శ్రామికవర్గ నియంతృత్వానికి ప్ర‌తీక పారీస్ క‌మ్యూన్‌

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

శ్రామికవర్గ నియంతృత్వానికి ప్ర‌తీక పారీస్ క‌మ్యూన్‌

- స్టాలిన్‌ | 18.03.2017 03:31:20pm

పారిస్ కమ్యున్ కు 146 ఏళ్ళు నిండిన సందర్భంలో " పారిస్ కమ్యున్ పై స్టాలిన్ విశ్లేషణ "

జెనీవాలో 1908,మార్చి 18వ తేదీన ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది . శ్రామిక వర్గానికి సంబంధించి మూడు చారిత్రాత్మకమైన సంఘటనల్ని స్మరించుకోవడానికి ఆ సమావేశం జరిగింది . స్టాలిన్ ఇలా అన్నాడు . ఒకటి - మార్క్స్ మరణించి 25 సంవత్సరాలైంది . మార్క్స్ 25వ వర్ధంతి ఆ రోజు. రెండు - ఫ్రాన్స్లో మార్చి 1848 విప్లవం జరిగి ఆనాటికి 60 సంవత్సరాలైంది. మూడు - పారిస్ కమ్యూన్ మృతవీరుల స్మరణ దినం జర్పవలసి వుంది. సభ నిర్వాహకులైన కార్మిక వర్గం పక్షాన - ఆ సభలో పారిస్ కమ్యూన్ ప్రధాన్యతను గురుంచి స్టాలిన్ ప్రసగించాడు. స్టెనోగ్రామ్ సహాయంతో అక్షర బద్ధం చేసిన ఆ ప్రసంగాన్ని "జాగ్రనిచ్నాయ గెజిట్ " అనే పత్రిక 1908 (మార్చి 23 సంచిక )లో ప్రచురించింది. ఆ ప్రసంగ వ్యాసం పూర్తి పాఠం ఈ విధంగా వుంది :

పారిస్ కమ్యూన్ చరిత్ర ఒక్కసారి తలుచుకుంటే కమ్యూనార్డులు చాలా శాంతియుతంగా వ్యవహరించారని చెప్పవచ్చు . వారు కేవలం పారిస్ ను పట్టుకోని వూరుకున్నారు . ముందు వర్సేలు మీదకు పోలేదు . వర్సేలులో ప్రతిఘాతక విప్లవం గూడు కట్టుకోని వుంది . అప్పుడు మార్క్స్ ఏమన్నాడు ? బాలెట్ పెట్టలను నమ్ముకోమన్నాడా ? ముందుగానే వర్సేలు మీద దండెత్తకపోవడం సరియైనదే అన్నదా ? " కూగల్ మన్ " కు 1871 లో రాసిన ఉత్తరంలో మార్క్స్ ఏమన్నాడో వినండి .

" ఏం చురుకుదనం ! ఏం చాకచక్యం ! ఏం త్యాగనిరతి ! పారిస్ శ్రామికులను మెచ్చుకోని తీరాలి . ఆరునెలలు పాటు ఆకలితో మల మల మాడినా ప్రష్యన్లు తుపాకీ మడమలతో అణగదొక్కినా నేలకు కొట్టిన బంతిలాగ వువ్వెత్తుగా లేచారు . ఇంత సాహసం చరిత్రలో ఎక్కడైనా ఉందా ? ఒక వేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ళ మెతకతనమే అందుకు కారణమవుతుంది . వాళ్లు వర్సేలు మీదకు ముందుగానే కాలు దూయవల్సింది . ఏవేవో సందేహాలు పెట్టుకొని కాస్త ఆలస్యం చేశారు . అంతర్యుద్ధం మనము కావాలని కోరుకోపోయిన శత్రువే దాన్ని మొదలెట్టాడు . అందుకని మనము ఏమీ వెనుకాడకుండా ముందు నుంచి కరుగ్గా , చురుగ్గా దండెత్త ఉండవలసింది ". మార్క్స్ , ఏంగెల్సుల ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి . సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఇలానే ఆలోచిస్తుంది , ఆచరిస్తుంది కూడా .

మార్క్స్ , ఏంగెల్సులు , వారి అనుచరులు బాలెట్ పెట్టలను నమ్ముకుంటారనీ , హింసాయుత విప్లవానికి వ్యతిరేకులని ఇంకా ఏమేమో ప్రగతి నిరోధక అరాచకవాదులు పదే పదే దుష్ప్రచారం చేశారు .

సోషలిస్టులది ప్రజా ఉద్యమం కాదని, వారు నిరంకుశులనీ అరాచకవాదులు ఆరోపిస్తున్నారు. "పైగా అరాచకవాదుల దృష్టిలో శ్రామికవర్గ నియంతృత్వం విప్లవానికి గోరీ కడుతుంది. అరాచకవాదుల మూలపురుషుడు ఏమన్నాడో విందాం.

" నియంతృత్వం గురుంచి అరాచకవాదుల ఆఖరి మాట చెబుతున్నాం . ఏ రకం నియంతృత్వమైనా సరే దాని ఉద్దేశాలు ఎంత మంచివైనప్పటికీ అది విప్లవానికి గోరీ కడుతుంది. ప్రభుత్వ అధికార దాహం తీర్చుకోవడానికి నియంతృత్వం ఉపయోగపడుతుంది . సోషలిస్టులు విప్లవ నియంతృత్వాన్ని గుర్తిస్తారు, శ్రామిక వర్గ నియంతృత్వం కావాలంటారు. శ్రామికులంతా తమ చెప్పచేతల్లోఉండాలంటారు. విప్లవకారులు శ్రామిక వర్గం ద్వారా ప్రభుత్వయంత్రాంగాన్ని స్వాధీన పర్చుకో జూస్తారు. (ఆహారం, స్వాతంత్ర్యం అన్న గ్రంథంలో)

మార్క్సు ఏంగెల్సు 1847 లో సోషలిజం స్థాపించడానికి శ్రామిక వర్గం రాజకీయ నియంతృత్వాన్ని స్థాపించమన్నారు. కార్మిక - కర్షక నియంతృత్వం (Dictatorship of the proletariat) మాత్రమే సోషలిజం స్థాపనకు ఏకైక మార్గం అని వారు నిర్ద్వందంగా పదే పదే స్పష్టం చేశారు.

ఈ నియంతృత్వం ద్వారా బూర్జవా వర్గపు విప్లవ ప్రతీఘాతుకతను దెబ్బ తీసి ఉత్పత్తి సాధనాలను వారి చేతుల్లో నుంచి స్వాధీన పర్చుకోవాలి. ఇది కొంత మంది వ్యక్తుల నియంతృత్వం కాదు. మొత్తం శ్రామికవర్గ నియంతృత్వం, నిజమైన శ్రామికవర్గ ప్రభుత్వం ,నూతన ప్రజాస్వామ్యం.

"శ్రామిక వర్గం తన రాజకీయ ఆధిక్యత వల్ల బూర్జువా వర్గం చేతుల్లో నుంచి పెట్టుబడిని స్వాధీన పర్చుకొని, ఉత్పత్తి సాధనాలను కేంద్రీకృతం చేసి పాలక వర్గంగా రూపొందుతుంది ". - (మార్క్పు, ఏంగెల్సు - కమ్యూనిస్టు ప్రణాళిక నుంచి)

దీన్ని బట్టి మనకు తెలిసేదేమంటే ఇక్కడ నియంతృత్వమనేది కొద్దిమంది వ్యక్తులదికాదు, బూర్జువా వర్గం మీద మొత్తం శ్రామిక వర్గం కొనసాగించవలసిన రాజకీయ నియంతృత్వం, ఈ నియంతృత్వం శ్రామిక వర్గం పక్షాన కొనసాగిస్తారు. అంతేగాని శ్రామికవర్గం మీద కొద్దిమంది వ్యక్తులు చెలాయించే అధికారం ఎంతమాత్రం కాదు.

మార్క్సు, ఏంగెల్సులు ఆ తరువాత కూడా తమ రచనల్లో ఈ మాట నొక్కి నొక్కి చెప్పారు. నిజానికి ఈ మాటలు సరిపోవు . పారిస్ కమ్యూన్ పట్ల మార్క్సు ఏంగెల్సుల వైఖరి పరిశీలిస్తేనే శ్రామికవర్గం నియంతృత్వం యెడల వారి భావాలూ తేట తెల్లమౌతాయి. శ్రామిక వర్గ నియంతృత్వాన్ని దూషించింది ఒక్క అరాచకవాదులే కాదు. అలా దూషించినవారిలో నానా రకాలు ఉన్నారు, పట్టణాల్లోమధ్యతరగతి వారు, దళారీలు,వీళ్ళందరినీ మార్క్సు ఏంగెల్సు పోసుకోలరాయుళ్ళన్నారు. వాళ్ళ నుద్దేశించి ఏంగెల్సు శ్రామికవర్గ నియంతృత్వం గురించి మీరు బెదిరిపోతున్నారా ? పారిస్ కమ్యూన్ కేసి చూడండి. శ్రామికవర్గ నియంతృత్వం అంటే అదే అన్నాడు. శ్రామిక వర్గ నియంతృత్వాన్ని కమ్యూన్ రూపంలో చూడగలిగాళ్లు ఏంగెల్సు.

శ్రామిక వర్గ నియంతృత్వం గురించి మార్క్సిస్టుల ఉద్దేశాలు తెలుసుకోవాలంపే ప్రతివాడు కూడా " పారిస్ కమ్యూన్ "ను అర్థం చేసుకోవాలి. ఒక వేళ పారిస్ కమ్యూన్ నిజంగా శ్రామిక వర్గం మీద కొద్దిమంది వ్యక్తులు చెలాయించిన నియంతృత్వమైనట్లయితే మనం శ్రామిక వర్గ నియంతృత్వానికి, మార్క్సిజానికి ఒక దణ్ణం పెట్టి ఊరుకోవచ్చు. అలాకాకుండా పారిస్ కమ్యూన్ బూర్జువా వర్గంమీద శ్రామిక వర్గం కొనసాగించిన నియంతృత్వం అయినట్టయితే అరాచకవాదులందరిది అపనింద అని వారివి అర్థరహితమైన ఆరోపణలనీ తేలుతుంది. మార్క్సిస్టుల మీద గుడ్డి ద్వేషంతో అరాచకవాదులు అపనిందలకు పూనుకుంటున్నారు. ఇంతకు మించి వారికి పనీ లేదు, చేయగలిగిందీ లేదు.

పారిస్ కమ్యూన్ చరిత్రను రెండు దశలుగా విడగొట్టవచ్చు. 1. కేంద్ర కమిటీ అజమాయిషీ చేసిన దశ, 2. కేంద్ర కమిటీ స్థానంలో ఎన్నికైన కమ్యూన్ అజమాయిషీ చేసిన దశ . కేంద్ర కమిటీ అంటే ఏమిటి ? అందులో ఎవరెవరున్నారు ?

" పారిస్ కమ్యూన్ చరిత్ర" అని ఆర్థర్ ఆర్నాల్డు (Arthur Arnold ) ఒక పుస్తకం రాశాడు . ఈ ప్రశ్నకు జవాబు ఆ పుస్తకంలో మనకు దొరుకుతుంది . పోరాటం మొదలవగానే మూడు లక్షలమంది పారిస్ కార్మికులు పొగయి కొంత మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు . ఈ ప్రతినిధులతో ఏర్పాటైన కేంద్ర కమిటీ కార్మికులంతా కలిసి ప్రతినిధులను ఎన్నుకున్నారు .

ఆ ప్రతినిధులెవరో ప్రజలకు తెలుసు . ఆ ప్రతినిధులు ఎలాంటి వారో కూడా ప్రజలకు తెలుసు. కొద్దిపాటి ఉద్యోగులు , మాములు కార్మికులు వీళ్లందరితో కూడిన ఒక రకమైన నామమాత్ర ప్రభుత్వమని మనము అనుకోవచ్చు. ఛాందస భావాలు పటాపంచలయ్యాయి . ఎవ్వరు ఊహించినది మరెవ్వరు అనుకోనిది జరిగింది . ఆ కేంద్ర కమిటీలో పై వర్గాల మనిషి ఒక్కరు లేరు . విప్లవంలో ఒక్క ప్లీడరుగాని, అధికారిగాని, పాత్రికేయుడుగానీ, సేనాని కానీ ఎవ్వరూలేరు... వాళ్ళ బదులు ఒక గని కార్మికుడు, పుస్తకాలు బైండు చేసేవారు, వంటపని వాడు... ఇలాంటి అట్టడుగు ప్రజలెందరో వున్నారు.

ఆర్థర్ ఇంకా ఏమంటున్నాడో : వినండి "మనం అనామకులం పీడిత ప్రజల చేతుల్లో పనిముట్లం. ప్రజల కోర్కెలకు సాధనం, ప్రజావాణికి ప్రతినిధులం. ప్రజా విజయాన్ని సాధిస్తాం. ప్రజలకు కమ్యూన్ కావాలి. కమ్యూన్ ను సాధించడానికి మనం కమిటీలో కొచ్చాం". అని కేంద్రకమిటీ సభ్యులు చెబుతున్నారు. జనంతో నిమిత్తం లేకుండా జనానికి దూరంగా నిలబడ్డ నియంతలు కాదువాళ్ళు. జనంతో కలిసీమెలిసి వుంటూ వాళ్ళల్లో ఒకళ్ళుగా "పెనవేసుకునిపోయి, జనంతో ఆలోచనలు కలబోసుకుని పోయి, అనుక్షణం వాళ్ళ సలహాను తీసుకుంటూ వాళ్ల చెప్పేది వింటూ వాళ్ళ భావాలను పదిమందికి తెలియజేసేవాళ్లు "

మొట్ట మొదటి దశలో పారిస్ కమ్యూన్ ఇలా పనిచేసింది. కమ్యూన్, ఇదే శ్రామికవర్గ నియంతృత్వం.మనం ఇప్పడు పారిస్ కమ్యూన్ రెండో దశలోకి వెళ్దాం.

ఈ రెండో దశలో కేంద్ర కమిటీ కమ్యూన్ అధికారం నిర్వహించింది. కేవలం రెండు నెలలు మాత్రమే కొనసాగించిన ఈ రెండు దశల గురించి ఆర్నాల్డు ఎంతో పొంగిపోతూ, ప్రజల నియంతృత్వమంటే ఇదేనని పొగిడాడు. ఆర్నాల్టు ఏమన్నాడో విందాం.

"ఈ రెండు నెలలలో ప్రజా హృదయాలు, ఆశలతో సాహసాలతో ఓలలాడాయి. భవిష్యత్తలోకి తొంగి చూడ్డం అంటే కన్నుల పండుగులా ఉంది. ఈ రెండు నెలలు పారిస్లో నిజమైన నియంతృత్వం ఉంది. ఈ నియంతృత్వం పరిపూర్ణమైనది. ఎదురులేనిది . కాని ఈ నియంతృత్వం మాత్రం ఏ ఒక్క వ్యక్తో చెలాయించినది కాదు. నిజానికి ఈ నియంతృత్వం ప్రజలందరిది , ప్రజలంతా ఒకే తాటిమీద నిలబడ్డారు, ఈ నియంతృత్వం 1871 మార్చి 18 నుండి మే28 వరకు ఎదురులేకుండా కొనసాగింది. మారణాయుధాలు ఏవీ లేకుండానే కమ్యూన్ మహత్తర శక్తిగా రూపొందింది. ఎందుకంటే కమ్యూన్ కు సర్వజనామోదం ఉంది. ప్రజలంతా మద్దతిచ్చారు. ప్రజలే పరిపాలకులయ్యారు. పోలీసులను, న్యాయశాస్త్రాలను ప్రజలే నెలకొల్పారు".

ఆర్థర్ ఆర్నాల్డు పారిస్ కమ్యూన్లో కార్మికులతో భుజం భుజం కలిపి పోరాడాడు. ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. కమ్యూన్లో సభ్యుడు కూడా. అందుకే అతను పారిస్ కమ్యూన్ గురించి అంత గొప్పగా రాయగలిగాడు.

పారిస్ కమ్యూన్"లో చురుకుగా పాల్గొన్న మరో వ్యక్తి లిస్సాగరే. "పారిస్ కమ్యూన్ చరిత్ర?" అనే ప్రథమశ్రేణి గ్రంథంలో కమ్యూన్ పోరాటాన్నీ, పాత్రనీ లిస్సాగరే అత్యద్భుతంగా, అత్యంత వాస్తవంగా చిత్రించాడు.

పారిస్ కమ్యూన్ ప్రజలే నిజమైన ఏకైక పరిపాలకులని అక్కడ ఏ ఒక్క నియంతా లేడని ఆ నియంతృత్వం ప్రజలదేనని లిస్సాగరే కూడా నివాళి పట్టాడు. అందుకే ఏంగెల్సు పోసుకోలరాయుళ్ళతో "పారిస్ కమ్యూన్" కేసి చూడండి "శ్రామికవర్గ నియంతృత్వం అంటే అదే" అన్నాడు. మార్క్సు ఏంగెల్సులు ప్రతిపాదించిన శ్రామికపర్గ నియంతృత్వం అంటే ఇదే.

No. of visitors : 1229
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
  మేఘాలొస్తాయి
  న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
  Justice in deep slumber
  ఎర్ర పిడికిలి
  వేకువ గానం
  అతడేమన్నాడు
  వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
  ఎరవాడ జెయిలులో ఈ వేకువ
  రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •