ఫ్రపంచీక"రణమా"

| సంభాషణ

ఫ్రపంచీక"రణమా"

- మమ్మా | 04.03.2017 10:21:56am


ఉర్వివారికెల్ల నొక్క కంచంబెట్టి అనీ, వసుధైక కుటుంబమనీ, సమస్త మానవ జాతి ఒకటేనని కొన్ని వందల సంవత్సరాల క్రితమే, ఓ మూర్ఖుడు నగ్నంగా వీధుల్లో తిరుగుతూ కేకలేసేవాడు.

16 వ శతాబ్ధపు చివరి అర్థభాగంలో చోటుచేసుకున్న ఇంగ్లండు పారిశ్రామికీకరణతో ఫ్యూడలిజం సన్నగిల్లింది. ఇంగ్లండు, ఫ్రాన్సు, మొదలుకొని యూరప్ అంతటా పారిశ్రామికీకరణ వ్యాపించి, సముద్రాలు, ఖండాలు దాటి భూమండలాన్ని రాజరికం నుండి ప్రక్షాళన గావించింది.

సామాన్యుల అసాధారణమైన ధైర్యసాహసాలకు, వీరోచిత పోరాటాలకు, నిస్వార్థపూరితమైన త్యాగాలకు రాజుల సిం హసనాల క్రింద భూకంపాలొచ్చాయి. కుర్చీలు కూలిపోయాయి. కంఠాహారాలు పోయి రాజుల మెడల్లో ఉరితాళ్ళు బిగించుకుపోయాయి.

కానీ, సామాన్యులకు తెలియదు. విప్లవం, తిరుగుబాటు, పోరాటం, మాత్రమే తమకు సొంతమని, అధికారం కాదని. పోరాటం సామాన్యులదే అయిన, అధికార మార్పిడి మాత్రం ఉన్నత వర్గాల మధ్యనే అని. ఫ్యూడల్ రాజ్యం పోయి, బూర్జూవా వర్గం పుంజుకుంది. బూర్జూవా వర్గపు లాభాపేక్ష, తమ తమ రాజ్యాలకే పరిమితం కాకుండా ఎల్లలు దాటింది. పరిశ్రమలొచ్చాయి. జమీందారీతనం పోయింది. భూస్వాములు పోయారు. కానీ, శ్రమ దోపిడి మాత్రం అలానే ఉంది. అలానే ఉండడమేగాక బడుగు బలహీన వర్గాలకు అర్థంకాని రీతిలో దోచుకోవడం మొదలైంది.

మితిమీరిన లాభాపేక్షతో, అరకొరగా జీతాలిస్తూ, రొజంతా వెట్టి చాకిరి చేయిస్తు పీడించారు. ముడిసరుకుల పేరుతో ప్రకృతిని మానభంగం చేశారు. ప్రకృతిలో మనమూ ఓ భాగమే అనే నిజాన్ని విస్మరించి చెట్లు, పుట్టలూ, చెరువులూ, గట్లూ అన్నింటిని ధ్వంసం చేశారు.

ఎన్నో సంవత్సరాల పీడన శక్తికి ఖనిజాలుగా మారిన రాళ్ళు మెల్లిగా తరిగాయి. ఆధునిక సమాజంలో ఓ దేశం ఇంకో దేశంలో పాలించడం అప్పటికే భౌతికంగా కనుమరుగై పోయింది. మరి, ఈ అభివృద్ధి చెందిన దేశాల పరిశ్రమల దాహం తీరేదెలా? ముడి సరుకులు సద్దుమనిగేదెలా?

దురాశతో కూడిన మేధస్సుతో విచ్చలవిడిగా సాగిన ఈ పారిశ్రామికీకరణలో, ప్రమాణస్థాయి కొంతగా పెరిగినా, అది సామాన్యులు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించలేకపోయింది. అందించకపోవడమేగాక ఆ గొంతును అదిమిపట్టింది. అప్పట్కే వలస దేశాల తిరుగుబాట్లు, అభివృద్ధి చెందిన దేశాలకు పీడకలగా మారాయి. ఆ పీడకలలోనుండే ఓ ఆలోచన తట్టింది. ఆ ఆలొచనే పేద ప్రజలపై ఓ పిడుగు. దాని పేరే ప్రపంచీకరణం, వసుధైక కుటుంబం!!

ముడిసరుకుల వెతుకులాటలో, శాస్త్రీయతను వాడుకొని, ప్రపంచీకరణం అనే పేరుతో వేట మొదలుపెట్టింది. సహాయం చేస్తం, మిమ్మల్నీ మా దేశాలలా అభివృద్ది (భౌతికంగా) చేస్తాం అంటూ, ప్రపంచ బ్యాంకు అంటూ, ఆశ చూపి ఎర వేసింది.

ఈ సున్నితమైన "ప్రపంచీకరణం" అనే కర్కశత్వం ఇంకా అందరికి కనిపించకపోవడం మన దురదృష్టకరం. అడవుల్లో సామాన్య జనానికి దూరంగా బ్రతికే అమాయకపు తెగలపై, వారి మనోభావాలని, వారికి ప్రకృతికి మధ్యనున్నటువంటి అనుబంధాన్ని ఖాతరు చేయకుండా, వారు నిలబడే భూమి గుండెలపై, గనులంటూ గునపాలతో గుచ్చారు. వారు తాగే నీటిలో, స్వచ్ఛమైన నదీజలాల్లో కాలుష్యాన్ని వ్యాపించారు. చిరరికి, వారిని వారే చంపుకునేల ఉసిగొల్పుతున్నారు.

ఈ ముసుగుని అర్థం చేసుకొలేని దేశాధినేతలూ, పాలకులూ- అర్థం చేసుకున్న మైధావులని అదిమిపట్టారు, అర్థం చేసుకుని, పోరాడే మానవతాహృదయలను పీడిస్తూ, బాదిస్తూ, వ్యక్తిగతమైన బంధాలపై దాడులు చేస్తూ, ఆతంకవాది అనీ, టెర్రరిస్ట్ అనీ, ఉగ్రవాది అని, అన్ని బాషలలో నామకరణం చేసి ప్రచారం చేస్తున్నారు.

ఓ ప్రపంచీకరణమా! నీ దురహంకారం, దురాశ, నియంతృత్వం చాలా మంది ప్రజలకు కనిపించకపోయినా, పీడిత ప్రజలకు, వారి పక్షాన నిలబదే పోరాటయోధులకు ఎప్పుడో అర్తమయింది. ఇంకెంతో సమయంలేదు అందరికి అర్తమయి నిన్ను నిర్మూలించడానికి. అందరూ ఒకే కలం పట్టుకుని, చైతన్యం రంగరించుకొని, మీ వేర్లని పెకిలించడానికి వస్తున్నం, తస్మాత్! జాగ్రత్తా

No. of visitors : 746
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార డిసెంబర్ 2019
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •