సర్వ శక్తులూ ఒడ్డి
ఒక రాజును గెలిపించడం
చదరంగమయితే,
దొంగ - పోలీసు
సహజమనుకోవడమూ ఒక ఆటే,
శ్రమతో నిమిత్తం లేదని
పడిన పందాన్ని బట్టే
ఎక్కే నిచ్చెనలు చిన్నవీ,
మింగేసే పాములు పెద్దవీ
అని చెప్పే వైకుంఠ పాళీ
ʹఅదృష్టం ʹ కొద్దీ వచ్చిన
ముక్కలే గెలుపోటములు
నిర్ణయిస్తాయి అని చెప్పే పేకాటా
దోపిడీ నీతిని
అలవాటు చేసాయి మనకు..
దోపిడి పాలకుల పైకి
దృష్టి మరల్చకుండా
తిరగబడకుండా జాతక
జ్యోతిష్య పరిష్కారాలు సాగుతున్నాయి
ఇక ప్రజలే చరిత్ర
నిర్మాతలని చెప్పే
సమిష్టి శ్రమే
సకల జ్ఞానాలకు
సకల సంపదలకు
కారణం అని చెప్పే
దోపిడి మర్మాన్ని విప్పి చెప్పే
ఆటలు ఇప్పుడిక కనుగొందాం
కొత్త తరాలకు ఉగ్గుపాలతో నేర్పిద్దాం
శ్రమ చేస్తున్న మనుషులు
ఇంకా ఊరవతలే ఉన్నారని
ఆడదంటే ఆట బొమ్మ కాదని
ఆకాశంలోనే కాదు
పోరాటంలో సగమని
సమిష్టిగానే గెలుపు
సాధ్యమని చెబుదాం
మార్పుకోసమే
అడవంటుకున్నాదని
వెలివాడల సెగలు
ఊరిని చుట్టాయని చాటుదాం
సమస్య ఏదయినా
దోపిడిలో భాగమని
దోపిడి పడగ నీడేనని
ఒంటరి నిరాశా
పరిష్కారాలు వద్దనీ
జీవితం పులి మేక జూదం
కోడి పందెం కాదనీ
ఇక వారి ఆటలు
సాగవనీ చెబుదాం
నిచ్చెన రూపమేదయినా
అంతారాల సారం ఏదయినా
మూలాలతో సహా తగులబెడదాం
ఆటైనా పాటయినా మాటయినా
ఇక సమిష్టి ఐక్యతకే...
ఆట నీతినీ నియమాలన్నీ
కొత్తగా రాసుకుందాం
పరీక్షలు లేని చదువులు
తాళాలు లేని ఇళ్ళు
పోలీసుల అణిచివేతలు లేని
సమాజ స్వప్నాల్ని నిజం చేసుకుందాం !
Type in English and Press Space to Convert in Telugu |
గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !తన జీవితం, ప్రేమ అన్నీ సమాజం లోని ప్రజలకోసమేనని, ఆ ప్రేమ కేవలం నీకు, కుటుంబానికి పరిమితమయ్యేది కాదని" చెప్పాడు..అది తన అంకిత భావం ఆ మాటను తను చనిపోయే...... |
నా ప్రియమైన... విప్లవమా !విప్లవమా నీవు చూడని
లోతులూ అగాథాలూ
ఎక్కని కొండలూ శిఖరాలూ
నడవని ముళ్ళ బాటలు
దాటని నదులూ సముద్రాలూ ఉన్నాయా ... |
వీరుల కన్నతల్లి, అమరుల బంధువు, స్నేహితురాలు కామ్రేడ్ సూర్యవతిప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు చరిత్ర పొడవునా పిల్లలు చేసిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన అనేక మంది తల్లులు లాగానే , కొడుకు నుంచి ప్రేరణ పొంది ఆచరణకు..... |
నీ చావు లిపిని .. డీకోడ్ చేస్తున్నా..కరోనా, నీ రాకతో
వ్యక్తిగత దూరం అనే మాట
మా దేశంలో వెంటనే
సామాజిక దూరంగానే అర్థమయింది..
ఉన్న దూరాలను
తేలిగ్గా పెంచడానికే
నీవు మరింత దోహద పడ్డావు..
... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |