మిణుగురు పూల వెలుగు

| సాహిత్యం | క‌థ‌లు

మిణుగురు పూల వెలుగు

- బిందు మిత్ర‌ | 18.06.2017 12:44:35pm

"సుజి, ప్లీజ్ నన్ను క్షమించు"

"...."

"ఏదో ఒకటి మట్లాడు సుజి, నీ మౌనంతో నాకు పిచ్చెక్కుతోంది"

"ఏం మాట్లాడమంటావు? మౌనం ఇపుడు నా పరిభాష‌ ఐనప్పుడు ఇంక మాట్లాడడానికి ఏం మిగిలిందంటావు?"

"సుజి, క్షమించమని అడుగుతున్నా కదా! నాది తప్పే, నిన్నలా ఒదిలేసి వెల్లి సరిదిద్దుకోలేని తప్పే చేసాను, ప్లీజ్ ఒక్క చాన్స్ ఇవ్వు నేనేంటో నిరూపించుకుంట."

"ఆల్‌రెడీ నిరూపించుకున్నావ్ కద, కొత్తగా ఇంకేముందని ప్రూవ్ చేసుకోవడానికి? ఐనా సరిదిద్దుకోలేని తప్పు చేసా అంటూనే మల్లీ ఒక చాన్స్ ఇవ్వు అంటావేంటి, నీ మాట మీద నీకు నిలకడ ఉండేదెపుడు ఇంక?"

"అలా సర్కాస్టిక్‌గా మాట్లాడకు ప్లీజ్, ఈ ఒక్కసారి నన్ను నమ్ము"

"ఒద్దు, నాకిపుడు నామీద నాకు తప్ప ఇంకెవరి మీద నమ్మకం లేదు"

"నమ్మితే మళ్లీ ప్రేమించాల్సి వ‌స్తుంద‌ని భయమా?"

"కాదు, మళ్లీ బాధ పడాల్సి వ‌స్తుందనే చిరాకు"

"....."

"......"

"ఇప్పుడింత పట్టుదలగా ఉన్న దానివి మరి ఆరోజెందుకు నిన్ను విడిచి వెల్లిపోతుంటే నన్నాపలేదు?"

"ఆపడానికి నువ్వు చెప్పి వెలితే కదా, కనీసం వెల్లిపోవాలనె ఆలోచన నీలో ఉన్నట్లు నాకు కనిపించనిస్తే కదా? నీలోకమే నేనైనట్లు ఎంత చక్కగా నీ పాత్రలో జీవించావని?"

"నేనే అనుకోలేదు వెల్లిపోతా అని, మతి తప్పి ఏం చేస్తున్నానో తెలియని స్తితిలో..."

"కాని నేను అనుకున్నాను ఏ స్తితిలోనైనా జీవితపు చివరి ఘడియల వరకూ మనం కలిసే ఉంటామని"

"మరిన్ని రోజులూ మౌనంగా ఎందుకున్నావు, నన్ను వెతికి పట్టుకొని కడిగేయాల్సింది, కనీసం ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాల్సింది, నన్నే తలుచుకుంటూ, జీవితంతో పోరాడుతూ మౌనంగా ఎందుకున్నావు?"

"...... (తనలో తనే మట్లాడుకుంటున్నట్లుగా)
మొన్నటి రాత్రి
నువ్వు నేను ఓ ఆత్మీయ బంధంలో ఏకరూపమై అల్లుకుపోయిన క్షణం,
నువ్వు గాలిలోకి విసిరేసిన మాటల వాగ్ధానాల మైకంలో మునిగి
నాలోని నీవుగా కరిగి పోయిన నేను
ఆ ఆనందంలో
అలసిన నీ దేహపు స్వేదగంధాన్ని ఆఘ్రాణిస్తూ
నీ ఎద మాటున సేదతీరుతున్నపుడు
అకస్మాత్తుగా
నీలోని నన్ను నీ తమకపు నీడల్లో ఒదిలి
నీ అడుగుల సవ్వడి నీకే వినిపీయనంత మౌనంగా
నాలో నుండి విడివడి
నీకు నీవుగా నీ ఆకారంగా... నిరాకారంగా నిష్క్రమించిన తరువాత

తేనెటీగల తాకిడిని తట్టుకుని ఒంటరిగానైనా నిబ్బరంగా నిలబడి ఉన్న రెక్కల పువ్వు
హఠాత్తుగా వీచిన ఈదురు గాలులకు తల ఒంచి రెక్కలు వాల్చేసినట్లు

నువ్వు మిగిల్చి వెల్లిన చీకట్లో
నువ్వు ఒదిలి వెల్లిన నీ ఊపిరి రాగాన్ని వింటూ
నేటి ఈ వేకువలో ఓ క్షణం మౌననయ్యానే తప్ప
మిత్రమా!
మాటలే రాని మూగదాన్ని కాదు, మాట్లాడలేకా కాదు..."

"అలా నీలో నువ్వే గొనుక్కుంటావెందుకు, ఏమైనా ఉంటే నా మొకమ్మీద చెప్పొచ్చు కదా?"

"నీ మొకమ్మీద మచ్చలుంచుకుని నా అద్దాన్ని కడగమంటే ఇంకేం చెప్పాలి?"

"సరే, ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నావు? నీ నిర్ణయం ఏంటి"

"అదేంటి ఏం చేస్తున్నావో తెలియని స్తితిలో వెల్లిపోయిందీ నువ్వే, జీవితంలో ఏం చేయాలో నిర్ణయించుకోలేక తిరిగొచ్చిందీ నువ్వే, నా మట్టుకి నేను బాగానె ఉన్నా, నా నిర్ణయంతో నీకు పనిలేదు, నీతో నాకు ఏ అనుబంధమూ అవసరం లేదు"

"అంటే ఇంక ఇలా ఒంటరిగా ఉండిపోతావా?"

".... (తనలో తనే మట్లాడుకుంటున్నట్లుగా)
నేను ఒంటరిని కాదు...
నీడల్నే నమిలే చీకట్లు నాలో ఉన్నాయి
మిణుగురు పూల వెలుగులూ నాతో ఉన్నాయి
గర్జించే ఉరుములు నాలో ఉన్నాయి
చల్లగ సాగే మేఘమాలికలూ నాతో ఉన్నాయి

ఆకాశపుటంచు నుండి జారిపడే చిట్టి చినుకులూ
చినుకు తాకిడికి మురిసి ప్రకృతి పాడే ఆకుపచ్చని వసంత గీతం
వేకువఝాములో రేయంచు నుంచి జారిపడిన మంచు ముత్యాలూ
ముత్యాల వెలుగుల్లో అందంగా ముస్తాబయి మెరిసే హేమంతం...
ఇలా ప్రకృతితో కూడిన విశ్వమే నా తోడైనప్పుడు నేనెలా ఒంటరినౌతాను?"

"ఓ వైపు నేను మట్లాడుతూ నిర్ణయం చెప్పమని బతిలాడుతుంటే నిముశానికి ఒకసారి మౌనంలోకి జారిపొతావేంటి?"

"చెప్పడానికి ఏం లేదు విశ్వా, నా దారి ఇప్పుడు క్లియర్‌గానే ఉంది, నువ్వొక పోటురాయివై మల్లీ నా అడుగుకి అడ్డం పడకు, నిర్ధాక్షిణ్యంగా పెకిలించి పక్కన పడేస్తా. తిరిగొచ్చే దారిని మరిచి నీదారిన నువ్వెల్లిపో"

"నీలో తిరుగుబాటుదనం మొదలైంది. తెలిసిన వాల్లందరూ అంటూంటే ఏమో అనుకున్నాను కాని అదిప్పుడు క్లియర్‌గా కనిపిస్తోంది"

"నీకోసం మా వాల్లందరినీ ఎదిరించినపుడే నాలో తిరుగుబాటుదనం మొదలైంది, ఇప్పుడు నా వ్యక్తిత్వం కాపాడుకోవడం కోసం నిన్ను ఎదిరిస్తున్నప్పుడు అదే తిరుగుబాటుదనం నీకు కొత్తగా కనిపిస్తోందా?"

"నేను లేకుండా గడప దాటడానికి సాహసించని దానివి ఇప్పుడు ఎవరి అండని చూసుకుని ఇలా ఉండగలుగుతున్నావో నేను ఊహించగలను"

"నా పుట్టింటి గడప దాటి నీకోసం ఒచ్చిన నన్ను ఇంకొక గడపలోపల బంధీని చేసి నీకోసం నీ సుఖమయ జీవితం కోసం నిర్లజ్జగా నన్ను దాటివెల్లిన నీకు నేను ఇంకా జవాబుదారినేనంటావా?"

"ఎవరే నీకు ఇంత దైర్యాన్ని ఇస్తున్నది, స్నేహితుల రూపంలో ఉన్న ఆ మావోలేనా?"

"జాగో జాగో అని చెప్పేవాల్లందరూ నీ దృష్టిలో మావోలే ఐతే, యెస్ నా స్నేహితులందరూ మావోలే, వాల్లందరూ మావోల్లే"

"చూసుకుంటానే, నిన్నూ నీకు సపోర్ట్ ఇచ్చే నీ స్నేహితులనూ, అందరినీ తొక్కి నార తీయకపోతే నా పేరు విశ్వానే కాదు"

"రంకెలొద్దు విశ్వా, ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల వేసి, వంచించి నువ్వు చేస్తున్న మోసాలు బయటికి ఒచ్చిన మరుక్షణం అదే నార నీ మెడకు ఉరితాడై బిగుసుకుంటుంది"

"ఎంత దైర్యమే నీకు, మగాడిని నాకై నేనే తిరిగొచ్చి ఒక్క అవకాశం ఇమ్మని అడుగుతుంటే ఆడదానివై ఉండి ఇంత ఎగిసిపడతావా?"

"పసుపు పూసిన గడపకి ఎర్రబొట్టునై మెరిసిన తెలుగుంటి ఆడబిడ్డను నేను, నీకోసం గడప దాటాను కదా అని ఆ ఎరుపులో మెరుపు తగ్గి వెరపు ఒచ్చిందనుకోకు. పల్లెటూరిది కదా ఇది నన్నేం చేస్తుందిలే అని పిచ్చి ఆలోచనలు చేయకు విశ్వా, పొద్దుపొడుపుతో తెల్లటి గోడల మీద ఎర్రటి నక్షత్రాలను చదువుతూ పెరిగినదాన్ని, మువ్వన్నెల జండానే కాదు మురిపించే ఎర్ర జండానీ చూస్తూ ఎదిగినదాన్ని, రంకెలేసే నీ నోటికి ముక్కుతాడు వేసి, కాల్ల మధ్య దూటం పెట్టి మెడ ఒంచి కొమ్ములు విరిచే దమ్మున్నదాన్ని. అణిగి ఉన్నాను కదా అని ఆవేశం చచ్చినదాన్ని అనుకోకు, ఆడపిల్లనే కానీ అవసరమైనచోట బెబ్బులికన్నా చురుకైనదాన్ని.

"ఒక మగాడితో అందులోనూ మొగుడితో మాట్లాడే మాటలేనా ఇవి"?

"మొగుడు అనే ట్యాగ్ త‌గిలించుకొని ఆడ‌దానిపై పెత్త‌నం చేయాల‌నుకునే వాడు మ‌గాడే అవుతాడు కానీ. మ‌నిషి కాదు.
నీలాంటి వాడి స‌హ‌చ‌ర్యం నాకవసరం లేదు. ఒక్క అవకాశం ఇమ్మని అడగడానికి పిల్లిలా ఒచ్చి కాదనగానే నీ అసలు స్వరూపాన్ని బయటపెట్టిన నీ నక్క స్వభావాన్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది, వెల్లిపో విశ్వా, నాలోని ఆవేశం కట్ట దాటకముందే వెల్లిపో, మరొక క్షణంలో నువ్విక్కడి నుండి కదలకపోతే నాలో శివంగిని చూస్తావు"

ఆమె కల్లల్లోని ఎరుపునీ మొఖంలోని ఆవేశాన్నీ చూసి ఝడిసి, ఇంకో క్షణం అక్కడే ఉంటే ఆమె అన్నంతపనీ చేస్తుందని దడిసి తనలో తాను "దేవుడా! ఆడవాల్లు పిల్లులనుండి పులులెప్పుడయ్యారు" అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెల్లిపోయాడు.

No. of visitors : 1712
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •