మధుక‌ర్‌ మనువాద హత్య

| సంపాద‌కీయం

మధుక‌ర్‌ మనువాద హత్య

- పాణి | 17.04.2017 10:15:33am

దళితుల విషయంలో కతలన్నీ ఒకేలా ఉంటాయి.

ఇప్పుడే కాదు, ఆనాదిగా ఈ కథలు, కథనాలు ఒకే ఇతివృత్తం మీద నడుస్తుంటాయి. దళిత యువతీ, యువకుల హత్యలు మొదట అనుమానాస్పదం అవుతాయి. దాని చుట్టూ నిజం ఎవ్వరికీ తెలయకుండా అంతులేని వాదనలు బైటికి వస్తాయి. అందులో ప్రేమ ఉంటుంది. అగ్రకులస్థులను ప్రేమించినందుకు హత్య జరుగుతుంది.

జిల్లా స్థాయి న్యూస్‌ పేపర్లలో ఇలాంటివి తరచూ కనిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని హత్యలకు సమాజం స్పందిస్తుంది. లేకుంటే మామూలు క్రైం వార్తల్లో ఇవీ కలిసిపోతాయి. తెలంగాణలో పెద్దపల్లి జిల్లా, మంథని మండలం ఖానాపూర్‌లో మార్చి 14న మధుకర్‌ అనే దళితుడి హత్య జరిగింది. పక్క ఊరు వెంకటాపూర్‌లోని ఓ ఆసామి ఇంట్లో మధుకర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆ ఇంటి అమ్మాయి, మధుకర్‌ ప్రేమించుకున్నారనే కారణం..మధుకర్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆతని మృతదేహం మీద ఉన్న గాయాలే ఎంత కసిగా చంపేశారో తెలియజేస్తాయి.

సహజంగానే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. తెలంగాణలోని దళిత, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. హత్యగా కేసు బుక్‌ చేయాలని, రీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ మూమూలు డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున సంఘాలు, ప్రజలు కదలాల్సి వచ్చింది. రీ పోస్టు మార్టం ఎంత తంతుగా జరిపించారో చాలా మంది రాశారు. దళితుల జీవితాలు, మరణాలే కాదు, పోస్టుమార్టం పట్ల కూడా ఎంత నిర్లక్ష్యం, ఎంత అమానవీయం.

చాలా వెనక్కి పోనక్కర్లేదు, చాలా ప్రముఖంగా చెప్పుకునే కారంచేడు ఘటనలో కూడా ఇలాంటివే. లోకమంతా మారిపోయిందని, కులం ఎక్కడుందనీ కొందరు గడుసుగా నిలదీస్తుంటారు. మన సామాజిక, మనో ప్రపంచాలు కులం పునాదుల్లో జుగుప్సాకరంగా పెనవేసుకొనిపోయాయని చెప్పడానికి ఇలాంటి ఘటనలు ఎన్ని కావాలి? రాజకీయార్థిక రంగాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నా కులానికి సంబంధించిన కీలక విషయాలు కర్కశంగానే పని చేస్తున్నాయి. అన్నిటిలోకి కులాంతరం అనేది బ్రాహ్మిణీయ భావజాలానికి ఆయువు పట్టు. కుల సంకరం జరుగుతుందంటే ఎంత మందినైనా చంపేస్తుంది. ఎంత దారుణమైన హత్యలకైనా సిద్ధపడుతుంది. ప్రేమ వివాహాల విషయంలో అగ్రకులాల దాష్టీకానికి మూలం అక్కడుంది. దీనికి రాజకీయ పలుకుబడి తోడవుతుంది. డబ్బు తిరుగులేని బలాన్ని ఇస్తుంది. నాలుగు పైసలు చల్లేస్తే కేసు పోతుంది.. అంత దానికి కుల సంకరాన్ని ఒప్పుకుంటామా? అనే దుర్మార్గమైన ఆలోచన మధుకర్‌ లాంటివాళ్లను పొట్టన పెట్టుకుంటుంది.

చాలా విచిత్రంగా భారత శిక్షాస్మృతి ప్రకారం ఏ నేరమూ చేయని వాళ్లు ఇలా అగ్రకుల భావజాలం చేతిలో జీవితాలే కోల్పోతారు. హత్య జరిగినప్పుడు ఉలిక్కిపడటం మన సమాజమింకా సున్నితంగానే ఉందనడానికి గుర్తుకాని, హత్యకాకుండా నిత్యం అనేక రూపాల్లో శిక్షాస్మృతితో సంబంధం లేని శిక్షలు దళితులు, మహిళలు అనుభవిస్తూ ఉంటారు. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం అంటరానితనం పాటించడం నేరం కావాలి. అది ఎక్కడికి పోయిందోగాని అంటరానితనం అనే బ్రాహ్మణీయ భావజాలం, దారుణమైన సాంఘిక నీతి వల్ల దళితులు నేరస్థులవుతుంటారు. అవమానాలకు, హత్యలకు గురవుతున్నారు. రాజ్యాంగం మన ఇతర జీవన రంగాల్లో .. రాజకీయార్థిక, పాలనా రంగాల్లో.. ఎలా అమలువుతోందనే వాదన అలా ఉంచితే సాంఘిక జీవన రంగంలో మాత్రం కుల భావజాలమే చాలా బలంగా ఉన్నది. ఇతరేతరంగా అంటు ముట్టు లాంటివి కొన్ని ఆవరణల్లో బైటికి కనిపించకపోయినా, కులాంతర ప్రేమలు, పెళ్లిళ్ల దగ్గర మాత్రం కులం చాలా నగ్నంగానే పని చేస్తోంది. ప్రేమలు, పెళ్లిళ్లలో ప్రతి కులం తనకంటే పై కులాన్ని కూడా అంగీకరించలేకపోవడం చూస్తాం. ఇది సాధారణతలంలో కులానికి సంబంధించిన విషయం. కులం గురించిన పరిశీలనతో అదేమంత ముఖ్యమైన విషయం కాకపోయినా దాని స్వభావం అక్కడ కూడా ఉంటుంది. అదలా ఉంచితే, ప్రతి కులం తన కింది కులం వాళ్లతో ప్రేమలు, పెళ్లిళ్లలో తీవ్రంగా స్పందిస్తుంది. అగ్రకులాలైతే మధుకర్‌ ఘటనలో లాగా హత్యల దాకా వెళతాయి.

ఈ దృష్ట్యా కులాంతర వివాహాల ఆవశ్యకతను అంబేద్కర్‌ ఎందుకు అంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది. కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన జరగకపోయినా దానికి బలంగా దోహదపడే విషయం కాబట్టి కులతత్వం, అగ్రకుల తత్వం ఇంత దారుణానికి ఒడిగడతాయి. అందువల్లే మిగతా రంగాల్లో చాలా మార్పులు వచ్చినా కుల అంతరాల నిర్మూలనకు వందల ఏళ్ల కింద ముందుకు వచ్చిన సంస్కరణల రూపాల ప్రాధాన్యత ఇప్పటికీ తగ్గిపోలేదు. వర్ణ సంకరం నిషిద్ధమనే భావజాలం ఇప్పటికీ బలంగా ఉన్నది. మన సాంఘిక ప్రపంచాన్ని అది నిర్దేశిస్తూనే ఉన్నది. అందువల్ల కులాంతర వివాహాల సమర్థన, మధుకర్‌లాంటి దారుణ ఘటనల ఖండన మన దేశంలో ఇప్పటికీ విప్లవాత్మక విషయంగానే ఉండిపోయింది. ఈ విషయం దళిత, ప్రజాస్వామిక, విప్లవ శక్తులకు బాగా తెలుసు. మధుకర్‌ ఘటనకు ఇన్ని రోజులుగా వ్యక్తమవుతున్న నిరసన ఈ చైతన్యాన్ని ఎత్తిపడుతోంది. కాకపోతే ఎంత కాలం ఇలా మనువాద భావజాల హత్యలు అనే విషాదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.





No. of visitors : 446
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
    ఇక యాక్షన్‌ ప్లాన్‌ 2018

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •