సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

- సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఎన్ని సార్లు మాట్లాడుకున్నా... ఎంత గొంతు చించుకున్నా... ఆగ‌ని హింస అది. మ‌ధ్య‌భార‌తంలో అమ‌ల‌వుతున్న అంతులేని హింస అది. ఈ సారి సంత‌కు వెళ్లిన వాళ్లు శ‌వాలుగా వ‌చ్చారు. మ‌ళ్లీ అదే క‌థ‌. నిన్న‌టి హిడ్మే లాగే ఈ సారి హేమ్ల‌. త‌నతోపాటు భీమ కూడా. వాళ్లూ మావోయిస్టులేన‌ట‌. ఇంటి నుంచి సంత‌కు వెళ్లిన వాళ్లు న‌క్స‌లైట్లుగా హ‌త్యగావించ‌బ‌డ్డారు. భారీగా ఆయుధాలు, విప్ల‌వ సాహిత్యాన్ని కూడా సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి స్వాధీనం చేసుకున్నార‌ట. ఇదే క‌థ వినిపించారు పోలీసులు.

బ‌స్త‌ర్‌లోని కిర‌ణ్‌దుల్ ప‌రిధిలో గ‌ల‌ గంపూర్ గ్రామానికి చెందిన ఇద్ద‌రిని జ‌న‌వ‌రి 28న పోలీసులు కాల్చిచంపారు. భీమ కుడ‌తి, సుక్మ‌తి హేమ్ల ఇద్ద‌రూ సంత‌కు వెళ్లి వ‌స్తుండ‌గా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మ‌ర్నాడు బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త్య చేశారు.

ఈ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌ని క‌ప్పిపుచ్చ‌కునేందుకు పోలీసులు భారీగా ఆయుధాలు, సాహిత్యం స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా కిర‌ణ్‌దుల్ మార్కెట్ నుంచి వ‌స్తున్న వాళ్ల‌ను ప‌ట్టుకొని కాల్చిచంపార‌ని కుటుంబ స‌భ్యులు అంటున్నారు. హ‌త్య‌కు ముందు పోలీసులు హేమ్లాపై అత్యాచారం జ‌రిపార‌ని, హేమ్లా క‌నుగుడ్లు లేవ‌ని, చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి చంపార‌ని ఆరోపిస్తున్నారు.

ఎన్‌కౌంట‌ర్ పై న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌ని, మృత‌దేహాల‌కు ఉన్న‌త స్థాయి అధికారులు, హక్కుల కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో రీ పోర్టు మార్టం నిర్వ‌హించి, ఈ హ‌త్య‌కు బాధ్యులైన అధికారుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప‌ద్నాలుగేళ్ల సోమ‌రును కోల్పోయిన తండ్రి న్యాయం కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన‌ట్లే గంపూర్ గ్రామ‌స్థులూ ఆందోళ‌న భాట ప‌ట్టారు.

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏకంగా వంద‌లాది మంది ఆదివాసీలు చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ ముందు ఆందోళ‌న చేశారు. కాగా పోలీసులు మాత్రం గ్రామ‌స్తుల ఆరోప‌ణ‌లు అవాస్త‌మంటూ త‌ప్పించుకుంటున్నారు. అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా.. హ‌క్కుల సంఘాలు, కార్య‌క‌ర్త‌ల‌ను బ‌స్త‌ర్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అక్ర‌మ కేసులు మోపుతూ జైళ్ల‌లో నిర్భందిస్తున్నారు. బ‌స్త‌ర్‌ని ఒక బ‌హిరంగ బంధిఖానా గా మార్చి ఆదివాసీల‌పై అకృత్యాల‌కు పాల్ప‌డుతోంది ప్ర‌భుత్వం.

No. of visitors : 1733
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •