ఫాసిస్టు దూకుడు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఫాసిస్టు దూకుడు

- జగబంధు, సిపిఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధి | 21.06.2017 10:33:14am

ʹసమాధాన్‌ʹ మరేమీ కాదు ఫాసిస్టు దూకుడు మాత్రమే!
విప్లవ, ప్రజాస్వామిక శక్తుల విశాల ఐక్యత నేటి అవసరం

సుకుమా చర్య తరువాత మే 7న కేంద్ర హోంమంత్రి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల, హోం మంత్రుల, డిజిపిల సమావేశం ఏర్పాటు చేసాడు. ఇందులో ʹప్రతి అంశంలోను దూకుడుగా వెళ్లాలనిʹ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చాడు. ʹచాలా జాగ్రత్తగా ఉండడంʹ, ʹరక్షణాత్మక ధోరణిలో వ్యవహరించడంʹ అన్నది అంతిమంగా ʹఎదురుదాడి సామర్థ్యాన్ని కృంగదీస్తున్నʹ విషయాన్ని గుర్తించాలిʹ అని చెప్పాడు.

ఈ ప్రకటనలోని ʹదూకుడుʹ (అఫెన్స్‌) అనే పదం కేవలం మిలిటరీ రంగానికే పరిమితమైనది కాదు. మిలిటరీ రంగంతో పాటు ప్రధానంగా భావజాల రంగానికి కూడా వర్తిస్తుంది. ఇప్పటికే కాషాయ సేన ఈ దాడి ప్రారంభించింది. రాజ్యాంగ యంత్రం నుండి కూడా ఈ దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో భాగంగానే ʹమావోయిస్టుల కన్నా మావోయిజం ప్రచారం చేసేవాళ్లే ప్రమాదకరం అనేʹ ప్రకటన వెలువడింది. ఈ మధ్య ఒక టివి ఛానల్‌లో హరగోపాల్‌తో చర్చలో పాల్గొన్న ఒక పోలీసు అధికారి ʹమావోయిస్టుల కన్నా పౌరహక్కుల సంఘాల వాళ్లే ప్రమాదకరమʹని మాట్లాడడం గమనించవచ్చు.

ఈ దాడి కేవలం మావోయిజంపైనే లేదు. మొత్తంగా ప్రగతిశీల భావాలపైన, చివరకు లిబరల్‌ డెమోక్రసీ ఆలోచనలపై కూడా దాడి ప్రారంభమైంది. బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ రచనల్లో ఈ విషయాలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి.

ఈ దాడి, వాళ్లు గొప్పగా చెబుతున్న ʹపార్లమెంటరీ ప్రజాస్వామ్యంʹ బండారాన్ని బయట పెడుతున్నది. వాళ్లిప్పుడు అఫెన్స్‌ గురించి మాట్లాడుతున్నారంటే ʹనామమాత్రపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానిʹకి నూకలు చెల్లుతాయనే. గతం నుండి కూడా పాలక వ్యవస్థను కాపాడుకోవడానికి వాళ్లు హింసపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం హింసను మరింత తీవ్రంగా ప్రయోగించేందుకు దూకుడుగా ఉన్నారు.

ఈ మార్పుకు గల నేపథ్యాన్ని కూడా మనం పరిశీలించాలి.

ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదం (ద్రవ్య పెట్టుబడి) 2008 తరువాత తీవ్రమైన సంక్షోభంలో పడింది. తొమ్మిది సంవత్సరాలు గడిచినా దానికి బయటపడే మార్గం (వే అవుట్‌) కనిపించడం లేదు. గతంలో అటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు పాత పార్లమెంటరిజం ద్వారా పాలించలేమని తెలుసుకున్న పాలకవర్గాలు ప్రజలను పక్కదోవ పట్టించేందుకు జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టేందుకు, ఫాసిస్టు అణచివేత పద్ధతులను అమలు జరిపాయి. అంతర్జాతీయంగా యుద్ధాన్ని ముందుకు తెచ్చాయి. ప్రస్తుతం తిరిగి ప్రముఖ సామ్రాజ్యవాద దేశాలలో అదే పరిస్థితి కనిపిస్తున్నది. అనేక దేశాలలో జాతీయ దురహంకారం ఒక ధోరణిగానే పెరుగుతున్నది. ఆర్థిక రంగంలో వాళ్లు రూపొందించి, ప్రపంచ దేశాలపైన రుద్దిన ʹగ్లోబలైజేషన్‌ʹకు వ్యతిరేకంగా ʹప్రొటెక్షనిజాʹన్ని ముందుకు తెస్తున్నాయి. క్రమంగా ఫాసిజం దిశగా కదులుతున్నారు. మరోవైపు యుద్ధ వాతావరణం తీవ్రతరమవుతున్నది.

మన దేశం విషయానికి వస్తే 1990ల తరువాత ద్రవ్య పెట్టుబడి సంక్షోభాన్ని ఇక్కడి పాలకవర్గాలు ఇక్కడి ప్రజలపై మరింతగా మోపారు. ఇందుకు ప్రతిఫలంగా సామ్రాజ్యవాదులు ఇక్కడి పాలకవర్గాలకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. అయితే సంక్షోభ భారాన్ని ప్రజలు మోసేందుకు సిద్ధపడకుండా వ్యతిరేకించడం, తిరగబడడం వల్ల పాలకవర్గాలకు పాత పద్ధతులలో (పార్లమెంటరీ ప్రజాస్వామ్యం) పాలించడం దుర్భరమైపోతున్నది. ఇటువంటి పరిస్థితులలో వాళ్ల ముందున్న ప్రత్యామ్నాయం ఫాసిజమే. అయితే ఫాసిజాన్ని దృఢంగా అమలు చేసేందుకు తగిన, సమర్థవంతమైన నాయకత్వం కూడా అవసరం. ఈ నేపథ్యంలోనే 2014 పార్లమెంటరీ ఎన్నికలలో సామ్రాజ్యవాదం నేతృత్వంలో దేశంలోని ఒక బలమైన పాలక వర్గ గ్రూపు మోడీని అధికారంలోకి తెచ్చారు, మోడీ, మోడీని నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే ఈ దేశంలో శిథిలమైపోతున్న పాత వ్యవస్థ (బ్రాహ్మణవాద, హిందూ మతంతో పెనవేసుకుపోయిన అర్ధ భూస్వామ్య, అర్ధ వలస వ్యవస్థ)ను కాపాడడంతో పాటు సామ్రాజ్యవాదానికి అత్యంత వినయంగా సేవ చేయగలరని విశ్వసించడం వల్లనే మోడీని అధికారంలోకి తెచ్చారు. వారి ఆశయాలకు అనుగుణంగానే మోడీ దేశంలో ఒకవైపు ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను కాపాడుతూ, మరోవైపు ఇక్కడి అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ʹదేశభక్తిʹ, ʹఅభివృద్ధిʹ మాటల ముసుగును ఫాసిస్టు పద్ధతులను అమలు చేస్తున్నాడు.

మావోయిస్టు పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ప్రజాయుద్ధం పోరాడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గంగా క్రమక్రమంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితిని వాళ్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితిని మన్మోహన్‌ సింగ్‌ ముందుగానే గుర్తించి మావోయిస్టు పార్టీ దేశ (పాలకవర్గాల) అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకారి అని ప్రకటించాడు. ప్రస్తుతం మోడీ అండ్‌ కో కూడా ప్రజాయుద్ధ ప్రమాదాన్ని తీవ్రంగా భావిస్తున్నది.

పై అంశాల నేపథ్యంలో రాజనాథ్‌ సింగ్‌ మాట్లాడిన ʹఅఫెన్స్‌ʹను అర్థం చేసుకోవాలి. అఫెన్స్‌ చేయడం అంటే వాళ్లు రూపొందించుకున్న రాజ్యాంగాన్ని, చట్టాలను కూడా అవతల పడేసి, స్టేట్‌ టెర్రరిజాన్ని (ఫాసిజాన్ని) అమలు చేయడం అనే. ఇందుకు అనుగుణంగా వాళ్లు భావజాల రంగంలో ఫాసిస్టు శక్తులను (మేధావులు, యువతను) సంఘటిత పరుస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలను (పార్లమెంట్‌ ఎన్నికలు) దృష్టిలో పెట్టుకొని కొంత సంయమనాన్ని పాటిస్తున్నట్లుగా నటిస్తున్నారు. అయితే తీవ్రతరం అవుతున్న వర్గయుద్ధం వాళ్ల అంతరంగాన్ని బయటపెడుతున్నది.

పై పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య శక్తులు రంగంలోకి దిగాల్సి ఉన్నది. ఎవరి కార్యక్షేత్రంలో వాళ్లు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాలి. ప్రజలను ఎవరు గెలుచుకోగలిగితే వాళ్లు యుద్ధంలో గెలుస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలను గెలుచుకునేందుకు విప్లవ, ప్రజాస్వామిక శక్తులు కలిసి పోటీపడాలి. గతంలో కొంతమేరకు కుదేలైన బ్రాహ్మణవాద శక్తులు నేడు మోడీ పాలనలో దేశవ్యాపితంగా సంఘటితపడి విప్లవ, పురోగామి భావాలపైన, శ్రామిక సంస్కృతి పైన దూకుడుగా దాడి చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విప్లవ శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ప్రజలలో సిద్ధాంత, రాజకీయ కృషిని వేగిరపరచాలి. బ్రాహ్మణవాద హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, విస్థాపనకు వ్యతిరేకంగా, రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులన్నిటినీ కలుపుకొని విశాల ఐక్యత ప్రాతిపదికగా పోరాడాలి.

No. of visitors : 1221
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2020
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •