పెట్టుబ‌డి పక్షం మ‌ళ్లుతున్న మేధో వ‌ర్గం !

| సంపాద‌కీయం

పెట్టుబ‌డి పక్షం మ‌ళ్లుతున్న మేధో వ‌ర్గం !

- క్రాంతి | 20.02.2017 11:17:49am

జల్, జమీన్, జంగిల్ మీద ఆదివాసీలకు హక్కులేకుండా చేస్తున్న పెట్టుబ‌డి ఇప్ప‌డు సాహిత్యంపై ప్రేమ‌ను కురిపిస్తోంది. మైనింగ్ మాఫియా, బహుళజాతి కంపెనీల దోపిడీని ప్రశ్నించాల్సిన బుద్ధిజీవులు ఆ ఉత్స‌వాల్లో అతిథులుగా పాల్గొంటూ పెట్టుబ‌డిపై ప్రేమ‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించాల్సిన సాహిత్యాన్ని పాల‌క ప‌క్షం నిలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌రిగిన సాహితీ ఉత్స‌వాలే అందుకు నిద‌ర్శ‌నం.

కోల్‌క‌టా లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్ (జ‌న‌వ‌రి 15 - 18), జైపూర్ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్ (జ‌న‌వ‌రి 19 - 23), భువ‌నేశ్వ‌ర్ లిట‌ర‌రీ ఫెస్ట‌వ‌ల్ (జ‌న‌వ‌రి 20, 21) , హైద‌రాబాద్ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్ (జ‌న‌వ‌రి 27 -29), కోజికోడ్ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్ (కేర‌ళ‌) (ఫిబ్ర‌వ‌రి 2 - 5), ఢిల్లీ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్ (ఫిబ్ర‌వ‌రి 10 -12), అక్టోబ‌ర్ 28, 29 తేదీల్లో జ‌ర‌గ‌నున్న బెంగుళూరు లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్.. ఇలా దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ సాహితీ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నాయి కార్పోరేట్ సంస్థ‌లు. సాహితీ సృజ‌న‌కు అర్థాన్ని మార్చివేసి పెట్టుబ‌డిని కీర్తించే మేధోవ‌ర్గాన్ని త‌యారు చేసుకుంటున్నాయి. భూస్వామ్య అణిచివేతను కొన‌సాగించిన‌ ప్రాచీన సాహిత్యం మాదిరిగానే... ఆధునిక సాహిత్యాన్నిపాల‌కుల అనుకూలంగా మ‌లిచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. క‌ళ‌లు - సాహిత్యం ప్ర‌జ‌ల కోసం అనే అర్థాన్ని మార్చివేస్తున్నాయి. రాజ్యాన్ని కీర్తించ‌డంలో మునిగిన ఈ వేడుక‌ల్లో చ‌ర్చిస్తున్న అంశాల్ని ప‌రిశీలిస్తే ఇది అర్థం చేసుకోవ‌చ్చు.

ఆదివాసీ, దళిత, మైనారిటీ వర్గాలను లాభాల‌కోసం బ‌లితీసుకుంటున్న ఈ బ‌హుళ‌జాతి సంస్థ‌లు దేశ వ్యాప్తంగా ఇలాంటి సాహితీ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నాయి. కార్పోరేట్ సంస్థ‌లు, ఎన్‌జీవోలు క‌లిసి నిర్వ‌హిస్తున్న ఈ ఉత్స‌వాలు రాజ్యం మెప్పు కోసమేన‌నేది సుస్ప‌ష్టం. ర‌చ‌యిత రాజ్యాన్ని, రాజ్య స్వభావాన్ని సంతరించుకున్న అన్ని రకాల వ్యవస్థలను ప్రశ్నించాలి. కానీ సామ్రాజ్య‌వాద సంస్థ‌లు స్పాన్స‌ర్ చేస్తున్న ఈ వేడుక‌ల్లో ప్ర‌శ్న‌కు తావులేదు.

దేశంలోనే అతి పెద్ద సాహితీ వేడుక‌గా చెప్పుకునే జైపూర్ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్ కి ఆధిప‌త్యానికి గుర్తుగా మిలిగిన ప్యాలెస్ డిగ్గీ వేదిక‌. దండ‌కార‌ణ్యం నుంచి నియంగిరి దాకా ఆదివాసీల అస్థిత్వాన్ని ధ్వంసంచేసేందుకు బ‌య‌లుదేరిన‌ వేదాంత నిన్న‌టి వ‌ర‌కు జైపూర్ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్‌ని నిర్వ‌హించింది. ఇప్పుడు జాతీయవాదాన్ని భుజానికెత్తుకొని ముస్లింలు, ఆదివాసీల‌ను దేశద్రోహుల‌ను చేసిన "జీ" టెలివిజ‌న్‌ సంస్థ నిర్వ‌హిస్తోంది. క‌ళింగ‌న‌ర‌గ్‌లో 13 మంది ఆదివాసీల‌ను పొట్ట‌న పెట్టుకున్న టాటా స్టీల్ భువ‌నేశ్వ‌ర్ లిట‌ర‌రీ ఫెస్టివ‌ల్‌ని నిర్వ‌హిస్తోంది. వేదాంత‌ నిర్వ‌హించిన లండ‌న్ ఎడిష‌న్ జైపూర్ ఫెస్టివ‌ల్‌లోనూ, టాటా స్టీల్ నిర్వ‌హించిన భువ‌నేశ్వ‌ర్ ఫెస్టివ‌ల్‌లోనూ ప‌లువురు ర‌చ‌యిత‌లు, ప్ర‌జాస్వామిక వాదులు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.

నియంగిరి, క‌ళింగ‌న‌ర్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, కోల్‌క‌తా, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ఇలా దేశ వ్యాప్తంగా ఆదివాసులు, దళితులు, రైతాంగం వేదాంత, టాటా వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల వ‌న‌రుల దోపిడీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. త‌మ కాళ్ల కింది నేల‌ను కాపాడుకునేందుకు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నారు. ఈ ప్ర‌జా పోరాటాల‌ను అణ‌చివేయ‌డానికి ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీల‌పై యుద్ధం చేస్తోంది ప్ర‌భుత్వం.

ప్రజా ఉద్యమాల వెల్లువతో అడుగడుగునా ఆటంకాలెదుర్కొంటున్న విదేశీ సామ్రాజ్యవాదానికి, దేశీయ బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు సరికొత్త మేధావి వర్గం అవసరమవుతోంది. రాజ్యం ప‌క్షం వ‌హించే క‌లం కావాలి. అందుకోసం క‌వులు, ర‌చ‌యిత‌లు, మేథావుల‌ను మ‌చ్చిక చేసుకుంటోంది. ప‌దువులు విదిల్చి త‌మ ప‌క్క‌కు చేర్చ‌కుంటోంది. అందులో భాగంగా సామ్రాజ్య‌వాదం ఇలాంటి సాహితీ వేడుక‌ల్ని స్పాన్స‌ర్ చేస్తోంది. ఖ‌నిజ త‌వ్వ‌కాల కోసం హ‌రిత‌వేట‌ను సాగిస్తున్న రాజ్యం సాహితీ ఉత్స‌వాల‌ను ప్రోత్స‌హిస్తోంది. ప్రజా ఉద్యమాలకు మేధోప‌ర‌మైన చేర్పునందించాల్సిన ర‌చ‌యిత‌లు ప్ర‌జ‌ల ప‌క్షం నిల‌బ‌డ‌తారో, పాల‌క ప‌క్షం నిల‌బ‌డ‌తారో తేల్చుకోవ‌ల్సిన సంద‌ర్భం ఇది.





No. of visitors : 456
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •