దొంగల రక్షణకే ప్రభుత్వాలున్నది

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

దొంగల రక్షణకే ప్రభుత్వాలున్నది

- భూనిర్వాసిత పోరాట సంఘీభావ కమిటీ (ఆంధ్రప్రదేశ్) | 10.03.2017 11:38:57pm



వినుకొండ మండలం కొప్పకొండ, నడిగడ్డ, పాకాల, తండా గ్రామాల విషాద గాధ ఇది. సాగునీటి సౌకర్యం కూడా లేని కాలంలోనే ఈ ప్రాంత రైతులు 2 పంటలు పండించేవారు. నాగార్జున సాగర్ ఆయకట్టు వచ్చిన తదుపరి కొప్పకొండ, నడిగడ్డ గ్రామ పంచాయితీలలోని భూములలో ఈ విధమైన సాగు కొనసాగింది. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఈ గ్రామాల రైతులకు, దళిత ప్రజానీకానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1940 లోనే పట్టాలను మంజూరు చేసింది. అప్పటి సర్వ్ నంబర్ 54 పై రెండు గ్రామాలూ ఒకే పంచాయతీ క్రింద ఉండేవి. ఒక్కో లబ్దిదారుడుకి సుమారు 2 ఎకరాల భూమి మంజూరు చేశారు. ఇప్పటికి కొద్ది మంది వద్ద ఆనాటి భూముల పాస్ పుస్తకాలు ఉన్నాయి. చాల రోజుల పాటు "నిమ్న జాతి సొసైటీ " కూడా కొనసాగింది. సొసైటీకి ప్రభుత్వం వైపు నుండి సరైన ఆదరణ లేక భూములు బీడుబడి పోయాయి. కొంత మంది అరకొర సాగుచేసుకుంటున్నారు.  
  
పెద్దల భూమాఫియా రంగప్రవేశం చేసింది. క్రమంగా నిమ్న జాతి సొసైటీ భూములు, పోరంబోకు భూములు, అగ్రహారం భూములు, కొంత పట్టా భూములు కలిపి కొందరు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని భూమి సొంతదార్లకు 500 రూపాయలు మొదలు 5000 రూపాయల వరకు ఆశచూపి కొనటం, మరికొంత మందిని బెదిరించటం చేసి సుమారు 250 ఎకరాల భూమిని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అధికారులు వీరికి సహకరించారు. రికార్డులు తిరగరాశారు. అలా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అందులో కేవలం 17.80 ఎకరాల భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ యోగ్యమైంది కాగా మిగిలిన భూమి మొత్తం అసైన్డు తదితర భూములు. ప్రస్తుతం ఈ భూముల విలువ ఎకరం పది లక్షలు పైన పలుకుతోంది. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలొచ్చాయి. "భూ నిర్వాసిత పోరాట సంఘీభావ కమిటీ" ఆ గ్రామాలను సందర్శించి నిజనిర్ధారణ జరిపి రిపోర్ట్ సేకరించింది. 

ప్రస్తుతం ఆ భూములలో చేపల చెరువులు వెలిశాయి. ఆ చేపల చెరువుల భాగస్వాములు ఎవరు, ఎంతమంది ఉన్నారు అనే విషయం వెల్లడించడం లేదు. ప్రజల్నినోరువిప్పకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వినుకొండకు చెందిన ఒక న్యాయవాది ఈ మొత్తం భూకుంభకోణానికి సారధని మనలో మాటగా పై గ్రామాలలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. కొన్నేళ్లుగా విస్తరించుకుంటూ వచ్చిన ఈ దోపిడీకి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని కాక అన్ని పార్టీల ప్రభుత్వాలు అండగా నిలిచాయి.

అధికారం అండతో ఈ దొంగలు భూమినే కాదు, నీటినీ కబ్జా చేశారు. సాగర్ జలాలను చేపల చెరువుల్లోకీ మళ్లించేశారు. ప్రజల భూములు కబ్జా చేయడమే కాకుండా, సాగు, తాగునీరు అందకుండా కొల్లగొడుతున్నా పట్టించుకునే అధికారులు లేరు. ఇక ఇప్పుడైతే దొంగల పక్షాన పోలీసులు నిలబడి ప్రజలను భయపెడుతున్న పరిస్థితి ఇక్కడుంది.

ఈ మొత్తం వ్యవహారం పై భూ నిర్వాసిత పోరాట సంఘీ భావకమిటీ ఈ క్రింద డిమాండ్స్ చేస్తోంది. 

1. మొత్తం భూమిలో అసైన్డు ఎంత? ఆగ్రహారం భూమి ఎంత? పట్టా భూమి ఎంత అనేది ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలి. 
2. అసైన్డు భూములలో చెరువులు త్రవ్విన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 
3. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి. 
4. దళితుల భూములు దళితులకు అప్పగించాలి. 

                                                                                   -

వై. వెంకటేశ్వర్లు , రాష్ట్ర కన్వీనర్ 
   
భూనిర్వాసిత పోరాట సంఘీభావ కమిటీ (ఆంధ్రప్రదేశ్)






No. of visitors : 450
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఫిబ్రవరి -2018
    Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
    బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
    హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
    ఇప్పుడు
    నిలబడి తీరాల్సిన దారుల్లో...
    ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
    ఈ పక్షం బుల్పికలు!
    హ‌క్కులపై ఉక్కుపాదం
    పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •