నిరంతరం

| సాహిత్యం | క‌విత్వం

నిరంతరం

- వారాల ఆనంద్‌ | 18.06.2017 12:58:11pm

ఎవడో ఎక్కడో
ట్రిగ్గర్‌ నొక్కుతాడు

బుల్లెట్లు
అడవి గుండెలో పేలుతాయి

అప్పటిదాకా
చెట్లమీదో చెట్ల నీడనో
సేద దీరిన పక్షులన్నీ
కకావికలై చెల్లాచెదరువుతాయి

చెట్లకు నిప్పంటుకుంటుంది
పచ్చదనం పోయి ఆకులన్నింటికీ
వెచ్చటి రక్తం రంగు పులుముకుంటుంది

నల్లటి పొగే మో
త్యాగాల్ని మోసుకుని
దట్టంగా ఆకాశంలోకి దూసుకెళ్తుంది

అడవులు మండి పోతాయి
తీగలూ మొక్కలూ పువ్వులూ
మాడిపోతాయి
అక్కడంతా కల్లోలమవుతుంది
కొండలూ నదులూ సెలయేళ్లూ
అనాధ లవుతాయి

కానీ అతడేమో
తన చుట్టూ
మన చుట్టూ కూడా
ప్రేమగా పుల్లల్ని నాటుతున్నాడు
పచ్చగా ఎదిగి
ఉద్యాన వనాలో మహారణ్యాలో అవుతాయని

నిరంతర నిర్మాణం
వూపిరిని నిలబెడుతూనే వుంది

No. of visitors : 605
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •