నాలో నేనే తొంగిచూస్తే

| సాహిత్యం | క‌విత్వం

నాలో నేనే తొంగిచూస్తే

- సు.దే.చె | 05.04.2017 11:58:04pm

అప్పుడప్పుడు
నాలో నేనే తొంగిచూస్తే
గుండె లోగిలిలో
మనస్సు పూతోట యోగక్షేమమును
అడిగి తెలుసుకుంటుంటాను
తెగులును గమనించి
జ్ఞాపకాల సహజ ఎరువును
చల్లుతుంటాను.

అప్పుడప్పుడు
నాలో నేనే తొంగిచూస్తే
నా మస్తిష్క పొరలలో
నిక్షిప్తమయిన అడవి కథలు
భద్రంగా ఉన్నాయో లేదో అంటూ
లాంతర్ వెలుగులో వెతుకుంటాను
వ్యధతో దుర్మార్గమును ఖండిస్తే
రాజ్యద్రోహ చట్టం కాటేస్తుంది.

అప్పుడప్పుడు
నాలో నేనే తొంగిచూస్తే
నా పక్కటెముకలను
వేళ్ల కొసలతో తట్టినప్పుడు
ఊసల సవ్వడి ధ్వనిస్తుంది
నలుదిక్కులా పరుచుకున్న
కాల్షియం కంచెలో
హృదయం బెరుకు బెరుకుగా
కొట్టుకుంటుంది.

అప్పుడప్పుడు
నాలో నేనే తొంగిచూస్తే
నిన్నటి జాడలు
నేడు గాయాలుగా
రూపాంతరము చెంది
రక్తపుటేరులు చీముతో జతకట్టి
దారాలంగా పారక ముందే
ఎవరైనా గమనించే లోపు
ఫేక్ నవ్వుల టిష్యూ పేపర్ తో
తుడిచెయ్యాలి.

అప్పుడప్పుడు
నాలో నేనే తొంగిచూస్తే
హృదయం ఏడుస్తూ కనిపిస్తుంది
ఎర్ర జాడలు పరుచుకున్న జీవితంలో
ఎన్ కౌంటర్ జడివానలు మిగిల్చిన శిథిలాలు
నా గుండెల్లో మరో చైతన్య గీతానికి పునాది





No. of visitors : 433
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆలోచించడం నేరం..

సు.దే.చె | 02.01.2017 11:22:05pm

ఈ దేశంలో నడిచేటప్పుడు జాగ్రత్త నీవు నడిచిన త్రోవను తరుముకుంటూ వస్తారు నీ మేధస్సును తూనిక వేస్తారు...
...ఇంకా చదవండి

ఆది-అంతం

సు.దే.చె | 18.01.2017 11:01:43pm

తుమ్మెద పుప్పొడి సేకరణకు సెలవు ప్రకటించింది. అడివంటే పచ్చని సోయగమే కాదు అందులోనే నిరంతరాయంగా దోపిడీ వ్యవస్థకు ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది...
...ఇంకా చదవండి

ఎలియాస్

సురేంద్ర | 04.02.2017 02:44:42am

ఒకానొక రోజు రేడియోలో ʹఉపగ్రహాలు నల్లమల అడవిలో ఖనిజాల సంపత్తిని తెలియపరిచాయి. వాటిని వెలికితీయడం కొరకు ప్రభుత్వం అధ్యాయన కమిటీని నియమించడం జరిగింది ʹ అంటూ .....
...ఇంకా చదవండి

రక్తం గోడపై...

సు.దే.చె | 18.03.2017 12:32:21pm

ఊసల వెనుక,గాఢమైన చీకటి గదిలో థర్డ్ డిగ్రీ లయబద్ధమైన చిత్రహింసలకు రక్తం గోడపై అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ గుర్తులు. సమసమాజ నిర్మాణం కొరకు సమస్తమూ వీడి అడవి బాట ప...
...ఇంకా చదవండి

సూధ్రుడెవడు?

సు.దే.చె | 04.05.2017 11:05:13am

వాడు వాడే సూధ్రుడిని అతిసూధ్రునిగా విభజించిన వాడే కదా.....
...ఇంకా చదవండి

చెరగనివి నీడలు మాత్రమే...

సు.దే.చె | 05.12.2017 11:49:32pm

నీడలు నల్ల రంగునే పూసుకుని మన మధ్య తిరుగాడడం ఎప్పటి మాటో! నీడలు వెలుగున్నప్పుడే పుడతాయని ʹఅంధకారంలో షాడో డైస్ʹ అని చెప్పినవాడు ఎటుపోయాడో? బహుశా కాకమీదున.....
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తెగులు సోకిన రచయితలారా రండీ
    ఎవరి ప్రాభవం తండ్రీ..
    వెలివేయబడ్డ అక్షరం
    గుండె గుర్తులు వెతుక్కుంటూ
    ఏ స‌మాజం కోసం?
    సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
    అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
    ప్రతివాది
    కవి ఎక్కడ?
    ధిక్కార స్వరాలకు ఆహ్వానం
    సౌందర్యాత్మక కవిత
    అమ్మకొ లేఖ!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •