బ‌లిపీఠం పైకి దేశీయ పాడి ప‌రిశ్ర‌మ‌

| సాహిత్యం | వ్యాసాలు

బ‌లిపీఠం పైకి దేశీయ పాడి ప‌రిశ్ర‌మ‌

- పి. ప్ర‌సాదు | 07.06.2017 11:52:36am

జూలై 7 నుంచి అమలులోకి రానున్న "వస్తు సేవల చట్టం - 2016 బడా పెట్టుబడిదారీ వర్గాలకు ప్రాణం వంటిది. ఇంత వరకూ తాము ప్రభుత్వాలకు చెల్లించిన పన్నుల వాటాను తగ్గించుకోవడం; ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వాటాను పెంచడం; బ్యాంకింగ్ వ్యవస్థకు ఇంత కాలం గల స్వయం ప్రతిపత్తిని హరించడం; దాన్ని తమ సేవా సంస్థగా మార్చుకోవడం, జి.ఎస్.టి. చట్టం ద్వారా ప్రజల నుంచి పెరగనున్న ప్రభుత్వ రాబడిని రాయితీలుగా అనుభవించడం బడా పెట్టుబడిదారీ, వాణిజ్య వర్గాలకు తక్షణ వ్యూహాత్మక లక్ష్యంగా వుంది. ముఖ్యంగా బూటకపు పారదర్శకత పేరిట ఇంత వరకూ అసలు పన్నుచెల్లించని చిన్న వ్యాపార, వర్తక వర్గాలతోపాటు తక్కువ పన్నులు చెల్లిస్తున్న చిన్న పారిశ్రామిక, వాణిజ్య వర్గాలను వ్యవస్థీకృత "పన్నుల వలʹ (టాక్సింగ్ నెట్)లోకి యీడ్వడానికి ఉ ద్దేశించిందే ʹజి.యస్.టి. చట్టం - 2016 ఒక్క మాటలో చెప్పాలంటే దేశ ప్రజల మీద కుహనా ప్రజా ప్రభుత్వాలు ప్రకటించిన అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాద యుద్ధమిది. ఈ మెగా ఆర్థిక ఉగ్రవాద యుద్ధ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేసే సౌలభ్యం కోసం ప్లానింగ్ కమీషన్ రద్దు, పెద్ద నోట్ల రద్దు అను రెండు మినీ ఆర్థిక యుద్దాలను మోడీ సర్కారుతో బడా పెట్టబడిదారీ, వాణిజ్య వర్గాలు చేయించాయి. ఇప్పడిక అసలు ఆర్థిక యుద్ధం ప్రారంభం కాబోతున్నది. దాని తేదీ (జూలై ఒకటి) సమీపించే కొద్దీ దేశ ప్రజల దృష్టిని మరింత ఎక్కువగా దారి మళ్ళింపజేయాల్సిన ʹరాజకీయ ఆవశ్యకత మోడీ సర్కారు మీద వుంది. అందుకోసం రకరకాల కృత్రిమ భావొద్వేగాలతో దేశ ప్రజలను రెచ్చగొట్టి తాము తలపెట్టిన ఆర్థిక బందిపోటు దోపిడీకి వారిని అడ్డు రానివ్వకుండా నియంత్రించాల్సి వుంది. అలాంటి అనేక అస్త్రాల‌లో ఒక‌ అస్త్రమే ʹఆవుʹ, దాని ఆధారంగా 23.7.2017న మోడీ మంత్రివర్గం "పశువథ"ను నిషేధించింది.

ఇంత వరకూ హిందుత్వ శక్తులు ఒక్క ఆవును మాత్రమే "పవిత్ర జంతువుగా ప్రకటిస్తూ వచ్చాయి. కానీ ఇప్పడు ఆవుతోపాటు ఎద్దు, బర్రె (గేదె), దున్నపోతు, ఒంటెలకు కూడా "పవిత్రతను విస్తరించాయి. ఈ పశువుల కొనుగోళ్ళ అమ్మకాల పట్ల మోడీ మంత్రి వర్గం రూపొందించిన తాజా విధి విధానాల లక్ష్యం ʹపశు వధʹను నిషేధించడమే. అయితే దీని వెనక ప్రకటిత ఉద్దేశ్యం ʹజంతు ప్రేమ" కాదు. మేకలు, గొర్రెలు, కోళ్ళ తదితర జంతువుల మీద నిషేధం లేదు. వాటి నెత్తురు ఏరులై పారించే "జంతు బలులు హిందూ దేవాలయాల ఎదుట నిత్యం జరుగుతున్నవే. వాటి జోలికి మోడీ సర్కారు వెళ్ళలేదు. మూగజీవాల పట్ల ప్రేమ వుంటే, ఈ తరహా జంతు బలులను కూడా నిషేధించాల్సి వస్తుంది. హిందుత్వ శక్తులు "పవిత్రమైనవి"గా భావించే జంతువుల వ‌ధ‌ను నిషేధించాలంటే ʹఆవు వధʹను మాత్రమే నిషేధించాలి. కానీ బర్రె, ఎద్దు, దున్న పోతులకు కూడా నిషేధాన్ని విస్తరించడం గమనార్షం!! దీని ఆంతర్యమేమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి.

ఒకే గుండుకు రెండు పిట్టలను (వీలుంటే రెండు కంటే మించి కూడా) పడగొట్టడం నేటి రాజకీయాలలో సర్వసాధారణ మైనదే. జూలై ఒకటి నుంచి సాగించనున్న వ్యవస్థీకృత ఆర్థిక ఉగ్రవాద యుద్ధం వైపు చూడకుండా దేశ ప్రజల కళ్ళ కప్పడం తోపాటు పాడి పరిశ్రమను బలితీసుకోవడం కూడా మోడీ సర్కారు ʹకార్పోరేట్ వ్యూహంలో భాగమే. ఈ రెండో పిట్టను (దేశీయ పాడి పరిశ్రమ) పడగొట్టడం కూడా మోడీ సర్కారుకు అవసరమైనదే. యూరప్, అమెరికా దేశాలు తమ పాలను ఓడల ద్వారా భారత దేశానికి ఎగుమతి చేయాలని చిరకాలంగా ప్రయత్నిస్తున్నాయి. దేశీయ పాల ఉత్పత్తులలో భారత దేశానికి ప్రపంచంలోనే పెద్ద గుర్తింపు వుంది. దానివల్ల అమెరికా, యూరప్ దేశాల పాల ఉత్పత్తుల దిగుమతులకి బ్రేకు పడింది. తాజా ఉత్తర్వు ద్వారా ఈ తరహా బ్రేకును ఎత్తివేయడం జరిగింది. అందుకు కేవలం ʹఆవుʹను నిషేధిస్తే సరిపోదు. భారత దేశ గ్రామీణ పాడి పరిశ్రమలో ఆవు కంటే బర్రె (గేదె)కు అధిక ప్రాధాన్యత వుంది. ఇంత వరకూ హిందుత్వ శక్తుల చేత "పవిత్ర జంతువ"గా చెలామణి అవుతున్న ఒక్కʹఆవుʹకు మాత్రమే పశువధని నిషేధాన్ని విస్తరించితే, బర్రె పాలు యధాతధంగా వర్ధిల్లుతాయి. బర్రె పాలను నియంత్రించా లంటే, బర్రె జాతి వధను నిషేధించాలి. అందుకే హిందుత్వ శక్తులకి ఇంత వరకూ అపవిత్రమైన బర్రె జాతి కూడా నేడు హఠాత్తుగా పవిత్ర జంతు జాతులలో చేరింది.

బౌద్ధం ఉనికిలోకి రాకముందు ఆర్య బ్రాహ్మణ వర్గాలు యజ్ఞాల పేరిట యధేచ్చగా పశువధను చేపట్టడం, గోమాంస భక్షణ చేయడం తెలిసిందే. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఇనుమును కనుగొన్న తర్వాత కర్రు ఆధారిత నాగలి ఉనికిలోకి వచ్చింది. భూసాగుకు నాగలితోపాటు దుక్కిటెడ్లు అవసరమయ్యాయి. లేగ దూడలను సైతం మాంసం కోసం ఆర్య బ్రాహ్మణ వర్గాలు వధించడం వల్ల ఆనాడు దుక్కిటెడ్లకి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అట్టి పరిస్థితులలో వశువధకు కారణమైన యజ్ఞ యాగాదులపై తిరుగుబాటుకు క్రీపూ అరవ శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ప్రాతినిధ్యం వహించడం తెలిసిందే. ఆ తర్వాత "రాజమతాలుగా బౌద్ధ, జైనమతాలు వర్ధిల్లాయి. సుమారు మూడు శతాబ్దాల వైదికేతర పాలన తర్వాత క్రీపూ మూడో శతాబ్దంలో మౌర్య చక్రవర్తి బృహద్రదుణ్ణి పుష్య మిత్రుడు అను బ్రాహ్మణ సేనాని కుట్ర పూరితంగా హత్య చేశాడు. ఆ తర్వాత పునరుద్ధరించబడ్డ వైదిక పాలకులు (నేటి హుందుత్వ పాలకులకు ఆదర్శం) తమ పూర్వ గోమాంస భక్షణ ప్రవృత్తికి స్వస్తి చెబుతున్నట్లు నాటకీయంగా ప్రకటించారు. వైశ్యులతోపాటు కొన్ని శూద్ర వర్ణాలు అప్పటికే వ్యవసాయాన్ని ఒక జీవన వనరుగా అభివృద్ధి చేయడంతో దుక్కిటెడ్లను మాంసం కోసం హరించే సత్తా ఆనాటికి ఆర్య బ్రాహ్మణ వర్గాలకు లేదు. అట్టి గత్యంతరం లేని ప్రతికూల పరిస్థితులే బ్రాహ్మణ వర్గాల చేత "మాంస భక్షణ"కు స్వస్తి పలికించాయి. ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన వైదిక సంబంధిత గుప్తయుగంʹలో ʹఆవుʹ పవిత్రమైన జంతువుగా చెలామణీలోకి వచ్చింది. అయితే ఆవతోపాటు "ఎద్దు కూడా తదనంతర కాలంలో పవిత్రమైన జంతువుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యవసాయ దశ విస్తరణకు ముందే ఆదివాసీ ప్రాంత తిరుగుబాటుదారుడైన శంకరుడ్డి (ఈశ్వరుడు) ఆర్యలు వశపరుచుకొని త్రిమూర్తుల జాబితాలో చేర్చారు. ఆదివాసులపై పెత్తనం కోసం శంకరుడి తోపాటు ఆయన నంది వాహనానికి (ఎద్దు) కూడా ఆర్యులు సముచిత స్థానం కల్పించారు. అయితే ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన వ్యవసాయంలో ʹఎద్దుకి ప్రాధాన్యత పెరిగింది. అందుకే "నందిని కూడా వైదికమతం ఆరాధనీయంగా మార్చింది. అలాంటి "నంది వధను నిషేధించకుండా, బర్రెవధను నిషేధించడం హిందుత్వ పాలకులకు ఇబ్బందికరమైనదే! అందుకే కాబోలు పశు వధ నిషేధిత "పవిత్ర జంతువుల జాబితాలో ఆవుతోపాటు ఎద్దును కూడా మోడీ సర్కారు చేర్చింది.

మరి దున్నపోతును ఎందుకు ఈ జాబితాలో చేర్చారన్న అనుమానం తలెత్తిడం సహాజమైనదే. నిజానికి వైదిక పాలకులకు రెండు వేల సంuరాలకు పైగా ఘన సేవచేసిన చరిత్ర దున్నపోతుకు వుంది. ఇహ లోకంలో అస్పృశ్యులు, శూద్ర వర్గాల అణిచివేత కోసం మనుస్మృతి అనే రాజ్యాంగం వుండేది. భూలోకంలో మత ధిక్కార పాపాలు చేసే అట్టడుగు వర్గాల ప్రజల అణిచివేత కోసం పరలోకంలో కూడా ఆర్య వర్గాలు ఒక హెూమ్ మంత్రిని నియమించుకున్నాయి. అతడే యమధర్మరాజు. ఆయన ప్రయాణ వాహనమే దున్నపోతు. నిజానికి శూద్రవర్గాల వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి వుపయోగపడ్డ "ఎద్దు కంటే తమ రాజ్యపాలన రక్షణకి వుపయోగపడ్డ యముడి వాహనమే (దున్నపోతు) ఆర్య బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ లాభం చేసింది. అందుకే ʹదున్నపోతు వధను నిషేధించకుండా "ఎద్దు వధను నిషేధించడం కూడా హిందుత్వ పాలకులకు రుచించదు. అందుకే కాబోలు, నరేంద్ర మోడీ సర్కారు ఈ జాబితాలో "దున్నపోతును కూడా చేర్చి వుంటుంది.

అసలు వైదిక బ్రాహ్మణ వర్గాల చరిత్రలో బర్రెకు ఏనాడూ సముచిత స్థానం లభించలేదు. ఏ ఒక్క కాలంలో కూడా బర్రెకు "పవిత్రతను చేకూర్చినట్లు ఆర్య బ్రాహ్మణ వర్గాల చరిత్రలో కనిపించడం లేదు. కనీసం మేక,గొర్రెలకిచ్చిన స్థానం కూడా బర్రెలకి లేదు. నిజానికి మేకలు, గొర్రెలు, కోళ్ళ వధపై లేని నిషేధాన్ని బర్రెల వధపై విధించాల్సిన అవసరం నేటి హిందుత్వ పాలకులకు లేనే లేదు. సమాజంలో హీనమైన జంతువుగా పంది అసహ్యంచుకో బడుతుంది. అలాంటి పందికి కూడా వరహావతారం అను పట్టం కట్టి దశావతారాలలో చేర్చారు. వైదిక మతం ప్రకారం ఒక పవిత్రావతార రూపిగా పందికిచ్చిన సముచిత స్థానం కూడా బర్రెకు లేదు. అట్టి "పంది వధను నిషేధించకుండా బర్రె వధను నిషేధించడానికి వైదిక ధర్మం కారణం కాదు. అందుకు కార్పోరేటు ధన ధర్మమే వాస్తవ కారణం. భారతీయ పాడి పరిశ్రమకు నేటికీ బర్రె ప్రధాన భూమికగా వుంది. బర్రె జాతి పీడను వదిలించుకోనంత కాలం బడా విదేశీ పాల వాణిజ్య వర్గాల లక్ష్యం నెరవేరదు. ఈ కారణంగానే బర్రెను కూడా పశువధ నిషేధిత జాబితాలో చేర్చింది. తాము అపవిత్రంగా భావించే బర్రె వధను నిషేధించినంది, మహిశంలను వధించడం మూఢ హిందుత్వ శక్తులకు రూచించదు. అందుకే ఒకేసారి అన్నింటి వధను నిషేధించి వుంటుంది.

వైదిక సమాజంలో ఒంటెకు కూడా ఎలాంటి సముచిత స్థానం లేదు.కానీ దాని వధను కూడా మోడీ సర్కారు నిషేధించింది. ఒంటెకూ, అరబ్బలకూ చారిత్రకంగా అత్యంత అనుబంధం వుంది. ఒంటె మాంసాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా అరబ్బులు ఆరగిస్తారు. ఇండియాతో సహా అనేక దేశాలకు అరబ్బల ద్వారానే తొలుత ఇస్లామ్ మతం వ్యాపించింది. సహజంగానే ఇతర దేశాల ఇస్లామ్ మతస్తులపై అరబ్బల వస్త్రధారణ, ఆహారపు అలవాట్ల ప్రభావం పడింది. రాజస్థాన్లో ఒంటెలు నేటికీ గణనీయంగా వున్నాయి. మన ప్రాంతంలో మేక, గొర్రె, కోడి, పంది, ఆవు, బర్రె జాతుల మాంసాలు సహజ అలవాటుగా గల ప్రజలకు అరుదుగా జింక లేదా కుందేలు మాంసం లభించిందనుకుందాం. పరమానందం పొందుతారు. అలాగే ముస్లిమ్స్కు ఒంటె మాంసం పట్ల ఎక్కువ మక్కువ వుంటుంది. ముఖ్యంగా ముస్లిమ్ సమాజంలోని సంపన్నవర్గాలు ఒంటె మాంసం పట్ల ఎక్కువ ప్రీతిని ప్రదర్శిస్తాయి. వీరి నైతిక స్థిర్యాన్ని దెబ్బతీసే దురుద్దేశ్యంతో ఒంటె వధను కూడా మోడీ సర్కారు నిషేధించి వుండొచ్చు.

ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం. బర్రె జాతి వధని నిషేధించడమంటే, దానిని ఎక్కువ కాలం బ్రతికించడమవుతుంది. మోడీ సర్కారు బర్రె జాతి మనుగడకి రక్షణ కల్పిస్తున్నపుడు బర్రె పాల పరిశ్రమ మనుగడ ఎందుకు దెబ్బ తింటుందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. ప్రగతిశీల, ప్రజా తంత్ర ఆలోచనాపరులకి సైతం ప్రాథమికంగా ఈ సందేహం రావచ్చు అర్థశాస్త్ర నియమాలకూ, ఉపరితల సామాజిక భావ జాలానికీ మధ్య చాలా సార్లు తీవ్ర వైరుధ్యం వుంటుంది. ఇక్కడ సామాజిక, సాంప్రదాయ నమ్మకాలు చెల్లవు. అర్థశాస్త్ర నియమాలే చెల్లుతాయి. బొగ్గు ఉత్పత్తులు ఎంత ఎక్కువ పెరిగితే ప్రజలకు అంతే ఎక్కువగా బొగ్గు సరఫరా జరుగుతుందని సామాజిక నమ్మకాలు సూచిస్తాయి. అయితే సోషలిస్టు సమాజంలో ఈ నమ్మకం వాస్తవ రూపం దాలుస్తుంది. కానీ పెట్టబడిదారీ వ్యవస్థలో తద్భిన్నమైన స్థితి వుంటుంది. బొగ్గు ఉత్పత్తులు పెరిగితే బొగ్గు గనులను యాజమాన్యాలు మూసివేస్తాయి. కార్మికులు ఉ ద్యోగాలను కోల్పోతారు. జీతాలు స్థంభిస్తాయి. కొనుగోలు శక్తి నశిస్తుంది. తమ ఇంట్లో బొగ్గుల కుంపటికి అత్యవసరమైన బొగ్గును కొనుగోలు చేయడం అట్టి నిరుద్యోగ కార్మికులకు సాధ్యం కాదు. బొగ్గు ఉత్పత్తి పెరిగిన కొద్దీ బొగ్గు వినియోగం పెరుగుతుందనేది సామాజిక నమ్మకం. కానీ బొగ్గు ఉత్పత్తి పెరిగే కొద్దీ బొగ్గు వినియోగం తగ్గిపోతుందనేది అర్థశాస్త్ర నియమం. ఈ వెలుగులో మోడీ సర్కారు తాజా పశువధ నిషేధపు ఉత్తర్వు ఫలితాలను పరిశీలించుదాం.

ప్రతి గేదెకు తన జీవిత కాలంలో మూడు దశలుంటాయి. అది పట్టిన దగ్గర నుండి పాడి గేదెగా మారేంత వరకూ మొదటి దశ అంటారు. పాడి గేదేగా జీవించినంత కాలం రెండో దశగా భావిస్తాం. పునరుత్పత్తి శక్తి (దూడలను కనే శక్తిని కోల్పోయిన తర్వాత మరణించేంత వరకూ మూడో దశగా భావిస్తాం. మొదటి దశలో పెంచడానికి కేవలం పెట్టబడి పెట్టాలి. అప్పడు దాని నుండి ఏ లాభం రాదు. రెండో దశలో తవుడు, దాణాలకి పెట్టబడి పెడుతూనే పాల ఉత్పత్తులపై అంతకంటే ఎక్కువ రాబడి లభిస్తుంది. మూడో దశలో దాన్ని ఇంట్లో పెంచుకోవాలంటే అట్టి ముసలి గేదెల కోసం ఏ లాభం ఆశించకుండా కేవలం పెట్టబడి పెట్టాలి. రెండో దశలో సంపాధించిన సామ్మ మొత్తాన్ని మూడో దశలో తగలెయ్యాలి. అందుకే అది సంతానోత్పత్తి (పునరుత్పత్తి) సామర్థ్యాన్ని కోల్పోయిన వెంటనే మాంసం కోసం అమ్మకం చేయడం సాంప్రదాయంగా వస్తున్నది. దాని వల్ల రెండు లాభాలుంటాయి. మొదటిది, దాని మేత కోసం ఖర్చు వుండదు. రెండవది, దాని మాంసం కోసం సంతలో అమ్మడం వల్ల ఎంతోకొంత రాబడి వుంటుంది. దాని స్థానంలో కొత్త పాడి గేదెను కొనాల్సి వస్తుంది. పాత టూవీలర్ ను ఇరవై వేలకు అమ్మకొని, మరో ముప్పైవేలు డబ్బుతో కొత్త మోటారు సైకిలును కొనుక్కునే పద్ధతి తెల్సిందే. మామిడి తోటలోని ఏఏ మామిడి చెట్లు ఫలసాయాన్ని యివ్వని దశకు చేరతాయో, వాటిని "కర్ర వ్యాపారులకి తోట యజమాని అమ్మివేస్తాడు. వాటికి కొంత డబ్బు వస్తుంది. తిరిగి కొత్త మామిడి మొక్కలను వాటి స్థానంలో నాటతారు. ఇప్పుడు మోడీ సర్కారు మామిడి, కొబ్బరి, సపోట, జామ తోటల యజమానులకి ఒక ఉత్తర్వులిచ్చిందనుకుందాం. పండ్ల దిగుబడి నశించిన తర్వాత కూడా వాటంతట అవే చెట్లు కృశించి, నశించి పోయేంత వరకూ నరకడానికి వీలులేదని జీవోయిస్తే ఏం జరుగుతుంది? పండ్ల తోటల యజమానులకి లాభాలు రాక పోగా నష్టాలు మూటగట్టుకోవాల్సిందే. గేదెల యజమానులు కూడా మూడో దశలో తమ గేదెలను పశు వధ శాలలకి అమ్మకుంటనే పాల వ్యాపారం వర్ధిల్లుతుంది. అర్థశాస్త్రం బోధిస్తున్న ఈ నీతి విదేశీ పాల వాణిజ్య సంస్థలకు బాగా తెలుసు. వారు దేశీయ పాడి పరిశ్రమ మనుగడకి వుపయోగపడుతున్న ఈ ఆర్థిక నరాలపై మోడీ సర్కారుతో దాడి చేయిస్తున్నారు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిన సందర్భమిది.

ఇక పోతే జంతు హింస అంశంలోకి వద్దాం. ఇటీవల జంతు ప్రేమ ముదిరి ఇంటింటా పెంపుడు కుక్కలూ, పిల్లలూ, పక్షులూ, పావురాలూ వర్ధిల్లుతుండటం తెలిసిందే. వాటి కోసం అత్యధిక ఖర్చు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా సంపన్న ఎగువ మధ్య తరగతి వర్గాలు ప్రదర్శిస్తున్న అమితాసక్తి తెలిసిందే. తమ ఎదుటనున్న శ్రామిక వృత్తుల, నిమ్నవర్గాల మనుషుల పట్ల లేని ప్రేమను జంతువుల పట్ల ప్రదర్శిస్తున్న నూతన కుహనా సంస్కృతి కూడా తెల్సిందే. ఈ తరహా జంతు ప్రేమికులకు మోడీ సర్కారు జంతు వధ నిషేధం రుచిస్తుంది. (వీరు ఒక వైపు కుక్కపిల్లి మీద ఈగవాలనివ్వని జంతు ప్రేమను ప్రదర్శిస్తూ మరోవైపు మేక,గొర్రె, కోడి మాంసాల భక్షణ కోసం అర్రులు చాస్తారనుకొండి) ఇదంతా ఒక హిపోక్రసీ మాత్రమే. ఈ హిపోక్రసీ ఆధారిత ఓటు బ్యాంకును పొందండం కూడా మోడీ సర్కారుకు ఒక రాజకీయ లక్ష్యమే! ఇది ఆయన సర్కారు గుండుకు పడనున్న మూడో పిట్ట!

కొన్ని వాస్తవాలు చేదుగా వుంటాయి. అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పి తీరాల్సిందే. నాగలి ఆధారిత వ్యవసాయం రైతుకే కాదు, ఎద్దుకి అంతకంటే ఎక్కువ హింసాత్మకమైనది. రాజ్యాల చేతుల్లో రైతు హింసించబడితే, రైతు చేతిలో ఎద్దు హింసించబడింది. ఎద్దుతోపాటు దున్న పోతు కూడా హింసించ బడింది. కొయ్య నాగలి స్థానంలో ట్రాక్టరు ఉనికిలోకి వచ్చేంత వరకూ దుక్కిటెడ్లు అనుభవించిన హింస వర్ణనాతీతమైనది. ఎద్దు ముడ్డి మూపురం, మెడల మీద వాతలు తేలిన దృశ్యాలు నేటికీ గుర్తుకొస్తాయి. పాతికేళ్ళ క్రితం వరకూ దుక్మిటెడ్లు అనుభవించిన దు:ఖం గుర్తుకొస్తే ఎవరికైనా ఏడుపాస్తుంది. కోడికూయక ముందు వాటి మెడల మీద కాడి వేస్తే మిట్ట మధ్యాహ్నం వరకూ రోజుకు ఒక్కొక్క ఎద్దు ముడ్డి మీద రైతు కనీసం వందసార్లు "ముల్ల కర్రతో పోడిచేవాడు. రక్తం కారీ, కారీ వాటి శరీరం అట్టలు తేలిన విషాధ దృశ్యాలు తెల్సిందే. వాటికి జ్వరం వచ్చినా, కడుప నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా వినే మనస్తత్వం రైతుకు వుండేది కాదు. ఆనాడు వాటి పట్ల జంతు ప్రేమ ప్రదర్శించిన వాళ్ళ శూన్యం. కానీ రక్తం కారిన దుక్కిటెడ్ల శరీరాలను పసుపు, కుంకుమ రంగుల కుచ్చులు, టంగువార్లతో "ఘనంగా రైతులు అలంకరించడం తెల్సిందే. ఇది చావబోతున్న పందెం కోడిపుంజలను స్నానం చేయించి, రంగు రంగుల అలంకరణలతో ముస్తాబు చేయడం వంటిదే. కొన్నిసార్లు సరిగ్గా నాగలిని లాగడం లేదనో, బండికి నాలుగు కాళ్ళ స్వారీ చేయడం లేదనో ఎద్దు తోకలను రైతుల నోటితో కర్కశత్వంతో రక్తం కారే వరకూ కొరికిన సందర్భాలు కూడా తెలియనిది కాదు. నిజానికి ట్రాక్టరు ఉనికిలోకి వచ్చాకే వాటి పని భారం చాలా వరకు తగ్గిపోయింది.

మానవజాతికి అవసరమైన ధన, ధాన్యాదుల ఉత్పత్తులకి వేల సంవ‌త్స‌రాలుగా దుక్మిటెడు సహకరించాయి. అలాంటి ఉపయోగప జంతువుల సాటి మనిషి కర్కశంగానే ప్రవర్తించాడు. కానీ నేటి ఆధునిక నవ నాగరీకుడైన మనిషి తద్భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. న పెంవుడు జంతువులకు చిన్న నొప్పి తగిలినా వాటిని హటాహుటిన వ్రత్యేక వాహనంలో ఆనువత్రికి తీసుకెళ్తుండటం తెల్సిందే. వాటిని పడక గదుల్లో ఎసీ రూముల్లో నెత్తికెక్కించుకోవడం కూడా తెల్సిందే. అందుకే "జంతు ప్రేమకు కూడా పాక్షికత వుంటుంది. ఈ హిపోక్రసీ పట్ల సరైన అవగాహన వండాల్సి వుంది. మానవుడికి దుక్కిడున్ని పెట్టిన పాతకాలప దుక్కిటెద్ద కంటే మనిషికి కేవలం మాంసాహారంగా వుపయోగపడే ఆధునిక ఎద్దు చాలా మెరుగైన వసతి సౌకర్యాలను కలిగి వుంటుంది. వాటికి మెడల మీద కాడి మోసే పని తప్పతుంది. ముల్ల కర్రతో నెత్తుర్లు కారీ విధంగా పాడిపించుకునే హింస తపుతుంది. చర్సాకోలలతో వీపు తాటలు లేచేంత వరకు కొట్టించుకునే పని తప్పతుంది. మాంసానికి పెంచే వాణిజ్య సంస్థలు పాట్టనిండా వాటిని మేపుతాయి. వైద్యచికిత్సలు సకాలంలో చేయించుతాయి. తమ మాంస వ్యాపార లాభాల కోసం వారు ఎద్దు, దున్న జాతులను అపరూపంగా పెంచుతారు. ఎక్కువ మాంసం దిగుబడి కావాలంటే, వాటికి మంచి క్వాలిటీ గల దాణా పెట్టాలి. చివరలో అవి పశువధశాలలకు చేరతాయి. చిత్ర హింసలు లేకుండా కేవలం అర నిమిషంలో పశువధ యంత్రాల కత్తిడ్లేడుకు వాటి మెడ కాయలు తెగుతాయి. దుక్కిటెడ్లు దున్నలు ఏండ్ల తరబడి చిత్రహింసలు అనుభవిస్తాయి. చివరలో వాటి ప్రాణం తీయడానికి నాలుకత్తితో ప్రాణం తీయడానికి నాలుగైదు నిమిషాలు పడుతుంది. కానీ మాంసం కోసం పెంచే దుకిటెడ్లు దున్నలు తద్భిన్నంగా అవి బ్రతికినంత కాలం సంతోషంగా జీవిస్తాయి. ఆఖరిలో అరనిమిషంలో మరణిస్తాయి. ఈ వెలుగులో ʹజంతు హింస" లేదా ʹజంతు ప్రేమ" లను నిర్వహించాల్సిన అవసరం వుంది.

కొయ్య నాగలి ప్రధాన వ్యవసాయ సాధనంగా ఉనికిలోవన్నంత కాలం రైతులను దుక్కిటెడ్ల ఆరాధకులుగా, దళితులను (ముఖ్యంగా చర్మకారులను) దుక్కిటెడ్ల హంతకులుగా భావించే ఒక ఆలోచనా ధోరణి సమాజంలో వుంది. ఇది ముఖ్యంగా శిష్ట వర్గ భావనగా వండేది. కానీ యిది వాస్తవ విరుద్దమైనది. పశువులకు ఆలోచించే మెదళ్ళ లేవు. తమ ప్రతిస్పందనలను నోటితో వ్యక్తీకరించే వీలు లేదు. ఒక వేళ అవి వుండి వుంటే, వాటి దృష్టిలో రైతులు పీడకులుగా కనిపిస్తారు. కానీ గోమాంసం తినే మాదిగ, మాల, ముస్లిమ్, ఆదివాసీ ప్రజల పట్ల గోజాతికి అలాంటి వ్యతిరేక ప్రతిస్పందనలుండవు. ఎందుకంటే, నాలుగైదు నిమిషాలలో వాళ్లు కత్తితో వాటి మెడలను నరికేస్తారు. అక్కడ దీర్ఘకాలిక చిత్రహింస ప్రక్రియకి అవకాశమే లేదు. పై దళిత ప్రజల పట్ల వ్యతిరేక స్పందన కలిగే లోపు ప్రాణాలు విడుస్తాయి. అయితే రైతాంగం పట్ల వ్యతిరేక దృక్కోణంతో ఈ విషయాన్ని చెప్పడం లేదు. తదనంతర మానవ జాతి అభివృద్ధి పథంలో దుక్మిటెడ్లతో సాగు చేయడం ఆ కాలంలో రైతాంగ విధిగా వుండేది. చరిత్ర గమనంలో దుక్కిటెద్ద ఒక మైలురాయి పాత్రను పోషించింది. సామాజిక పరిణామక్రమంలో తనకు తెలియకుండానే దుక్మిటెడ్డ ఒక పురోగమన పాత్రను పోషించింది. దుక్కిటెద్ద చేత అలాంటి పాత్రను పోషించే విధంగా ఆనాటి రైతు తన చారిత్రిక కర్తవ్యాన్ని నిర్వహించాడు. వ్యక్తిగతంగా రైతులను హింసావాదులుగా చూడటం చారిత్రికంగా సరైనది కాదు. అయితే పశుమాంస భక్షకులుగా ఇంత కాలం శిష్ట సమాజం చేత అవమానించబడ్డ దళిత ప్రజలు మాత్రం సాపేక్షికంగా పశు జాతి పట్ల సానుకూలురన్న కరోర సత్యాన్ని గుర్తించాలి. మనుస్మృతి ఆధారిత సమాజ నమ్మకాలు అత్యంత వక్రీకరణతో కూడుకున్నవి. ఈ చారిత్రిక వాస్తవ పరిజ్ఞానాన్ని పొందడానికి తగు సందర్భమిది.

పశువధపై నిషేధం వల్ల పునరుత్పత్తి (సంతానోత్పత్తి) సామర్థ్యాన్ని కోల్పోయిన ఆవు. బర్రె జాతులను రైతులు పెంచడానికి సిద్ధపడరు. (అసలు పాడి వ్యాపారం నుంచే వైదొలుగుతారను కొండి) గాన ముసలి వవలు, గేదెలు ఊర్ల మీద పడతాయి. పంట పాలాలలను మేస్తాయి. మోడీ ప్రభుత్వ రాజనీతి ప్రకారం వాటిని ఎవరూ చంపకూడదు. పంట భూముల మీద నేటి కోతులతోపాటు మున్ముందు ముసలి పశువుల గుంపలు కూడా దాడికి దిగుతాయి. వాటి వల్ల మాంసం, చర్మాలు, ఎముకల వ్యాపార లాభాలు రాక పోగా, పంట పాలాలను నష్టపరుస్తాయి. కానీ విదేశీ పాల ఉత్పత్తులు మాత్రం మున్ముందు మన గ్రామ సీమలతో సహా సమాజాన్ని ముంచెత్తుతాయి.

మొన్న శ్రీరాముడు ద్వారా హిందుత్వ శక్తులు అధికారంలోకి వచ్చాయి. నిన్న ఉమ్మడి పౌరస్మృతి, కాశ్మీరు వంటి బూచితో తమ అధికారాన్ని సుస్థిరపరచుకున్నాయి. నేడు గోజాతితో సమాజాన్ని ఫాసిజం వైపు నడపించ జూస్తున్నాయి. సామాన్య ప్రజలకు చిటారు కొమ్మల మీద మిఠాయిని చూపించి చెట్టెక్కించి, చివరకు చెట్టపై నుంచి క్రిందికి పడవేయించడం ఫాసిస్టు తాత్విక సిద్ధాంత లక్షణమే నిజానికి గోవధ నిషేధంలో గోసంతతి పట్ల ప్రేమ లేదు. మోడీ సర్కారు లక్ష్యం దేశీయ పాడి పరిశ్రమను బలిపీఠం ఎక్కించడమే. తస్మాత్ జాగ్రత్త!

(ర‌చ‌యిత ఇఫ్టూ జాతీయ కార్య‌ద‌ర్శి)

No. of visitors : 1310
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మహారాష్ట్ర రైతు విజయం – ఫాసిస్ట్ బాటలో స్పీడ్ బ్రేకర్

పి. ప్రసాదు | 18.06.2017 11:27:48am

రైతాంగంతో సహా నేడు ముందుకొస్తున్న ప్రజా పోరాటాలని పక్క దారి పట్టించేందుకు పధకం ప్రకారం సరిహద్దుల్లో "యుద్ధ సృష్టి" జరగవచ్చు. హఠాత్తుగా "ఉగ్రవాద భూతం" సృష్టి...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •