ఎవరిని శిక్షించాలి?

| సంభాషణ

ఎవరిని శిక్షించాలి?

- మమ్మా | 18.06.2017 01:27:41pm

ముక్కుపచ్చలారని పసిపాపలు. పట్టుమని మూడేండ్లు నిండకముందే కార్పోరేట్ విద్యాసంస్థల దప్పికకు బలైపోతున్న హృదయాలు. పాపం! సగం నిద్రలోనే స్నానం, అల్పాహారం, అలానే అమ్మానాన్నల వీడుకోలు, కాదు! పసిపాపల వేడుకోలు. స్కూల్ బస్సు, డిజిటల్ క్లాసులు, యూట్యూబ్ పాఠాలు, ఇంగ్లీషులో గగ్గోలు, అబాస్కస్ ఆటలు. శ్రీ శ్రీ గారు తన కవితని మార్చి రాయాల్సిందే.

రోజూ అదే కథ. ఈ రోజూ మొదలైంది. స్కూల్ బస్ హారన్ మోగగానే మోగింది.. పాప ఏడుపు కూడా. తప్పదు కదా! స్కూల్ టైం అవుతుంది. బస్సేమో ట్రాఫిక్ లో ఇరుక్కుంది. ఐదు నిమిషాలు ఆలస్యం. వామ్మో! ఎక్స్లేటర్ నొక్కాడు మన బస్సు డ్రైవర్. అలా ఉండగానే అర్జంటు ఫోన్ కాల్. వాడికేమైన కొత్తనా ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపడం? తప్పు రైలుబండిది. ప్రతిరోజూ ఐదు గంటలు ఆలస్యంగా నడిచే ఆ దరిద్రపు బండి, ఏ రోజు సమయానికి వచ్చింది. పసిపాపల ప్రాణాలను హరించింది. ఈ వార్త చూసికాని, వినికాని కలత చెందని మనిషెవరైనా ఉన్నారా? ఉంటారా? రక్తంలో పిల్లల శవాలు, కన్నీళ్ళలో తల్లిదండ్రులు. ఏ శిక్ష వేయాలి? శిక్షతో ప్రయోజనమేమిటి? అసలు ఎవరిని శిక్షించాలి?

***********

పిల్లాడికి యాభైవేల జీతం అటా! పైగా అమ్మానాన్నలిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగులంట! ఇంకేముందీ? మన అయిలన్న తన గారాల పిల్లని అతనికిచ్చి అంగరంగ వైభవంగా (భూమి అమ్మి మరీ) పెళ్ళి చేసాడు. ఏడాది తిరిగేలోపే పండంటి పాపని చేతులో పెట్టారు. కాకపోతే, అత్తారింటివాళ్ళు రెండు తులాల బంగారం, ఓ యాభైవేలు ఇవ్వాలంటూ!

మా గారాలపట్టికి లక్ష్మీదేవి పుడితే ఆ మాత్రం చేయలేనా అని అయిలన్న అప్పుచేసి మరీ కానుకలిచ్చాడు. ఇంకో ఏడాది అయిందో కాలేదో ఇంకో లక్ష్మీదేవిని చేతిలో పెట్టాడు అల్లుడుగారు. లక్ష్మీదేవిని చూశాక ఆనందం కాదు, ఆందోళన మొదలైంది ఈసారి. అయిలన్న మళ్ళా అప్పు చేశాడు. అల్లుడిగారికి ఈసారి గుబులు పట్టి, భార్యని వైద్యపరీక్షలంటూ దవఖానకి తీసుకెళ్ళి గుట్టుచప్పుడు కాకుండా పుట్టేది ఆడో, మగో తెలుసుకొని, ఆడని తెలిసాక, పసికందుని పురిటిలోనే చంపేయించాడు. ఆ కిరాయి హంతకుడు ఎవరో తెలుసుకదా?

తన వంశోద్ధారకుడికి జన్మనియ్యని ఆమె, తన భార్యగా అర్హురాలు కాదని తేల్చేసి పుట్టింటికి లక్ష్మీదేవిలతో సహా పంపి, ఇంకో పెళ్ళి చేసుకుని వంశోద్ధారకున్ని పుట్టించే పనిలో పడ్డాడు. తన వంశం అంతరిస్తుందని గర్భాన్ని తీసేసాడు, కాదు కాదు తీయించేసాడు. మగ పిల్లాడికి జన్మనివ్వట్లేదనే శంకతో భార్యని అయిలన్న ఇంటికి పంపాడు. అంధులో తప్పు ఎవరిదీ? ఎవరిని శిక్షించాలి?

********************

"అరై వెధవా! పత్తితో ఎన్ని ఉపయోగాలున్నా, వరి పండిస్తే ఆకలి తీరుస్తుందిరా. మన ప్రాణాలని నిలబెడుతుందిరా. జర సోచో! నేను వరినే పండిస్తరా. మన సర్కారు కూడా తెలివైంది. వ్యాపారం చేసే పత్తి కన్న కడుపు నింపే వరికే మంచి గిట్టుబాటు కల్పించి మనల్ని ఆదుకుంటది. ఏమోరా లింగం! నాకైతే ఎందుకో పత్తినే పండించాలని ఉందిరా! సరే పో! నీ చావు నువ్వు చావు."

మన లింగమన్న అప్పు తెచ్చి మరీ నారు పోయించి, నాటు వేయించాడు. ఎమైందో ఎమో! పొలం నిండా పురుగులే. మేలిరకం మందులు వాడినా ప్రయోజనం లేకుండే. రావాల్సిన వానలూ రానే రావట్లేదు. లింగమన్న కళ్ళు కాయలు కాసిపోయినయి. కరెంటేమో సరిగా ఉండదాయె. కొడుక్కి ఏదో అవ్వ చేతి బువ్వ తినాలనిపించిందంటె పట్నం పోయిండు లింగమన్న. కొడుకు ఫ్యాక్టరీలో పని చేస్తడు. అదేంట్రా రాజా, ఇక్కడ పొద్దుట్నుండి కరెంటు పోతలేదేమ్రా? అని ఆశ్చర్యంగ అడిగాడు. తిరిగి ఇంటికొచ్చాడు. కొన్నాళ్లు వానకోసం, నీళ్ళకోసం వేచిచూచాడు, పంట ఎండిపోతుంది. గుండె బరువైతుంది. రుమాలు తీసాడు, ఫ్యానుకి కట్టాడు, ఉయ్యాలూగాడు. అది ఆత్మహత్య కదా, ఎవరిని శిక్షించాలి?

*******************

పిల్లలకి స్కూలు దగ్గరగా ఉంటుందని రవి అద్దెకు ఇల్లుని తీసుకున్నాడు. తను పని చేసే ఆఫీసుకేమో బండిపై గంట ప్రయాణం పడుతుంది. ప్రొద్దున్న ఏడు గంటల వరకు లేచి, తయారయ్యి బయలుదేరి, ఆ ట్రాఫిక్ దాటుతూ రోజూ వెళతాడు. చదివిందేమో ఇంజనీరింగు. చేసే జాబ్ ఏంటో ఎవరికీ తెలియదు. బాస్ చేత తిట్లు, పని ఒత్తిడి, సాయంత్రానికి రెండు బీర్లు. మరో గంట/గంటన్నర ప్రయాణం. వచ్చే సరికే పిల్లలు నిద్రపోవడం. కూర రుచి బాలేదని భార్యతో గొడవ. ఆమె తన భర్తని ఏమి అనలేని పరిస్థితి (అర్థం చేసుకుంటుంది). రోజూ ఇదే రామాయణం. రవి, పోయిన ఆదివారం రోజు ఆడుకున్నాడంట పిల్లలతో, పాపం! ఒకటో తారీఖు వస్తుందంటే రవికి జ్వరం. ఇప్పటికే అయిదారేళ్ళు గడిచాయి. ఇంకా ఎన్నాళ్ళొ? తప్పెవరిది? శిక్ష ఎవరికో?
************************

ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన విద్యాసంస్థలు, ఆసుపత్రులు ప్రై వేటు వాళ్ళ వశమైనవి. ప్రజల మెడలో పాశమైనవి. ప్రతి సామాన్యుడి మదిలో ఉన్న అభిప్రాయమేమంటే, ఈ రెండింటికంటే మంచి వ్యాపారం ఇంకొకటి లేదని.

పోటీ పడుతున్న ప్రపంచం ముంగిట తన పిల్లలు ఎక్కడ బోర్లపడుతారో అని తమ సామర్థ్యానికి మించి మరీ కార్పోరేట్ విద్యాసంస్థలలో చేర్చి, ఫీజులు కట్టలేక అప్పులు చేస్తున్నారు. ఇక పిల్లలు పుసుక్కున తుమ్మినా, దగ్గినా ఆ రోజు జేబు దవాఖానాలో ఖాళీ అవ్వాల్సిందే. యునిఫాంలు, పుస్తకాలు, కాపీలు, బెల్టులు, టైలు, వర్క్ బుక్కులు అన్నీ స్కూల్లలోనే కొనాలంట ! అదీకాక, ఈవెంట్స్, సెలబ్రేషన్స్, పండుగలు, పబ్బాలొచ్చినప్పుడు అదనపు భారం తప్పనే తప్పదు. ఇక ఆసుపత్రులంటారా? ఏదో నీరసంగా ఉందని వెళ్తే, రక్త పరీక్ష, మూత్రపరీక్ష, స్కానింగ్, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, సిరప్లు... అని అన్నీ అంటగడుతారు. పైగా, అన్నీ వాళ్ళ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంటాయని ఉచిత సలహా ... ఈ విచ్చలవిడి పోకడలకు ఎవరు బాధ్యులు? ఎవరిని శిక్షించాలి?

No. of visitors : 678
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కశ్మీరం

మమ్మా | 04.09.2017 10:57:54am

ఆ నెత్తుటి మంచుకొండలలో ఏరుపారి ఉరకలేస్తుంది, పూవుపూసి పరిమళిస్తుంది, స్వేచ్ఛాకోరిక సువాసనొస్తుంది....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •