ఐడెంటిటీ క్రైసిస్

| సంభాషణ

ఐడెంటిటీ క్రైసిస్

- సు.దే.చె | 20.05.2017 10:20:03pm

భావాలను అక్షరీకరించడం వొక అందమైన ప్రక్రియ. మెదడులో కాంతి వేగంతో ప్రయాణించే సంగతులకు అనుభూతిని జతచేసి memory lobeలో భద్రపరచడం వొక అసాధారణమైన సాహస క్రీడ. అందమైన ఊహలు కన్నులు మూసుకుని గాఢమైన నిదురలోకి జారుకుంటే వస్తాయని ఎవరైనా శిలాపలకంపై చెక్కారా? కాస్త మనస్సును అడిగిచూడకూడదూ....

మనస్సును పలకరించడం మరిచిపోతే నేను చెప్పనా? అవి unknown frontiersలో పుడతాయి, మనకి తెలియని ప్రదేశాలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి తీసుకువెళ్తాయి. అందరూ ఒక్కేలా స్వాప్నించడానికి మనలో identical dream chipని ఎవరూ insert చెయ్యలేదు కదా! అందుకే ఎవరు ఏ కోణంలో ప్రపంచాని చూపిస్తారో తెలుసుకోడానికి రాయడంతో పాటు చదువుతూ ఉండాలి.

అందరి భావాలు వొకే బాణీలో ఉండవు, ఎవరి రాగం వారిది. ఎప్పుడూ వొకే కీర్తన ఆలపిస్తే అవి గొంతుకలోంచి వస్తాయి మరి గుండె గదులలో నిక్షిప్తమైన సముద్ర గర్భ గోష ఎప్పుడు అక్షరీకరిస్తావు? లేక మ్యూట్ ని ఇంకా కొనసాగిస్తారా?

అదేమిటో గానీ వొక taglineని కొందరు తగిలించుకుని అదే పనిగా అన్ని భాషల్లో నిఘంటువులను తిరగేసి పదాలను వెతుకుతూ ఉంటారు. రోజూ మధురమైన వాటినే తింటే రుచిమొగ్గలు ఎందుకు చచ్చిపోతాయో?

భావాలను అక్షర రూపం ఇవ్వడంలో కవిది గానీ రచయితది గానీ మంత్రసాని పాత్ర, ఆ ప్రసవ వేదనలోంచి పుట్టిన అక్షరాలను చూస్తుంటే కన్నులలో నీళ్ళు తిరుగుతుంటాయి.

ఈ మధ్య అక్షరాలను పలకరిస్తే పసుపు కుంకుమ చందనం అంటూ రకరకాలైన పూజాసామాగ్రిని అద్దుతున్నారు, అవి ముక్కు మూసుకునేలా చేస్తున్నాయి.
అలనాటి చరిత్రలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న మహా కవులు ఎందరో, వాళ్ళకు కూడా ఆరంభంలో identity crisis ఎదురుకాలేదని అనుకుంటున్నావా? నిశ్శబ్ద సంద్రాలు పాఠాలు చెప్పలేవు.

ఈనాడు సోషల్ మీడియా వేళ్ళ కొసలకు అందుబాటులోనే ఉంది. Lengthy proseని టూ ది స్కేల్ నరికేసి, వొకదాని క్రింది మరో లైన్ ని పెట్టి పోస్ట్ చేస్తుంటారు. దానినే కవిత్వమని అనుకుంటూ సంబరపడిపోవాలా?

ఆడియన్స్ లేకపోతే పోయారు, నువ్వు రాయడం కంటే మునుపు వొక విషయం గుర్తుపెట్టుకో ʹఇక్కడ ఎమోషన్ కి మార్కెట్ లేదుʹ.
సో...నిత్యం జనుల నోటిలో నానడానికి కవిత్వం రాయకు, ఎప్పుడైనా రాస్తే అది జనుల గుండెల్లో నిత్యం చైతన్య నిప్పురవ్వలను రాజెయ్యాలి. ఇకనైనా ఆవిధంగా రాస్తారని ఆశిస్తున్నాను మిత్రమా!

కవిత్వం సో కాల్డ్ ప్రేమను వ్యక్తీకరించడానికి మాత్రమే సహకరిస్తుందా? అప్పుడప్పుడూ రాయడం పక్కనపెట్టి చదవడంలో మునిగిపోయినప్పుడు అనిపిస్తుంది ʹ ప్రేయసి అంగాంగాలను ఎక్కడా లేని ఉపమాన ఉపమేయాలతో వర్ణిస్తుంటారు. మనసులో సుస్థిర స్ధానం సంపాదించుకోవడం మరిచిపోయి ఆమె గుండెమీద బాహువుల రూపురేఖలను, పిరుదుల డయామీటర్ ను చూపులతో కొలవడంలో తనని తాను మరిచిపోతాడుʹ ఇంతలో నా మనస్సు question tagతో గిచ్చుతుంది ʹప్రేమను అక్షరాల్లో నింపుతున్నాడా? లేక పశుకామాన్ని మెండుగా ప్రవాహంలో కలుపుతున్నాడా? అక్షరాలు progressivenessకి సంకేతాలు మరి ఇదేమిటి sexual urgeని వాటిలో నిక్షిప్తం చేస్తున్నారు? వొకటి గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ʹఈ దేశంలో లిఖితమైన కామసూత్రా గూర్చి బహిరంగంగా చర్చించడానికి నిషేధం.ʹ

పదాలకు లింగాన్ని ఆపాదించడం ఎంత వరకూ కరెక్ట్‌? యూనివర్సల్‌ గా మనుషుల వేషధారణ మాత్రమే ఉంటే సరిపోదు దానితో పాటు భావప్రకటన కూడా ఉండాలనేది మనందరం ఆకాంక్షించాలి. ఇంకా ఆ రోజు రావాలని కోరుకోవడం సిగ్గుచేటుతో కూడిన విషయమైనప్పటికీ ఇంకనైనా Gender Bias లేకుండా ఉండేలా చూడడం మన తక్షణ కర్తవ్యం.

కవిత్వం ఎట్లాంటి పరిస్థితులలో ఉద్భవిస్తుంది? కవిత్వం ఏమైనా తయారీ వస్తువా? అది అంతరంగాల్లోంచి ప్రవహిస్తుంది, భావాలకు లిపిని జతచేసినప్పుడల్లా అందంగా మెరుస్తుంది.

దశాబ్దం క్రిందటి కొన్ని భాదిత సంఘాల పేర్లను విన్నప్పుడు తెలియకుండానే పెదాలు అసహజంగా విచ్చుకున్నాయి. ఇప్పుడు రచయితలకు కవులకు సమాజంలో ఎక్కడిది గౌరవం? endangered species లిస్టులో ఉన్న సాహితీ వర్గం యొక్క రేపటిని మీ ఊహాశక్తికి విడిచిపెడుతున్నాను.

కృష్ణానగర్ సందుల్లో కాస్త తొంగిచూడు, సింగిల్ టీ ఇప్పిస్తే పాట రాయడానికి, వొక పూట భోజనం పెడితే కథ రాసివ్వడానికి ఎందరో క్యూ కడుతున్నారు. ఇది భాషా ప్రేమికుల ఆకలిరాజ్య గాథ.

సాహిత్య ప్రక్రియలో ఉన్నవాళ్ళు ఎంత పిచ్చివాళ్ళో మీకు తెలుసా? రోడ్డు మీద పడివున్న అనాధ శవాలను భుజంమీద మోస్తారు, ఆ unclaimed శవాలపై పాటలు, కవిత్వం, నాటికలు ఇట్లా అందుబాటులో ఉన్న ప్రతీ formatలో సమాజంలో క్షణం తీరికలేని వాడిగా మనిషి తనను తాను ఎట్లా చిత్రీకరించుకుంటున్నాడో ధైర్యంగా చెప్పుతాడు. అయినా ఇంత చేసినా మార్పు ఆశించినంత మేరకు ఎందుకు సాధించలేదు? ఈ ప్రశ్నకు జవాబు అందరికీ తెలుసు గానీ ఎందుకో మాట్లాడడానికి పెద్దగా ఆశక్తిని చూపించేందుకు ముందుకురారు. రుచించని నిజాని గుర్తుచేస్తున్నాను కదా కాస్త మీ చెవిని ఇలా ఇవ్వండి ʹఎన్ని allegations వచ్చినా ఫేక్ నవ్వుతో దులుపుకుంటూ ముందుకు సాగిపోతారు...అవునా?ʹ అందుకే సిగ్గు ఎప్పుడో సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది.

ఆకాశదేశ తెరపై రాత్రిళ్ళు అదేపనిగా నక్షత్రాలు నేల రాలవు. అందుకే ఆ మనోహర దృశ్యం కొరకు వెతుకులాటలో ఒక్కోసారి కన్నుపాప freeze అయిపోతుంది. కొందరు నిజంలో బ్రతుకుతారు, అందులోనే జీవించాలని స్వాప్నిస్తారు. అట్లాంటి వాళ్ళపై syndicate రాళ్ళదాడి జరుగుతుంది, extremist పొయట్రీ అంటూ ముద్రను వేస్తారు. రక్తం వేడెక్కిన ప్రతీసారి అది కోరికల పాపం కాదు, అదే హింసపై తిరుగుబాటు సంకేతం.

No. of visitors : 418
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
  Self mortality
  దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
  నుల్క‌తోంగ్ నిజాలు
  అప్పుడు
  ఎలా కలవాలి ?
  నిన్న- నేడు - రేపు
  జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
  ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •