పడవలైపోదాం

| సాహిత్యం | క‌విత్వం

పడవలైపోదాం

- గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

ఇప్పుడు మనం
ప్రాణాలు విడుస్తున్న
దేహాల పెనుగులాటను చూడాలి
ప్రాంతమోడే మోసం చేసిన
కలలు విరిగిన చప్పుడుని వినాలి
చెమ్మ ఇంకని ఆ కన్నీటి
ఊటల్లో కలాలు ముంచి
మరీ కవిత్వం రాయాలి

పెంకుటిల్లో గుడిసో
తలుపులు తాళాలు పెట్టో...
పెట్టుబడి దున్నపోతు ధ్వంసం చేసిన
తన జొన్న చెలకల మీదుగా

వీడలేక వీడిపోతున్న
నెర్రలు వాసిన ఆ పాదముద్రల
జాడలెంబడి
కవియత్రీ...కవీ ...చిత్రకారుడా
నువ్వు ..నేను కూడ వలసెల్లిపొవాలి
ఆ నేలను అదిమిన రైతు
పాదాల కింద భూమి కూడా
మొలకెత్తడాన్ని పాటగా రాయాలి

సమాధుల్లొకి శవాలు కాదు
మనుషుల ఆకాంక్షలు పూడ్చబడటాలు
లేదా కట్టెల మీద కాలిపోవడాలు చూడాలి

తొవ్వ దొరకని పాదాలు
తడబడి కూలబడిపోవడాలు చూడాలి
నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న
పడవలను ,,
లేదా,,,, నదిని మోస్తున్న పడవలను
ఎన్నడు తీరం చేరని తనాన్ని
నదిని వీడలేని తనాన్ని
నది మధ్యలొ నిలిచిపోయి
నదుల సామూహిక దుఃఖాన్ని
తనలోకి నింపుకుంటున్న
పడవల సహానుభూతి చూడాలి
కవీ ..చిత్రకారిణి ...గాయకురాలా
వక్తా ....
రండి ..మనం కూడా
పడవలమైపోదాం
ఈ కన్నీటి నదిలొ ... మునకలేద్దాం
కలియ తిరుగుదాం....
కవిత్వమొ ...పాటొ.... చిత్రమో...
మాటలొ...పడవల్లాగా ముందుకు
మునుముందుకే
ప్రవహించకపోతాయా......?
సముద్రంలా హొరెత్తకపోతాయా





No. of visitors : 754
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నిదుర‌లోని స్వ‌ప్నాల్లో మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో నాచూపుల‌కందే దృశ్యాల‌లో నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?...
...ఇంకా చదవండి

ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి

నీడ ఒక అంతర్ మానవి !

గీతాంజలి | 03.08.2018 11:31:48am

పోనీ...నువ్వు ఎప్పుడైనా మృత వీరుడి స్తూపపు నీడ పడ్డ భూమి.. ఎఱ్ఱెరని విత్తనమై మొలకెత్తడం చూసావా?? రా... నీడలు చెప్పిన రహస్యాలను .. మనం చేయాల్సిన యుద్ధాలను.....
...ఇంకా చదవండి

వదిలి వెళ్లకు...!

గీతాంజలి | 21.12.2018 07:53:43pm

నన్ను నీళ్లు లేని సముద్రం లోకి.. సముద్రం లేని భూమి మీదకి. వదిలి వెళ్ళకు .. వదిలి వెళ్ళకు.. ఎలా ఉండాలి నీవు లేక... ఎలా చేరాలి నీ దాకా? నిన్ను చేరాలంటే.. ...
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
    నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
    భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
    నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
    లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
    కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
    కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
    ʹ రాగో ఏమవుతుంది? ʹ
    "తిన్నాడో లేదో పాపం"
    పరిమళభరిత తావుల్లోంచి
    ఆకలి చెమట వాసన
    ఇంద్రావతి..

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •