హంతకులను కాపాడే వ్యవస్థను ప్రజాస్వామ్యం అనలేము.

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

హంతకులను కాపాడే వ్యవస్థను ప్రజాస్వామ్యం అనలేము.

- విరసం | 03.04.2017 08:43:24am

హంతకులను కాపాడే వ్యవస్థను ప్రజాస్వామ్యం అనలేము.
మధుకర్ ను హత్య చేసిన కుల ఉన్మాదులను శిక్షించాలి.
చేయని నేరానికి సత్యంబాబు జీవితాన్ని బలిచేసిన పోలీసులను శిక్షించాలి.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో జరిగిన దారుణం భారతదేశ సామాజిక నీతిని, చట్ట వ్యవస్థ తీరుని, రాజ్య స్వభావాన్ని విప్పి చూపుతున్నది. వేల సంవత్సరాల నాటి ధర్మం ఆధునికను, సో కాల్డ్ ప్రజ్వాస్వామ్యాన్ని గ్రామం నుండి నగరం దాకా గేలి చేస్తున్నది. మన దేశంలో ఫ్యూడల్ ఆధిపత్య శక్తుల మీద చావుదెబ్బ వేయాల్సిన ఉద్యమాలు వెనకతట్టు పట్టిన స్థితిలో అవి అంతకంతకూ విశ్రుంఖలంగా చెలరేగుతున్నవి. కుల వ్యవస్థ పైమెట్టు మీద ఉన్న అమ్మాయిని ఇష్టపడినందుకు అచ్చంగా మనుధర్మం మధుకర్ ను చిత్రహింసలు పెట్టి అంగాలు కోసి హత్య చేస్తే చట్టం దీనికి రక్షణ కవచం కప్పుతున్నది. దేహం మీద ఆచ్ఛాదన తొలగించుకుని బహిరంగంగా కనపడుతున్న గాయాలు జరిగిన దుర్మార్గాన్ని కళ్ళకు కడుతుంటే రాజ్యం హంతకులను రక్షించే పనిలో పడింది. పోలీసుల నుండి మంత్రుల దాకా అది ఆత్మహత్య అని నిస్సిగ్గుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో వేలాది మంది స్పందిస్తే గాని ఇది కనీసం మీడియాలో వార్త కాలేదు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని మంత్రి మాట్లాడతాడు. నిందితులు అధికార పక్షానికి దగ్గరివారు కావడమే కాదు, రాజ్య స్వభావంలో కులవ్యవస్థను కాపాడే లక్షణం ఉండటం కూడా ఇందుకు కారణం. ఇటువంటి ఉదాహరణలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. చట్టం, న్యాయస్థానం కూడా అంతిమంగా ఆధిపత్య వ్యవస్థను కాపాడటం ఈ దేశ అనుభవంలో చిక్కాగా ఉన్నది. ఇది ఎక్కడో ఒక చోట బద్దలు కాక తప్పదు.

ఇప్పుడు మధుకర్ హంతకులను కాపాడే ప్రయత్నం ఎట్లా జరుగుతోందో, సరిగ్గా పదేళ్ళ క్రితం విజయవాడలో ఆయేషా మీరా హంతకులను కాపాడి, అమాయకుడైన సత్యంబాబు జీవితాన్ని బలిపెట్టిన తీరు ఇవాల హైకోర్టు తీర్పుతో బట్టబయలైంది. ఆరోజు ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు మాట్లాడినవి వాస్తవాలని న్యాయస్థానం తేల్చేలోగా దిక్కులేని ఒక నిరపరాధి ఆరోగ్యం, జీవితం నాశనం అయింది. ఇప్పుడైనా అసలు నేరస్తులను పట్టుకుంటారా అన్నది అనుమానమే. అసలు నేరస్తులతో పాటు అన్యాయంగా సత్యంబాబు జీవితాన్ని బలి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలి. మధుకర్ హత్యపై పారదర్శకంగా విచారణ జరగాలని, హంతకులను శిక్షించాలని విరసం డిమాండ్ చేస్తున్నది.
- విరసం





No. of visitors : 769
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మనకాలపు సాహిత్య కృషీవలుడు చిలుకూరి దేవపుత్రకి నివాళి

విర‌సం | 18.10.2016 10:51:34pm

దేవపుత్ర దళిత జీవిత చిత్రాన్నిగొప్పగా ఆవిష్కరించాయి. కరువు నేపథ్యం నుండి రాయలసీమ సమాజాన్ని లోతుగా చిత్రీకరించాయి.......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •