అలసెంద్రవంక

| సాహిత్యం | క‌థ‌లు

అలసెంద్రవంక

- అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm


ఉదయాన్నే లేవగానే వాడేందుకో గుర్తొచ్చాడు. కలసి చాల రోజులైంది. ఈ రోజు కలుద్దాం అని వాడింటి ముఖం పట్టాను. వెళ్లేసరికి ఎప్పటిలాగే తాళం వేసి ఉంది.

ఎక్క‌డికెళ్లాడా... అని ఫోన్ చేశాను. రావ‌డానికి కాస్త లేట‌వుతుందిరా... తాళం చెవి ప‌క్క‌నే ఉంది. నువ్వు ఇంట్లో ఉండు... నేనొస్తాను అన్నాడు. ʹఎంతసేపుʹ నోటిలో మా నోటిలో ఉండగానే కాల్ కట్ అయింది.

అలవాటయిందే కదా అని తాళం తీసి ఇంట్లోకి వెళ్ళా. వస్తా అని చెప్పి అరగంట అవుతుంది వీడెంతకి రాడేంటి అనుకోని కాల‌క్షేపానికి ఏదైనా చ‌దువుదామ‌నుకొని బుక్ షెల్ఫ్ వైపు న‌డిచా.

రీడింగ్ టేబుల్ పైన ఓ నోటుబుక్ కనిపించింది. తెరవగానే మొద‌టి పేజీలోనే రెండు వాక్యాలు.

ʹనా అల
మా యిద్దరి కల.

ఇంట్రెస్టింగ్ గా అనిపించి కుర్చీ లాక్కొని చదవడం మొదలెట్టా.

ʹనా అల
మా ఇద్దరి కలʹ ఏంటా వాక్యాలు? సముద్రపు అలలు తెలుసు. కానీ ఈ ʹఅలʹ ఏంటి? అల అనేది పేరా?
నాకు తెలిసి ʹఅలʹ అనే పేరుగల వాళ్ళు ఎవరు వీడికి స్నేహితులు లేరే!
ఈ అలేంటి? కలేంటి? అని పేజీలు తిరగేస్తున్న. నాలుగు పేజీల తరువాత...

ʹఅల త‌న‌ పేరు కాదది. నేను ప్రేమగా పిలుచుకునే పేరు. తనను తలచుకున్నప్పుడల్లా తన గురించిన ఆలోచనలు, జ్ఞాపకాలు నాలో అల‌ల్లా ఎగిసిపడతాయి. అల వెన్నెలంత అందమైనది. తాను నా దగ్గరికి ఎప్పుడు ఉట్టినే రాదు. అందమైన భీభత్సాన్ని వెంటేసుకొని వస్తుంది. దగ్గరున్నంతసేపు నవ్వుల్నీ చిందించి, కలల్ని పంచి, తన రాక తాలూకు జ్ఞాపకాల్ని మిగిల్చి వెళ్తుంది. తాను చాలా అందంగా నవ్వుతుంది. ఆ నవ్వు ʹఅలలపై వాలిన సెంద్రవంకలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా అల సెంద్రవంక.

అలకి కడలంటే ఇష్టం. అలలంటే ఇష్టం. అలల తరంగాలు మరి ఇష్టం. ఒక్కర్తే అలా ఇసుక తెన్నెలపై కూర్చొని కడలి వంక చూస్తుంటుంది. తనని అలా చూస్తుంటే ʹతనే కడలిలా, తనే అలలాʹ కనిపిస్తుంది. కడలంతా విశాలమైన మనసున్నది. ప్రేమున్నది. అల లాంటి అలకా ఉన్నది.

ఎప్పుడైనా ʹనువ్వే కడలి. నువ్వే అలʹ అంటే నవ్వుతుంది. తీరం తాకే అలంత‌ సహజంగా కౌగిల్లో ఒదిగిపోతుంది. ʹఏంటేʹ అంటే
ʹఇట్లా ఒదిగిపోవడం నాకు ఇష్టం-ʹ
ʹఅయినా నీకు ఏంటే అని పిలిస్తే నచ్చదు కదా! అంటే..
ʹదగ్గరి వాళ్ళు పిలిస్తే బాగుంటుందిʹ
ʹఎంత దగ్గర?ʹ... ఆ ప్రశ్నకు సమాధానంగా గుండెలకు హత్తుకుంటుంది.

అలకి నాలాగే కవిత్వం ఇష్టం. శివసాగర్, పాబ్లోలు తనకూ అభిమాన కవులయ్యారు. వాళ్ళిద్దరి ʹవిప్లవ కాల్పనికతʹ బాగుంటుందంటుంది. ఓ రోజు మాటల్లో ʹప్రేమ క్షణాలు - జ్ఞాపకాలు యుగాలుʹ ఎంతగా ప్రేమిస్తే పాబ్లో అట్లా రాసుంటాడు. అంతలా పార్వతిని ప్రేమించాడు కనుకనే శివసాగర్ ఆమె స్మృతిలో వాడుంటాడు అన్నది.

ఆ రాత్రి మాట్లాడుకుంటున్నప్పుడు తక్కువ కాలంలో అలలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాను. నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన్నది.

నిజమే తనకు అటువంటి జీవితం లేదు. కానీ ఆ జీవితాలపై అచంచలమైన ప్రేమున్నది. ఆ జీవితం ఉన్న ప్రజలు చేసే విముక్తి పోరాటంపై విశ్వసం ఉన్నది.

నేను - అల

ʹవాళ్లకి పోరాటం అనివార్యం కదా!ʹ
ʹఅవును అనివార్యమేʹ

ʹఒక మనిషిని పశువు కన్నా హీనంగా ఎట్లా చూస్తారుʹ
ʹచూస్తూనే ఉన్నాం కదా, ʹఆవుʹల పాటి విలువ చెయ్యని జీవితాలనుʹ

ʹఈ జీవితం ఎవరికీ ఉంటుంది.ʹ
ʹపుట్టిన కులం నిషేధం అయినా వారికిʹ

ʹకులం పోవాలంటే?ʹ
ʹకులాంతర వివాహాలు చేసుకోవాలిʹ

ʹమన పేరెంట్స్ వి అట్లాంటి వివాహాలే కదా! అయినా మనం మన తండ్రి కులాన్నే మోస్తున్నాం కాదా!ʹ
ʹ కులం అనేది మానసిక సమస్య అంటాడు అంబెడ్కర్. దాని నిర్ములనకు కులాంతర వివాహాలను ప్రపోజ్ చేసాడు. ఒక కులం ఎక్కువ, మరొకటి తక్కువ అనే భావన పోవాలంటే పోరాటాలు అనివార్యంʹ

ʹనాకు ఈ పోరాటాలన్నీ ఆదర్శం అనిపిస్తుందిʹ
ʹనీ ఆదర్శం, నా అవసరం అనివార్యంగా మారాలి. అందరు పోరాటాలు అనివార్యం అనుకోని పోరాటంలోకి వచ్చినప్పుడే ఈ అసమానతలు పోతాయిʹ
-----

తరువాత అక్షరాలు ఆగిపోయాయి ఇంకా ఏమైనా రాశాడా పేజీలు తిప్పుతునే ఉన్నా. మూడు, నాలుగు పేజీల తరువాత మళ్ళి రాత మొదలైంది.

తనతో పాటు గడిపిన ఆ రాత్రిని ఎలా మరిచిపోగలను. ఎన్ని విషయాలు పంచుకున్నాం ఆ రాత్రంతా.
పాతగొడవలేవో గుర్తొచ్చి అలిగి పక్కకి తిరిగితే దగ్గరికి తీసుకొని నుదిటిపై తాను పెట్టిన ముద్దు, అచ్చం అన్నం తినని మారం చేస్తే అమ్మ బతిమాలి పెట్టిన గోరుముద్దలా. మాట్లాడుతూ మాట్లాడుతో రెండు సంవత్సరాలుగా తనలోనే దాచుకున్న విషయాలను చెప్తూ కన్నీటీ వరదైంది. భాధపడతాననుకుందేమో ఆపేసింది.

దగ్గర హత్తుకుంటే .. ʹనాన్న ఉంటే ఇలానే గుండెలకు హత్తుకొని ఓదార్చేవాడు కదా!ʹ
ఇంతకన్నా బాగ చూసుకునేవాడు. అసలు కన్నీళ్లే రానిచ్చేవాడు కాదేమో (మనసులోనే అనుకున్న)
నాన్న జ్ఞాపకాల్లోకి వెళ్తే తాను కన్నీటి వరదవుతుంది. దాన్ని ఆపడం, చూసి తట్టుకోవడం కష్టం.

మాట్లాడుకుంటూ అలానే పడుకున్నాం.
మధ్యలో మెలకువ వచ్చి చూస్తే ఎదపై తలవాల్చి పడుకుంది. చిన్నపిల్లలా పడుకున్న తనని చూసి నవ్వుకొని చుట్టూరా చేతులు వేసి కౌగిల్లోకి తీసుకుంటే, తలపైకెత్తి నవ్వి ʹనువ్వు అలా పట్టుకుంటే అమ్మ దగ్గరున్నట్టుంది ʹ అంది

ʹఓయ్ నిద్ర పోలేదాʹ
ʹఊహు రాట్లేదుʹ

ʹఏదైనా మాట్లాడుతూ ఉండాలా?ʹ
ʹవద్దు నీ గుండె చప్పుడు వింటుంటే ఇలానే బాగుందిʹ

పక్కన కిటికీలోంచి కనపడుతున్న సెంద్రవంకను చూసి ʹఅలసెంద్రవంకస‌ అన్నాను

ʹఏమన్నావ్?ʹ
ʹఅలసెంద్రవంకʹ

ʹఅంటేʹ
ʹనువ్వేʹ

ʹనేను అలను కదా!ʹ
ʹఅలసెంద్రవంకʹవి కూడా
ʹనేనాʹ అని నవ్వింది. అచ్చం అలసెంద్రవంక లాగే

------

తరువాతి పేజీల్లో....

నేనిప్పడి వరకు అలనే రాశాను
ʹఅలʹ తనకో ʹకలʹ ఉందంటుంది
అది మనిద్దరిదీ అంటుంది
అది సామూహికం కూడా అంటుంది
అలను రాయడమైతే రాసాను
కలను రాయాల్సి ఉంది.
మా ʹకలʹను, సామూహికమైన ʹకలʹను
రాయడం మామూలు విషయం కాదు
ఇదే మాట తనతో అంటే
ʹనాకోసం రాయవాʹ అని అడిగింది
కలని రాయాలి. ʹఅలʹ కోసమే కాదు
మా యిద్దరి కోసం రాయాలి
సామూహికం కనుక
అందరి కోసం రాయాలి"

-----
అల ద‌గ్గ‌రే అక్ష‌రాలు ఆగిపోయాయి..
ఆ తరువాత పేజీలు ఖాళీగా ఉన్నాయి..

ఇంతకీ.. వీళ్ల క‌ల ఏమై ఉంటుంది? ʹఅలʹ ఎలా ఉంటుందో చెప్పాడు. మరి ʹకలʹ. అలసెంద్రవంకలా అందమైనదే అయ్యుంటుంది. వాడినే అడిగితే? ʹనా బుక్ నువ్వెందుకు తెరిచావంటే!ʹ ʹఅలʹను చదివిన సంతోషంతో... కలను క‌ల‌గంటూ.... ఇంటికి తాళం వేసి బయల్దేరాను వాడెంతకి రాకపోయేసరికి.

No. of visitors : 485
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న......
...ఇంకా చదవండి

ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి -2018
  Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
  బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
  హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
  ఇప్పుడు
  నిలబడి తీరాల్సిన దారుల్లో...
  ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
  ఈ పక్షం బుల్పికలు!
  హ‌క్కులపై ఉక్కుపాదం
  పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •