అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

| సంపాద‌కీయం

అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

- సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

చదువెందుకు? అన్నది ఎప్పటి నుండో పదేపదే వినవస్తున్న ప్రశ్న. చదువు కూడుపెట్టడానికా, జ్ఞానం సంపాదించుకోవడానికా అని తలలు పండిన మేథావులు తర్కించి తర్కించి సిద్ధాంతాలు చేసారు. ఈ సిద్ధాంతాల సామంజస్యత అట్లా వుంచితే, ఇప్పుడు కొత్తగా తలెత్తుతున్న చర్చ విద్య అమ్మభాషలో జరగాలా, ఆంగ్లంలోనా అన్నదాని చుట్టూ తిరుగుతోంది. ఈ చర్చకంతటికీ కారణమైన ఒక అధికారిక ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ జీ.ఓ. నం. 14గా 2017 జనవరి 2న విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిలలో మాతృభాషా మాధమాన్ని రద్దుచేసి ఆంగ్లభాషా మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. ఇందుకు సంబంధించి మార్చి 21 నాటికల్లా అన్ని అంశాలల్లోనూ ఆంగ్లంలో టెక్ట్స్‌పుస్తకాల అచ్చుపని పూర్తికావడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మనిషికి జ్ఞానం అవసరం. అది పరిసరాల జ్ఞానం కావచ్చు, తన శరీరానికి సంబంధించిన జ్ఞానం కావచ్చు, సమాజానికి సంబంధించిన జ్ఞానం కావచ్చు. ఏ జ్ఞానాన్నైనా మనిషి నేర్చుకొనేది అధ్యయనం ద్వారా, పరిసరాల పరిశీలన ద్వారా. దేన్నైనా అధ్యయనం చేయటానికి భాష అవసరం. మనకి సహజంగా సంక్రమించేది అమ్మభాష కాబట్టి, ఆ భాషలోనే చదవటం, అధ్యయనం చేయటం, తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవటం సుళువుగా వుంటుంది. మనది కాని భాషలో చదివి నేర్చుకోవాలంటే ఇంతకు రెండింతలు కష్టపడాలి. ఎందుకంటే ముందు మనది కాని ఆ భాషను నేర్చుకోవాలి, తరవాత మాత్రమే ఆ శాస్త్రంలోని అంశాలను నేర్చుకోవాలి.

కేవలం పుస్తకాల చదువు మాత్రమే కావాల్సినంత జ్ఞానాన్ని ఇవ్వదు. పరిసరాలతో నిత్య సంబంధాన్ని కలిగి వుండటం, వాటిని పరిశీలించటం, పరిసరాలలో భాగం కావటం కూడా మనిషికి సంపన్నమైన అనుభవాల్నిస్తుంది. పరిసరాల్ని పరిశీలించటమంటే మనం భాగమైన సమాజంలో మనచుట్టూ వున్న మనుషులతో సజీవ సంబంధాల్ని కలిగి వుండటమే. ఇందుకు కూడా అమ్మ భాష అవసరం.

కేవలం ఏదో ఒక రూపంలో జ్ఞానాన్ని సంపాదించుకొన్నంత మాత్రాన మనిషి జీవితం సంపూర్ణం కాదు. ఆ జ్ఞానానికి ఆచరణ తోడు కావాలి. జ్ఞానాన్ని నేర్చుకోవటం కొంత మేరకు వ్యక్తిగతమైనా, జ్ఞానాన్ని ఆచరణలో పుటం పెట్టటం సాముదాయకం. సాముదాయకమైన ఈ సమిష్టి ఆచరణ మానవుల మధ్య ఆలోచనల మార్పిడి ద్వారానే సాధ్యం. అంటే నేర్చుకోవటం, ఆచరణలతో పాటు, తాను నేర్చిన దాన్ని ఇతరులతో కలసి పంచుకోవడం కూడా మనిషి జ్ఞానవంతుడు కావటానికి అవసరమన్నమాట. మనచుట్టూ సమాజంలో వుండే వ్యక్తులతో సంభాషించటం వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అంశం. ఇదంతా సహజాతమైన అమ్మభాషలో జరిగినంత శాస్త్రీయంగా, స్నేహపూర్వకంగా పరాయి భాషలో జరగదు.

అధ్యయనం, ఆచరణలే కాదు, మానవుడికి సృజనాత్మకత కూడా చాలా అవసరం. అందుకు భావనాశక్తి, ఊహాశక్తి ఎంతగానో తోడ్పడతాయి. బాల్యం నుండీ భావనాశక్తీ , ఊహాశక్తీ పెంపొందడానికి అవకాశం వున్న పిల్లల వ్యక్తిత్వం, అదిలేని పిల్లల వ్యక్తిత్వతం కంటే ఆరోగ్యకరంగా వుంటుంది. స్వతంత్రమైన భావనలు కలిగి వుండటం, ఊహించగలగటం మనిషిలో సాహిత్య వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆ వాతావరణంలో పెరిగినవాళ్ళే తదనంతర కాలంలో సాహిత్యకారులుగా, ఆలోచనా పరులుగా ఎదుగుతారు. వాళ్ళద్వారానే సాహిత్య, కళాసృజన కూడా జరుగుతుంది. దీనికంతటికి మూలం అమ్మ భాషే.

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంలో ప్రజలది కాని భాష, అది సంస్కృతమైనా, ఆంగ్లమైనా, ఆ సాహిత్యంలోనూ, సంస్కృతిలోనూ ఆధిపత్య వర్గాల భావజాలాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజల సాహిత్యాన్ని, సంస్కృతిని, నుడికారాన్ని నాశనం చేస్తుంది. వర్గ సమాజంలో భాషకూడా ఒక వర్గ సాధనం. ఒకప్పుడు సంస్కృతం ఈ దేశంలో ప్రజల భాషలన్నింటిని కాలరాచివేయటానికి ఉపయోగపడితే, ఇప్పుడు ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దశలో ఇంగ్లీషు ఆ వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఉపయోగపడుతోంది.

ఆధిపత్య వర్గం, అది భూస్వామ్యమైనా, సామ్రాజ్యవాదమైనా ప్రజల్ని పాదాక్రాంతం చేసుకోవడానికి యుద్ధాలు చేయటం కంటే ఆ ప్రజల భాషా సంస్కృతుల్ని నాశనం చేయడానికే ప్రాధాన్యతనిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ సామ్రాజ్యవాదుల వలస విధానంలో అమలైన చరిత్ర ఇదే. ఆ క్రమంలోనే కొన్ని వందల భాషలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి. అందుకే గూగీలాంటి వాళ్ళు ఆఫ్రికా దేశాల్లోని విద్యాలయాల్లో ఇంగ్లీషుభాషా అధ్యయనాన్ని రద్దు చేయమని డిమాండ్‌ చేశారు. అందుకే తల్లి భాషలో చదువుకోవటం, ప్రజల భాషలో పరిపాలన అమలు కావటం ప్రజాస్వామిక హక్కులుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి.

మనదేశంలో ప్రపంచీకరణ పేరిట బహుళజాతి సంస్థలు రంగప్రవేశం చేసిన తరవాత, ఒకవైపు ప్రజల సంపదను వాటికి కట్టబెడుతూనే మరోపక్క ఆ సంస్థలకు అవసరమైన మానవ వనరుని రూపొందించటం ప్రభుత్వాలకు అవసరంగా మారింది. అందులో భాగంగానే ఆంగ్లంలో చదివితే తప్ప ఉపాధి దొరకదనే ప్రచారం. ఈ ప్రచారంతో ప్రజల్ని మోసం చేస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని విస్తృతంగా ప్రవేశపెట్టాటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విధంగా భాషా కార్పొరేటీకరణను అమలు జరపటానికి ప్రభుత్వాలు చేస్తున్న కుతంత్రాలను అడ్డుకోవటం ప్రజాతంత్రవాదుల కనీస కర్తవ్యం.

తల్లి భాషను కాపాడుకోవటం కేవలం దానిపట్ల సెంటిమెంట్‌తో మాత్రమే కాదు. ఒకప్పుడు సంస్కృతం కారణంగా, ఆ తరవాత ఇంగ్లీషు కారణంగా అమలైన అమ్మభాషల అణచివేతను వ్యతిరేకించటం, సమాజంలో తలెత్తిన భాషా వివక్షతతో కూడిన అసమానతలను తొలగించటం అనే ప్రజాస్వామ్య కర్తవ్యాలను నేరవేర్చటంలో భాగంగా తల్లి భాషను కాపాడుకోవటానికి పోరాడాలి. ఆంగ్లభాషా ఆధిపత్యాన్ని వ్యతిరేకించటం సామ్రాజ్యవాద ప్రపంచీకరణను వ్యతిరేకించే పోరాటంలో భాగంగా గుర్తించాలి.

అదే సమయంలో భాషల పట్ల వుండే అపచైతన్యాన్ని తొలగించటానికి కూడా ప్రయత్నించాలి. తమతమ భాషలే మిగిలిన భాషలకన్నా గొప్పవనే దురభిమానంతో కూడిన దురహంకారాన్ని వ్యతిరేకించాలి. భాషను మతంతో ముడిపెట్టే కుటిల యత్నాలని ఎండగట్టాలి. భాషపేరుతో పండిత భాషను ప్రామాణికం చేసే కుతంత్రాలని ఎదుర్కోవాలి. ప్రజలలో వున్న మాండలికాలను గుర్తించి గౌరవించటం నేర్పాలి. భాషను నేర్పడానికి ఇప్పుడు అమలులో వున్న అశాస్త్రీయ పద్ధతుల స్థానంలో శాస్త్రీయ పద్ధతుల్ని ప్రవేశపెట్టమని డిమాండ్‌ చేయాలి. వివిధ భారతీయ భాషల మధ్య స్నేహపూరకమైన ఆదానప్రదానాల్ని ప్రోత్సహించాలి. ఈ బాధ్యతల్ని పాలకవర్గాలు ఆధిపత్యవర్గాలు తమవిగా స్వీకరించవు. సమాజంలో నెలకొన్న వివిధ రకాల ఆధిపత్యాలని నిర్మూలించాలని పోరాడుతున్న శక్తులే ఈ బాధ్యతలను కూడా చేపట్టాలి.


No. of visitors : 893
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప...
...ఇంకా చదవండి

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు.....
...ఇంకా చదవండి

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

- రామ్‌ పునియాని | 16.09.2019 03:14:12pm

ʹకాశ్మీర్‌ ప్రాతినిధ్యానికి సంబంధించి ఎలాంటి చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం లేదుʹʹ ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వానికే అధికారం వుందని కూడా ఆయన .....
...ఇంకా చదవండి

కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం

ముకుళిక. ఆర్‌. | 16.08.2019 08:28:10pm

జె.ఎన్‌.యు.లో హాస్టళ్ళ గోడలమీదా, తరగతి గదుల భవనాలమీదా, క్యాంటీన్‌లమీదా, లైబ్రరీలమీదా కనపడే రాడికల్‌ స్వభావం కలిగిన పోస్టర్లు, నినాదాలు, బొమ్మలు వైవిధ్యభరి.....
...ఇంకా చదవండి

దళితుల పాటలు, సంగీతం ఎందుకు రాజ్య విద్రోహానికి గురవుతున్నాయి?

యోగేష్‌ మైత్రేయ | 02.12.2019 10:45:56pm

ఒక గాయకుడి పాటలను విద్రోహానికి గురిచేసినప్పుడూ, తమ రచనలకు గాను వారిని శిక్షించినప్పుడు అనేక సందర్భాలలో భారతదేశంలో ఒక కఠిన వాస్తవాన్ని అందరూ అకస్మాత్తుగా.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •