సజీవ జ్ఞాపకమై…

| సాహిత్యం | క‌విత్వం

సజీవ జ్ఞాపకమై…

- మహమూద్ | 17.04.2017 11:25:45am

తెగిపడిన అంగాల గురించే కాదు
కనపడని గుండె గాయాల గురించీ దుఃఖం

చిందిన నెత్తుటిగురించే కాదు
వెలిసిన వర్ణం గురించీ కాసింత కష్టం

నెత్తుటి రంగొక్కటే వాళ్ళకీ మనకూ
కావొచ్చులే...
కణాల నీలిదనం గురించి కాసింత గౌరవం

లేదు కాదు అని నిరాకరించబడినం కదా
మధుకర్
ఊరవతలికి గిరాటేయబడ్డం కదా మధుకర్

వెలివాడల్లో తొలిపొద్దులమైనా
పొలాల్లో సాయంకాలాలమై వొరిగినా
మా చమట తడితో ఈ నేలని వేల ఏళ్ళుగా చల్లబరుస్తున్నా
మనది వెలిబతుకే కదా మధుకర్

తెగినపడిన మన అంగాల్తోనే ఎన్నాళ్ళుగా వాళ్ళు
అంగీలు కుట్టుంచుకొని మానం కాపాడుకుంటున్నారో కదా మధుకర్

నీ నవ్వు ముఖం వెనుకాల దాక్కున్న ప్రేమవెన్నెల్లో
కన్నులకు కాటుకంటించుకున్న
నీ ప్రియురాలు ఉగ్గబట్టుకున్న శ్వాసల్లో
ఎంతలా కూరుకుపోయావో కదా మధుకర్ నువ్వు

నీతో ప్రేమలో పడాలన్న ధైర్యం తనకి ఎక్కడినుంచి వచ్చిఉంటుందో
వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే
తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు
నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన
గాలి పరిమళాలు ఆ పశు ముక్కులకు తగిలే ఉంటాయిలే దోస్త్

ఇప్పటికి చల్లారి ఉంటుంది ప్రతీకారెఛ్ఛ
నీ
నిశ్చల దేహం ఖననం కాబడుతున్న వేళ

అగ్గిలో గుగ్గిలమైన ఆ ఆత్మలు కాసింత చల్లబడి ఉంటాయి ఇపుడు నీ రూపం కనుమరుగైన వేళ

ఆమె అన్నదట కదా.. మీ వాళ్ళతో ...
నీ శవాన్ని వెతుక్కోమనీ...

మీ వాడి హృదయం గురించి మాత్రం నన్నడక్కండి అని కూడా అనే ఉంటుంది

అంతేలే
తన తొలిగర్భపు వసంతం
ఓ నీలికళ్ళ పిల్లాణ్ణి కంటుందో ఏమో ఎవరికి తెలుసు
వాడి నరాల్లో నీ రక్తమే కదా లయలయ్యేది

కాసిన్ని వసంతాల హిమత్వం ఆమె దోసిళ్ళలో పోసే ఉంటావ్
మీగతా లోకం సంగతేమో గానీ
ఆమెకి నువ్వెపుడూ బతికే ఉంటావ్...





No. of visitors : 570
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

డెన్ ఆఫ్ లైఫ్

మహమూద్ | 15.10.2019 05:58:03pm

వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ ప్రేమించడం నేర్చుకోవాలి కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన...
...ఇంకా చదవండి

వెల్తుర్ధ్వని

మహమూద్ | 21.12.2018 07:42:29pm

నీవెపుడూ నాకు దూరం కావు నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు…....
...ఇంకా చదవండి

బందిష్

మహమూద్ | 16.08.2019 08:51:51pm

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి ...
...ఇంకా చదవండి

ఇంతెహా ఇంతెజార్ కీ..

మహమూద్ | 02.12.2019 11:30:43pm

నింగి మీద పొడిచిన ఆ నెలవంక వంపులో ఏదో వెలుతురు కబురు అతడు పంపాడేమో లేకుంటే ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార డిసెంబర్ 2019
    సృజనాత్మక ధిక్కారం
    హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
    ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
    హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
    వాళ్ళు
    ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
    గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
    దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
    జై శ్రీరామ్!
    రమాకాంత్‌ వాళ్లమ్మ
    హిందూ రాజ్యం దిశగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •