హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మోటారు వాహ‌నాల‌తో తొక్కిస్తాడ‌ట‌

- సంఘ‌ర్ష్‌ | 04.03.2017 12:26:49pm


బ‌స్త‌ర్ పోలీసుల అరాచ‌కాల‌కు అంతులేకుపోతోంది. హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన బ‌స్త‌ర్‌లో హ‌త్య‌లు, అత్యాచారాలు నిత్య కృత్య‌మ‌య్యాయి. ఎలాంటి చ‌ట్టాలు అక్క‌డ వ‌ర్తించ‌వు. పోలీసులు, ప్రైవేటు హంత‌క ముఠాల‌దే రాజ్యం. ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో సాగుతున్న ఈ అరాచ‌కాలు హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌కు పొంచిఉన్న ప్ర‌మాదాన్ని సూచిస్తున్నాయి. సోనిసోరిపై యాసిడ్ దాడి, బేలా బాటియా ఇంటిపై దాడి అందుకు ఉదాహ‌ర‌ణ‌లు. మాలినీ సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి జ‌ర్న‌లిస్టులు, ఇషా కందేల్‌వాల్, శాలినీ గేరా వంటి న్యాయ‌వాదులను సైతం బ‌స్త‌ర్ వీడి వెళ్లాల‌ని ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తాజాగా సుక్మా ఎస్‌పీ ఇందిర క‌ళ్యాణ్ ఎలెసెలా హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్డు మీద వాహ‌నాల‌తో తొక్కించాలంటూ వ్యాఖ్యానించ‌డం హంత‌క రాజ్యం న‌గ్నంగా ఊరేగుతోంద‌న‌డానికి నిద‌ర్శ‌నం.

జ‌గ‌ద‌ల్ పుర్‌లో ఎలిమినేష‌న్ ఆఫ్ న‌క్స‌ల్ త్రెట్ అనే అంశంపై ఓ ఆటోమొబైల్‌ కంపెనీ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సుక్మా ఎస్సీ ఇందిర క‌ళ్యాణ్ మాట్లాడుతూ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు ఇషా కందేల్‌వాల్, శాలినీ గేరాల‌ను రోడ్డుమీద తొక్కించాలంటూ వ్యాఖ్యానించాడు. జ‌గ‌ద‌ల్ పూర్ లీగ‌ల్ ఎయిడ్ గ్రూప్ స‌భ్యులైన ఇషా, శాలినీ చాలా కాలంగా బ‌స్త‌ర్‌లోని ఆదివాసీల‌కు న్యాయ‌స‌హ‌కారం అందిస్తున్నారు. ఆదివాసీ మ‌హిళ‌ల‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన అకృత్యాల‌పై న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంతో ఇషా, శాలినీలు బ‌స్త‌ర్ వీడి వెళ్లాలంటూ పోలీసులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. చివ‌ర‌కు వాళ్ల‌కు ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఇంటి య‌జ‌మానిని సైతం బెదిరించారు. ఐన‌ప్ప‌టికీ వాళ్లు త‌మ పోరాటాన్ని ఆప‌లేదు. దీంతో ఆగ్ర‌హానికి గురైన పోలీసు అధికారులు వారిని బ‌హిరంగంగా హ‌త్య‌చేయాలంటూ మాట్లాడుతున్నారు.

జ‌గ‌ద‌ల్‌పూర్ మీటింగ్‌లో సుక్మా ఎస్పీ ఇందిర క‌ళ్యాణ్ చ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన రోడ్ల నిర్మాణాన్ని కొనియాడ‌మే కాకుండా, ఆ రోడ్ల‌పై న‌క్స‌ల్స్ సానుభూతి ప‌రుల‌ను తొక్కించాలంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా స‌హించేది లేదంటూ హెచ్చ‌రించాడు. బ‌స్త‌ర్‌లో హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డి ఇటీవ‌లే బ‌దిలీ అయిన మాజీ ఐజీ క‌ల్లూరి, జ‌గ‌ద‌ల్ పూర్ ఎస్‌సీ దాస్ స‌మ‌క్షంలో ఈ వ్యాక్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసు వ్య‌వ‌స్థ ఎంత ప్ర‌జా వ్య‌తిరేకంగా కొన‌సాగుతోందో చెప్పే సంఘ‌ట‌న ఇది.

No. of visitors : 1410
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •