గుర్మేహర్‌

| సాహిత్యం | క‌విత్వం

గుర్మేహర్‌

- వడ్టెబోయిన శ్రీనివాస్‌ | 06.07.2017 12:21:58am

నన్నే మాట్లాడాలి
కాలం నేనైపోవాలి

నేనే నేనే నేనే ననే వ్యాధి ముదిరింది

పితృస్వామ్య‌ పెత్తనంలో
స్వేచ్ఛ‌
గడపదాటొద్దు
పెదవి దాటొద్దు
మృగాళ్ళే వేదశాసనం

గుర్మేహర్‌
నీకు మెదడుండడం తప్పైంది
నువ్వాలోచించడం నేరమైంది
అంగదురహంకారమనురాజ్యమున్నచోట
నీకు మనసుండడం
మత వ్యతిరేకమైంది
నీ రక్తబంధ తపనకు
రాకాసి కాషాయపడగ బుసలు కొట్టింది

శాంతి
అధికారం బద్దశతృవు

ఆకలి
సరిహద్దు మంటల్లో
యుద్ధ సమిధవడమే
అధకారం అందించే దేవుడైనపుడు

నువ్వుజి
నిర్యుద్ధనేల కల గంటే
నవ్వుల సరిహద్దుల్ని వింటానంటే

కాషాయం శ్వాస కల్లోలమైంది
ఆడది
అభిప్రాయమైనిటారుగా నిలబడడం
అనాది సనాది ఆధునిక సీతల
అగ్నిజ్వాలల్లో ముంచుతున్న సనాతనం కంట్లో
కారమై ఎగిసిపడింది

గుర్మెహర్‌
నాన్న రుచి కోల్పోయిన జ్ఞాపకాలగాయం
నీగుండెల్లో రక్తమొడ్తుండవొచ్చు
హిందుత్వవిచ్చుకత్తుల విన్యాసం
నీమనస్సు పొక్కిలి పొక్కిలి చేయవచ్చు

కానీ
నీమానవీయం తగిలి
మీసం మెలేసిన మగతనం మీద గడ్డిమొలుస్తోంది
కాషాయ దొరతనం బ్రద్ధలవుతుంది





No. of visitors : 270
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


జలగలంచ, దేవునిగుట్ట ఆదివాసుల్ని బతకనీయండి!

వడ్డెబోయిన శ్రీనివాస్‌ | 05.10.2017 11:16:52pm

వారు నోరు లేనోళ్ళు.అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడవిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది.అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు......
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
    అరుణతార జనవరి - 2018
    జయహో టి.టి.ఆర్‌.
    జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌
    కుందాపన
    కాస్త..దారిస్తారా!
    చూపుడు వేలై పొడుచుకొస్తాను
    చీగుడ్లు
    విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి
    కవులారా ఓ కళాకారుల్లారా
    కులమతాలు లేని సమాజం కోసం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •