ప్ర‌జ‌ల్ని భూమికి దూరం చేస్తున్న అధికార మాఫియా

| సంపాద‌కీయం

ప్ర‌జ‌ల్ని భూమికి దూరం చేస్తున్న అధికార మాఫియా

- పెన్నేరు | 18.03.2017 10:49:57am

రకరకాల రూపాల్లో రైతులు భూమికి దూరం అవుతున్నారు. దోపిడీ వర్గాలు దూరం చేస్తున్నాయి. వ్యవసాయం నుంచి ఇతర వ్యాపార మార్గాల్లోకి భూమి వెళ్లిపోతున్నది. దీని వల్ల తరతరాలుగా భూమి మీద ఆధారపడిన రైతులు నిరాశ్రయులవుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే నిర్వాసితులవుతున్నారు.

గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పకొండ, నడిగడ్డ, పాకాల, తండా మొదలైన గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి భూ నిర్వాసితత్వమే. ఇంకోపక్క భారీ ఎత్తున అమరావతి రాజధాని నిర్మాణం. ప్రజలు ఇష్టపడి ఇస్తున్నారో, భ్రమపడి ఇస్తున్నారో, భయపడి ఇస్తున్నారో తెలియకుండా ప్రచార హోరు సాగుతున్నది. ఆ గోలలో సత్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్న వాళ్లకు ఏమీ కనిపించదు. వినిపించదు. ఇక ఆ పక్కనే ఉన్న కొప్పకొండ నిర్వాసితుల గురించి అసలే తెలియదు.

అయితే దీన్ని కూడా మొత్తం కోస్తా ప్రాంతంలో చాలా తీవ్రంగా ముందుకు వచ్చేసిన భూ నిర్వాసిత సమస్యలో భాగంగా చూడాలి. భూమి విషయంలో ప్రభుత్వం నేరుగా, అధికారికంగా ముందుకు వచ్చినప్పుడు చట్టాలు, జీవోలు అనే వ్యవహారం కూడా అందులో ఉంటుంది. అంటే నేరుగా పాలకుల రాజకీయార్థిక విధానం అమలవుతూ ఉంటుంది. ఇందులో భూ మాఫియా, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వడ్డీ వ్యాపారులు సరేసరి. కొన్ని చోట్ల నేరుగా ప్రభుత్వ జోక్యం ఉండకపోవచ్చు. మాఫియా, అధికార రాజకీయాలు కలిసి భూమిని కాజేస్తుంటాయి. ప్రభుత్వం రూపంలో కనిపిస్తే ఏదో ఒకటి అడగడానికి, మాట్లాడటానికి ప్రజలు ప్రయత్నిస్తారు. మాఫియా, స్థానికంగా అధికార పార్టీ పెత్తందార్లు మాత్రమే ఉన్నప్పుడు ప్రజలు భయపడ్డం తప్ప మరేమీ చేయలేని ప్రత్యేక పరిస్థితి దాపురిస్తుంది.

వినుకొండ దగ్గరి కొప్పకొండ గ్రామస్థులు కూడా మాట్లాడ్డానికి మొదట భయపడ్డారేమోగాని, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. ఈ గ్రామస్థులకు బ్రిటీష్‌ కాలం నుంచీ భూములు ఉన్నాయి. ఒకే సర్వే నెంబర్‌ మీద నడిగడ్డ, కొప్పకొండ గ్రామాల భూములు ఉండేవి. ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాల పట్టా భూమి ఆ రోజుల్లో ఇచ్చారు. వీళ్లందరితో కలిసి నిమ్న జాతి సంఘం అనేది ఒకటి చాలా కాలం నడిచింది. ఈ పేరునుబట్టే ఆ భూములు ఎవరివో ఊహించవచ్చు. మామూలుగానే అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడా జరిగింది. దళితులకు ఎర వేసి వాళ్ల బతుకు తెరువు అయిన భూమిని కొందరు పెద్దలు కాజేస్తూ వచ్చారు. ఇలా సుమారు 200 ఎకరాలు పరాస్తమయ్యాయి. మొత్తంగా బ్రిటీష్‌ కాలంనాటి భూ యాజమాన్యం కాగితాల మీద కూడా మారిపోయింది. కొంత బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. మరి కొంత కారు చౌక ధర ఇచ్చి కొనుక్కున్నారు. కేవలం ఈ నిమ్న జాతి సొసైటీ కింద ఉండిన భూముల్లో సాగువుతున్నవీ, కానివీ, అగ్రహారం భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డు భూములు రికార్డులు మార్చి స్వాధీనం చేసుకున్నారు. దీనికంతా స్థానిక అధికార పార్టీ నాయకులు, వాళ్ల ఆశ్రితులు పాల్పడ్డారు. కాగితాల మీది పనులు కాబట్టి అధికాగణం కూడా వీళ్లకు తోడ్పడ్డారు.

ఇలా స్వాధీనం చేసుకున్న భూముల్లో పదుల సంఖ్యలో చేపల చెరువులు పెంచుతున్నారు. సాగర్‌ నీళ్లతో చేపల చెరువులు నింపుకుంటున్నారు. వ్యవసాయ చెరువులకు రావాల్సిన నీటిని అక్రమంగా చేపల చెరువులకు మళ్లించుకుంటున్నారని, దీంతో ఆ చుట్టు పక్కల సాగునీటి సమస్య తలెత్తిందని ప్రజలు అంటున్నారు. దీని కోసం అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారని, ఇంక తమకు నీళ్లు రావడం కల్లే అని అంటున్నారు. పైగా దీని వల్ల భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయని, ఆ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ బోరు బావులు కూడా ఎండిపోతున్నాయని వాళ్లు అంటున్నారు. అంతేగాక ఈ ప్రాంతానికి కొండల నుంచి వచ్చే నీటిని కూడా అక్రమంగా ఒడిసిపట్టి, సంప్రదాయకంగా పొలాలకు అందే మార్గాలను దెబ్బతీసి చేపల చెరువులకు మళ్లించుకుంటున్నారు.

వీటన్నిటి వల్ల ఇప్పుడు ఆ భూముల విలువ కోట్లలోకి చేరుకుంది. వ్యవసాయం చేస్తే బువ్వ దొరుకుతుంది. కానీ ఇప్పుడా భూములు చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోయాయి. సహసంగానే ఆ భూముల ధరలు చుక్కల్లోకి చేరుకున్నాయి. ఇంత కాలం ఆ భూముల మీద ఆధారపడ్డ జనం ఇప్పుడు నేలకు దూరమైపోయాయి. భూ నిర్వాసిత సమస్య వాళ్లను కూడా చుట్టుముట్టింది.

కోస్తా తీర ప్రాంతమంతా ప్రభుత్వ విధానాల వల్ల భారీ ఎత్తున భూ నిర్వాసిత సమస్య దాపురించింది. పచ్చని పంట పొలాలు అమరావతి రాజధానికి, కార్పొరేట్ల పరిశ్రమలకు ధారా దత్తమైపోయింది. ఈ ప్రక్రియ ఇంకా వేగం పుంజుకుంటోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇవాళ రకరకాల రూపాల్లో భూ నిర్వాసిత సమస్య అత్యంత ప్రధానమైన విషయంగా మారింది. సంప్రదాయ వ్యవసాయ జీవనోపాధి నుంచి భూములు మారిపోతున్నాయి. సంపన్నులకు లాభాలు ఆర్జించి పెట్టే కంపెనీల కిందికి, రొయ్యల చెరువుల కిందికి వెళ్లిపోతున్నాయి. ప్రజా పోరాటాలు తప్ప ఈ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం ఏముంటుంది?





No. of visitors : 430
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •