డేగ రాగం

| సాహిత్యం | క‌విత్వం

డేగ రాగం

- కృపాకర్ మాదిగ | 04.05.2017 12:29:50pm

అవునహే
సరిహద్దులు శానా ఉన్నై
నువ్ జెప్పేవి రెండే రెండు
కాశ్మీరో లేకపోతే ఏబీవోనో
కానీ లోపలి సరిహద్దులు
అరలు అరలుగా మెట్లు మెట్లుగా
శానానే ఉండై

అడివికీ - మైదానానికీ
వాడకీ - ఊరికీ
ఊరికీ - అగ్రహారానికీ
గుడిసెలకీ - గేటెడ్ కీ
సఫాయి తట్టకీ - శఠగోపానికీ
తోలుకీ - నూలుకీ
పారకీ - పెన్నుకీ
కొండను కొలిచి బువ్వను తీసేటోడికీ
కొండను తొలిచే వినాశకారికీ మధ్య
ఎన్నని చెప్పనహె
సరిహద్దులు శానానే ఉన్నై
లోపలి హద్దులు ఎన్నో ఉన్నై

సోక్రటీస్ కి విషం గిన్నె నందించింది
నాటి ప్రజాస్వామ్యం
సోక్రటీస్ పోయాడు గానీ
అతని గతితర్కం మిగిలే ఉంది

ఆదివాసులకి తూటాలు తినిపించింది
నేటి ప్రజా స్వామ్యం
ఐనా, వారి హేతువు
తూర్పుగాలై వీస్తోంది

తుఫాను డేగ రాగం తీస్తోంది
ఎప్పుడో ఒకప్పుడు అది విప్పాటనమౌతుంది
నీ బుల్లెట్లూ బాయ్ నెట్లను నమిలేస్తుంది
టర్నాడోయై ఊడ్చేస్తుంది
మనుషుల్ని మాయం చేసే నెత్తుటి పద్దు లేని
నీ భయాల హద్దుల్ని చదును చేస్తుంది
దాని పేరు అసమానతలపై ఆగ్రహ చర్య
దాని ఆపరేటర్ బహుజన్





No. of visitors : 291
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •