వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

- పాణి | 04.05.2017 10:53:32am

చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పాతికి మంది పోలీసులను చంపేసిన ఘటన మీద వెంకయ్యనాయుడు ఇంకా చిందులేస్తూనే ఉన్నాడు. గుంటడు వ్యాకరణం వెలగబెట్టినట్లు ప్రజాస్వామ్యం, మానవహక్కులు లాంటి పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నాడు. ప్రజలను చంపడానికి పోలీసులను ఉసిగొలిపి ఇప్పుడు వాళ్ల మరణానికి కన్నీళ్లు కార్చుతున్నాడు. అక్కడితే ఆగితే ఏముంది? మానవ హక్కుల నాయకులు, బుద్ధి జీవులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆడిపోసుకున్నాడు. ఏకపక్షం గురించి మాట్లాడటానికి వెంకయ్యనాయుడికి సిగ్గనిపించడం లేదా? అని. ఈ ఇరవై ఐదుగురు పోలీసుల గురించే మాట్లాడాలా? లేక సాల్వాజుడుం1,2 దాడుల్లో, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌లోమ భాగంగా చత్తీస్‌ఘడ్‌లో జరిగిన మానవ హననం గురించి కూడా మాట్లాడాలా? వేలాది మందిని ఏకపక్షంగా కాల్చి చంపడం, గృహదహనాలు, మహిళలపై అత్యాచారాలు, పంటల విధ్వంసం, పసిబిడ్డల హత్యలు.. ఒకటేమిటి అగ్నికీలల్లో బస్తర్‌ అనుభవిస్తున్న గాయాలను, బాధలను కూడా మాట్లాడాలి కదా? ఆ దుర్మార్గాల గురించి మాట్లాడితేనే రెండు పక్షాల మాట్లాడినట్టు. వాటి గురించి మట్లాడే మానవత, విజ్ఞత వెంకయ్యనాయుడికి ఉందా? సంఘ్‌పరివార్‌ మానస పుత్రుడైన వెంకయ్యనాయుడికి అది సాధ్యమేనా? ఉందని చెప్పినా ఇతరులు నమ్మగల ఇంటెగ్రటినీ ఆయన సంతరించుకున్నాడా? మానవహక్కులంటే పోలీసులకు వర్తించేవేనా? ఆదివాసులకు కూడా వర్తిస్తాయా? అని ఎదురు ప్రశ్న ఎందుకు వేయకూడదు? మావన హక్కుల కార్యకర్తలే అంతిమంగా మానవ ప్రాణానికి విలువ ఇచ్చేది. అయితే ఆ జీవించే హక్కును వ్యవస్థీకృత ఆధిపత్యశక్తితో, హింసోన్మాదంతో నిర్మూలిస్తున్నది ఎవరనేది అతి ముఖ్యమైన ప్రశ్న. ఎవరి మరణమైనా బాధా కరమేగాని దానికంటే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

ప్రజాస్వామ్యంలో మావోయిస్టులకు స్థానం లేదని వెంకయ్య అన్నాడు.ఈ ప్రజాస్వామ్యం కాదూ మనుషులను చంపే యుద్ధం ప్రారంభించింది. హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు ఉద్యమిస్తున్నామని ప్రకటిస్తారు. ఉద్యోగం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసు కుటుంబ సభ్యుల కన్నీరు, వేదన ప్ల ఎవరికి కన్‌సర్న్‌ ఉండదు? ఒక వేళ మావోయిస్టులే అప్రమత్తంగా లేకపోతే ఈ పోలీసులే ఎంత మందిని చంపి వీరోచిత కార్యం చేసినట్లు అవార్డుల కలలు గంటూ తిరిగి వచ్చేవారు. అందుకే ప్రజల గురించి ఆలోచించేవాళ్లందరికీ ప్రజా యుద్దం గురించిన విజ్ఞత ఉంటుంది. పాలకవర్గాల అణచివేతపై, హింసపై ఎదురుదాడిగా సుక్మా ఘటనను ఎందుకు చూడకూడదు? పత్రికలు కూడా ఈ ఘటన తర్వాత మావోయిస్టుల దాడుల చిట్టా విప్పాయి కానీ నిత్యం నెత్తురు, కన్నీరు కార్చుతున్న బస్తర్‌ ప్రజలపై రాజ్యం చేస్తున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడలేదు? పత్రికలు మోదీ కోటు కింద దూరి చాలా కాలం అయింది.

వెంకయ్యనాయుడి ప్రశ్నలు, అసహనం ఏమిటో మానవహక్కుల కార్యరక్తలకు, మావోయిస్టు సమర్థకులైన మేధావులకు తెలుసు. సంఘపరివార్‌ ప్రతినిధి ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి మాట్లాడటం మిగతా వాళ్లందరూ అర్థం చేసుకోవాలి. ఆదివాసులు, ముస్లింల గురించి మాట్లాడ్డానికి సంకోచించే వాళ్లే వెంకయ్య బరితెగింపు బెదిరింపుల సారం తెలుసుకోవాలి. తెల్లారింది మొదలు విప్లవ సంస్థలను నిందించే వాళ్లే తమ మావోయిస్టు వ్యతిరేకతలను వదిలి సంఘ్‌ ఫాసిజంపట్ల అప్రమత్తం కావాలి. లేకపోతే వెంకయ్యలాంటి వొదరుబోతులు మరెవ్వరి మాట వినపడకుండా శబ్ద కాలుష్యం సృష్టిస్తారు.

మావోయిస్టు విప్లవ ప్రజాస్వామాన్ని అభివృద్ధి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్న మోదీ ఫాసిజంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఆత్మహత్య చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే డజన్ల సంఖ్యలో ప్రగతిశీల ఆలోచనాపరులను సంఘ్‌ మూక దారుణంగా హత్య చేసింది. నోరు లేని ఆవు కోసం దేశమంతా తిరిగి ఈ ఉన్మాద సేన ఎంత మంది ముస్లింలను, దళితులను హత్య చేసిందో? మోదీగారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ఎన్ని వేల మంది ముస్లింలను హత్య చేసిందీ, ఎన్ని వేల మంది ముస్లిం మహిళలను అత్యాచారం చేసిందీ అందరికీ తెలిసిందే. తెల్లారి లేచింది మొదలు హింస, అత్యాచారాలు, దురాగతాలు మాత్రమే చేయడం తెలిసిన సంఘ్‌ మూకకు మావోయిస్టుల గురించి మాట్లాడే రాజకీయ అరÛతే కాదు, నైతిక అరÛతకు కూడా లేదు. అలాంటిది వెంకయ్య నాయుడు ద్వంద్వ ప్రమాణాల గురించి మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉండదూ?

సంఘ్‌ హింసోన్మాదానికి ఈ దిక్కుమాలిన ప్రజాస్వామ్యంలో తప్ప మరెక్కడ చోటు ఉంటుంది? బాబ్రీ విధ్వంసంలో కోర్టు బీజేపీ నాయకులు, వాళ్లను నడిపించే సంఘ్‌లోని సాధువులు సన్నాసుల్ని బోనులో నిలబెట్టబోతోంది కదా? అయినా ఇంకా ఇంకా హింస, విధ్వంసాలను ఇతరులకు ఆపాదించే అరÛ్హత వీళ్లకు ఉన్నదా? అభివృద్ధి అనేదానికి చుక్కెదురు అయిన వెంకయ్య నాయుడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే లోకమంతా నవ్విపోదూ! పైగా మావోయిస్టుల నిజమైన అభివృద్ధిని వక్రీకరించడం తగునా? సంఘ్‌ సర్కారులో రైతులంటే ఆత్మహత్యకు పర్యాయపదం కదా? దండకారణ్యంలోని మావోయిస్టుల క్రాంతికారీ జనతన సర్కార్‌లో ఇంత వరకు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. రైతులను చావు మొగదాలకు బలవంతంగా లాక్కెళ్లే పాలకవర్గానికి రైతును అద్భుతమైన సృజనశీలిగా మార్చిన మావోయిస్టుల గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది కదా? అభివృద్ధి అంటే ఏమిటో అమెరికా దగ్గరో, ప్రపంచ బ్యాంకు దగ్గరో కాదు.. దండకారణ్యంలోకి మోకాళ్ల మీద దేక్కుంటూ వెళ్లి ఆదివాసుల దగ్గర నేర్చుకొని వస్తే బాగుంటుంది. ఈ డెబ్బై ఏళ్లలో ఇంత విశాల భారత దేశంలోని ఏ చిన్న భూ భాగంలో .. ఏ ప్రభుత్వమూ ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయింది. ఆ అవసరాలు ఎలా తీర్చాలో, దానికి ఎలాంటి రాజకీయార్థిక వ్యూహం ఉండాలో, అది ఎంత మానవీయంగా ఉండాలో, ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడే స్వావలంబన విధానమై ఉండాలో దండకారణ్యంలోని మావోయిస్టు గెరిల్లాల దగ్గర నేర్చుకోవాల్సిందే.





No. of visitors : 2629
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి

ఏవోబీ నెత్తురు చిందుతోంది

విరసం | 23.09.2019 01:07:09pm

సీపీఐ మావోయిస్టు అగ్రనేత ఆర్కేను టార్గెట్‌ చేసి ఈ అభియాన్‌ను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు మోదీ రెండోసారి అధికారంలోకి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
    నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
    చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
    అరుణతార మార్చి - 2020
    ఉన్నావో సీత
    ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
    విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
    బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
    అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
    సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
    ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
    మూడో తరానికి...

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •