ఒకప్పుడు విప్లవ కవిత్వం విద్యుత్ ప్రవాహ సదృశ్యంగా ఉండేది. ఇప్పటికీ ఆ సూటిదనం, ఉద్వేగ గుణం నిలబెట్టుకున్న పాయ ఒకటి కొనసాగుతున్నది. దీంతోపాటు విప్లవ కవిత్వం ప్రతి దశకంలో అనేక కొత్త వ్యక్తీకరణలు సంతరించుకుంటున్నది. హద్దులు లేని వ్యక్తీకరణ విస్తృతి విప్లవోద్యమం వల్లే విప్లవ కవిత్వానికి పట్టుబడింది. ప్రతి అయిదేళ్లలో, పదేళ్లలో ఈ వ్యక్తీకరణ వైవిధ్యాన్ని, విస్తృతిని ప్రకటించిన కవులు ఎందరో ఉన్నారు. కవితా రచనలో వ్యక్తిగత సృజనాత్మక ప్రతిభ ఉన్నప్పటికీ దీనికొక ఉద్యమ స్వభావం కూడా ఉంటుంది. అంటే సామూహికత్వం. ప్రజా ఆచరణ. ఒక కాలంలో ఒక కవిలో పలికిన వైవిధ్యభరిత వ్యక్తీకరణ వెనుక ఆనాటి విప్లవోద్యమ ఆవరణ తప్పక ఉంటుంది. స్థూలంగా ఆ ప్రభావంలోంచే ఆ వైవిధ్యం కవులకు పట్టుబడుతుంది. అందువల్ల ఏక కాలంలో విభిన్నమైన కవితా వ్యక్తీకరణలు విప్లవ కవిత్వంలోని ప్రతి దశలోనూ కనిపిస్తాయి. అంటే తొలినాళ్ల లాంటి సూటి కవిత్వం రాస్తున్న కవులూ, ఒక నిర్దిష్ట కాలం, ఉద్యమ సన్నివేశం అత్యంత ప్రయోగాత్మకంగా ఎన్నెన్ని రకాల కవిత్వం కాగలదో వ్యక్తీకరిస్తున్న కవులూ విప్లవ సాహిత్యోద్యమంలో ఉంటారు. ఇది అంతా కలిస్తే విప్లవ కవిత్వం.
అలా ఈ దశకంలో విప్లవాన్ని చాలా వైవిధ్యభరితంగా కవిత్వం చేస్తున్న వాళ్లలో కెక్యూబ్ వర్మ ఒకరు. ఆయన తాజా కవితా సంపుటి కాగుతున్న రుతువు. ఈ సమయ సందర్భాల విప్లవ కవిత్వానికి ఇదొక ఉదాహరణ. ఆయన ʹవెన్నెల దారిʹలోంచి ʹరెప్పల వంతెనʹ మీదుగా ఈ కాగుతున్న రుతువులోకి చేరాడు. ఒక కవి ఎలా రూపొందుతాడో ఈ మూడు సంపుటాల్లో తెలుసుకోవచ్చు. ఒక మామూలు మనిషి కార్యకర్తగా, సృజనకారుడిగా అనేక జీవన తలాల్లోంచి సాగే పరివర్తన క్రమాన్ని ఆయన మొత్తం కవిత్వంలో చూడవచ్చు. ఈ మూడు కవితా సంపుటుల శీర్షికల్లో కూడా ఆయన చేసిన కవితా ప్రయాణంలోని ఉద్యమ సన్నివేశాలను గమనించవచ్చు. వాటి వెనుక ఉన్న విప్లవోద్యమ గతిశీలతలను కూడా కలిపి చదువుకుంటే వర్మలోని సృజనాత్మక వికాసం ఏ ఏ దశల్లో ఎలా రెక్కలు విప్పిందీ తెలుసుకుంటాం. విప్లవమనే వెన్నెలదారిలో ప్రయాణం మొదలు పెట్టి అతి కొద్ది కాలంలోనే అదొక రెప్పల వంతెన మీదిగా సాగుతుందనే ఎరుక పొందాడు. జగమంతా పరుచుకున్న వెన్నెల దారిలో నడుస్తూ .. నడుస్తూ కనుపాపకు రక్షణ ఇచ్చే రెప్పల వంతెన మీదికి చేరుకోవడం ఒక సునిశిత అన్వేషణ. సున్నితమైన కొనసాగింపు. బైటినీ, లోపలినీ కలగలుపుకోవడం. ఈ ప్రక్రియే ఒక కవితా రచనలోని వ్యూహం. అదంతా వర్మ రెప్పల వంతెనలోనే కనిపిస్తుంది.
కాగితంపై ఒలికి పోయిన రంగులలోంచి
గాఢంగా ఓ చెరిగిపోని చిత్రం..
నీవా? నేనా?
ఈ వెతుకులాటలో ఓ స్పష్టత ఉన్నది. అందువల్ల ప్రతి ఫీలింగ్ కవిత్వమవుతూ వచ్చింది. ʹకనురెప్పల వంతెన కింద నల్లని రేఖగా కరిగిపోవడంʹలోని దు:ఖపులోతుల్లోకి వెళ్లే కొద్దీ ఏది ఎలా కవిత్వమవుతుందో వెన్నెలదారిలో కంటే మరింత బాగా తెలిసింది.
కవిగా ఇది ఆయన పరిణత అన్వేషణ. ఇందులో విప్లవాన్ని ఎక్కడెక్కడ, ఎలా చూడాలో తెలుసుకున్నాడు. రెప్పల వంతెన దాటి మరో కొత్త జీవన, ఉద్యమ సన్నివేశంలోకి చేరుకున్నాడు. నిజంగానే ఇది కాగుతున్న రుతువు. విప్లవానికి, జీవితానికి కూడా వర్తించే పదబంధం. ఈ ఆవరణ గురించి వర్మకు చాలా స్పష్టత ఉన్నది. అదంతా ఈ మూడో సంపుటంలోని ప్రతి కవితా, అందులోని ప్రతి దృశ్యమూ ఎత్తి చూపుతాయి. ఈ కవిత్వం చాలా లోపలి నుంచి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ముట్టుకోగానే ఆ లోపలి వెలుగు రేఖలు మన మీదికి ప్రసరిస్తాయి. విశిష్టత ఏమంటే.. బైటి నక్షత్ర కాంతులు, చంద్ర కళలు, ఉదయాస్తమయాలు, ఇంద్ర ధనస్సులూ అద్దిన వెలుగు రేఖలివి. మామూలు మాటల్లో చెప్పాలంటే బైటి ప్రపంచంతో సంబంధం లేని లోపలి గొడవ కాదిది. ఈ సంబంధాన్ని కవిత్వం చేయడంలో వర్మ ఊహాశక్తి ఈ మూడో సంపుటం నాటికి వేల కొలది రంగుల రెక్కలు తొడిగింది. సరిగ్గా విప్లవ కవి ఎక్కడికి చేరుకోవాలో వర్మ అక్కడికి చేరుకున్నాడనడానికి ఈ సంపుటి ఉదాహరణ.
ఈ సంపుటంలోని కొన్ని కవితలను తీసుకొని విప్లవాన్ని, సాయుధ సంఘర్షణను, దాని ముందుకు నడిపే బలిదానాలను, అనివార్య విషాదాలను వర్మ తన ఊహాశక్తితో ఎన్నెన్ని జీవన తలాల్లోకి తీసికెళ్లాడో విశ్లేషించవచ్చు. ఒక గడ్డు వాస్తవం కాల్పనిక రూపం ధరించాలి. కళ కావడం అంటే అదే. అప్పుడే వాస్తవికత విలక్షణంగా కమ్యూనికేట్ అవుతుంది. దీని వెనుక కళాకారుల ఊహాశక్తి ఉంటుంది. ఊహ తెగిన గాలిపటం కాకూడదు. అప్పుడది ఏ ఆకాశంలో ఎగురుతుందో చెప్పలేం. వర్మ తన ఊహాశక్తిని నేల మీద సజీవ వాస్తవికతతో ముడేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి అనంత ఆకాశంలో హద్దులు లేకుండా తన వ్యక్తీకరణను విస్తరించాడు. కాగుతున్న రుతువంతా అదే.
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
ఈ తీసివేతలు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా......... |
ఆజాదీ కశ్మీర్ : చల్లారని ప్రజల ఆకాంక్షకాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........ |
రైతు - నీళ్లురైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం...... |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |