నరకం

| సాహిత్యం | క‌థ‌లు

నరకం

- దోస్తోవిస్కీ | 20.05.2017 10:43:29pm

ʹʹహలో బాగున్నావా పెద్దాయనా? నీ దగ్గరకు వచ్చే నిరుపేదల్ని, అమాయకుల్ని ఎందుకలా భయపెట్టి చంపుతున్నావు? నరకంలో శిక్షల గురించి వాళ్ళకు వర్ణించి వర్ణించి చెబుతున్నావెందుకు? ఆ చిత్రహింసలు వాళ్ళకేం కొత్త కాదుగా! నరకంలో కూడా ఇంతకన్నా పెద్ద శిక్షలేం వెయ్యరు. నువ్వూ, ప్రభుత్వాధికారులే ఈ లోకంలో నా ప్రతినిధులని నీకు తెలియదా? పేదల్ని నరకంలోకి నెట్టేది మీరే, అది సరిపోదన్నట్టుగా కొత్తగా శిక్షలు విధిస్తామని బెదిరించేదీ మీరే. నా మాటలు నిజమో కాదో ఇప్పుడే రుజువు చేస్తను. నా వెంట రాʹʹ అని ప్రీస్టుకు సవాల్‌ విసిరాడు సైతాను.

అంతటితో అయిపోయిందా? ప్రీస్ట్‌ కాలర్‌ పట్టుకొని, బరబరా ఈడ్చుకుంటూ ఓ ఫ్యాక్టరీలోకి తీసికెళ్ళాడు. అదో ఇనుము ఫౌండ్రీ. నరక జ్వాలలను మించిన వేడిలో కూలీలు క్షణం విరామం లేకుండా పని చేస్తున్నారు. నరకం గురించి ఇన్నాళ్ళు రకరకాలుగా వర్ణించి చెప్పాడు ప్రీస్టు. ఫౌండ్రీ పరిస్థితులు అంతకన్నా దారుణంగా ఉన్నాయి. అక్కడ మరి కాసేపు ఉంటే తాను మాడి మసిబొగ్గు కావడం ఖాయం. మొహం ఎర్రబడింది. కన్నీళ్ళు ధారగా కారాయి.

ʹʹఇక్కడ ఉండటం అసాధ్యం. త్వరగా వెళ్ళిపోదాంʹʹ అంటూ వేడుకున్నాడు.

ʹʹఅయ్యోక్ష్మ అప్పుడే ఏమైందని? చూడాల్సింది ఇంకా ఉందిʹʹ అంటూ ప్రీస్టును పొలం దగ్గరకు లాక్కెళ్ళాడు సైతాను.

దుమ్ము, ధూళి, ఎండవేడి, యజమానుల కొరడా దెబ్బలు, బూతులు ఒకవైపు ఆకలితో అలమటిస్తూ, మరోవైపు నాలిక పిడచగట్టుకుపోతున్నా, చీమల దండులా పనిచేస్తున్నారు రైతు కూలీలు, అర్థబానిసలు. ఆ తర్వాత ఈ నిర్భాగ్యులు తలదాచుకునే పూరిపాకల వైపు ప్రీస్టును నడిపించాడు సైతాన్‌. అవి పశువుల కొట్టాల కన్నా అధ్వాన్నం. నిటారుగా నిల్చోగలిగినంత ఎత్తు కూడా లేవు. లోపల పొగ, వేడి, గాలి ఆడదు. దుర్గంధం, మురికి...ʹఈ పరిస్థితులతో పోల్చితే నరకమే స్వర్గమనిపించదా?ʹ అన్నట్లు వ్యంగ్యంగా నవ్వాడు సైతాన్‌. కానీ ఆ దీనులను చూస్తే సైతాన్‌కు కూడా జాలేసినట్టుంది.

ప్రీస్తుకేమో ముళ్ళమీద నిల్చున్నట్టుగా ఉంది.

ʹʹఈ భూలోక నరకాన్ని నేను భరించలేను తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందేʹʹ అంటూ ప్రాధేయపడ్డాడు.

ʹʹసరి సరి, నీ భాద అర్థం చేసుకున్నానులే. కానీ ఇంకా నువ్వు వాళ్ళకు నరకాన్ని గురించి చెప్పి భయపెట్టాలనుకుంటున్నావా? ఈ పేదలు, నిర్భాగ్యులు ఇప్పటికే జీవచ్ఛవాలు. మరణించి మరెక్కడికో వెళ్ళవలసిన పనిలేదు. నరకంలోని శిక్షలకు వంద రెట్లు ఇక్కడే అనుభవిస్తున్నారు. నిన్ను వెంటనే వదిలిపెడతాను గాని, అంతకు ముందు మరో దృశ్యమూ చూద్దువు. రా...ʹʹ అంటూ ప్రీస్టును ముందుకు నెట్టాడు సైతాను.

అదోక జైలు గది. చీకటి గుయ్యారం లాగుంది. ముక్కు పుటాలు బద్ధలయ్యే దుర్గంధంలో కదులుతున్నాయి కొన్ని మానవ రూపాలు. వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడుకోవటం అనవసరం. ʹఇంకా బతికున్నారుʹ అనుకుంటే చాలు. నేల మీద చీమలు, క్రిమికీటకాలు, కొన్ని ఎగురుతున్నాయి. కొన్ని పాకుతున్నాయి. వాటి మధ్యనే పెద్ద సైజు కీటకాల్లా మెలికలు తిరుగుతున్నాయి. వారి శరీరాలు. ఒంటి మీద దుస్తుల్లేవు. అన్నీ నగ్నంగా ఉన్న అస్తిపంజరాలే!

ʹʹనీ సిల్కు దుస్తులు విడిచి ఇటురాʹʹ అంటూ ప్రీస్టును ఆజ్ఞాపించాడు సైతాను.

ʹʹబరువైన ఈ ఇనుప గొలుసు కాళ్ళకు బంధించుకో. లుకలుకలాడే పురుగుల మధ్య దిసమొలతో పడుకొని వీళ్ళను పలకరించు. ఇది కాక వేరొక నరకం ఉంటుందని ఈ నిర్భాగ్యులకు నీ సందేశం వినిపించుʹʹ

ʹʹలేదు లేదు. ఇంతకన్నా మరో నరకముండదు. నరకాన్ని వెయ్యి పెట్టి గుణించినట్టుగా ఉందీ బందిఖానా. ఒక్క క్షణం కూడా ఉండలేనిక్కడ. వెళ్ళిపోదాం. పద!ʹʹ అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యాడు ప్రీస్టు.

ʹʹఇప్పటికైనా వాస్తవాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇదే నరకం. కాదు...కాదు, నరకం కూడా ఇంత దుర్భరంగా ఉండదు. ఆశోపహతులైన ఈ జీవులకా నరకం గురించి చెప్పి భయపెట్టాలనుకున్నావు?ʹʹ అంటూ కసురుకున్నాడు సైతాన్‌.

అనువాదం - ముక్తవరం పార్థసారథి


No. of visitors : 770
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆవూ - పలుపుతాడు

ఫెంగ్ షూ | 04.06.2017 01:27:38pm

మూడో కంటికి కనిపించకుండా రెండూ ఊరి పొలిమేరలు దాటాయి. మరి కాసేపటికి తాడు ఓ బండ పగులులో చిక్కుకుపోయి, ఎంత ప్రయత్నించినా రాలేదు....
...ఇంకా చదవండి

కప్పగారి యుద్ధభేరి

ఫెంగ్ షూ | 16.07.2017 08:58:07am

బండి సమీపించగానే, పాము గాలి పీల్చుకుని, ఉబ్బి బుసకొట్టింది. కప్ప బెకబెకలతో వాతావరణాన్ని భయానకంగా మార్చింది. ʹబండీ, ఎలా కదుల్తావో చూస్తాను!ʹ అంటూ పాము దారికి...
...ఇంకా చదవండి

నవయుగ వైతాళికుడు

ఫెంగ్ షూ | 18.06.2017 11:39:53am

తుఫాను రానే వచ్చింది. అప్పుడు చూడాలి సాలీడుని. భయంతో బిక్కచచ్చి ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని తన గూడు ఏమైపోతుందోననే బెంగతో ఒక ఆకు వెన నక్కి చివరి క్షణాల్ని ...
...ఇంకా చదవండి

చేదబావీ - జీవనదీ

ఫెంగ్ షూ | 06.07.2017 12:15:02am

ʹఎటు చూస్తే అటు బురద, ఎప్పుడూ రొద చేస్తూ ప్రవహిస్తుంటుంది. ఛీ అదీ ఓ బతుకే. నాలాగా లోతుగా, దుమ్మూ, ధూళీ లేకండా ఉండగలదా అది. ...
...ఇంకా చదవండి

పదవీచ్యుతుడు

ఫెంగ్ షూ | 07.10.2017 08:14:12am

ʹʹనేను సరిగానే ఊహించానన్నమాట. నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతున్నది. తిరుగుబాటును అణచివెయ్యటానికి నీకు సాయం చేస్తాను. మళ్ళీ రాజ్యం చేజిక్కించుకుందువు గానిʹʹ అంటూ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •