తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

- డేవిడ్‌ | 07.06.2017 12:07:59pm

ఆకాశంలో సగం మీరు / అనంత కోటి నక్షత్రాల్లో సగం మీరు, సగం మేము/ మనిద్దరం కలిసి ఉద్యమిస్తే ʹʹఉప్పెనʹʹ/మనిద్దరం కలిసి విప్లవిస్తే ʹʹవిజయంʹʹ అని విప్లవ కవి శివసాగర్‌ రాశారు. దీనికి సరిగ్గా సరిపోతుంది ప్యారిస్‌ కమ్యూన్‌. ʹస్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వాలʹ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గడ్డపై స్త్రీ పురుషులంతా ఏకమై, కమ్యూనిస్టు ప్రభుత్వాలకు తొలి నమూనాను అందించింది ʹప్యారిస్‌ కమ్యూన్‌. బూర్జువా వర్గాన్ని కూలదోసీ, కార్మిక వర్గం ఏర్పాటు చేసిన ప్రభుత్వం 72రోజులే మనగలిగినా ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన చరిత్రను లిఖించింది. ఈ మే 28నాటికి ʹప్యారిస్‌ కమ్యూన్‌ʹ పతనమై 147 ఏండ్లు కడుస్తున్నా ఆ జ్ఞాపకాలు పారిస్‌ ప్రజల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి...!!

దశాబ్దాలుగా రాచరిక పాలనలో నిత్యం యుద్ధాల మూలంగా జీవితాలను దుర్భరంగా నెట్టుకొస్తున్న పారీస్‌ ప్రజానీకం తిరుగుబాటు చేసి మూడవ నెపోలియన్‌ సామ్రాజ్యాన్ని 1870 సెప్టెంబర్‌లో నేలమట్టం చేశారు. కార్మీక వర్గం చొరవతో ఆ స్థానంలో ఫ్రెంచి రిపబ్లిక్‌ ఏర్పాటు చేసి అధికారాన్ని ʹలూయి అడాల్ప్‌ థేర్స్‌ʹకు అప్పగించినప్పటికీ అతని నాయకత్వంలో ఆధికారాన్ని చెలాయిస్తున్న పెట్టుబడిదారులు దాని పతనానికి గోతులు తొవ్వారు. ధేర్స్‌ నాయకత్వాన ఏర్పడ్డ ప్రభుత్వం కార్మీకులకు అండగా ఉండకపోగా వ్యతిరేక చర్యలకు పాల్పడింది.అదే కాలంలో ప్రష్యన్‌ సైన్యం పారిస్‌ను చుట్టుముట్టడంతో ప్రతిఘటించని థేర్స్‌ 1871 జనవరి 29న తన 4 లక్షల మంది సైన్యంలో రెండు లక్షల మంది ఉన్న జర్మన్‌ సైన్యం ముందు లొంగిపోయాడు. దీంతో కార్మిక వర్గం థేర్స్‌ లోంగుబాటును ప్రతిఘటించి 1871 మార్చి 18న నేషనల్‌ గార్డ్‌ నాయకత్వంలో పారిస్‌ను తిరిగి హస్తగతం చేసుకొని కార్మికవర్గ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. విధిలేని పరిస్థితుల్లో థేర్స్‌ ప్రభుత్వం వర్సైల్స్‌ పారిపోయింది.

అట్టడుగు వర్గాలకు చెందిన శ్రామీకులతో ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వం 1871 మార్చి 18 నుంచి మే28 వరకు కేవలం72 రోజులు మాత్రమే మనుగడ సాగించినప్పటికీ అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రయోగాలను చేపట్టింది. రాచరికాన్ని రద్దు చేసింది. మతపరమైన పూజలు రద్దు, చక్రవర్తితో కుమ్మక్కైన మతాధిపతులను అరెస్టు చేసింది. చర్చి ఆస్తులను జాతీయికరణ చేశారు. లైసెన్సు పొందిన వ్యభిచార గృహాలను రద్దుచేయడం. మరణశిక్ష రద్దు. ఇంటి అద్దెలను రద్దుచేయడంతోపాటు అద్దెకున్న గృహాలను శాశ్వతంగా అందులో నివాసం ఉన్నవారికి కట్టబెట్టారు. ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిన ఇంటిన పత్రాలను వెనక్కి తిరిగిచ్చారు. అందరికి పని కల్పించడం, కమ్యూన్‌లో సగటు కార్మికుడికి ఇచ్చే జీతంతో సమానంగానే అందరి కూడా అదే వేతనం తీసుకోవాలని నిర్ణయించారు. సైన్యాన్ని రద్దు చేయడం, చివరకు ఎన్నికైన ప్రభుత్వ ప్రతినిధులు తప్పుచేస్తే, ప్రజావ్యతిరేకంగా వ్యవహరిస్తే వెనక్కి పిలిచే (రీకాల్‌) చట్టాన్ని కూడా చేసి సాహసోపేతమైన నిరయాలు తీసుకుంది.

అయితే పలాయనం చిత్తగించిన థేర్స్‌ ప్రభుత్వం కార్మికులు అధికారాన్ని చెలాయించడం సహించలేక పారిస్‌సై దాడి పాల్పడింది. తుపాకుల మోతతో నగరం మేల్కొన్నది. పారిస్‌ చుట్టూ బారీకేడ్లు నిర్మించబడ్డాయి. నేషనల్‌ గార్డ్స్‌ పారిస్‌ను రక్షించేందుకు వీరోచింగా పోరాడుతుంది. పురుషులకు అండగా మహిళలు నిలిచారు. కమ్యూన్‌ని బలపరుస్తేనే తమకూ, తమ వారికి రక్షణ అని గుర్తించిన మహిళలు ఎలిజబేత్‌ డిమిట్రియస్‌, నతాలీ లామేల్‌ల నాయకత్వలో ఫ్రెంచి ఇంట్రర్నేషనల్‌ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యుద్ధం చేస్తున్న పురుషులకు మద్దతుగా బారికేడ్సులోనూ, యుద్ధరంగంలోనే, అంబులెన్సు స్టేషన్‌లోనూ, వంటశాలల్లోనూ పనిచేయాలని లక్ష్యాలుగా పెట్టుకున్నారు. చురుకైన మహిళలతో పారిస్‌ రక్షక మహిళా సంఘం (ఉమెన్స్‌ యూనియన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ పారిస్‌)ను ఏర్పాటు చేశారు. 24 గంటలు ఏక్షణంలోనై మహిళలను రిక్రూట్‌ చేసుకునేందుకు ఈ సంఘం తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బుతో పోరాటంలో వున్న వారికి పెట్రోలియం, ఆయుధాలు కొనుగోలు వంటివాటిపై వెచ్చించారు. దాదాపు 8వేల మంది మహిళలు (పేట్రోలియుస్‌ అనే గుంపు) పేట్రోలును చేతులో పట్టుకొని తిరుగుతూ ప్రభుత్వ అధికారులమీద, కార్యాలయాలమీద దాడులకు తెగబడ్డారని రాశారంటే ఎంత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గోన్నారో అర్థం చేసుకోవచ్చు.

వర్సైల్స్‌ వైపు నుంచి దాడి ముమ్మరం కావడంతో స్త్రీలందరిని బారీకేడ్ల దగ్గరకు నడవాలని పిలుపునిచ్చింది. లూసీ మైకేల్‌, ఆండ్రూలియా, నతాలీ లామేల్‌, సోఫియా పయనీర్‌ వంటి మహిళల నాయకత్వంతో బ్యాచ్‌లుగా బయలుదేరిన మహిళలు వీరోచితంగా పోరాడుతూ శత్రువులను నిలువరించారు. పలుగులు, పారలు చేబూని ఎక్కడికక్కడ బారీకేడ్లు నిర్మించారు. నగరమంతా బారీకేడ్లతో నిండిపోయింది. మహిళలు బారికేడ్‌ను ఏర్పాటు చేసి థేర్స్‌ సైన్యాలను ఎదుర్కొంటూనే చివరివరకు పోరాడుతూ వందలాదిమంది అహుతి అయ్యారు.

అయితే ఎన్ని విధాల అడ్డగించినప్పటికీ వరైల్స్‌ సేలనలను నిలువరించడం ఎక్కువ కాలం సాధ్యం కాలేదు. ప్యారిస్‌ నగరాన్ని హస్తగతం చేసుకున్న సేనలు ప్రజానీకం మీద నిర్భంధ కాండ అమలుచేశారు. కనిపించిన ప్రతి మహిళనూ క్రూరంగా కాల్చిపారేశారు. చచ్చేందుకు సిద్ధంగా ఉన్న స్త్రీల బట్టలుల ఇప్పించి ఘోరంగా అవమానించారు. బహిరంగ విచారణ పేరుతో వందలాది మందిని ఒకే దగ్గరకు చేర్చి కిరాతక సైనికులు స్థనాలమీద, పొత్తి కడుపుల మీద తుపాకులతో పొడవడంతో చాలామంది అకాల ప్రసవాలు, గర్భస్త్రావాల పాలయ్యారు. చిత్రహింసలకుతోడు కిక్కిరిసిన కారాగారాల్లో సరైన సదుపాయాలు లేకోవడంతో ఆకలితో చాలా మంది పిచ్చివాళ్లయిపోయారు. ఇద్దరు ముఖ్య సైనికాధికారులను చంపారనే కారణంతో 47 మంది స్త్రీ,పురుషులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. మే 21 నుంచి మే 28 వరకు జరిగిన భీకర పోరాటంలో దాదాపు 20 వేల మంది హత్యకావించబడ్డారంటే ఆ మారణహోమం ఎంత అమానుషంగా జరిగిందో ఉహించుకోవచ్చు.

పోరాటంలో వ్యభిచారిణులు!

పారిస్‌ కమ్యూన్‌ ముట్టడిలో వేలాది మందిని థేర్స్‌ ప్రభుత్వం హత్యగావించిన తర్వాత 1851 మంది అరెస్టు అయ్యారు. అధికారుల లెక్కల ప్రకారం వీరిలో 246 మంది అంతకు ముందు వ్యభిచారిణులు. ఆనాటి రాచరికపు సమాజం చాలా మంది స్త్రీలకు చూపిన బ్రతుకుదెరువు వ్యభిచారమే. ఈ వ్యవస్థ వల్ల ముందు బాధలపాలైంది వీరే నుక ఆ వ్యవస్థ మార్పుకౖేె సాగిన పోరాటంలో వీరే ముఖ్య పాత్ర వహించారు.!

శిక్షల్లోనూ పోటీ!

1873 ఆగస్టులో లూసీమైకేల్‌ను, ఆమెతోపాటు మరో 19 మంది మహిళలను ఒక పడవలో న్యూకోలడియానాలో ఉన్న మహిళా కాలనీకి తరలించారు.కానీ లూసీ అందుకు వ్యతిరేకించి తమకు మగవాళ్లకు విధించిన శిక్షే వేశారు కనుక వారితోపాటు సమానమైన శిక్షలు తామూ అనుభవిస్తామని ముందుకు వచ్చారు. తత్పలితంగా పురుషుల్లాగా కొరడాలు, చైన్లతో దెబ్బలు తిన్నారు. ఆ స్త్రీ ఖైదీలలో ఎంతో మంది యవ్వన ప్రాయంలో వున్న వారైనప్పటికీ జైలు అధికారులు పెట్టే అనేక అవమానాలను, దుర్భాషలను ఎదుర్కొంటూనే 800 మంది మగవారి మధ్య తమ శిక్షలను అనుభవించారు.

మహిళా ఉద్యమకారులను విచారణ జరిపుతున్న సమయంలో కూడా ఎవరికి వారు శిక్షలను కూడా హేలన చేశారు. ఆ ఉద్యమంలో క్రీయాశీలంగా పాల్గొన్న సందర్భంలో నతాలీ లామేల్‌ని విచారణ జరుపుతున్న సమయంలో ʹప్రభుత్వాన్ని ధిక్కరించడం నా జన్మహక్కు. నువ్వు ఉరిశిక్ష వేస్తే తప్ప నువ్వు ఏ శిక్ష వేసినా కూడా నేను బ్రతికినంత కాలం నిన్ను ధిక్కరిస్తూనే వుంటాను. నన్ను సజీవంగా కొనసాగించావంటే మీరు శత్రువును కొనితెచ్చుకున్నట్లేʹ అని తన చివరి ఉపన్యాసంలో పేర్కొంది.

యావజీవ శిక్షను అనుభవిస్తున్న మహిళలు శిక్షలను అనుభవిస్తూనే సంఘటితంగా పోరాడి తమ డిమాండ్స్‌లను ఒక్కొక్కటిగా సాధించుకున్నారు. అనేక మంది మహిళలు శిక్షలను అనుభవిస్తున్న మగవారిలో తమకు నచ్చిన వారిని పెళ్ళి కూడా చేసుకున్నారు. అయితే శిక్ష అనుభవిస్తున్న వారికి 1879లో పాక్షిక క్షమాభిక్ష మంజూరైతే 1880 నాటికి బతికున్న వారందరికీ శిక్షలు రద్దయ్యాయి.

ʹపారిస్‌ కమ్యూన్‌ʹను కాపాడుకునేందుకు వీరోచితంగా పోరాడిన మహిళలు ప్రధానంగా శ్రామిక వర్గం నుంచి వచ్చినప్పటికీ నాయకత్వం వహించినవారు మాత్రం సంపన్న కుటుంబాలవారే. వీరు సమాజ పరివర్తన కోసం, స్వాతంత్య్రం, సమానత్వం, న్యాయం కోసం అగ్రభాగాన నిలబడి పోరాడారు. పోరాటంలో పాల్గొన్న సకల వర్గాల ప్రజల సమస్యలకు మూలం ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలే కాబట్టి ఐక్యంగా తమ పోరాటాన్ని కొనసాగించారు. అయితే బీజ ప్రాయంలో వున్న శ్రామీక రాజ్యం 72 రోజుల్లోనే పతనం కావచ్చో గాక కానీ ఆ పారిస్‌ కమ్యూన్‌ అందించిన చైతన్యం, ఆ మహిళల వీరోచి పోరాటం నేటికి ప్రపంచ విప్లవాలకు స్ఫర్తిధాయకమే. ప్యారిస్‌ పతనం తర్వాత ఇంగ్లాండ్‌లో తలదాచుకున్న కవి ʹయాజీవ్‌ పొట్టియార్‌ʹ పారిస్‌ కమ్యూన్‌ అందించిన స్ఫర్తితో రాసిన ʹʹఆకలి మంటలు మలమలలాడే, అనాథలందరూ లేవండోయ్‌ʹʹ అనే గీతాన్ని రాశాడు. ఇదే తర్వాతి కాలంలో అంతర్జాతీయ గీతంగా ఖ్యాతిగాంచింది. పారిస్‌ పతనమై 147 గడిచిన ఇవ్వాల్టికి మనం ఆ గీతాన్ని పాడుకుంటున్నామంటే ఆ తొలి విప్లవ పోరాటం ఎంత మహోన్నతమైనదో కదా...ఈ గీతాన్ని బాలాంత్రపు నళిని కాంతారావు గారు తెలుగులోకి అనువదించారు.

విర‌సం మార్క్సిస్టు పాఠ‌శాల‌(మే 22, హైద‌రాబాద్‌)లో ʹపారిస్ క‌మ్యూన్ʹ పై వీక్ష‌ణం సంపాద‌కులు ఎన్‌. వేణుగోపాల్ పాఠం ఆధారంగా రూపొందించిన నోట్స్ (మొద‌టి భాగం)

అక్ష‌రీక‌ర‌ణ - డేవిడ్‌

No. of visitors : 1898
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - ఆగ‌స్టు 2018
  శప్తభూమి పరిచయ సభ
  రాపూరు దళితవాడపై పోలీసు దమనకాండను నిర‌సిద్దాం
  నాస్తికోద్యమ నాయకుడు కడుచూరి అయ్యన్నకు నివాళి
  ప్రజాపక్ష రచయిత, అనువాదకులు నిర్మలానందకు జోహార్లు
  Statement from the Indian Writersʹ Forum
  Dream to Dream
  ఊరుకుందామా?
  అమ్మ చెప్పింది
  మౌనం తెగేదెప్పుడు?
  మిగతా కథ
  బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజాన్ని ప్ర‌తిఘ‌టిద్దాం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •