మేడే చారిత్రక ప్రాముఖ్యం

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

మేడే చారిత్రక ప్రాముఖ్యం

- అలెగ్జాండర్ ట్రాచెన్ బర్గ్ | 01.05.2017 01:08:44am

వేతనాల పెంపు కోసమేగాక తక్కువ పని గంటల కోసం, కార్మిక సంఘ నిర్మాణం కోసం గత శతాబ్దం మొదలైనప్పటినుంచీ ఆమెరికాలో కార్మికవర్గం సమ్మెపోరాటాలు సాగిస్తూ వచ్చింది. ఆక్షరాలా పొద్దు పొడిచింది మొదల పొద్దు గూకేంతదాకా బండచాకిరీ చేస్తూ వచ్చిన పనివాళ్ళు మొదట్లో పదిగంటలు మాత్రమే పనికాలాన్ని నిర్ణయించవలసిందిగా కోరారు. ఫిలడెల్ఫియాలో మెకానిక్స్ సంఘం ప్రపంచంలోనే మొదటి ట్రేడ్ యూనియన్ (1806). తమ సమ్మెలో వీళ్ళు ముఖ్యంగా కోరింది అరవ చాకిరీ తగ్గింపు. ఆ తర్వాత న్యూయార్క్ లోని రొట్టె పనివాళ్ళు 1834లో చేసిన సమ్మెలోనూ యీ కోరికే బిగ్గరగా వినవచ్చింది.

ఇలాంటి చిన్న చిన్న స్థానిక పోరాటాలు క్రమేపీ ఉద్యమ రూపం దాల్చిన ఫలితంగా 1837 లో అమెరికన్ ప్రభుత్వం 10 గంటల పనిదినాన్ని నిర్ణయించింది. మరో ఇరవయ్యేళ్ళపాటు ఈ నిర్ణయం అమలు జరిగింది. అయితే మరికొద్ది కాలానికే కార్మికవర్గం 8 గంటల పనిదినం కోసం ఆందోళన చేయసాగింది. అమెరికాలోనేగాక ఇంగ్లాండులో, చివరకు ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి డిమాండ్లే వెలువడసాగాయంటే, శ్రమ దోపిడీ తీవ్రాతితీవ్రంగా సాగిన పెట్టుబడి దారీ తొలి, నడి దశల్లో కార్మికవర్గం పోరాట పంథాకు దిగిందని అర్థం చేసుకోవాలి. 8 గంటల పనిదిసం కోసం ఆమెరికాలోనే ఈ పోరాటం ప్రారంభమైన మాట చరిత్ర ఒప్పకున్న వాస్తవం. ఇది 1884లో తలెత్తింది. ఒక ఇరవయ్యేళ్ళ క్రితమే నేషనల్ లేబర్ యూనియన్ ఇందు కోసం వుద్యమం లేవదీయబూనినా, అంతర్యుద్ధంలో యిలాంటి యూనియన్లు అనేకం అదృశ్యమైపోయాయి. యుద్ధానంతర కాలాన స్థానికకార్మిక సంఘాలు మళ్ళీ ఒక్కటి కాసాగాయి. 1886 లో నేషనల్ లేబర్ యూనియన్ ఏర్పడింది. ఈ సంఘటిత కార్మికోద్యమ నాయకుల్లో ఒకరైన విలియం హెచ్ సిల్విస్, ఫస్ట్ ఇంటర్నేషనల్ తో సంబంధం పెట్టుకున్నాడు. ఎనిమిది గంటల సమితులు ఎక్కడికక్కడ ఏర్పడి పోట్లాడిన ఫలితంగా 1868 నాటికి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగంలో పనిదినం 8 గంటలుగా నిర్ణయించే చట్టాలు చేశాయి. ఆ యేడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలాంటి చట్టం చేసింది.

కార్మికవర్గ స్థితిగతులను మెరుగు పరచాలన్నా కార్మికవర్గ విమోచన జరగాలన్నా, ముందుగా పనిదినం నిడివిని చట్టబద్ధంగా పరిమితం చేసి తీరాలంటూ,మార్క్స్ మహాశయుని నాయకత్వాన ఫస్ట్ ఇంటర్నేషనల్ తన జెనీవా సమావేశంలో(1866 సెప్టెంబరు) తీర్మానించింది. తెల్లజాతి కార్మికులనీ నల్లజాతి కార్మికులనీ భేదాలు విడిచి, నీగ్రో దాస్య విమోచన తర్వాత గూడా వర్ణవివక్ష చూపెట్టక, కార్మికులంతా ఒకటి కావాలని మార్క్స్ తన ʹకేపిటల్ʹలో రాశాడు. అట్లాంటిక్ మహాసముద్రానికి అద్దరీ, యిద్దరీ, ఇలా ఒకే నినాద బంధంతో ఏకమయ్యాయి.

1872 నాటికి ఫస్ట్ ఇంటర్నేషనల్ అంతరించింది. దాని, కేంద్రకార్యాలయం లండన్ నుంచి న్యూ యార్క్ కు మారింది. పునర్నిర్మాణం తర్వాత ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థను ఇంటర్నేషనల్ అన్నారు. దీని ప్రారంభ సమావేశం పారీస్ లో 1889లో జరిగినప్పడు, తమ తమ వృత్తి సంఘాలలోనూ రాజకీయ పార్టీలలోనూ సంఘటితపడివున్న కార్మికులంతా ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడాలని మేడే మాసం మొదటిరోజును పోరాట దినంగా గుర్తించాలని ఆదేశించడం జరిగింది. ఆంతకు ఐదేళ్ళ క్రితమే చికాగో సగరంలో ఒక కొత్త అమెరికన్ శ్రామిక సంస్థ ప్రతినిధులు ఇలా నిర్ణయించి పున్నారు. ఆ సంస్థే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్: ఇందులో కెనడా కార్మికవర్గ సంస్థలూ వుండేవి. 1886 మే మొదటిరోజు మొదలు ఎనిమిది గంటల పని దినమే ఉండాలని ఇది తన నాలుగో సభలో కోరింది. అంటే:1886 మే మొదటి రోజున సమ్మె చేసి తమ కోరిక వినిపించాలి. సమ్మె చేసి రోజు కూలి పోగొట్టుకునే కార్మికులకు సాయం చెయ్యాలి. ఈ సమ్మె దేశం అంతటా జరగాలి. 1876లో జరిగిన ఉక్కు, రైలు రోడ్డు పనివారి సమ్మె పోరాటాలు, వాటిని నిర్దాక్షిణ్యంగా అణచివేసిన అణచివేసిన ప్రభుత్వపద్దతులు, కార్మికవర్గం కళ్ళు తెరిపించాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రభుత్వం కవచంలా పనిజేస్తూందని గ్రహించారు. కార్మికయోధులొక ఐదుగురు 1875లోనే ఉరికంబాలెక్కారు. మొత్తం మీద అమెరికన్ పరిశ్రమ విస్తరిస్తూ వచ్చినా,1878 తర్వాత కొంతమాంద్యం ఏర్పడి నిరుద్యోగం ఎక్కువై కార్మికులు కడగళ్ళపాలైనప్పడు, ఎనిమిది గంటల పనికోసం జరిగే పోరాటాలను కేంద్రంగా చేసుకుని అశేష శ్రామిక జనాభాను సమీకరించేందుకు పై ఫెడరేషన్ సంస్థ పూనుకుంది. అనేక యితర జాతీయ కార్మిక సంస్థలూ దీన్ని అందుకున్నాయి. నైట్స్ ఆఫ్ లేబర్(కార్మిక వీరులు) వీటిలో ఒకటి. ఇది మిలిటెంట్ పోరాట సంస్థ. దీని సంఖ్యాబలం రెండు లక్షల నుండి కొద్దికాలం లోనే ఏడు లక్షలకు పెరిగింది. సాదా పని వాళ్ళలో దీని ప్రఖ్యాతీ పెరిగింది. మరోవైపున ఫెడరేషన్ నాయకుల్లో కొందరు మే మొదటిరోజున జరగాల్సన పోరాటానికి ముందునుంచే తూట్ల పొడవబూనారు. సమ్మె పోరాటాలు వెల్లవకట్ట సాగిన తరుణంలో ఈ విశ్వాసఘాతుక ధోరణి బలపడడం శోచనీయం. ఆయినా కార్మిక లోకo మాత్రం బాగా కదలబారింది.

మేడే పోరాట కేంద్రం చికాగో నగరం అయినా అనేక యితర నగరాలలోనూ పోరాటాలు జరిగాయి. విశేషమేమిటంటే, ఏ సంస్థలకూ చెందిని సాదా కార్మికులెందరో గోదాలోనికి దిగారు, చికాగోలో యిది బాగా మిలిటెంట్ అయింది. ఐక్యకార్యచరణలో వామపక్ష కార్మిక సంస్థలు చాలాకాలంగా పోరాటానికి సన్నాహాలు చేయసాగాయి. సెంట్రల్ లేబర్ యూనియన్ రూపొందింది.

1887 మే ఒకటి... చికాగో...

వేలాదిగా కార్మికులు తమ పనిసాలలు వదిలి బయటికి నడిచారు. పనిముట్లు మూలబడ్డాయి. పని స్తంభించింది.

అయితే కార్మికవర్గ ఆగర్భశత్రువులైన పెట్టుబడి దార్లూ వారితైనాతీ ప్రభుత్వమూ చేతులు కట్టుకు కూర్చో లేదు. వారి శక్తి కొద్దిపాటిదీ కాదు. ఈ కార్మిక ప్రస్థానాన్ని అడ్డగించారు. దీనికి నిరసనగా చికాగోలో హేమార్కెట్ స్క్వేర్ అనేచోట ప్రదర్శనకు దిగిన కార్మికులు, క్రితం రోజున మెక్కార్మిక్ రీవర్ వర్క్స్ లో పోలీసు కాల్పుల ఫలితంగా చనిపోయీ గాయపడీ నష్టపోయిన కార్మిక సోదరులకు సానుభూతిగా, ప్రభుత్వ పశుత్వానికి నిరసనగానే గుమికూడారు. సభ ప్రశాంతంగానే జరిగింది. అయితే గుంపులోకి ఒక బాంబు వచ్చి పేల్చింది. ఒక సార్జెంటు చనిపోయాడు. ఇకనేం? పోలీసులు తుపాకులకు పనిబెట్టారు. ఆది యుద్ధమే. ఏడుగురు పోలీసులు, నలుగురు కార్మికులు ప్రాణాలు వదిలారు. కార్మికనాయకుల్లో పార్సన్స్, స్పెస్ ఫిషర్ - ఎంగెల్ ఉరిపాలయ్యారు. ఇలా మేడే పోరాటం కార్మికుల రక్తంతో ప్రాణత్యాగంతో అమరత్వం సంపాదించుకుంది.

కష్టనష్టాలేవీ దీన్ని ఆపలేదు, నిలపలేదు. 1888 లో మళ్ళీ పుంజుకుంది, ఇది సంప్రదాయంగా మారింది. అంతే కాదు, అంతర్జాతీయతను పొందింది.

ఫ్రెంచి మహా విప్లవ సంకేత దినమైన జూలై 14 న 1889 లో పారీస్ నగరంలో ఆ విప్లవం శతాబ్ది దినాన, వివిధ దేశాల సంఘటిత కార్మికోద్యమ నాయకులు సమావేశమై, కార్ల్ మార్క్సు, ఎంగెల్సులు నిర్మించి నడిపిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ను పునరుద్ధరించారు. 1890 లగాయతు ప్రతి యేడు మే ఒకటిన కార్మికులు శెలవు దినం చేసుకుని ప్రదర్శనలు సాగించాలని యీ రెండవ ఇంటర్నేషనల్ ఆదేశించింది. ఆయా దేశాల ప్రభుత్వాలు అణచివేత చర్యలు చేబట్టినా, మేడే కార్మిక ప్రదర్శనలు సాగుతూనే వచ్చాయి. మేడేకి గల కార్మికవర్గ ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశాయి. వర్గ పోరాటాన్ని మరింత గాఢం చేసేందుకే యిదంతా. బ్రిటిష్ లేబరు పార్టీ వెనక్కు తగ్గినా జర్మన్ సోషల్ డెమోక్రాట్లు వాయిదాల పేరిట దిగజారినా, ఈ పోరాటం నిలవలేదు. సంస్కరణవాదులు పోరాటాన్ని నీరు గార్పించేందుకు ఎన్నెన్నో కుటిల ప్రయత్నాలు చేశారు. "వర్గ వ్యత్యాసాలను సర్వనాశనం చేసేందుకు కార్మికవర్గం కృతనిశ్చయమైవున్నద"ని నిరూపించాలంటూ సెకండ్ ఇంటర్నేషనల్ జూరిచ్ సమావేశంలో కోరింది(1893). అంటే కూలిదాస్యాన్ని నిర్మూలించి సోషలిజాన్ని సాధించాలని అర్థం. మేడే ఇలా ʹరెడ్ డేʹ అయింది.

అనకాశవాదుల దిగజార్పుడు పంథాను లెనిన్ 1896 నుంచీ ఎండగట్టాడు. జైలునుంచి పంపిన ఒక చిన్న కరపత్రంతో పోరాట జ్వాలను ముట్టించగలిగాడు. ʹఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల విశ్రాంతి, ఎనిమిది గంటల ఉల్లాసం, (రిక్రియేషన్)" కావాలని కార్మికులు కోరాలన్నాడు. రష్యన్ ప్రజల విముక్తి పోరాటానికి మేడే ప్రదర్శనలు కేంద్రబిందుపుగా ఉపయాగపడాలనుకున్నాడు. అంటే, ఆర్థిక కోర్కెలకు మాత్రమే దీన్ని కుదించరాదని లెనిన్ ఉద్దేశం.

సెకండ్ ఇంటర్నేషనల్ లో ఠికాణా వేసుక్కూర్చున్న మితవాద కార్మికోద్యమ నాయకులతో మేడే విషయంలో లెనిన్ సాగించిన సిద్ధాంత పోరాటం చాలా ముఖ్యమైనది. మొదటి ప్రపంచ యుద్ధకాలాన యీ మితవాదులు ʹదేశభక్తి" ప్రేరణతో తమ తమ దేశాల పెట్టుబడిదారీ -సామ్రాజ్యవాద ప్రభుత్వాలకు తొత్తులై సంఘటిత కార్మికోద్యమ ద్రోహులయ్యారు. వర్గ పోరాటం మరుగునపడి వర్గ సామరస్యం ముందుకు వచ్చింది. సమ్మెలు ససేమిరా కూడదన్నారు. రష్యాలో బొల్షవిక్కులు, ఇతర దేశాలలోని అల్పసంఖ్యాకులైన విప్లవవకర శక్తులు మాత్రమే మేడే జెండాను పోరాటాల మధ్య సమున్నతంగా నిలబెట్టారు. ʹసోషల్ దేశభక్తి వున్మాదంʹకు వ్యతిరేకంగా సెకండ్ ఇంటర్నేషనల్ వేదిక మీది నుంచీ లెనిన్ తో బాటు, కార్ల్ లైబ్ నెక్ట్, రోసా లక్జెంబర్గ్ వగైరాలు గొంతులెత్తారు. ఇలా థర్డ్ ఇంటర్నేషనల్ కు సరైన ప్రాతిపదిక ఏర్పడింది. సోవియట్ విప్లవ విజయం, వలస దేశాల ప్రజల స్వాతంత్ర్య పోరాటాలు, ఆగ్రదేశాల కార్మికోద్యమ పోరాటాలు యివన్నీ పెనవేసుకున్నాయి. ఇలా మేడే సంప్రదాయం పోరాట సంప్రదాయమే కాగలిగింది గాని లొంగుబాటు సంప్రదాయం కాలేదు. కాగూడదు కూడా. ఆర్థిక కోర్కెలేగాక అంతర్జాతీయ కార్మికవర్గ సంఘీభావం, సార్వజనిక వోటింగు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, ప్రదర్శన హక్కు, రాజకీయఖైదీల విడుదల, సంఘ నిర్మాణ హక్కు-- అన్నిటిని మించి పెట్టుబడిదారీ వ్యవస్థను మొత్తంగానే ఎదుర్కొని పోరాడవలసిన బాధ్యత - ఇలాంటి యితర డిమాండ్లతో, గుర్తింపుతో ʹపోరాడే వారిదే ఎర్రజండాʹ అనే వాస్తవం ఇప్పటికి చెరిగిపోకుండా ఉంది.

(అరుణతార ఫిబ్రవరి-మే 1979)

No. of visitors : 1711
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •