ʹసమాధాన్‌ʹ ప్రజల దగ్గర ఉంది - అయిదు వసంతాల ప్రతిఘటనారావం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ʹసమాధాన్‌ʹ ప్రజల దగ్గర ఉంది - అయిదు వసంతాల ప్రతిఘటనారావం

- యూసఫ్‌బీ | 21.05.2017 07:26:22pm

మే నెల 8వ తేదీ ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, పోలీసు అధికారుల సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నక్సల్స్‌ రహిత భారతదేశమే తమ లక్ష్యమని పాలకవర్గం ప్రతిజ్ఞ చేసింది.

శ్రీకాకుళ పోరాట కాలం నుంచి పాలకులు నక్సల్స్‌ రహిత సమాజం సాధిస్తామని చెబుతూనే ఉన్నారు. దీని కోసం వేలాది మంది విప్లవకారులను హత్య చేస్తూనే వచ్చారు. సాధారణ ప్రజలను హింసలకు గురి చేస్తూనే వచ్చారు. దారుణమైన అప్రజాస్వామిక చట్టాలను తెచ్చుకుంటున్నారు. నక్సల్బరీ అనే ఒక గ్రామంలో మొదలైన విప్లవోద్యమం ఒక ఘటనగా మిగిలిపోకుండా ఒక పంథాగా దేశవ్యాప్తమైంది. శ్రీకాకుళం జిల్లాలో మూడు తాలూకాల్లో జరిగిన పోరాటం ఒక విముక్తి మార్గంగా అనేక ఓటములను, శతృవుల దాడులను, హత్యాకాండలను అధిగమిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది.

ఆ కాలాల్లోని పాలకులు కూడా సరిగ్గా ఇప్పటి రాజ్‌నాథ్‌సింగ్‌లాగే నక్సల్స్‌రహిత దేశాన్ని కలగన్నారు. వాళ్ల చర్యల్లోనేగాకాదు. కలల్లో సహితం ప్రతీఘాతుక స్వభావం ఉన్నది. అందుకే ఎంత నెత్తురు పారించినా వాళ్ల కలలు నిజం కాలేదు. అనేక సార్లు శతృవు చేతిలో దెబ్బతిన్నా, పడిపోయినా నక్సల్బరీయే లేచి నిలబడింది. ఇదొక గతితర్క నియమం. విప్లవోద్యమం గతితర్క నియమాలను మార్గదర్శకంగా తీసుకోవడమేకాదు, వాటిని నిజం చేస్తుంది కూడా.

పాత చరిత్ర అంతా అక్కర్లేదు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలైనప్పటి నుంచే పరిశీలిద్దాం. ఈ ఏడాదిలో విప్లవోద్యమాన్ని తుడిచేస్తామని ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌1ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మూడు దశలు దాటాయి. అవిగాక మిషన్‌ 2016 తీసుకొని వచ్చారు. ఇప్పుడు మిషన్‌ 2017 నడుస్తోంది. ఈ క్రమమంతా యుద్ధతీవ్రత పెరుగుతూనే ఉన్నది. లక్షల సైనిక, అర్ధ సైనిక బలగాలు దండకారణ్యాన్ని, ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతాన్ని, ఈ చివర పశ్చిమ కనుమల దగ్గరి నుంచి లాల్‌ఘడ్‌, అస్సాం సరిహద్దులదాకా ఈ యుద్ధం నడుస్తున్నది. దశాబ్దాలుగా కశ్మీర్‌లో నడుస్తున్న యుద్ధాన్ని తలపిస్తున్నది.

ఇంత భయానక హింసలో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా బస్తర్‌ విధ్వంసం గురించి, అక్కడ నడుస్తున్న అణిచివేత గురించి ఎంత అప్‌డేట్‌ రాయగలిగినా ఇంకా ఎంతో దుర్మార్గం బైటికి రాకుండా పోయే పరిస్థితి ఉన్నది. అయితే అంతా విధ్వంసమూ, అణిచివేతనేనా? అని. కానేకాదు. ప్రజలు ఇంత దారుణ పరిస్థితిలో ఉన్నా గొప్ప ప్రతిఘటన సాగిస్తున్నారు. నక్సల్బరీ ఈ యాభై ఏళ్లలో ఎంత రక్తమోడినా తనలోని ప్రతిఘటనా శక్తి వల్లే శతృవును నిలువరించగలుగుతున్నది. ఎదుర్కోగలుగుతున్నది. నష్టాల మధ్యనే అనేక విజయాలు సాధిస్తున్నది.

ఈ అనుభవం రాజ్యానికి కూడా తెలుసు. అందుకే ప్రతిసారీ మరింత దూకుడుగా మీదికి వస్తోంది. ఈసారి సమాధాన్‌ అనే పేరుతో వస్తోంది. ఇందులో రాజ్‌నాథ్‌ సింగ్‌ చాలా స్పష్టంగా మావోయిస్టుల గురించిన ఆలోచనల్లో, విధానాల్లో, వ్యూహాల్లో మరింత దూకుడుగా ఉండాలని పిలుపు ఇచ్చాడు. రాష్ట్రాలు సమప్వయంతో, సాంకేతికంగా బలపడి నిఘా వ్యవస్థ పెంచి దాడులు చేయాలని అన్నాడు. ఈ కొత్త వ్యూహానికి సమాధాన్‌ అని పేరు పెట్టాడు. సమాధాన్‌లోని ఇంగ్లీషు అక్షరాలకు నిర్వచనం కూడా ఇచ్చాడు. ఎస్‌అంటే స్మార్ట్‌ లీడర్‌ షిప్‌, ఏ అంటే అగ్రెసివ్‌ కష్ట్రస్ట్రాటజీ, ఎం అంటే మోటివేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, ఏ అంటే యాక్షనబుల్‌ ఇంటలిజెన్సీ, డి అంటే డ్యాష్‌ బోర్డు బేస్డ్‌ ఇండికేటర్స్‌, హెచ్‌ అంటే హార్నెసింగ్‌ టెక్నాలజీ, ఏ అంటే యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ థ్రెట్‌, ఎన్‌ అంటే నో యాక్సెస్‌ టు ఫైనాన్సింగ్‌ అన్నాడు.

మావోయిస్టు మూలాలు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనేది అసలు అర్థం. కానీ పాలకులకు ఒక విషయం తెలియడం లేదు. మావోయిస్టుల మూలాలు ఈ దేశ దోపిడీ ఉత్పత్తి సంబంధాలని, అవి ఉన్నంత వరకు ప్రజలే వాళ్ల బలమని. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం సాధ్యమవుతుందేమోగాని ఉద్యమానికి ఉన్న ప్రజా మూలాలు తాత్కాలికంగా దెబ్బతీయగలరేమోగాని మొత్తంగా విప్లవోద్యమానికి ఉన్న ప్రజా పునాదిని రద్దు చేయడం రాజ్యానికి సాధ్యం కాదని ఇప్పటికే రుజువు అయింది. అయినా పాలకులు ప్రతిసారీ సరికొత్త సన్నాహాలతో దాడులు చేస్తూనే ఉన్నారు. అణచివేత ద్వారా ఉద్యమానికి సమాధానం చెప్పాలని కలలుగంటున్నారుగాని, యాభై ఏళ్ల నక్సల్బరీ చరిత్ర చెబుతున్న సాక్ష్యం ఏమంటే ప్రజల దగ్గర ఈ అణచివేతకు సమాధానం ఉన్నది. ఎప్పటికప్పుడు కొంత నష్టపోతున్నా ఉద్యమం పాలకుల అణచివేతకు ధీటైన సమాధానం చెబుతోంది.

ఇది కేవలం సైనిక సంబంధమైనదే కాదు. అసమ సమాజంలోని అన్ని రకాల దోపిడీ పీడనలకు విప్లవోద్యమమే అసలైన సమాధానం. ప్రశ్న ఈ దోపిడీ వ్యవస్థ. ఈ అమానవీయ పాలన. పార్లమెంటరీ విధానం. దానికి శాస్త్రీయ సమాధానం విప్లవోద్యమం. ఈ ఎరుక ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విప్లవోద్యమంలో సమీకృతం అవుతున్న ప్రజలకు పుష్కలంగా ఉన్నది. కాబట్టి గ్రీన్‌హంట్‌ను, మిషన్‌ 2016, 2017లను ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ ʹసమాధాన్‌ʹకు ధీటైన అసలు సమాధానం చెప్పగల విప్లవశక్తి ఉన్నది. అంతిమంగా గెలిచేది అదే.

No. of visitors : 456
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి -2018
  Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA
  ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)
  కలత నిద్దుర‌లోకి త‌ర‌చి చూస్తే
  బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా
  హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు
  ఇప్పుడు
  నిలబడి తీరాల్సిన దారుల్లో...
  ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం
  ఈ పక్షం బుల్పికలు!
  హ‌క్కులపై ఉక్కుపాదం
  పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •