ప్రకృతి - వికృతి

| సంభాషణ

ప్రకృతి - వికృతి

- పి. వరలక్ష్మి | 18.06.2017 08:01:01pm

జూన్ 5 పర్యావరణ దినం రోజున ఒక చిన్న వార్త ఇది. మంత్రి నారాయణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలను పోస్టర్ రహితం (మీరు సరిగ్గానే చదివారు. ప్లాస్టిక్ రహితం కాదు, పోస్టర్ రహితం) చేయాలని, దీని కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను అదేశించారట. అన్ని పట్టణాలోని ప్రభుత్వ భవనాలు, రోడ్ల మధ్య డివైడర్లపై కరపత్రాలు అంటించడానికి, రాతలు రాయడానికి వీల్లేదని, ఇది చట్టరీత్యా నేరమని తెలిపారట. ఈ ఆదేశాలు జూన్ 5 నుండి అమల్లోకి వస్తాయట. ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారట. ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటివి తగిలించాలనుకుంటే తప్పనిసరిగా ఆయా మునిసిపాలిటీల అనుమతి తీసుకోవాలట.

పోస్టర్లు, కరపత్రాలు పర్యావరణానికి హానికరమని చెప్పదలచుకున్నారా నారాయణగారు? మీ బళ్ళో పిల్లోళ్లకు ఈ సదువే చెప్తారన్నమాట. బాక్సయిట్ తవ్వితే పర్యావరణానికి హానికరం కాదు. పైపెచ్చు అది అభివృద్ధికి అవసరం. అణువిద్యుత్ కేంద్రాలు, థర్మల్ ప్లాంట్లు, కెమికల్ ఫ్యాక్టరీలు, పంటభూముల్ని రియల్ ఎస్టేట్ చేయడం, నదులపై నగరాలు నిర్మించడం, నదుల గర్భాలను చీల్చి ఇసుక తోడెయ్యడం ఇవేవీ పర్యావరణానికి హానికరం కాదు. ఒకవేళ అయినా, అభివృద్ధి కోసం ఆ మాత్రం నష్టం భరించాలి. మీదేం పోయింది. భరించేది నిరుపేదలు, దళితులు, ఆదివాసులు కదా. వీళ్ళంతా ఎలాగూ అభివృద్ధి నిరోధకులు. అరె.. ప్రభుత్వం వేసే భిక్ష తినకుండా మా భూములు, మా హక్కులు అంటారు. ఇట్లా అయితే అభివృద్ధి ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా అని సో కాల్డ్ మిడిల్ క్లాస్ చికాకు పడుతుంది.

వీళ్ల ప్రకృతి ఏమిటి? కంటికి అందంగా కనిపించడమా? అందంగా కనిపించడమంటే నిలువెత్తు పెప్సీ కోలా యాడ్స్ లా, కింగ్ ఫిషర్ లా విషాన్ని సొంపుగా చూపించడమా? సంపద గల వాడి అజీర్తిని, బూతును బాక్సాఫీసు బొమ్మలుగా వేయడమా? యూనివర్సిటీ ప్రాంగణాలు, నగర కూడళ్లు, చెట్లు, గోడలు భావ సంఘర్షణతో తొణికిసలాడితే ప్రకృతిలో జీవవైవిధ్యమున్నంత ఆరోగ్యకరంగా సమాజమున్నట్లు. ప్రకృతి సంపద కోసం జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న పాలకులు, అడవులు, కొండలు నదీనదాలు ఏకరూప మార్కెట్ గా దున్నిపడేస్తున్న సామ్రాజ్యవాదం మనుషుల్ని కూడా కేవలం శ్రమను అమ్ముకుంటూ, సరుకుల్ని కొంటూ చలనరహితంగా కుంచింపజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మన భావాలను చేరిపేయడానికి గోడల మీది అక్షరాలపై అర్థం లేని రంగులు పులుముతున్నారు. పైగా మీ కాంపస్ గోడలను, మీ ఊరిని, నగరాన్ని పోస్టర్లతో పాడు చేస్తారా అని అతి తెలివితో మనల్నే నిలదీస్తున్నారు.

నిజానికి నిలదీయాల్సింది మనం. అది మర్చిపోయేలా చేస్తున్నారు. నిలదీసి అడుగుదాం. అసలు పోస్టర్లు, కరపత్రాలు ఎవరు వేస్తారు బాబూ? మీలాగ అధికార పత్రికలూ, ఈనాడులూ, ఆనాడులూ, చంద్రజ్యోతులూ లేనివాళ్ళు. ఎవరి గొంతు ప్రచార సాధనాలకు వినసొంపుగా ఉండక ముఖం చాటేస్తాయో, నిలువెత్తు యాడ్స్ వేయగలిగే స్తోమత ఎవరికైతే ఉండదో, పెయిడ్ న్యూస్ కు పెట్టుబడులు ఎవరైతే పెట్టుకోలేరో వాళ్ళు వేస్తారు.ఉదాహరణకు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి వేలాది మంది కూడి మొత్తుకున్నా ఆ ఊసు మీకు న్యూస్ కాదు. మీ మీ నాయకుల కోసం మీ మీ పత్రికలూ చానెళ్ళు ఉన్నాయి. ఎవడి శక్తి కొద్దీ వాడు ప్రచారం చేసుకుంటాడు. మరి మేమేం చేయాలి? మీ వాళ్ళు రైళ్లు తగలబెట్టినా, బూతులు కూసినా మీకు మురిపెమే. మేము నిలువునా తగలెయ్యబడినా, ఉరిపోసుకుని చచ్చినా, ప్రసాసంలో మా బతుకులు తెల్లారి మా శవాలు దేశంగాని దేశంలో కుళ్లిపోయినా మీ మీడియా అయ్యో పాపం అనదు. మేం ఏడవడానికి మురికి గోడలు, దుమ్ము పట్టిన రోడ్ డివైడర్లు కూడా నిషిద్ధం. ప్రజాస్వామ్యం, భావ సంఘర్షణ చాలా పెద్ద మాట. అసలిక్కడ మా ఏడుపులే నిషిద్ధం. ఒకడు మీ అరుపులు వినపడకూడదని ధర్నాలు ఊరవతలికి నిషేధిస్తాడు. ఒకడు గోడ మీద రాతలు నిషేదించి గోడు చెప్పుకోవద్దంటాడు. అసలు తిండే తొనొద్దంటాడు ఇంకొకడు. To hell with your democracy. మీ ప్రజాస్వామ్యాన్ని తీస్కపోయి బంగాళాఖాతంలో కలుపుకోండి. మా పరిష్కారాలు మేం చూసుకుంటాం

No. of visitors : 845
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఆగస్టు 2019

  ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
  వేటగాడి వల
  పదునెక్కుతున్న కోరలు
  ఎదురుచూపులు
  యురేనియమం
  మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
  నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
  దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
  చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
  ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •