కార్పోరేట్ ప్ర‌యోజ‌నాల కోస‌మే

| సాహిత్యం | వ్యాసాలు

కార్పోరేట్ ప్ర‌యోజ‌నాల కోస‌మే

- క్రాంతి | 05.07.2017 11:42:26pm

పెద్ద నోట్ల ర‌ద్దు త‌రువాత దేశం ఇప్ప‌డు కొత్త చ‌ర్చ‌లోకి న‌డిచివ‌చ్చింది. అదీ GST. సామాన్యుల నుంచి రాజ‌కీయ నేత‌ల దాకా అంద‌రి నోటా ఇదే మాట‌. జూలై 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన వ‌స్తు, సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) గురించి గ‌త కొద్ది నెల‌లుగా కేంద్ర ప్ర‌భుత్వం ఊద‌ర‌గొడుతోంది. ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌కు క‌ళ్లెం వేసేందుకే జీఎస్‌టీని అమ‌లులోకి తెచ్చిన‌ట్లు చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల మీద భారం మోపి ప్ర‌భుత్వ ఖ‌జ‌నా నింపుకునే ల‌క్ష్యం ఇందులో ఇమిడి ఉంది.

గ‌తంలో... న‌ల్ల ధ‌నానికి అడ్డుక‌ట్ట వేసే పేరిట పెద్ద నోట్లు ర‌ద్దు చేసి డిజిట‌ల్ లావాదేవీలకు ద్వారాలు బార్లా తెరిచిన కేంద్రం ఈ సారి మ‌రో కొత్త నాట‌కంతో ముందుకు వ‌చ్చింది. కార్పోరేట్ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా జ‌నం నెత్తిన కొత్త ప‌న్నుల భారానికి తెర‌తీసింది. దేశ‌మంతా ఒకే ప‌న్నుపేరుతో జీఎస్‌టీని ముందుకు తెచ్చిన కేంద్రం.. ఈ విధానంతో ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని, దేశ జాతీయాదాయం వృద్ధి చెందుతుంద‌ని గొప్ప‌గా ప్ర‌చారం చేస్తోంది. కానీ వాస్త‌వాలు మాత్రం విరుద్దంగా ఉన్నాయి. వివిధ పరోక్ష పన్నులు, సేవా పన్నులను విలీనం చేయడం ద్వారా తీసుకువచ్చిన జీఎస్‌టీతో చిన్న వ్యాపారుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది. వాల్‌మార్ట్‌లాంటి కార్పోరేట్ మాల్స్‌, ఆన్‌లైన్ వ్యాపారాల ప్ర‌యోజ‌నాల ఇందులో దాగి ఉన్నాయి. ఇంత‌కాలం వ్యాపార సంస్థ‌ల నుంచి రాష్ట్రాల‌కు వ‌చ్చే ప‌న్నుల్లో మెజార్టీ నేరుగా కేంద్రానికి చేర‌నున్నాయి. అంటే కేంద్రం పెత్త‌నం పెర‌గ‌డంతో పాటు
రాష్ట్రాల‌ను బ‌ల‌హీన ప‌రిచే కుట్రను అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్నుల మీద న‌డిచే ప్ర‌భుత్వాలు ఒక్క‌శాతం ఉన్న సంప‌న్నుల ప్ర‌యోజ‌నాల కోసం అశేష ప్ర‌జానికం ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నాయి. రాజుల కాలంలో జ‌నం గోళ్లూడ‌గొట్టి ప‌న్నులు వ‌సూలు చేసిన తీరునే.. వ‌ర్త‌మానంలో వేరువేరు పేర్ల‌తో ప‌న్నుల భారం మోపుతోంది. ప్ర‌స్థుతం కేవ‌లం సేవా ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వ ఖ‌జానాకు రెండు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా చేరుతోంది. జీఎస్‌టీ అమ‌లుతో ఇది రెట్టింపు కానుంది. జీఎస్‌టీ కింద కేవ‌లం ధ‌ర‌లు పెర‌గ‌డానికి అవ‌కాశం ఉన్న‌వాటిని మాత్ర‌మే చేర్చింది. ధరలు తగ్గటానికి అవ‌కాశం ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులను ఇందులో చేర్చలేదు. దీన్ని బ‌ట్టి ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిని అర్థం చేసుకోవ‌చ్చు.

రైతాంగంపై సైతం జీఎస్‌టీ తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న‌ కేంద్రం రోజు రోజుకూ రైతుల‌ను సంక్షోభంలోకి నెడుతోంది. ఇప్పుడు మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా జీఎస్‌టీతో రైతులను మరింత దివాళా తీయించటానికి సిద్ధ‌మైంది. ఒకే పన్ను విధానం ద్వారా ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గుతుంద‌ని చెప్పిన ప్ర‌భుత్వం, విపరీతంగా పన్నుల భారాన్ని పెంచింది. వ్య‌వ‌సాయం రంగంపై గ‌తంలో 4 నుంచి 8 శాతం ఉన్న ప‌న్నుల‌ను 12 శాతం పెంచింది. మ‌రోవైపు పెరిగిన ర‌వాణా ప‌న్ను రైతాంగాని భారంగా మార‌నుంది. వ్యవసాయోత్పత్తులకు కావలసిన ముడి సరుకులను జీఎస్‌టీ ప‌రిధిలో చేర్చ‌డం వ‌ల్ల వ్య‌వ‌సాయ రంగం మ‌రింత సంక్షోభంలోకి వెళ్ల‌నుంది. రైతుల రుణాలు మాఫీ చేయ‌లేని ప్ర‌భుత్వం పెట్టుబ‌డి దారుల ప్రోత్సాహం పేరుతో వేల కోట్ల రాయితీలు ఇస్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప‌న్నుల ఎగ‌వేత దారుల‌కు క‌ళ్లెం పేరుతో మెజార్టీ ప్ర‌జానికం జేబుకు చిల్లుపెట్టే ప‌నిలో ప‌డింది ప్ర‌భుత్వం.

No. of visitors : 572
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •