మరో తల్లి

| సంభాషణ

మరో తల్లి

- స్వేచ్చానువాదం -ఉదయమిత్ర | 04.06.2017 02:02:49pmʹహజారీ చౌరాసియామాʹ(మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ కి సినిమా రూపం)...సినిమా లో పోలీసులు ఐదు మంది ఉద్యమకారుల్ని కాల్చి చంపి, తామే వాళ్ళకు చితి పేరుస్తారు. భగ భగ మండుతున్న మంటల్లో తన కొడుకు కాలిపోవడం చూసి ఓ తల్లి(మిస్సెస్ చటర్జీ) మౌనగా రోదిస్తూ ఉండిపోతుంది.

సరిగ్గా ఇప్పుడు దండకారణ్యం కూడా చితిమంటల్లో కాలుతున్నట్టే ఉంది. అయితే ముక్కు పచ్చలారని ఆదివాసి అమ్మాయిలు మారణకాండ కు బలవుతుంటే చలించిన ఒక వ్యక్తి దైర్యంగా ముందుకు వచ్చి జరుగుతున్న అత్యాచారాల్ని ఎత్తి చూపి ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఆమె మరో తల్లి ఆమె వర్షా డోoగ్రే (జైలు deputy superindent of రాయిపూర్)

ʹనేను 14-16 వయస్సు గల ఆదివాసి అమ్మాయిల్ని పోలీస్ స్టేషన్ లలో బట్టలు విప్పధీసి, చిత్రహింసలు పెట్టడం స్వయంగా చూసాను. నేనా గుర్తులు చూసాక విపరీతంగా చలించిపోయాను. ముక్కు పచ్చలారని పిల్లల మీద నక్సలైట్ కేసులు పెట్టి ఎందుకిల థర్డ్ డిగ్రీ పద్ధతుల్ని ఉపయోగిస్తారో అర్థo కాదుʹ అంటుందామె.

ఏప్రిల్ 26 న వర్ష డోoగ్రే facebook లోపెట్టిన పోస్ట్ పెద్ద దుమారమే లేపింది. చత్తిస్ గడ్ లో మావోయిస్టు ఉద్యమం అణిచివేత పేరు మీద పోలీసులు అమలు చేస్తున్న మారణకాండను ఆ పోస్ట్ బహిరంగంగా ఎత్తి పట్టింది. ఇది పాలకులకు కంటగింపు గా మారింది. పలితంగా ఆమెను సస్పెండ్ చేసి 350km దూరంలో గల అంబికాపూర్ జైలు కి అటాచ్ చేసారు.
ఆమె మీద విచారణ జరిపిన గిరిధర్ నాయక్(DGP), ఆమె సర్వీస్ రూల్స్ కి విరుద్దంగా ప్రవర్తించినట్టు తేలిందని ప్రకటించాడు. ʹఆమె ప్రభుత్వ ఉద్యోగి.. ఫ్రీలాన్సు జర్నలిస్ట్ కాదు..ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా రూల్స్ కి లోబడి ఉండాలి. ఏదైనా చెప్పదలుచుకుంటే దానికి సోషల్ మీడియా వేదిక కాదుʹ అంటాడాయన.

ఆమెను సస్పెండ్ చేసిన kk గుప్త(జైళ్ళ ప్రధాన అధికారి) రెండు కారణాలని చెప్పాడు.

1. తప్పుడు విషయాలని చూపిస్తూ బాద్యతరహిత ప్రకటనలు చేయడం
2. ముందస్తు అనుమతి లేకుండా డ్యూటీకి దూరం అవడం.

ʹనాకు ఏ ఛార్జ్ షీట్ ఇవ్వలేదు. కానీ నా ప్రతిస్పందన పంపిన మరుసటి రోజే నన్ను సస్పెండ్ చేసారు. ఇది చాల అన్యాయంʹ అంటుంది డోoగ్రే.

ఈ కేసును పరిశోదిస్తున్న ఆఫీసరు ఆమెకు 32 పేజీల ఉత్తరం పంపాడు. అందులో హిమాంశు కుమార్(సామాజిక కార్యకర్త) ఆమె పోస్ట్ ను ఎందుకు షేర్ చేసాడని ప్రశ్నించాడు. దీంతో పాటు ఆమె FB లో పెట్టిన ఫోటోలు దాని కింద వ్యాక్యానాలు గురించి కూడా వివరణలు అడిగాడు. ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి FB లో పోస్ట్ పెట్టడం రూల్స్ కి విరుద్దమేనని ఆయన సెలవిచ్చారు.వీటన్నిoటికి జవాబు ఇచ్చిన మరుసటి రోజే ఆమెను సస్పెండ్ చేసారు.

ʹఅవును నేను పెట్టిన పోస్ట్ కు నేనే బాద్యురాలిని. కానీ దాన్ని చూసి స్పందించిన మిత్రుల భావాలకు నేనెట్ల బాద్యురాలినిʹ అంటూ ఆమె రాయ్ ఉత్తరానికి జవాబిచ్చింది. ʹనేను రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను పూర్తి బాధ్యతతో వినియోగించుకున్నాను. నేనెక్కడ ప్రభుత్వ రహస్యాలు గాని, డాకుమెంట్లు గాని బయట పెట్టలేదు. కాని ఒక్క విషయం ఏ ప్రభుత్వ ఉద్యోగి ఐన తన విధిని నిర్వర్తిస్తూనే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కూడ కాపాడవలసి ఉంటుందిʹ అంటుందామె.

వాస్తవాలను బహిరంగపరచడంʹఅందరికి భావ ప్రకటన స్వేచ్చ ఉంటుందిʹ అందామే. స్క్రోల్.ఇన్ లో....ʹమనం ప్రభుత్వ ఉద్యోగులం అయినంత మాత్రాన దాన్ని కుదువపెట్టల్సిన అవసరం లేదు. మనం స్వాతంత్ర పౌరులం. ప్రజలకు జరిగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కుందిʹ

తానేoచుకున్న మార్గం అంత సులభమైనది ఏమి కాదని ఆమె అభిప్రాయం. ఆ మార్గం నిండా , ముళ్ళు ఉంటాయని,కుట్రలుంటయని,ప్రమాదాలు పొంచి ఉంటాయనిʹఆమెకు తెల్సు..ఐన సరే , తన పోరాటాన్ని రెండు విషయాల మీద కేంద్రికరిస్తానని చెప్పిందామె.ʹమొదటిది రాజ్యాంగం పొందు పరచిన 244వ ఆర్టికల్ ని అమలు పరచడం. దిని ప్రకారం ఆదివాసి కి నీటి మీద భూమి మీద అడవి మీద ప్రత్యేక హక్కులు సంక్రమిస్తాయి. అవి అమలులోకి వస్తే కార్పొరేట్ దోపిడీ నుండి విముక్తి దొరుకుతుంది.అతను తన వనరులతో స్వయంగా అభివృద్ధి పొందుతాడు. రెండోది, ప్రభుత్వ ఉద్యోగి అటు ప్రబుత్వానికి ప్రజలకి భాద్యత పడాలిʹ అందామే.

ఆ ఆశయం తోటే ఆమె ఆదివాసిల పట్ల రాజ్యం అమలు పరుస్తున్న మారణకాండను బయటపెట్టగలిగిoది. తను సస్పెండ్ అయినంక తన ఇంటి(కావర్ధ)నుండి మాట్లాడుతూ ʹఆదివాసిల పట్ల దారుణ మారణకాండ అమలవు తోoది. ఇట్లాంటి కేసులు జగ్దల్ పుర్ లోను రాయిపూర్ లోను ఎన్నో చూసాను అందామె.ఆమె తాను చూసిన వాటిలో ఒకానొక ఘట్టాన్ని చెప్పుకొచ్చింది(దాన్నే ఆమె ఏప్రిల్ 26 నాడు fb లో పెట్టింది)ఆమె మహిళా ఖైదిల సెల్ ను చెక్ చేస్తున్నప్పుడు 14 సo. లోపు కనబడుతున్న నలుగురు ఆదివాసి అమ్మాయిలు ఓ మూలగ వణుకుతూ నిలబడడం చూసింది.ఆమె వాళ్ళ దగ్గరగా వెళ్లి ʹఎందుకు అరెస్ట్ అయ్యారుʹ అని అడిగితే వాళ్ళు భయం తో నోరు విప్పలేదు. కాని సెల్ లోని ఇతర మహిళా ఖైదీలు దైర్యమివ్వడం తో జరిగింది చెప్పారు ʹవాళ్ళకు పోలీస్ స్టేషన్ లో ఎలక్ట్రిక్ షాకులిచ్చారు. ఒక్కొక్కరి మణికట్టు చుట్టూ పది షాకులు ఇచినట్టు నల్లటి మచ్చలు(dark spots) ఉన్నాయి. వాళ్ళ రొమ్ముల చుట్టూ ఒక్కొక్కరికి ఏడు షాకులిచ్చినట్టు నల్లటి గుర్తులున్నాయి. ఆ అమ్మాయిలు గట్టిగ ఏడవటం మొదలు పెట్టారు.అక్కడ ఉన్న అందరం ఏడ్చేసాంʹ అందామె.

అయితే ఈ విషయాన్నీ ఆమె ఎవరికైన రిపోర్ట్ చేసిందా? అని అడిగితే ʹదురదృష్టవశాత్తూ అప్పట్లో ఖైదీల మెడికల్ రికార్డ్లు పొందుపరిచే పరిస్తితే ఉండేది కాదు. మే 2010 లో జాతీయ మానవ హక్కు ల కమిషన్ వారు సూచించిన తర్వాత గాని ఖైదీల మెడికల్ రికార్డ్లు పొందుపరచడం మొదలైందిʹ అందామె.

ʹఅదృష్టం కొద్ది ఆ రోజు జైలు డాక్టర్ కూడా మాతోబాటే ఉంది. షాకుల వల్ల వాళ్ళ శరీరాలమీద గుర్తులు చూసి చలించి పోయింది. ఆమెను చూసింది చూసినట్టుగా రాయమని సూచించానుʹఅంది డోoగ్రే.నక్సలైట్ కేసుల కింద అరెస్ట్ కాబడిన ముక్కు పచ్చరాలని అమ్మాయిలకి ఇది కొంత ఊరట కాగలదని ఆమె అభిప్రాయం.

ఈ సంగటన తర్వాత ఆమె కొన్ని రోజులు లీవ్(సస్పెన్షన్ లీవ్ )మీద వెళ్లి తిరిగొచ్చే సరికి ఆ పిల్లలు బేల్ మీద వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళని వెతకడం కష్టం ఐపొయింది. ఈ లోపున కొత్త కొత్త ఆదివాసీ కేసులు కుప్పలుగా పెరిగిపోయాయి.ʹకాని, ఆ సంగటన మాత్రం నన్నెపుడు వెంటాడుతుందిʹ అంటుందామె. ʹఎప్పుడైనా పాలకులు ఆదివాసిల పట్ల పోలీసులు మరింత కఠినంగా ఉండాలని చెప్తుంటే వాల్లేమైపోతారని దిగులేస్తదిʹ

అయితే ....తాను fb లో షేర్ చేసిన విషయం కొత్తదేమి కాదంటుంది డోoగ్రే..ʹఇదంతా బహిరంగ రహస్యమే. 2011లో సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్ట్ లోను తాడిమెట్ల మారణకాండలో సిబిఐ రిపోర్ట్ లోను బీజాపూర్ హత్యాచారం కేసులో జాతీయ మానవ హక్కుల రిపోర్ట్ లోను ఇదంతా ఉన్నదే. ఇవన్ని బస్తర్ పరిస్తితికి అడ్డం
పడతాయి ఇవి నేను వ్యక్తిగతంగా చూసిన దానికి మరింత బలం ఇస్తాయిʹ అందామె.

ʹమరెందుకు ఈ కక్ష సాదింపు చర్యలు?ʹఅంటే ʹదానికి కారణం వేరే ఉంది. గతం లో నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకలు బయట పెట్టినందుకు ప్రభుత్వం నాపై కక్ష కట్టిందిʹఅందామె.

పాత కక్షలు2003 లో జరిగిన ఛత్తీస్గడ్ పబ్లిక్ సర్వీస్ నియామకాల్లో 147 పోస్ట్ లలో అవకతవకలు జరిగాయి. డోoగ్రే దిని మీద 2006 లో కేసు వేసింది.

పిటిషన్ వేసినంక ఆమె జూన్ 19, 2006 నాడు CM రమణసింగ్ ను కలసి న్యాయం కోరింది. కేసు కోర్టులో ఉంది కాబట్టి ఏమి చేయలేమని సెలవిచ్చడాయన. ఆమె కనీసం సిబిఐ విచారణ నన్న జరిపించమని కోరింది. ఆయనకు కోపం వచ్చి ఆమెను బయటికి గేoటేయించాడు.

2016లో కోర్టు డోoగ్రే కి అనుకూలంగా తిర్పునిస్తూ కొత్తగా మెరిట్ లిస్ట్ ను తయారుచేయమంది.దీంతో పాటు పిటిషనర్లకు కొంత పరిహారం కూడా ఇప్పించింది ʹపిటిషనర్లు పెద్ద పోరాటమే చేసారు. వాళ్ళ పట్టుదల శ్రమల వాళ్ళ పాలకుల అసలు మొఖం వెల్లడైందిʹ అంది కోర్టు.

ʹముగ్గురు లాయర్లు ఈ కేసును 9సo. వాదించిన పలితం లేకపోవడం తో నా కేసు నేనే వాదిoచుకొని చివరికి గెలిచానుʹ అంటూ ʹఅవినీతి మీద సత్యం గెలిచిందిʹ అందామె.

ఇదొక్కటే కాదు రాయపూర్ జైలు లోని మహిళా విభాగపు ఆఫీసర్ గా ఆమె స్త్రీ ఖైదీల పట్ల పిల్లల పట్ల జరుగుతున్నా అనేక నేరాలను బట్టబ బట్టబయలు చేసింది. ఈ నేరాలను పై అధికారుల దృష్టికి తిసుకపోవడమే కాక ఆమె తన రహస్య వార్షిక రిపోర్ట్ లోను ఇవన్ని స్పష్టంగా పేర్కొంది

ʹదీంతో నేను ప్రభుత్వానికి కంటగింపుగా మారాను. నా మీద తీసుకున్న ఈ సస్పెన్షన్ చర్య, వాళ్ళ అసహనానికి కోపానికి అద్దం పడ్తుంది.

ప్రభుత్వ ఉద్యోగి కి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఆమెకు అడివితల్లి దండాలు.

scroll.in సౌజన్యంతో


No. of visitors : 1455
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రాతి పలక

ఉద‌య‌మిత్ర‌ | 18.11.2016 11:11:46am

చెట్ల చాటు నుండి, తుప్పల చాటునుండి, బండ చాటు నుండి అత్యంత సుశిక్షితులైన, అత్యంత క్రూరులైన రక్షక భటుల గుంపు వేగంగా, చురుగ్గా, గూడేల వైపు ʹʹవేయి కాళ్ల జెర్రిʹ...
...ఇంకా చదవండి

నది గొంతుక

ఉదయమిత్ర | 03.08.2018 11:37:33am

నూతన మానవుణ్ణి కలగన్నందుకు నాబిడ్డల జూడండని తన అలల చేతులతొ జల్లెడైన శరీరాల్ని ఎత్తిపట్టి భూమినీ ఆకాశాన్నీ ఒక్కటి జేసింది...
...ఇంకా చదవండి

గూడు

ఫెడీజౌడా | 22.09.2018 12:22:17pm

తన చిన్నారిగుండెల వెల్గిన చిరుదీపం లోకమంతా గొప్పవెలుగును ప్రసరించింది.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •