మ‌త‌రాజ‌కీయాల పెత్త‌నం

| సాహిత్యం | వ్యాసాలు

మ‌త‌రాజ‌కీయాల పెత్త‌నం

- క్రాంతి | 04.03.2017 11:45:14am

విశ్వ‌విద్యాల‌యాల్లో పెరుగుతున్న మ‌త ఉన్మాదానికి తాజా ఉదాహ‌ర‌ణ రామ్‌జాస్ క‌ళాశాల ఉదంతం. అది రోహిత్ వేముల వెంటాడి వేధించి మృత్యుఒడికి నెట్టింది. జేఎన్‌యూ విద్యార్థుల‌ను దేశ‌ద్రోహుల‌ను చేసింది. న‌జీబ్‌ను మాయం చేసింది. ఇఫ్లూకూ కులం కంచెలు బిగించింది. ఇప్పుడు ఢిల్లీ యూనివ‌ర్సిటీలో త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించుకునేందుకు ఏకంగా దాడుల‌కు తెగ‌బ‌డింది. గ‌త సంవ‌త్స‌రం జేఎన్‌యూలో త‌ల‌పెట్టిన ఎ కంట్రీ విత్ అవుట్ పోస్టాఫీస్‌ సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవ‌డంతో పాటు క‌న్హ‌య కుమార్‌, ఉమ‌ర్ ఖాలీద్‌, అనీర్బ‌న్ త‌దిత‌రుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసిన ఏబీవీపీ ఇప్పుడు దేశభ‌క్తి పేరిట విశ్వ‌విద్యాల‌యాల‌ను మ‌తోన్మాద రాజ‌కీయాల‌కు కేంద్రంగా మార్చేందుకు య‌త్నిస్తోంది.

ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌జాస్‌ కళాశాలలో ఫిబ్ర‌వ‌రి 21న ʹనిరసన సంస్కృతిʹ అనే అంశంపై త‌ల‌పెట్టిన సెమినార్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించింది ఏబీవీపీ. క‌శ్మీర్ నుంచి బ‌స్త‌ర్ వ‌ర‌కు ప్ర‌జ‌ల పోరాట సంస్కృతిని గురించి చ‌ర్చించేందుకు ఉద్దేశించిన ఈ స‌ద‌స్సుకు జవాహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ను వక్తగా ఆహ్వానించారు. గత ఏడాది జేఎన్‌యూలో దేశ వ్య‌తిరేక నినాదాలు చేశాడ‌నే ఆరోప‌ణలున్న ఉమ‌ర్‌ని వ‌క్త‌గా పిల‌వ‌డాన్ని ఏబీవీపీ వ్య‌తిరేకించింది. ʹదేశద్రోహనేరంʹ నేరారోప‌ణ‌లున్న వ్య‌క్తిని వ‌క్త‌గా పిల‌వడాన్ని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేసింది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం రెండు రోజుల స‌ద‌స్సును ర‌ద్దుచేసింది.

జేఎన్‌యూలో దేశ వ్య‌తిరేక నినాదాలిచ్చాడ‌నేది ఉమ‌ర్‌పై ఆరోప‌ణ మాత్ర‌మే. అది నిరూప‌ణ కాలేదు కూడా. ఆరోప‌ణ‌ల‌కు ఆధారంగా చూపించిన వీడియో టేపుల‌ను ప‌రిశీలించిన ఇన్వెస్టిగేష‌న్ టీం ఇటీవ‌లే అక్క‌డ ఎలాంటి దేశ వ్య‌తిరేక నినాదాలు చేయ‌లేద‌ని తెలిపింది కూడా. ఇక పోతే రామ్‌జాస్ కాలేజీలో జ‌రుగుతున్నది అక‌డ‌మిక్ సెమినార్‌. బ‌స్త‌ర్‌లో ఆదివాసీల జీవితంపై ప‌రిశోధ‌న చేస్తున్న ఉమ‌ర్ అదే అంశాన్ని గురించి ఆ స‌ద‌స్సులో ప్ర‌సంగించాల్సి ఉంది. కానీ బీజేపీ అనుబంధ ఏబీవీపీ క‌నీస వాక్ స‌భా స్వేచ్ఛ‌ను కూడా హ‌రిస్తూ అరాచ‌కంగా వ్య‌హ‌రించింది.

ఏబీవీపీ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఫిబ్ర‌వ‌రి 22 న ఢిల్లీ యూనివ‌ర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించాయి. ప‌లువురు అధ్యాప‌కులు సైతం విద్యార్థుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున మోహ‌రించిన ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు విద్యార్థులు, అధ్యాప‌కుల‌పై దాడిచేశారు. రాళ్ల‌తో త‌ల‌పై మోదారు. ఈ సంఘ‌ట‌న‌లో ప‌లువురు పాత్రికేయులు సైతం తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న‌లో ఢిల్లీ పోలీసులు సైతం మ‌తోన్మాద గుండాల ప‌క్షాన నిల‌బ‌డి విద్యార్థుల‌పై దాడికి పాల్ప‌డ్డారు.

యూనివ‌ర్సిటీలో త‌మ పెత్త‌నాన్ని కొన‌సాగించేందుకు విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతోంది. 22వ తేది రామ్‌జాస్ కాలేజీ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు ప‌లువురు విద్యార్థినిల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఏబీవీపీ వైఖ‌రికి నిర‌స‌గా ʹస్టూడెంట్స్‌ ఎగైనిస్ట్‌ ఏబీవీపీʹ పేరిట సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాన్ని ప్రారంభించిన గుర్‌మోహ‌ర్ కౌర్‌ని అత్యాచారం చేస్తామంటూ ప‌లువురు బెదించారు.

స‌రిగ్గా ప‌దిరోజుల త‌రువాత పంజాబ్ యూనివ‌ర్సిటీలోనూ ఇదే త‌తంగం కొన‌సాగింది. పంజాబ్ యూనివ‌ర్సిటీలో ఫాసిజంపై స్టూడెంట్స్ ఫ‌ర్ సొసైటీ సెమినార్‌ని ఏర్పాటుచేసింది. ఈ సెమినార్‌కు ప్ర‌ముఖ సామాజిక‌కార్య‌క‌ర్త సీమా ఆజాద్‌ని వ‌క్త‌గా ఆహ్వానించింది. కాగా సీమా ఆజాద్‌ని ఆహ్వానించ‌డంపై ఏబీవీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతోపాటు సీమా ఆజాద్ స‌ద‌స్సు హాజ‌రైతే దాడులు జ‌రుపుతామ‌ని బెదిరించింది. దీంతో యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం సెమినార్‌కి అనుమ‌తిని ర‌ద్దు చేసింది. ఏబీవీపీ గూండాగిరిని నిర‌సిస్తూ యూన‌వ‌ర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున్న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మ‌తోన్మాదులు బెదిరింపుల‌ను లెక్క‌చేయ‌కుండా సీమా ఆజాద్ యూనివ‌ర్సిటీకి మారువేశంలో వ‌చ్చి ప్ర‌సంగించింది కూడా. దేశభ‌క్తి పేరుతో సాగుతున్న ద‌బాయింపు రాజ‌కీయాలు చెల్ల‌వ‌ని చెప్ప‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. అంతిమంగా యూనివ‌ర్సిటీల్లో మ‌త రాజ‌కీయాలు అంత‌కాక త‌ప్ప‌దు.

No. of visitors : 1037
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •