ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

| సాహిత్యం | వ్యాసాలు

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

- అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్... ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఆ పేరు విన‌గానే బ్రిటీష్ సామ్రాజ్య‌వాదుల‌తో హిందుస్థాన్ సోష‌లిస్ట్ రిప‌బ్లిక్ అసోసియేష‌న్ చేసిన రాజీలేని పోరాటం స్పురిస్తుంది. త‌న‌తో పాటు అమ‌రులైన రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగం స్ఫురిస్తుంది. భ‌గ‌త్‌సింగ్, అత‌ని స‌హ‌చ‌రులు అమ‌రులైన 68 ఏళ్లు అవుతోంది. తెల్ల‌దొర‌లు పోయి న‌ల్ల దొర‌లు వ‌స్తే ఆ స్వాతంత్ర్యం వ‌ట్టి బూట‌కం అన్న భ‌గ‌త్‌సింగ్ మాట‌లు ఈ అర‌వై తొమ్మిదేళ్ల‌ పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యాన్ని చూస్తే నాటి ప్రాసంగిక‌త నేటికీ ఉన్న‌ది అన‌డం అతిశ‌యోక్తి కాదు.

స్వాతంత్ర్యం అంటే కేవ‌లం అధికార మార్పిడి అనే భావ‌జాలం నుంచి నిజ‌మైన స్వాతంత్ర్యం అంటే ఏమిటో చెప్పిన వాడు భ‌గ‌త్‌సింగ్‌. రైతు ఆక‌లితో నిద్ర‌పోన‌ప్పుడు, చేనేత న‌గ్నంగా ఉండ‌న‌ప్పుడు, కార్మికుడికి గూడు దొర‌క‌ని స్థితి లేన‌ప్పుడు నిజ‌మైన స్వాతంత్ర్యం సిద్ధించిన‌ట్ల‌న్నాడు. అది విప్ల‌వం ద్వారానే సాధ్య‌మ‌ని న‌మ్మాడు. విప్ల‌వ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాడు. అచ‌రించాడు. ఆ విప్ల‌వం కోసమే ప్రాణ‌మిచ్చాడు.

విప్ల‌వం అంటే బాంబులు, తుపాకులే త‌ప్ప ఇంకేమీ కాద‌నే ప్ర‌చారం భ‌గ‌త్‌సింగ్ కాలం నుంచి నేటికీ కొన‌సాగుతోంది. ఆ ప్ర‌చారానికీ ఆయ‌నే స‌మాధానం చెప్పాడు. విప్ల‌వం అంటే ఒక మ‌నిషిని మ‌రొక మ‌నిషి పీడించే స్థితికి చ‌ర‌మ‌గీతం పాడ‌డం అని, విప్ల‌వం అంటే బాంబులు, పిస్తోళ్లే కాదు... అన్యాయం మీద ఆధార‌ప‌డ్డ వ‌ర్త‌మాన సామాజిక వ్య‌వ‌స్థ మార్పు చెంద‌డ‌మ‌న్నాడు. భ‌గ‌త్‌సింగ్ స్వాతంత్య్రానికి ఇచ్చిన నిర్వ‌చ‌నం నేటికీ వ‌ర్తించ‌డ‌మంటే ఈ బూట‌క‌పు స్వాతంత్య్రం నుంచి ప్ర‌జ‌లు త‌మ‌ను తాము విముక్తం చేసుకోవ‌డానికి విప్ల‌వం త‌ప్ప మ‌రో మార్గం లేదు.

మార్చ్ 23న‌ భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేలు మాత్ర‌మే కాదు... విప్ల‌వ క‌వి పాష్ కూడా (1988) అమ‌ర‌త్వం నొందాడు. తాను జీవించిన కొద్దికాలంలోనే చిర‌స్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని సృష్టించాడు అవ‌తార్ సింగ్ సాధు (పాష్‌). 1950లో పంజాబ్‌లో జ‌న్మించిన అవ‌తార్ సింగ్ న‌క్స‌ల్బ‌రీ ఉద్య‌మ ప్ర‌భావంలో ఎదిగిన వాడు. నూనూగు మీసాల వ‌య‌సులో విప్ల‌వాన్ని ప్రేమించిన వాడు. క‌విత్వంలో జీవించిన‌వాడు. తాను చ‌నిపోయే నాటికి లోహ్‌క‌థా, ఉద్దాడే బాజ‌న్ మ‌గ‌ర్‌, సాడే స‌మియా, ఖిల్‌రే హోయే వార్కే అనే నాలుగు క‌వితా సంక‌ల‌నాల‌ను వెలువ‌రించాడు. విప్ల‌వాన్ని స్వ‌ప్నించ‌డంలోనే కాదు, ఆచ‌రించ‌డంలోనూ భ‌గ‌త్‌, పాష్‌కు పోలిక‌లున్నాయి. వారిద్ద‌రూ జైలు జీవితాన్ని అనుభ‌వించారు. విప్ల‌వ కాంక్ష‌ను ఎలుగెత్తిచాటారు.

పాష్ క‌విత్వం అనేక భాష‌ల్లోకి అనువందిబ‌డ్డ‌ది. హ‌మ్ ల‌డేంగే సాథీ అంటూ అస‌మ వ్య‌వ‌స్థ‌పై పోరాటాన్ని ఎక్కు పెట్టిన‌వాడు పాష్‌. ʹస‌బ్‌సే ఖ‌త‌ర్నాక్ హోతా హై , హ‌మారే స‌ప్నే కా మ‌ర్ జానా, అంటూ మ‌న క‌ల‌లు మ‌ర‌ణించ‌డం అన్నింటిక‌న్నా ప్ర‌మాదమ‌ని హెచ్చ‌రిస్తాడు. తెలుగు నేల‌పై ప్ర‌తి ఇంటి గోడ‌మీద క‌నిపించిన శివ‌సాగ‌ర్‌, చెర‌బండ‌రాజు, అలిశెట్టి క‌వితా పాదాల్లా పాష్ క‌విత్వం పంజాబ్ గోడ‌ల‌పై ఇప్ప‌టికీ క‌నిపిస్తుంది.

70వ ద‌శ‌కంలో వెల్లువ‌లా వ‌చ్చిన విప్ల‌వ సాహిత్యంలో పాష్ త‌న‌దైన ముద్ర‌వేశాడు. లోహ్ క‌థ‌లో తాను వినిపించిన దిక్కార స్వ‌రాన్ని వినిపించినందుకు రాజ్య‌నిర్భందాన్ని ఎదుర్కోవ‌ల్సి వ‌చ్చింది. రెండు సంవ‌త్స‌రాల జైలు జీవితం త‌రువాత పంజాబ్ మావోయిస్టు ఫ్రంట్‌కి చెందిన సిరాహ్ అనే సాహిత్య ప్ర‌తిక‌కు సంపాద‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు పాష్‌. 88లో తాను చ‌నిపోయేనాటి వ‌ర‌కు విప్ల‌వ రాజ‌కీయాల‌కు పాపుల‌ర్ ఫిగ‌ర్‌గా నిలిచాడు పాష్‌.

ఖ‌లిస్థాన్ వేర్పాటువాదుల చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టినందుకు పాష్‌ను ఆయ‌న స్వ‌గ్రామంలోనే 1988లో త‌న స్నేహితుడు హ‌న్స్‌రాజ్‌తో పాటు కాల్చిచంపారు. భ‌గ‌త్‌సింగ్ ఆశించిన స్వాతంత్య్రం, విప్ల‌వ సాధ‌న కోసం క‌లం యోధునిగా త‌న క‌వితాస్థ్రాన్ని సంధించిన పాష్ యాదృచ్చికంగా అదే రోజు మార్చి 23నే హ‌త్యగావించ‌బ‌డ్డాడు. కానీ వారు క‌ల‌లు క‌న్న స‌మాజం కోసం ఇవాల్టి త‌రం వారి పోరాటాన్ని ఎత్తుకోవ‌ల్సిన అవ‌స‌రం ఉంది. భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే.

ఇవాళ దేశంలో పొంచిఉన్న హిందూ ఫాసిస్టు ప్ర‌మాదం అన్ని వ‌ర్గాలు ఐక్య‌మై పోరాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తుచేస్తోంది. హిందూ మ‌తోన్మాదం, అమెరికా సామ్రాజ్య‌వాదం క‌లిసి చేస్తున్న దాడిని ఎదుర్కోవ‌డానికి ఆ అమ‌రులు చూపిన దారిని ఎంచుకోక‌త‌ప్ప‌దు. బ్రాహ్మ‌ణీయ పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థను కూల్చ‌డానికి వాళ్లు చూపిన మార్గం మ‌న ముందు ఉంది. పోరాటం త‌ప్ప మ‌రో దారి లేదు. మ‌న స్వేచ్చ‌, స్వాతంత్ర్యాల కోసం జ‌రిపే పోరాటాల‌లో అమ‌రుల స్మృతులు స‌జీవంగా ఉంటాయి.


బంధూక్ న హుయీ తో త‌ల్వార్ హోగి
త‌ల్వార్ న హుయీ తో ల‌గాన్ హోగి
ల‌డ్నే కా దంగ్ న హుయీ తో
ల‌డ్నే కి జ‌రూర‌త్ బాకీ హోగీ
హ‌మ్ ల‌డేంగే
హ‌మ్ ల‌డేంగే
హ‌మ్ ల‌డేంగే
హ‌మ్ ల‌డేంగే, సాథీ
ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్
- పాష్‌

(భ‌గ‌త్ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్ దేవ్ మ‌రియు పాష్‌ల వ‌ర్థంతి సంద‌ర్భంగా )

No. of visitors : 1008
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

యుద్ధానంతర యుద్ధగీతం

అరుణాంక్ | 06.09.2018 11:50:31pm

ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే ఓ నా తెలంగాణ నేల నీకు గుర్తుందా! నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది కాకపోతే రూరల్ పేద .....
...ఇంకా చదవండి

నెలవంక సందేశం

అరుణాంక్ | 16.06.2018 12:36:48am

ప్రశ్నించిన చోటల్లా బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా దేశ ముఖచిత్రాన్ని మార్చే ఒక్క వాక్యం రాద్దాం ఒక్క కవాతు చేద్దాం ... ...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

ఆలోచన ఒక మహారణ్యం

అరుణాంక్‌ | 17.04.2018 12:31:36am

మరణించేది వ్యక్తులే శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మహారణ్యం వారి ఆశయం వారి ఆలోచనలు...
...ఇంకా చదవండి

Dream to Dream

అరుణాంక్‌ | 22.07.2018 01:05:48am

కలిసి కట్టుకున్న కలల సౌధం మిసైల్ పడ్డట్టు నిట్టనిలువునా కుప్పకూలిపోయింది కలిసి కన్న కల వేటగాడ్ని చూసిన పావురాల గుంపులా చెదిరిపోయింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •