2017 లో ʹపారిస్ కమ్యూన్ʹ

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

2017 లో ʹపారిస్ కమ్యూన్ʹ

- బి.ఎస్.రాజు | 20.03.2017 10:40:51am

గాలి వీయడం ఆగిపోయిందా? చెట్లు ఊగడం మానేసాయా? ఉరుములు, మెరుపులు లేని ఆకాశం ప్రశాంతంగా ఉందా? కడలి అలలు సేద తీర్చుకుంటున్నాయా? దోపిడీ పీడనలు అంతమైపోయాయా?
స్వతంత్రత, సమభావం, సౌభ్రాతృత్వం ప్రపంచమంతా పరుచుకుని విరాజిల్లుతున్నాయా? ఫాసిజానికి, సోషలిజానికీ మధ్య గీత చెరిగి పోయిందా? శ్రమకు పెట్టుబడికి మధ్య వైరుధ్యమే లేకుండా పోయిందా?
పెట్టుబడికి, శ్రమ దాసోహమైపోయిందా? శ్రామిక విప్లవాలు పెట్టుబడి పాదసేవలో ఒదిగిపోయి తిరుగుబాటుకన్నా, విముక్తికన్నా, బానిసత్వమే మేలని తీర్మానించుకున్నాయా? అలానే, సేదతీరుతున్నాయా? పారిస్ కమ్యూన్ కేవలం ఒక అలేనా? కేవలమది ఒక కలగానే కరిగి పోయేనా?
బోల్షెవిక్ విప్లవం, శ్రామిక వర్గ సాంస్కృ తిక విప్లవం, నక్సల్బరి, ప్రజాయుద్ధ విప్లవం.. విఫల ప్రయోగాలేనా? మోడీ , ట్రంప్, పుతిన్, జి జెన్-పెంగ్ ... ఇత్యాది నూతన హిట్లర్ వారసుల తరం మానవాళిని తరుముకొస్తున్నదా? ఫాసిస్టు కారుమేఘాల కాళరాత్రులు మానవాళిని కమ్ముకుంటున్నాయా? మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం వేడెక్కుతున్నదా? సోషలిజం, కమ్యూనిస్ట్ భావజాలం కొత్తరక్తం నింపుకుంటున్నాదా? లేక నిలవనీటి మురికి గుంటగా మారిపోతున్నదా? ప్రపంచ శ్రామిక జనావళి పెట్టుబడి బానిస సంకెళ్లను తెంచుకునే పోరాటాన్ని, విముక్తి పథాన్ని, ససమాజ నిర్మాణ ధ్యేయాన్ని వదులుకున్నదా? ఆర్ధిక వాదంలో, పైసల బేరసారాల్లో కూరుకుపోయి, మధ్యే మార్గం ఎంచుకున్నదా? కార్మిక శ్రేణి మధ్యతరగతి లోనికి; మధ్య తరగతి నేను, నాది అనే స్వార్ధపు గుల్లలోనికి మరింతగా ముడుచుకు పోతున్నాయా ?

146వ వార్షిక సందర్భంగా పారిస్ కమ్యూన్ ను మననం చేసుకుంటూ ఓ వ్యాసం రాయాలనుకున్నప్పుడు కందిరీగల రొదలా నా మదిలో జుమ్మని ఎగసిన ప్రశ్నలివి.

మార్చ్ 18, 1871 న పారిస్ ప్రజలు అప్పటి ఫ్రెంచ్ పాలక దుష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారని మనకు తెలుసు. విప్లవ కమ్యూన్ ను ఏర్పాటు చేసుకున్నారని, సంపన్నుల చిహ్నమైన ʹహోటల్ డీ విల్లేʹ పై అరుణ పతాకను ఎగరేశారని, ఈ సంఘటన యూరోప్ ఖండాన్నంతా వణికించిందని, సాయుధులైన ప్రజలు శ్రామిక బస్తీల రహదారులన్నీ అడ్డకట్టలతో నింపేశారని, ప్రభుత్వ అధికారులు ʹవేర్సైల్లెస్ʹ వైపు పరుగులుతీసి, పారిస్ నగరం నుండి తాత్కాలికంగా నిష్క్రమించారని, పారిస్ నగరం 72 రోజులపాటు శ్రామిక ప్రజల వశమయ్యిందని మనకు తెలుసు.

ఈ కొద్ది కాలం.. బూర్జువాల రాజ్యం ఫ్రాన్స్ రాజధాని నుండి ఆవిరైపోయింది. పారిస్ నగర సాధారణ పనివారు, శ్రామికులు, కార్మికులు పౌర పాలనను తమ అజమాయిషీ లోనికి తెచ్చుకున్నారు. వారి బాగోగులు వారే చూసుకునే కమ్యూనిటీ పాలనను ఆవిష్కరించారు. ఇరుగు పొరుగు పాలనా, ఉత్పత్తి కౌన్సిళ్ల ను స్థాపించుకున్నారు. వీటి నిర్వహణకై శ్రామిక వర్గ సేవా ధృక్పధంగల ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నారు. వీరిని ఎప్పుడైనా తప్పించి, వెనక్కు పిలిచే పద్ధతి ననుసరించి అతి సాధారణ వేతనాలతో పనిచేసేట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికి సామజిక విద్య అందుబాటులోకి తెచ్చే సంస్కరణలు చేబట్టారు.

పారిస్ నగరంలో నివసించే విదేశీయులను ఫ్రెంచ్ దేశ పౌరులుగా గుర్తించారు. ప్రజా అణచివేత అంగాలైన పోలీసు వ్యవస్థను రద్దు చేసి, ఆ స్థానంలో ప్రజలను సాయుధులను చేసి ప్రజా మిలిషియాగా నిలబెట్టి శాంతి భద్రతల బాధ్యతను ఈ ప్రజా మిలిషియాకు అప్పచెప్పారు. ఈ చర్య.. బూర్జువా రాజ్య వ్యవస్థ కుంభస్థలిపై గురిచూసి శ్రామిక పులి పంజా విసరడమే! అప్పటి వరకు ఉనికిలో ఉన్న రాజ్య యంత్రాన్నంతటినీ యధాతధంగా ఉంచి శ్రామిక రాజ్యాధికారం కావాలనుకుంటే జరగని పని అనే ఎరుక సంపూర్ణంగా కాకపోయినా, ఒక మేరకైనా కమ్యూన్ శక్తులు గుర్తించడం ఒక విప్లవకర ముందంజ. ప్రజా పాలనా వ్యవహారాలను కమ్యూన్ తన బుజస్కందాలపై ఎత్తుకోవడానికి సాహసించి చర్యలు చేపట్టి, విప్లకర శ్రామిక వర్గ స్పృహను వెలికి తీసి ఆవిష్కరించడమన్నది ప్రపంచ శ్రామికోద్య మంలో సాహసోపేతమైన ముందడుగు. అంతేగాక కమ్యూన్ మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిచి కార్మికులే నడిపించుకునే పధ్ధతిని అవలంభించింది. ఈ మొత్తం చర్యలన్నీ ఏ లొసుగులూ లేకుండా ఓ నిర్దుష్ట పద్ధతిలో ప్రణాళికతో జరిగినవా? అప్పటి చారిత్రిక సందర్భంలో అలా జరిగే అవకాశం లేదు. ఎందుకనంటే, అప్పటికి ఫ్రెంచ్ శ్రామిక వర్గం బలమైన ఐక్య సైద్ధాంతిక పునాదికల్గి బూర్జువా రాజ్యంపై తిరుగుబాటు చేసే క్రమశిక్షణగల ఒక పటిష్టమైన సంఘటిత శక్తిగా ఏర్పడినది కాదు. అది ఒక ఇసుక గుట్ట వంటి సమూహం మాత్రమే. ఇందులో అరాచక వాదులు, బ్లాంకిస్టులు, పలు తరహా సోషలిస్టులు, కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నవారు.. ఇలా ఇది ఒక కలగూర గంపగా ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా ఈ శక్తి అప్పటి బూర్జువా రాజ్యానికి ఎదురొడ్డి నిలబడటమే గాక, ఒక శ్రామిక వర్గ ప్రత్యమ్నాయ రాజకీయాన్ని, పాలనా యంత్రాగాన్ని, గొప్ప త్యాగనిరతిని ప్రదర్శించి మునుముందు రాబోయే విప్లవాలకు వెలుగు దీపంగా నిలిచింది. ప్యారిస్ కమ్యూన్ మహత్తర ఆశయాన్ని, అది నిర్దేశించిన గమ్యాన్ని ఇంకా మానవాళి చేరుకోవాల్సే ఉంది.

ఐతే, పారిస్ కమ్యూన్ గా మనం పిలుచుకుంటున్న ఈ ʹప్రజా-కమ్యూన్ʹ వ్యవస్థ అనతి కాలంలోనే వెర్సైల్లెస్ ఫ్రెంచ్ బూర్జువా ప్రభుత్వం చేతిలో ఓడిపోయింది. 30,000 మంది ʹకమ్యునార్డ్స్ʹ ను, సాధారణ ప్రజలను ప్రష్యాకు అమ్ముడు పోయిన ఫ్రెంచ్ పాలక వర్గాలు ఊచకోత కోసి, వేలాది ప్రజలను జైళ్లలో కుక్కి, కమ్యూన్ను చిదిమేశారు. కమ్యూన్ను గనుక కొనసాగనిస్తే ఇక తమ ఉనికి కోల్పోయినట్లేనని వారికి తెలుసు. అందుకే బూర్జువా వర్గ కసినంతా ప్రదర్శించి అత్యంత అమానుష దాడితో కమ్యూన్ను నిర్మూలించారు. అన్నిటికన్నా ప్రధానంగా బూర్జువాలను వణికించిన కమ్యూన్ చర్య.. 16 ఏప్రిల్ 1871 న అది జారీ చేసిన డిక్రీ. అదేమంటే, మూతపెట్టిన ఫ్యాక్టరీలను తెరిచి వాటి నిర్వహణను కార్మిక సంఘాల కమిటీలకు అప్పచెప్పాలని నిర్ణయించి అమలుచేయడం. బూర్జువాల ఆయుపట్టైన ఫ్యాక్టరీ ఆస్తులు, ప్రధాన ఉత్పత్తి సాధనం తమ చేజారిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది కాబట్టి బూర్జువా యజమానులు ఇక ఏమాత్రము ఉపేక్షించ కూడదని, తమ సర్వ శక్తులను కూడగట్టుకుని, శత్రు దేశమైన ప్రష్యా పాలకులతో కూడా చేతులుకలిపి కమ్యున్ పై విరుచుకుపడ్డారు. కమ్యూన్ శక్తులను ఊచకోతకోసి, రక్తపుటేరులు పారించి అణిచి వేశారు.

అయితే ఈ పాలక బూర్జువా దాడిలో శైశవ దశలో ఉన్న కమ్యూన్ ఓడిపోయినా, అది అందించిన నూతన భావజాలం, నూతన శ్రామికోత్తేజం, బూర్జువా పాలనకు ప్రత్యామ్నాయంగా అందించిన శ్రామిక పాలనా నమూనాలు, కమ్యూన్ తాత్వికత, కమ్యూనా ర్డ్ల, శ్రామిక ప్రజల అనన్య త్యాగాలు ... ఇప్పటికీ నెరవేరని పారిస్ కమ్యూన్ ఆశయ సాధనకై జరుగుతూ వస్తున్న విప్లవాలకు ఊపిరి పోస్తూనే ఉన్నాయి. అజరామరంగా కొనసాగుతూనే ఉన్నాయి. వర్గ రహిత సమసమాజ స్థాపనా ఆశయానికి ఒక నిధిగా, ఒక గీటురాయిగా, చేరుకోవాల్సిన గమ్యంగా నిలిచి ఉన్నాయి.

పారిస్ కమ్యూన్ స్పూర్తితోనే అక్టోబర్ బోల్షెవిక్ విప్లవం, మొదటి సోషలిస్టు సమాజ నిర్మాణ ప్రక్రియ అనే అద్భుత ఆవిష్కరణ జరిగింది. యూరోప్ అంతటా, అమెరికా ఖండ మంతా సోషలిస్టు పెనుగాలులు వీచి పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించివేసే ఒక ఉప్పెన దశ ప్రపంచ మానవాళి చవిచూసింది.
ఈ రెంటి స్పూర్తితో జనచైనా ఆవిర్భావించి , మూడో ప్రపంచ దేశాల విముక్తి భండాగారం తెరుచుకుంది. రెండు ప్రపంచ యుద్ధాలను ʹపెట్టుబడి-సామ్రాజ్యవాదంʹ ప్రపంచ ప్రజలపై రుద్దినది. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన లేక మావోయిజం సిద్ధాంతాలు శ్రామిక విముక్తికి ఆయుధంగా అందివచ్చాయి .

అయితే దీనికి సమాంతరంగా అరాచకవాదం, రివిజనిస్ట్ సోషల్ డెమాక్రసీ, ఉదారవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామయం, ఆధునిక టెక్నాలజీల సహాయంతో పెట్టుబడి, సామ్రాజ్యవాదులు ఊపిరి పోసుకున్నాయి. సోషలిస్టు నిర్మాణాలు రివిజనిజానికి గురై పెట్టుబడిదారీ మార్గాన్నే ఎన్నుకుని సోషలిజాన్ని ఓడించాయి.

భారత దేశంలో ఓ శతాబ్దం పైబడ్డా విప్లవాన్ని విజయవంతం చేసే మాట అటుంచి, కమ్యూనిస్టు శక్తులు కమ్యూనిస్టు పేరునే అభాసుపాలు చేసే కార్మిక వర్గ ద్రోహంలో భాగస్వాములైపోయారు. ఒక నక్సల్బరీ వెలుగు రేఖ విప్లవ ఆకాశాన్ని కమ్మివేసిన కారు మేఘాన్ని చీల్చుకుని మెరిసినా, అనతికాలంలోనే అది ఒక ఉన్మాద ప్రవాహంలో కొట్టుకుని పోయి, ఇప్పుడు కాలు కూడదీసుకుని ప్రజాయుద్ధ పంథాలో పట్టువిడవక నడుస్తోంది. రివిజనిజానికి విరుగుడుగా వెలిగిన చైనాలో సాంస్కృతిక విప్లవం అత్యంత దారుణంగా ఓడిపోయి పెట్టుబడిదారీ పంథా విజయకేతనం ఎగరేసింది.

తిరిగి అత్యన్త తిరోగమన మితవాదం, మతవాదం, జాత్యాహంకార వాదం, సామ్రాజ్యవాదం... కలగలసి మూడో ప్రపంచ యుద్ధ బూచి మానవాళి ముంగిట తలుపులు తడుతోంది. భారత దేశంలో కాషాయ వాద త్రిసూలాల మతోన్మాద విన్యాసాలు బూటకపు అభివృద్ధి ముఖుటాతో రాజ్యమేలుతున్నాయి.
శ్రామిక కులాలు కాషాయానికి కాపలా కాస్తున్నాయి. సంఘటిత శ్రామిక వర్గం అన్నది కానరాకుండానే పోతున్నది. మధ్యతరగతి.. సరుకుల మాయలో, మత్తులో మునిగి పోయింది. భారత దేశంలో ఒక్క గిరిజనులు మాత్రమే తమ అస్తిత్వం కోసం కొండకోనల్లో పోరాడుతున్నారు.

కమ్యూన్ కాల గర్భంలో కలిసిపోయింది.
ఐనా, కమ్యూనిస్టు కలలు కనేవారి నుండి అది కనుమరుగవలేదు.
చెట్లు విశ్రాంతి కోరుకున్నా గాలి వీయక మానదు.
ʹప్రజాయుద్ధంʹ కమ్యూన్ ను సాకారం చేస్తుంది
పెట్టుబడిని ఓడించి తీరుతుంది
కమ్యూన్ ఆశయాలను తిరిగి ఆవిష్కరిస్తుంది
ప్రపంచం నలు దిశలా తిరిగి నూతన శ్రామిక రాజ్యం పరుచుకుంటుంది
వివా! లా కమ్యూన్ !
వివా! లా కమ్యూన్ !
లా కమ్యూన్ ! లాల్ సలాం!
లాల్ సలాం ! లాల్ సలాం !

No. of visitors : 725
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2018
  కత్తి మహేష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం
  కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
  రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే
  వీళ్లు చేసిన నేరం ఏంటి?
  జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ
  కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు
  నెలవంక సందేశం
  The tree of the world
  వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?
  వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
  రాజ్యం బరితెగింపు వెనక

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •