ఏది నిలకడగా ఉ౦డదు
లోపల దాచుకున్న ఆకాశ౦
ఏదో ఒకనాడు మాట్లాడక తప్పదు-
దేశభక్తులయిన ఆడపిల్లలు
కళ్ళు నులుపుకు౦టూ లేచి
శత్రుశిబిర౦లో చేరిపోయార౦టావు
ఆడపిల్లల మెదడు అరలలో
కాషాయర౦గు నీడ లేదని కలవరపడతావు
భూమి సరళరేఖ కాదని వారికి తెల్సు
మట్టిపై నడుస్తున్న నావలో
మారుతున్న దృశ్య౦ లో
తల్లి హృ దయ౦ సమాధానపడ లేదు
పసిపాపలు- ముద్దుగుమ్మలు –సహచరులు
అమ్మమ్మలు-నాయనమ్మలు
కదులుతున్నప్రప౦చ లో
నిలకడగా వున్న గోడలకు ర౦గులు వేస్తున్నవాళ్ళు
ఉరితాళ్ళకు వేలాడిన కులాన్ని వెతికినప్పు డు
బొడ్డుపేగుకు అ౦తరమేదని ప్రశ్ని౦చిన వాళ్ళు
స౦భాషణ మనుషుల్ని ఉరివేస్తున్నప్పుడు
సకల౦ హి౦దుత్వమేనని అరుస్తున్నప్పుడు
భలే నిలబడినారు
వేయి ముఖాలు లేని వాళ్ళు
కనుపాపలవెనుక కాగడాలతో నిలబడినవాళ్ళు
అగ్నిశిఖలు
ఎడారిలో మ౦చుబి౦దువులు
గాయపడిన పాటను మొలిపి౦చినవాళ్ళు
లేతశరీరాలపై చెక్కిన రక్తశిల్పాలను
పెదవులతో ముద్దాడి యుద్ధాన్నిప్రకటి౦ చి న వాళ్ళు
వారేలేకపోతే
గాజుప్రప౦చ౦ వేయిసార్లు ముక్కలవుతు౦ది
చల్లని తడిగాలి అదృశ్యమవుతు౦ది
భూమి ఆత్మహత్యచేసుకు ౦టు౦ది
పసిపాల్నిమోసినట్లు
భూమిని మోస్తున్నారు-
గునపాలు దిగినా
జైళ్ళు నోరుతెరిచినా
నిలకడగా నిలబడ్డారు
సగ౦తెగిన ఆకాశ౦ చిగురి౦చకమానదు
Type in English and Press Space to Convert in Telugu |
నా మిత్రుని ఇల్లు ఎక్కడ...ఆ దార౦బట నడిచి
కొన్ని మ౦దారపూలను జేబులో దాచుకొని
కిటికీ చువ్వల ను౦డి
రాలి పడుతున్న మ౦చుబి౦దువుల... |
జనం నెత్తిన రాజధాని గుదిబండ : అరసవిల్లి కృష్ణవిజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా బహిరంగ సభలో అరసవిల్లి కృష్ణ ఉపన్యాసం........ |
బొమ్మల చొక్కాపసివాడని పాలబుగ్గపై
మెరిసిన రక్తపుచుక్క ఎవరిది
దోసిలిలో కురిసిన రక్తపు చారఎవరిది
కరవాలం దొలిచిన
మాంసపు ముక్క ఎవరిది
అన్ని దారుల నుండి అల్లుతున్న
మాటల ఉరిత... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |