స్వ‌ప్న ర‌హ‌స్యం

| సాహిత్యం | క‌విత్వం

స్వ‌ప్న ర‌హ‌స్యం

- గీతాంజ‌లి | 04.06.2017 02:29:47pm

దృశ్యం స్ప‌ష్టంగా ఉంది
అడుగులు ముందుకే ఉన్నాయి
గ‌మ్యంలో ఉంచాల్సిన ఎర్ర‌గులాబీ
నా తోట‌లో ఎప్పుడూ
సిద్ధంగానే ఉంటుంది

పేగు బంధాల‌లో
విడిపోయిన రెక్క‌ల చ‌ప్పుడు
ఆకాశంలో మేఘ‌సందేశ‌మై విన‌ప‌డుతుంది
తెగిపోయిన చూపులు
క‌ల‌ల్లోకి ముడుచుకుంటాయి

క‌ల‌యిక అంటే
వియోగ‌మే ఇక !
మిత్ర‌మా నీ చివ‌రి శ్వాసను అందుకున్న వాణ్ణి
ర‌క్తంతో నిండిన నీ పాద‌ముద్ర‌ల్లో న‌డ‌వ‌లేనా?

ద‌శాబ్ధాలుగా వినాల‌నుకున్న ఒకే ఒక్క మాట‌
నీ మ‌ర‌ణంతో నిశ్శ‌బ్ధంలోకి జారిపోయినా.... క్ష‌ణ‌కాలం కోస‌మే

నువ్వు నాతో చెప్పాల‌నుకున్న‌వి
రాలిన మాల‌తీ పూలు
భూమితో చేసిన ర‌హ‌స్య సంభాష‌ణంత‌
ప‌రిమ‌ళ‌భ‌రిత‌మైన‌వి !

మ‌ర‌ణం త‌రువాత నువ్వు చేసిన‌
సంభాష‌ణ‌... ఒక నినాదంలా ఉంది

దుఃఖం వ‌స్తే వ‌చ్చింది
హృద‌యం ప‌గిలితే ప‌గిలింది
నీ నుంచి విడిపోవ‌ల్సే ఉంది

నువ్వు... కొద్దిమంది వీరులూ..
పోతూపోతూ
వాళ్ల క‌ల‌లు నా నిద్ర‌లోకి విడిచి వెళ్లారు
నా క‌ళ్లు తెరిచి వెళ్లారు
అవి తెల్ల‌వార‌నీయ‌ని క‌ల‌లు

నిజం
నా కోసం కొన్ని క‌ల‌లు
నా రాత్రిలోకి చేరిపోయాయి
ఇక
నేను రాసే ప్ర‌తి మాటా
పాడే ప్ర‌తి పాటా
వేసే ప్ర‌తి అడుగూ
నువ్వు క‌న్న స్వ‌ప్నంలోకే





No. of visitors : 762
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ర‌హ‌స్య ఒప్పందం

గీతాంజ‌లి | 03.09.2016 02:20:56am

అంతిమంగా... నిన్ను చేరాల‌నే ర‌హ‌స్య ఒప్పందం నీకూ నాకూ మ‌ధ్య‌......
...ఇంకా చదవండి

ఎప్పటిలాగే ... !

గీతాంజ‌లి | 19.10.2016 11:26:40pm

తోటలు.. చెలకలు ... చెరువులు పరిమళాలు- పచ్చదనాలు తుమ్మెద వాలే - పువ్వులు - రంగులు కమ్మని - భూ సుగంధం...
...ఇంకా చదవండి

ప్రపంచాన్ని ప్రేమిస్తున్న మనిషి!!

గీతాంజలి | 20.02.2018 08:53:47am

గత వారపు ములాఖత్ లో ఆమె చేయి తాకిన గోడల్ని తడుముతూ.. ఆమెను పలకరిస్తూంటాడు. బందీ కాక ముందరి ,ఆమె చివరి చెమ్మగిల్లిన చూపు నో......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    21వ శతాబ్దంలో మార్క్స్‌
    అరుణతార ఏప్రిల్ - 2018
    యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం
    గోడ ఒక ఆయుధం
    చెప్పులు కొందాం రండి
    ఎలా వెళ్ల‌ను?
    ʹహెచ్‌సీయూ వీసీ హ‌త్య‌కు ప‌థ‌కంʹ బూట‌కం
    భవిష్యత్తును కాల్చేశారు
    రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది
    కలకత్తా సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ముగ్గురు కవయిత్రులు
    కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ప్రైవేటు వర్సిటీలు
    ప్రజా ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •