ఆవు కథలకు సమాధానం రైతులే చెప్తారు

| సంపాద‌కీయం

ఆవు కథలకు సమాధానం రైతులే చెప్తారు

- పి.వరలక్ష్మి | 19.06.2017 11:38:05pm

జూన్‌ మాసం రైతుల ఆగ్రహాన్ని వెంటేసుకుని ప్రవేశించింది. కనీసం ఏడెనిమిది మంది రైతుల ప్రాణత్యాగంతో, వందలాది మంది రక్తంతో ఈ ఏడాది రుతుపవనాల్ని తీసుకొచ్చింది. ఇన్ని రోజులు ఆత్మహత్యలే వింటున్నాం. అసహజ మరణాలు ఈ దేశపు దినచర్యలుగా అలవాటైపోయాయి. రైతుల ఆత్మహత్యలు ఎంతగా అలవాటైనాయంటే రైతంటే ఉరితాడు తగిలించుకు తిరిగేవాడని నమ్మేంతగా. తమిళనాడు రైతులు దేశరాజధాని నడిరోడ్డు మీద దయనీయంగా ఏడ్చిన ఏడ్పులు, లోకం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో పడ్డానికి వేసిన విషాద బీభత్స నాటకాన్ని చూశాం. ఎంత విషాదానికీ చలించని సమాజం ఉంటుంది. ఎక్కడో అగ్గిపడి కాలందే నిద్రలేవని దేహ(శ)స్థితిలో ఏం జరగాలో అదే జరుగుతుంది.

కార్మికులు, ఉద్యోగులు, వైద్యులు, వివిధ వృత్తుల, సేవల సమూహాలు సమ్మె చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. రైతులు సమ్మెచేస్తే? మూకుమ్మడిగా పంట వేయకపోతే, లేదా పంట కోయకపోతే, పండిన పంటనంతా ధ్వంసం చేస్తే ఎలా ఉంటుంది? టమాటాలు, ఉల్లిపాయలు, మిర్చి రోడ్ల మీద పాలబోసే దృశ్యాలను, పంట చేన్లను, పండిన మిరపకాయల్ని కసిగా తగులబెట్టే దృశ్యాలను కూడా చూశాం. కానీ రైతులు గట్టిగా అనుకుంటే, రైతులే సమ్మె చేస్తే నిత్యావసరాల మార్కెట్‌ను స్తంభించేయగలరు అని ఇవాల చూపించారు. జూన్‌ 1 నుండి మహారాష్ట్ర రైతులు విశాల ఐక్యవేదికగా ఏర్పడి సమ్మె చేయడం మొదలుపెట్టి పాలు, కూరగాయలు, పండ్లు నగరాలకు, పట్టణాలకు సరఫరా కాకుండా బందు చేశారు. ధరలు ఆకాశాన్నంటి ముంబై, పూణే, నాసిక్‌, థానే, సతారా, ఔరంగాబాద్‌, అహ్మద్‌నగర్‌, పర్బని వంటి పట్టణాలు విలవిల్లాడుతున్నాయి. వెంటనే మధ్యప్రదేశ్‌ అంటుకుంది. బి.జె.పి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కనీస మద్దతు ధర ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు తగ్గించాలని, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా ఉండాలని, పది లక్షల పరిమితి వరకు వడ్డీ లేని రుణాలు అందజేయాలని రైతులు కొంత కాలంగా అడుగుతున్నారు. అట్లాగే 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయకూడదని కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ఎం.ఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసు మేరకు రైతు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం ఎక్కువగా మద్దతు ధర ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన ప్రభుత్వం మూడేళ్లవరకు మెదలకుండా ఉండి ఇప్పుడు రైతులు రోడ్లమీదికొచ్చాక అది అమలు చేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని వెక్కిరించింది. అందుకనే పాలు, పండ్లు టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, వంకాయలు, మార్కెట్‌కు చేరాల్సిన పండ్లు రోడ్ల మీద పారబోసి రైతులు నిరసన తెలుపుతున్నారు. రహదారులు స్తంభింపజేశారు. పల్లెకు పట్టణానికి రోడ్డు వారధిని అడ్డగించారు. ఇట్లా నిరసన తెలుపుతున్న రైతులపై అలవాటుగా పోలీసు కాల్పులు జరిపితే మంద్‌సౌర్‌లో అయిదుగురు రైతులు చనిపోయారు. ఎనిమిది మంది చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం సమాచార వ్యవస్థను తెగ్గొట్టేసింది. కర్ఫ్యూ విధించి ఆందోళనలు చెలరేగుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ పనిచేయకుండా చేసింది.

నిజంగా మద్దతు ధర ఇవ్వటం సాధ్యం కాదా? మరి ఎందుకు హామీలిచ్చారు? ప్రతి ఏటా కార్పొరేట్‌ సంస్థల కోసం ఆరు లక్షల కోట్ల మేర పన్ను రాయితీలు ఎల ఇస్తున్నారు? దేశంలో యాభై కార్పొరేట్‌ సంస్థలు బకాయి పడ్డ 5 లక్షల కోట్లు రూపాయల సొమ్మును చూసీ చూడనట్లు ఎందుకు ఉంటున్నారు? ఇవన్నీ రైతులు అడుగుతున్నారు. రైతులతో గొంతు కలిపి మనమంతా అడగవలసిన ప్రశ్నలు. సరిగ్గా ఈ ఆందోళనలు ప్రారంభం అవుతున్న సమయంలో ప్రభుత్వం దేశీయ పాడి పరిశ్రమపై దుర్మార్గమైన దాడి చేసింది. పశువుల క్రయవిక్రయాలపై అత్యంత మూర్ఖమైన నిబంధలు విధిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పుడు సంతల్లో ఆవుల్ని, గేదెల్ని, ఎద్దుల్ని, ఒంటెల్ని అమ్మడం కొనడం దాదాపు అసాధ్యం. పాడి పశువుల్ని పోషించడం అసాధ్యం. పశువులు వ్యవసాయం కోసమేనని ధృవీకరణ పత్రాలు సమర్పించి వాటిని కొని ఒట్టిపోయాక కూడా కబేళాలకు తరలించకుండా జీవితాంతం పోషించాలట. ఈ నిబంధనలన్నీ జంతుహింస నిరోధక చట్టం కింద కొత్తగా చేర్చారు. పాడి పశువులతో పాటు ఒంటెల్ని వధించడం కూడా నేరమని చట్టపరిధిలోకి తీసుకొచ్చి ప్రభుత్వం నేరుగా ముస్లింలను టార్గెట్‌ చేసింది.

ఇది ఆహారంపై ఆంక్షలు విధించడం మాత్రమే కాదు అంతకన్నా పాడి, పశువులపైన ఆధారపడిన కోట్లాది మంది ఉపాధిని ధ్వంసం చేయడం. ఇప్పటికే వ్యవసాయాన్ని సామ్రాజ్యవాద మార్కెట్‌పరం చేసి సంక్షోభంలో పడేశారు. పెట్టుబడి రంగప్రవేశంతో పాడి, పంట మధ్య ఎడం పెరిగింది. పశువుల పెంపకం చాలా మటుకు వ్యవసాయ అవసరాలకు అనుబంధంగా కాక పాల ఉత్పత్తికి, మాంసానికి, లెదర్‌ పరిశ్రమకు అనుసంధానమవుతున్నది. ఎట్లా ఉన్నా వ్యవసాయ ఉత్పత్తి మొత్తంలో 28 శాతం వాటా పశువుల నుండే వస్తోంది. దీన్నీ దెబ్బతీస్తే, నాశనం చేస్తే అప్పుడు బహుళజాతి కంపెనీలకు లైన్‌ క్లియర్‌ అవుతుంది. ఈ రాజకీయార్థిక వ్యూహానికి హిందూ మతం, సెంటిమెంట్లను అడ్డం పెట్టుకుని ఆవు కథలు చెప్తున్నారు. మన చేత కూడా ఆవు చూట్టూ కథలల్లిస్తున్నారు. ఇది మరింత రక్తి కట్టడం కోసమే హిందూ ముస్లింల మధ్య అగాధాన్ని పెంచడం కోసమే ముస్లిం సమూహాన్ని లక్ష్యం చేసుకుని సరిగ్గా రంజాన్‌ ముందు ఒంటె మాంసాన్ని నిషేధించారు. ఈ జంతుప్రేమ వెనక గుత్తపెట్టుబడి అత్యాశ, మతోన్మాద రాజకీయాల తెంపరితం రెండూ ఉన్నాయి. ఇది వెనటిలాగా మొరటు, మూర్ఘ నియంతృత్వం కాదు. తెలివిమీరిన అహంకారం.

మనం ఆవుల గురించి ఆహారహక్కు గురించి మాట్లాడుతూ ఉంటాము. బీఫ్‌ గురించి మాట్లాడుతూ ఉంటాము. బీఫ్‌ తినడం మా హక్కు అని బహిరంగంగా బీఫ్‌ తిని ధిక్కారాన్ని ప్రకటిస్తాము. అది చాలా అవసరం కూడా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? కేసులు పెడుతుంది. చాలా మామూలు విషయం. అయితే అంతకన్నా అది తాననుకున్న మెజారిటీ సమూహాన్ని తన హిందుత్వ ఆవరణలోకి సమీకరిస్తూ ఉంటుంది. అదీ తనదైన శైలిలో ఆవు కథలు చెప్తుంది. కానీ దాని వెనక చప్పుడు కాకుండా మరోపని కూడా చేస్తూ ఉంటుంది. అది ఆర్థిక దాడి. మన సంపదను, మన ఉపాధిని, మన కార్మిక హక్కులను తోడేసి గుత్తపెట్టుబడికి ఆహారంగా వేస్తూ ఉంటుంది. మన మూలుగుల్ని పీల్చేస్తూ ఉన్నా మనం దాని గురించి ఆలోచించలేని తీరిక లేని వివాదాల్లో ఉంటాం. చిక్కుముళ్ల సంక్లిష్ట భారతసమాజంలో అనుక్షణం ఏదో ఒక ముడిలో రాజ్యం మనల్ని ఇరికిస్తూ ఉంటుంది. నోట్ల రద్దు పేరుతో అతిపెద్ద ఆర్థిక దాడి చేసినా, అది పెద్ద ఇబ్బంది లేకుండా మనగలుగుతోందంటే రాజకీయార్థిక అంశాల మీద భారతసమాజం కీలకమైన సమయాల్లోనూ ప్రతిఘటన చేయలేకపోతోంది కాబట్టే. అందువల్లనే చప్పుడు లేకుండా వస్తుసేవల బిల్లు (జి.యస్‌.టి) కోసం రాజ్యాంగాన్ని కూడా సవరించింది. అభివృద్ధి పేరు చెప్పి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పి దశాబ్దాలుగా ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు అనేక పన్ను రాయితీలు ఇస్తూ ప్రజల సంపద వారికి దోచిపెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం తగ్గిపోయేసరికి దాన్ని ప్రజల నుండి పిండుకునే ఎత్తువేసింది. పెద్ద నోట్ల రద్దు పేరుతో మొదట ప్రజల డబ్బంతా బ్యాంకుల్లో వేయించింది. తర్వాత జి.యస్‌.టి. దీని వల్ల రాష్ట్రాల పన్నులన్నీ కేంద్రం పరిధిలోకి పోవడం ఒక ఎత్తయితే అందరినీ పన్నుల చట్రంలోకి ఈడ్చిపడెయ్యం మరింత కీలకమైన అంశం. దాని వల్ల సింపుల్‌గా ధనవంతుల మీద తక్కువ పన్ను, పేదల మీద ఎక్కువ పన్ను పడుతుంది. అంతే, ఇక ఆవు కథ చెప్పుకుంటూ తిరుగుతుంది.

ఆవు కథలు చెప్తే కుదరదు. మా డిమాండ్లు పరిష్కరించండని రైతులు రోడ్డమీదికొచ్చారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మొదలైన నిరసనలు పక్క రాష్ట్రాలకు, ముఖ్యంగా బిజెపి పాలిత గుజరాత్‌, రాజస్థాన్‌లకు అంటుకుంటున్నాయి. అన్ని చోట్లా ఆరెస్సెస్‌ అనుబంధ రైతుసంఘాలు కపట నాటకాలాడుతూ రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి, చల్లార్చడానికి కుట్రలు చేస్తున్నాయి. అది కుదరకుపోయేసరికి అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు ప్రవేశించాయని ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. యధావిధిగా ప్రధాన ప్రతిపక్షం మీదికి ప్రభుత్వమే కాదు, దానికి దాసోహమైన మీడియా ఛానళ్లు లంఘించుకుంటున్నాయి. దేశం, దేశభక్తి నిత్యం పారాయణం చేసే సంఘపరవార్‌ దేశప్రజల ముఖ్యమైన సమస్య పట్ల ఎలా ఉంటుందో నగ్నంగా దొరికిపోయింది. సరిగ్గా ఇక్కడే మతోన్మాదుల ఆయువు పట్టు ఉంటుంది. ఈ శక్తుల్ని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి. అందుకు ఈ దేశ రైతులు సరైన సమయంలో దారి చూపిస్తున్నారు. ఆ ఉద్యమాలకు మద్దతు తెలుపుదాం. అట్లాగే పాడి పరిశ్రమపై దాడికి వ్యతిరేకంగా కూడా వివిధ సమూహాలు రైతులతో కలిసి ఉద్యమిస్తే సంఘపరివార్‌ ఎంత బలహీనమైన శక్తో రుజువవుతుంది.

No. of visitors : 519
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •