నక్సల్బరీకి విప్లవ జేజేలు

| సంపాద‌కీయం

నక్సల్బరీకి విప్లవ జేజేలు

- విప్లవ రచయితల సంఘం | 20.05.2017 09:42:44pm

నక్సల్బరీ పోరాటం మొదలై ఈ ఏడాది మే 25కు యాభై ఏళ్లు. నక్సల్బరీ ఒక ఊరు కాదు. ఒక ఘటన కాదు, ఆధునిక భారత దేశ చరిత్రను గుణాత్మకంగా మార్చివేసిన ఒక పోరాట పంథా. మార్క్సిజాన్ని కేవల అధ్యయన శాస్త్రంగాకాక వర్గపోరాట ఆచరణ సిద్ధాంతంగా ఈ దేశ ప్రజలకు అందించిన ప్రజాయుద్ధ పంథా అది. ఆ మార్గంలో దేశవ్యాప్తంగా మూడు తరాల ప్రజలు ఎన్నో పోరాట వెల్లువలను సృష్టించారు. అసాధారణ త్యాగాలు చేశారు. యాభై వసంతాలనే కాదు, ముసురుకొచ్చిన శిశిరాలనూ అనుభవించి తిరిగి మోడువారిన కొమ్మలపై లేలేత ఎర్ర చిగుళ్లను మొలిపించారు. పూచిన పూలెన్ని రాలిపోయినా వేల వేల వసంతాలను పూయించారు. త్యాగానికి, ధిక్కారానికి ప్రతీక కావడం నక్సల్బరీ మొట్ట మొదటి విశిష్ట లక్షణం. నక్సల్బరీ ఏక్‌హీ రాస్తా అనే నినాదం ఇవాళ నక్సల్బరీయే ఏకైక ప్రజా ప్రత్యామ్నాయమని రుజువు కావడం దాని మరో అద్భుత లక్షణం.

అయితే ఈ అర్ధ శతాబ్దంలో ఇంకా ఎంతో సాధించవలసి ఉండిందని, విప్లవ విజయానికి చేరువ కావాల్సి ఉండిందని ఆశించడంలో తప్పు లేదు. 20వ శతాబ్ది విప్లవాలతో పోల్చితే తప్పక ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నక్సల్బరీ పోరాటం ముందు ఉన్న మాట వాస్తవమే. కానీ గత విప్లవాలతో పోల్చితే నక్సల్బరీకి తనదే అయిన చారిత్రక, రాజకీయార్థిక ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. నక్సల్బరీ చైనా మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ శిశువు. సోవియట్‌ యూనియన్‌ సోషల్‌ సామ్రాజ్యవాదాన్ని, ఆ తర్వాత చైనా రివిజనిజాన్ని అధిగమిస్తూ మొత్తంగానే సోషలిస్టు శిబిరం కూలిపోయిన తరుణంలో లేచి నిలబడి కొనసాగుతున్న పోరాటం. అంతేగాక స్వతహాగా నక్సల్బరీ పోరాటమే ఆరంభం నుంచీ తీవ్రమైన అంతర్గత నిర్మాణ, రాజకీయ సంక్షోభాలకు పదే పదే లోనవుతూ, అధిగమిస్తూ కొనసాగుతున్న పోరాటం. అలాగే ఆది నుంచీ రాజ్యహింసకు తీవ్రంగా నష్టపోతూ, కూలిపోతూ తిరిగి కూడగట్టుకుంటూ మునుముందుకు సాగుతున్న పోరాటం.

నక్సల్బరీ ఒక పోరాట పంథాగా, ఒక విప్లవ రాజకీయ కార్యక్రమంగా ముందుకు వచ్చింది. భారత దేశంలో 1947 అధికార మార్పిడీ తప్ప నిజమైన స్వాతంత్య్రం రాలేదని, మన దేశం అర్ధవలస, అర్ధ భూస్వామ్యమనే మౌలిక సూత్రీకరణ చేసింది. దీని వల్ల దళారీ వర్గానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా ఈ యాభై ఏళ్ల నుంచి నక్సల్బరీ ఉద్యమం పోరాడుతున్నది. భారత పాలకవర్గాల స్వభావాన్ని, రాజ్య స్వభావాన్ని అంచనా వేసి దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథాను చేపట్టి అమలు చేస్తున్నది. ఈ పోరాట క్రమంలో ఎన్నో అనుభవాలు గడించింది. ఒక చిన్న ప్రాంతంలో మొదలైన పోరాటం ఇవాళ దేశ వ్యాప్త ఉద్యమంగా విస్తరించింది. ఈ క్రమంలో వేలాది మంది బలిదానాలు చేశారు. ఎక్కడికక్కడ లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ పోరాటాల్లో పాల్గొన్నారు. మౌలికమైన భూమి సమస్యపై లక్షలాదిగా జీవన్మరణ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. విద్యార్థి, యువజన, కార్మికోద్యమాల్లో, వివిధ మేధో కార్యక్రమాల్లో నక్సల్బరీ ప్రభావంతో మూడు తరాలుగా ఉద్యమిస్తున్నారు. విస్త్రుత ప్రజా బాహుళ్యాన్ని వివిధ పోరాటరూపాల్లోకి, అన్నిటికీ అత్యున్నతమైన సాయుధ ఉద్యమంలోకి సమీకరిస్తూనే ఉన్నది. అందువల్లే దేశవ్యాప్తంగానే నక్సల్బరీ ఒక రాజకీయ శక్తిగా తిరుగులేని ప్రభావం ఇచ్చింది. అంతేగాక ప్రత్యక్షంగా అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఊతమిచ్చింది. అలాంటి ప్రజాపోరాటాల్లో నేరుగా పాల్గొన్నది. దేశవ్యాప్తంగానే ధిక్కారానికి, సామాజిక చైతన్యానికి, సృజనాత్మ క వికాసానికి నక్సల్బరీయే తిరుగులేని ఆలంబనగా ఉన్నది.

నక్సల్బరీ సాధించిన విజయాలను, అపజయాలను, దాని ముందున్న బృహత్తర లక్ష్యాలను కూడా ఈ వాస్తవ చరిత్ర నుంచి చూడాలి. ఈ యాభై ఏళ్లలో కైవసం చేసుకున్న ప్రపంచాలున్నాయి. కోల్పోయిన కోటలూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యనే యాభై ఏళ్ల కింద ఈ దేశ ప్రజలకు పరిచయమైన నక్సల్బరీ పోరాట పంథా మార్క్సిస్టు లెనినిస్టు ఉద్యమంగా, మావోయిస్టు ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ యాభై ఏళ్లలో నక్సల్బరీ ప్రత్యక్ష, పరోక్ష ప్రభావంలో సాగిన ఎన్నో ప్రజా సంచలనాలు ఉన్నాయి. మొత్తంగానే వ్యవస్థ సంక్షోభంలోంచి వాటికవిగా పెల్లుబికిన ఆందోళనలూ ఉన్నాయి. సారాంశంలో వ్యవస్థపై తీవ్ర నిరసనను, అసమ్మతిని ప్రదర్శించిన చైతన్య రూపాలవి. సమాజ ప్రజాస్వామికీకరణలో భాగమయ్యాయి. కానీ ఒక క్రమంలో అవన్నీ తమ పాత్ర ముగించుకొని వ్యవస్థలో కలిసిపోయాయి. రాజ్యంలో అంతో ఇంతో చోటు సంపాదించుకొని పాలకవర్గాలతో సహజీవనం చేస్తున్నాయి. కానీ నక్సల్బరీ మార్గంలో సాగుతున్న మావోయిస్టు ఉద్యమం మాత్రమే వ్యవస్థపై రాజీలేని పోరాటం చేస్తున్నది. మౌలికమైన ఉత్పత్తి సంబంధాల మార్పు దగ్గరి నుంచి సమాజంలోని అన్ని వ్యవస్థల సమూల మార్పు లక్ష్యంగా పోరాడుతున్నది. పోరాట శక్తి అనే మాటకు నక్సల్బరీ మాత్రమే తిరుగులేని ఉదాహరణగా నిలబడింది. అందువల్లే అది ఇవాళ దండకారణ్యంలో బీజరూప ప్రజారాజ్యాధికారాన్ని, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను, విప్లవ ప్రజాస్వామిక జీవన సంస్కృతిని పాదుకొల్పింది.

మానవ జాతి చరిత్రకు సోషలిజమే ప్రత్యామ్నాయమని చాటి చెప్పే చారిత్రక విశ్లేషణకు ప్రపంచంలోనే ఇవాళ నక్సల్బరీ పంథా ఒక ఆచరణాత్మక విశ్వాసాన్ని అందిస్తున్నది. చరిత్రలో ప్రజలు సాధించిన పారిస్‌ కమ్యూన్‌, బోల్షివిక్‌ విప్లవం, చైనా విప్లవం, శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవాల వారసత్వంలో నక్సల్బరీ పంథాను ఎత్తిపట్టవలసి ఉన్నది. సోషలిజమే ప్రత్యామ్నాయమనే నినాదంతో విప్లవ రచయితల సంఘం యాభై వసంతాల నక్సల్బరీకి జేజేలు పలుకుతూ కార్యక్రమాలు చేపట్టింది. శ్రీకాకుళ పోరాటం 1967 అక్టోబర్‌ 31న కా. కోరన్న, మంగన్నల అమరత్వంతో సాయుధ మార్గాన్ని ఎంచుకొని నక్సల్బరీ పంథాను కొనసాగించింది. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం దెబ్బతిన్నాక తిరిగి 1980లలో పునర్నిర్మాణ ప్రయత్నాలు మొదలై ఇవాళ దేశవ్యాప్త విప్లవోద్యమంగా విస్తరించింది. దండకాణ్యంలో బీజరూప ప్రజా రాజ్యాధికారం, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా స్థాపించడానికి ప్రయత్నిస్తున్నది. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడటానికి, అన్ని రూపాల్లో దోపిడీ హింసలను నిర్మూలించడానికి పోరాడుతున్నది.

ఈ దేశ ప్రజల ముందు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం నక్సల్బరీ. అది భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి, దళారీ పెట్టుబడికి, తరతరాల కుల పీడనకు, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నది. వేలాది మంది ప్రజల రక్తతర్పణ, జెయిలు నిర్బంధాలు, దారుణమైన హింసల మధ్య సాగుతున్న నక్సల్బరీ పంథాను ఎలుగెత్తి చాటవలసి ఉన్నది. ఇదే ఇవ్వాల్టి ప్రజానుకూల శక్తులన్నిటి బాధ్యత.

No. of visitors : 533
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •