ఈ బాలుడి కనీటి ప్రశ్నకు న్యాయవ్యవస్థ జవాబు ఏమిటి

| సంభాషణ

ఈ బాలుడి కనీటి ప్రశ్నకు న్యాయవ్యవస్థ జవాబు ఏమిటి

- పి. ప్రసాదు | 06.04.2017 11:46:57am

లక్షలాది ఎకరాలను కబళిస్తున్న భూకబ్జా ముఠాలూ, ట్రిలియన్ల ఖనిజ సంపదను కొల్లగొడుతున్న లూటీకోరులూ ; లక్షల కోట్ల రూపాయల విలువగల పన్ను ఎగవేతదారులూ ; జూదగొండి టక్కరి వ్యాపార మఠాలూ ; స్విస్ బ్యాంకు నల్లధనాధిపతూలూ; మాఫియా డాన్లూ : పర్యావరణ విధ్వంసకారులూ ఏ శిక్షలూ (కనీసం కేసులు కూడా) లేకుండా నడిబజారుల్లో బోర విరుచుకుని అచ్చోసిన ఆంబోతుల వలె రంకెలు వేస్తూ తిరుగుతున్నారు. కానీ ఏ నేరం చేయకపోయినా, యూనియన్ స్థాపించుకున్న నేరానికి శ్రమ జీవులు యావజ్జీవ శిక్షలకు గురౌతున్నారు. ఢిల్లీ పరిసరాలలోని మానేసర్ పారిశ్రామికవాడకి చెందిన మారుతీ సుజుకి కార్మికులు 13 మందికి గురుగావ్ జిల్లా కోర్డు యావజ్జీవ శిక్ష విధించింది. మార్చి 10 న నేర నిర్ధారణ చేస్తూ మరియు 18న శిక్షలు ఖరారు చేస్తూ యీ తీర్పు వెలువడింది.

మారుతీ సుజుకి కార్ల ఫ్యాక్టరీ విదేశీ బహుళ జాతి సంస్థకి చెందింది. యూనియన్ను స్థాపించుకున్నందుకు యూజమాన్యం కక్షకట్టింది. ప్యూహాత్మకంగానే యాజమాన్య ప్రతినిధి ఒకరు మరణించే పరిస్థితిని పథకం ప్రకారం సృష్టించింది. 2012 జులైలో జరిగిన ఒక దుర్ఘటనను సాకుగా చూపించి 148 మంది కార్మికుల మీద కుట్ర కేసును బనాయించింది. సరైన సాక్ష్యాలు లేకపోయినా, ముందస్తు అభిప్రాయాలకనుగుణ్యంగా 31 మందిని నేరస్తులుగా న్యాయస్థానం నిర్ధారించింది. అందులో 13 మందికి యావజ్జీవ శిక్షను విధించింది. (తన తండ్రికి యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించిన వార్తను కోర్టు హాలులో వినగానే బిక్కమొఖం పెట్టిన బాలుడి ఫోటను చూడండి).

2012 జులై దుర్ఘటన తర్వాత 546 మంది పర్మినెంటు కార్మికులను యాజమాన్యం సస్పెండు చేసింది. వందలాది మంది కాంట్రాక్టు కార్మికులను డిస్మిస్ చేసింది. 148 మందిని జైలుకు పంపించింది. 31 నెలల పాటు మొత్తం 148 మందిలో ఏ ఒక్క కార్మికుడికి బెయిల్ యివ్వని సంఘటన బ్రిటీష్ వలస కాలంలో కూడా లేదు. 2015 ఫిబ్రవరిలో తొలిసారి సుప్రీమ్ కోర్టు యిద్దరికి బెయిల్ యిచ్చింది. ఆ తర్వాత దఫదఫాలుగా మంజూరు చేసింది. మొన్న తీర్పు వరకూ 8 మంది జైలులోనే వున్నారు.

దేశ సంపదలను పంది కొక్కుల్లా మెక్కేవారికే,దేశ సంపదలను సృష్టిస్తున్న శ్రమ జీవులకూ మధ్య యిదీ నేడు అమలు జరుగుతున్న వివక్షతా న్యాయం కార్పొరేటు మీడియాలో కార్మికుల కన్నీటి విషాధ గాధకు చోటు లేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా నైనా ప్రచారం చేసుకుందాం. మధ్యదరా సముద్రంలో మునిగి మృతి చెందిన 3 ఏళ్ళ సిరియా బాలుడు ఐలాన్ కుర్డీ వలె ఈ జైలు కార్మిక ఖైదీ కన్నబిడ్డ కన్నీటి చిత్రాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా కోట్లాది శ్రమ జీవుల వద్దకు తీసుకెళదాం.

No. of visitors : 756
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సామ్రాజ్యవాదయుగంలో సాటిలేని హీరో ఉత్తర కొరియా !

పి. ప్రసాదు | 18.10.2017 03:15:47pm

నేటి సామ్రాజ్యవాద యుగంలో ఉత్తరకొరియా ఒక ప్రతిఘటనా ప్రతీకగా నిలుస్తుంది.ప్రతిఘటనా ప్రపంచానికి ఒక విప్లవ స్ఫూర్తి దాతగా నిలుస్తుంది.అగ్రరాజ్యల దురాక్రమణదారీ.....
...ఇంకా చదవండి

జనగణమన లోగుట్టు

పి.ప్రసాద్ | 15.08.2018 11:57:40pm

ఆగస్టు 15... దాని నిజ రంగు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ దేశ ప్రజల లో ఎంత ఎక్కువ స్థాయిలో బట్ట బయలు అవుతుంటే, అంతే ఎక్కువ స్థాయిలో కృత్రిమ అందాలతో అది సింగారించబ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2020
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •