వేకువముగ్గు

| సాహిత్యం | క‌విత్వం

వేకువముగ్గు

- సూర్యచంద్ర | 20.02.2017 12:37:51pm

రక్తాన్ని రంగరిస్తూ
నీవు తూర్పు వాకిలిలో
వేకువముగ్గును పేర్చుతున్నావ్
నీరవ రాత్రిలో
పీడితజన కలల్ని
కవిత్వంగా అల్లుతున్నాను నేను
ఆయుధాల వెన్నెలతీగల సంగీతంపై
సూర్యోదయం లాంటి వాగ్ధానామే కదా నాకు ఊపిరి
పువ్వులు రాలిన
ఏడారిమైదానాల్లో
కన్నీటి సుడిగుండాల్లోనే
నీవు మళ్లీ చిగురిస్తావు....
నక్షత్రాల ప్రవాహానివి నువ్వు..
నిన్ను పిడికిలిలో బందించడం ఎవరి తరం.?!
శుస్కిస్తున్న దేహంలోంచి
ఉప్పొంగుతూ వ్యాపిస్తున్న
నా హృదయ తరంగాలకు
హరివిల్లులకు ఎరుపును
అలికె నీకు మధ్య
ఎన్ని అదృశ్య సుడిగుండాలో
అయినా భయంలేదు
నీవు సముద్రమై ఉప్పొంగేవేళ
నేను తీరాన్నై ఒడిగిపోతాను





No. of visitors : 421
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మిణుగురు న‌వ్వుల‌మై

సూర్యచంద్ర | 19.10.2017 10:09:22pm

నెత్తురంటని తొలి సమతా సంధ్యలోకి.... చీకటి చెదలను చీలుస్తూ మిణుగురు నవ్వులమై మన ప్రయాణం... మన పాదాలను పసిగడుతూ ఎన్ని విషం పుక్కిలించే కండ్లో......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి -2018
    Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
    బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
    హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
    ఇప్పుడు
    నిలబడి తీరాల్సిన దారుల్లో...
    ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
    ఈ పక్షం బుల్పికలు!
    హ‌క్కులపై ఉక్కుపాదం
    పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •