క‌దిలించే క‌విత్వం ʹకాగుతున్న రుతువుʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

క‌దిలించే క‌విత్వం ʹకాగుతున్న రుతువుʹ

- మేడ‌క యుగంధ‌ర్‌ | 18.03.2017 01:10:46pm

విరసం సాహిత్య పాఠశాలలో కెక్యూబ్ వర్మ కవిత్వం ʹకాగుతున్న రుతువుʹ ఆవిష్కరణ జరిగింది. వర్మ తన కవిత్వంతో దహించుకుపోయి చదవుతున్నంతసేపూ మనల్ని కూడా తన కవితాగ్నితో దహించివేస్తాడు. పుస్తకమంతా కవిత్వమైపరుచుకుని మనల్ని నిలబెట్టి కత్తితో నిలువునా కోస్తున్న ఫీలింగ్ కనబడుతుంది. 83 వరకూ కవితలున్న పుస్తకంలో 26 కవితలు ఉద్యమం దాని పరిసరాలు కాగా, 8 ఒంటరితనం, నైరాశ్యం, 21 కవితలు కవిత్వం దాని రుచిని చూపిస్తూ ముందుకు సాగిపోతాయి. ఇవన్నీ 2013-16 మద్యకాలంలో రాసినవి.

ఎక్కువుగా నాకు నచ్చిన కవితా పాదాలు కోట్ చేస్తూమాట్లాడతాను.. ముస్లింల పై దాడులు జరగడానికి మన పాత్ర లేదా? దానిని ప్రస్తావిస్తూ "ఈ రోజు చెప్పులకంటిన/నెత్తురులో/వాడితో పాటు/సగభాగం/నీది నాది కూడా!" అంటూ బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదాన్ని ఎదుర్కునే పనిలోమనల్ని అప్రమత్తం గా వుండాలని చెబుతాడు.

ఇద్దరి వ్యక్తుల మద్య తెగిన మాటలమౌన గీతల్ని "పారుతున్న నదీపాయ ఒక్కసారిగా/ఇసుక తిన్నలలోకి జారిపోతూ"....చదువుతుంటే మనం కూడా కవిత్వం లోకి జారిపోతుంటాం. వర్మ చాలా చోట్ల కవిత్వమై పలవరిస్తూ వస్తువును మింగేస్తూ కవిత్వమై తేలుతూ రాసిన "మానని గాయమేదో సలపర పెడుతూ చారలు దేరిన/నెత్తుటి పగుళ్ళు మద్య గడ్డకట్టిన జిగటగా వేలాడుతూష‌.., "దీపం కాలిన వాసనేదో దారి చూపుతూ ఒకింత/ఆశపు ఒత్తిని ఎగదోస్తూ..." ఇలాంటి కవితల్ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించి ,నేను అర్ధం చేసుకోలేకపోతాను. పాఠకుడి తప్పో లేక కవి తప్పో తేల్చుకోలేకపోతాను.

ఇలా రాసిన కవి
నెత్తురోడుతున్న మూలవాసి పై ఎంత బాగా రాశాడో చూడండి "ఉత్తచేతులతో గోచిపాతతో నేలనలా తన్నిపెట్టి/పగలబారుతున్న భూమినలా కలిపి వుంచింది/అతడొక్కడే" అద్భుతమైన కవిత ఆవిష్కరించారు వర్మ.

అక్షరాన్ని కవిత్వం చేసే సందర్భంలో "ఎక్కడో దాగిన వేరు నీరును తోడుతున్నట్టు/లోలోపల నెత్తురు చిమ్ముతూ.."
అమ్మ జ్ఞాపకాల్లో "బొత్తం ఊడిన ప్రతిసారీ అమ్మకళ్ళు చిట్లిస్తూ/సూదిబెజ్జంలో ప్రేమదారాన్ని చేర్చి కుడుతున్నట్టు".,మనల్ని కూడా పాతరోజులోకి లాక్కుపోతాడు.

స్వేచ్చ కరువైన ఈ దేశంలో దాని కోసం వెంపర్లాడుతూ రాసిన "వాన కడిగిన జైలు గోడలపై ఆకాశాన్నింత దోసిట్లో/ పోసి పావురం బొమ్మవేస్తూ,"ఎప్పటికప్పుడు కొత్త పదాలు అలాదొర్లిపోతుంటాయి.

ఉద్యమకారులపై వర్మ రాస్తుంటే మరల మరల చదవాలనిపిస్తుంది."కనులకంటిన చెమ్మను కోల్పోతూ/రాతి రెప్పలను చెక్కుతూ/నరాలను పేనుతున్నాడు."అలాగే అమరుడు వివేక్ పై రాసిన కవిత అత్యద్భుతమైన expressions, అన్నింటికంటే ఈ కవిత నాకు బాగానచ్చింది.అని చెప్పకుండా వుండలేను.

ఇక కవిత్వం ఎలావుండా లో చెబుతూ "ఎగిపడిన/అలల నురుగుతో/సర్రున ఒడ్డుకు చేరుతూ/పాదం కిందుగా ఇసుకను ఒరుసుకుంటూ/శిరసు వరకూపాకే/ఓ చల్లని పాదరసం లాంటి/కవిత్వం కావాలి"అని వచనమై తేలిపోకూడదంటాడు.

రాజ్యహింసను వ్యతిరేకిస్తూ .. "నువ్వంటావు/మరల మేఘమేదో కురుస్తూ మొలకెత్తుతుందని.," "చేతుల రేఖల గాయాలపై/నీవొక వాడిన కనకాంబరంలా/నేలపై వాలిపోతూ... "అటు చివర ఆ బాలుడు విల్లునలాష‌ /గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...

"కొన్ని సాయంత్రాలలో నల్లని ఆకాశపు కొక్కేనికి/ఒంటరి వెన్చెల ఉరిపోసుకుంటుంది/కోందు బాలుడొకడు/నియాంగిరి సానువులలో సాగిపోతున్నాడు.." ...ఎంత నిజం.రోమాలు నిక్కబొడుచుకునేంత నిజం.విప్లవం విజయమయేంత నిజం.

అయితే కొన్ని కవితల్లో కవి పాఠకుడికి ఏం ఆలోచన యిచ్చి ముగింపు పలుకుతున్నాడో నాకు తెలియలేదు.జరిగిన సంఘటనలపై అప్పటికప్పుడు స్పందించిన కవితలలో మునపటి చిక్కదనం లోపించిందనిపించింది.కవులపై దాడులు,మతం,కులం,స్రీల పై హింస మొ:రాయాల్సినంతగా రాయలేదేమో?నాకెందుకో కొన్నికవితల్లో చాలా భాగం వస్తువును శిల్పం మింగేసిందేమో ననిపించింది.వైయక్తిక భావాలే కవిత్వంగా ఆక్రమించకుండా.,ఒకవేళరాసినాసామాజిక చింతనలో వాటి పరిష్కారాన్ని,వాటినిభాగం చేస్తే బాగుండేది.ఇంతకు ముందటి "రెప్పల వంతెన" సింహభాగం నాకు అలానే అనిపించింది.

విరసం కవులలో కవిత్వ చిక్కదనం వుండదనే భ్రమల్ని వర్మ ఇపుడు పటాపంచలు చేశాడు.మూసపోసినట్టు వున్న కవిత్వానికి,పదాలకు బద్ద వ్యతిరేకి వర్మ. కవితల్ని ఎలా రాయాలి?ఎలా ఎత్తుకోవాలి,ముగింపు ఎక్కడ పలకాలి,శిల్పద్రుష్టి,పాతపదాలజోలికి పోకపోవడం వర్మ కవిత్వానికి సొంతం.కొత్తగా రాస్తున్న కవులకు వర్మ కవిత్వం ఒక డిక్షనరీయే అని చెప్పవచ్చు.

No. of visitors : 452
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •