గూర్ఖాలాండ్‌ - ఓ ప్ర‌జాస్వామిక డిమాండ్‌

| సంపాద‌కీయం

గూర్ఖాలాండ్‌ - ఓ ప్ర‌జాస్వామిక డిమాండ్‌

- పి.వరలక్ష్మి | 06.07.2017 02:18:54am

ప్రత్యేక గూర్ఖాలాండ్‌ రాష్ట్రం కోసం గూర్ఖా ప్రజల నిరవధిక బంద్‌ 20 రోజులు దాటింది. ముప్పై ఏళ్లనాటి ఆందోళనలు గుర్తుకు తెచ్చేలా ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. 1980ల నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సుమారు 1200 మంది చనిపోయారు.

ఒక సున్నితమైన సమస్యతో ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో బెంగాల్‌ ప్రభుత్వ ఉదాహరణే కాదు, జాతుల సమస్య ఏది తీసుకున్నా మనకర్థమవుతుంది. ఉదాహరణకు కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో మాట్లాడ్డానికి మన ప్రజాస్వామ్యానికి మానవత్వపు భాషే కరువవుతుంది. ఇప్పుడు గూర్ఖాలాండ్‌ ఉద్యమం ఉధృతమవుతున్న దశలో సరిగ్గా ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న సిలిగురి ప్రాంతంలో గూర్ఖాలాండుకు వ్యతిరేకంగా బెంగాళీల ఆందోళన మొదలైంది. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర పాలకవర్గాలు నడిపించిన ఆందోళనల వంటివి అక్కడి పాలకులు నడిపిస్తున్నారు. అంతకన్నా ఎక్కువగా గూర్ఖాలాండుకు మద్దతు తెలిపిన సిక్కిం ప్రాంతీయులపై, వారి వాహనాలపై దాడులు కూడా చేస్తున్నారు. బెంగాల్‌ రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని బెంగాలీయులు జరిపే ఆందోళనా కార్యక్రమాలలో ఎక్కువగా తృణమూల్‌ కార్యకర్తలు కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్యనే దర్జాగా ఆస్తులు ధ్వంసం చేస్తూ గూర్ఖా ప్రజలను విచ్ఛిన్నకారులని ఆడిపోసుకుంటున్నారు. ఇదిప్పుడు కొత్తగా మొదలైంది కాదు. విభజన గురించి డిమాండ్‌ వినిసించినప్పుడు గూర్ఖాలకు వ్యతిరేకంగా గతంలోనూ ఇటువంటి కౌంటర్‌ ఉద్యమాలు జరిగాయి.

గూర్ఖా ప్రజల సమస్య ఏమిటి? ఎందుకు వాళ్లు ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నారు? అలా అడగడం నేరమా? ఈ ప్రశ్నలు ఏ ప్రాంతీయ ఉద్యమంలోనైనా, జాతి ఉద్యమంలోనైనా వేసుకోవలసినవి. వాటికి సమాధానాలు ఓపికతో, సహానుభూతితో వినే ప్రజాస్వామిక విలువలు చాలా ముఖ్యం. మనం మాట్లాడకుండా అవతలివాళ్ల వాదన కాసేపు వినగలిగే సహనం చిన్న విషయం కాదు. కశ్మీర్‌ను భారతీయులు ఎంతమంది వినగలరు? మరీ ఇప్పటి వాతావరణంలో ఈ ప్రశ్న చాలా కష్టంగా ఉంటుంది. ʹమేం బెంగాలీయులం కాదు. మమ్మల్ని వేరుగా గుర్తించండి. మా భాషను గుర్తించండి. మమ్మల్ని ఈ దేశ ప్రజలుగా గుర్తించండʹని నూటపదేళ్లుగా బెంగాల్‌ ఉత్తర భాగంలోని ఒక చిన్న సమూహం అడుగుతోంది. అది అత్యంత వివక్షతను, హేళనను ఎదుర్కుంటున్న సమూహం.

గూర్ఖాలను మొట్టమొదట పరాయివాళ్లగా చూస్తారు. వాళ్లు నేపాలీ భాష మాట్లాడతారు కానీ నేపాల్‌ దేశస్థులు కారు. కానీ వీళ్లు నేపాల్‌ నుండి వలస వచ్చిన వాళ్లని అనుమానించడం వల్ల రేషన్‌ కార్డులు, ఓటరు కార్డులు పొందడం కూడా వీళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. మా భాషను, మా జాతిని గుర్తించనందువల్లే కదా మేం ఈ దేశవాసులమే అని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది అంటారు గుర్ఖాలు. ఉపఖండంలో అనేక చిన్నా చితకా రాజ్యాలు బ్రిటీష్‌ ఇండియాలో భాగమైనట్లే వీళ్ల భూభాగం బ్రిటీష్‌ స్వాధీనమైంది. ఇప్పటి డార్జిలింగ్‌ జిల్లా, పక్కనే ఉన్న దోవర్స్‌ ప్రాంతం (జలపాయగురి జిల్లా) సిక్కిం, భూటాన్‌ రాజ్యాల్లో ఉండేవి. 1835లో సిక్కిం రాజు డార్జిలింగ్‌లో కొంత ప్రాంతాన్ని బ్రిటీష్‌ వాళ్లకు ఇచ్చేశాడు. మిగిలిన ప్రాంతంతోపాటు తెరాయి ప్రాంతాన్ని 1850లో బ్రిటీష్‌ వలసవాదులు స్వాధీనం చేసుకున్నారు. 1865లో భూటాన్‌తో యుద్ధం చేసి కలింపాంగ్‌, దోవర్స్‌ ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాలను బెంగల్‌ ప్రెసిడెన్సీకి అనుసంధానం చేసినా షెడ్యూల్డ్‌ జిల్లాగా ఉంచారు. అలా కాకుండా పూర్తిగా బెంగాల్‌ నుండి వేరు చేసి ప్రత్యేక పరిపాలనా విభాగంగా చేయాలని 1907 నుండి ఆ ప్రాంతం వాళ్లు అడుగుతున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎస్‌.ఆర్‌.సి గూర్ఖాలను గుర్తించలేదని, ఆ విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం కుట్ర చేసిందని చెప్తారు. ఏకంగా జనాభా లెక్కలే తప్పుగా చూపించి ఆ ప్రాంతంలో నేపాలీ భాష మాట్లాడేవాళ్లు 66 శాతం కాగా 17శాతం మాత్రమేనని చూపించారట. వాస్తవానికి ఆ ప్రాంతంలో గూర్ఖాలతో పాటు కొన్ని ఆదివాసీ తెగలున్నాయి కానీ డార్జాలింగ్‌, దోవర్స్‌ ప్రాంతాలో అన్ని సమూహాల మధ్య నేపాలీ భాష వినిమయంలో ఉంటుంది. కానీ బెంగాల్‌ ప్రభుత్వం డార్జిలింగ్‌ సహా అన్ని ప్రాంతాల్లో బెంగాలీ భాషను అధికార భాషగా అమలు చేస్తోంది. బలవంతంగా తమపై బెంగాలీ భాషను రుద్దడాన్ని నిరసిస్తూ 1961లో నేపాలీ భాష మాట్లాడే వాళ్లు ఆందోళనలు చేయగా చివరికి నేపాలీని రెండో అధికార భాషగా గుర్తించారు. కానీ చలామణిలో బెంగాలీ భాషనే ఉంటున్నది. అన్ని ప్రభుత్వ పత్రాలు బెంగాలీలోనే ఉంటాయి. రెండు యూనివర్సిటీల్లో (నార్త్‌ బెంగాల్‌, కలకత్తా) తప్ప డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యువేషన్‌లో ఎక్కడా నేపాలీ భాష అధ్యయనం కూడా లేదు. ఇక బ్యూరోక్రసీలో, ఉద్యోగాల్లో అవకాశాలు, ఆధిపత్యాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.

గూర్ఖాలు, ఆదివాసీల పట్ల చిన్న చూపు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కూడా హీనంగా ఉండటం, ఉపాధి, జీవన ప్రమాణాలు దయనీయంగా ఉండటం వెరసి గూర్ఖాలు తమ జాతిని వేరొక జాతి ఎదగనీయకుండా చేస్తున్నదని బలంగా అనుకునే స్థితి వచ్చింది. ఇది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తేయాకు తోటలు, టూరిజం ఇక్కడ ప్రధాన ఆదాయ రంగాలు.

ఇటీవలి కాలంలో తేయాకు తోటలు కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయి. టూరిజంలో కూడా ఉపాధి అవకాశాలు పెద్దగా లేవు. ఇట్లా అన్ని రకాల అసంతృప్తులు గూర్ఖాలాండ్‌ ఉద్యమంలో చిక్కనవుతున్నాయి. ఉద్యమాన్ని చల్లార్చడానికి ఒకసారి డార్జిలింగ్‌ కొండప్రాంతాలకు ప్రత్యేక కౌన్సిల్‌ ఏర్పాటు చేసారు. మరోసారి గూర్ఖాలాండ్‌ ప్రాదేశిక పాలనా సంస్థను (గూర్ఖాలాండ్‌ టెరిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఏర్పాటు చేసారు. కానీ బెంగాల్‌ ప్రభుత్వం, బ్యూరోక్రసీ చాలా సులభంగా వాటి నిధులను మళ్ళించేస్తుందని గూర్ఖా ఉద్యమకారులు అంటారు. పేరుకేగాని హిల్‌ కౌన్సిల్‌కు, టెరిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు ఎటువంటి అధికారాలు ఉండవని, ఇలాంటివన్నీ మాయచేసి మభ్యపెట్టడానికేనని వీళ్ల ఆగ్రహం.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు ఘోర వైఫల్యాలలో జాతుల సమస్య ఒకటి. డెభ్బై ఏళ్లయినా జాతుల సమస్యను పరిష్కరించడం కాదు కదా, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేస్తున్నట్లు కనపడదు. భారతజాతీయతలో వివిధ జాతుల్ని గుర్తించ నిరాకరించే దురహంకారం ఉంది. కృత్రిమమైన మెజారిటీ ఆధిపత్యభావనను రాజ్యం ప్రజలకు సంక్రమింపజేసింది. ఒక పక్క హిందీని అధికార భాషగా ఎట్లా అంగీకరిస్తాం అని ధిక్కార స్వరంతో మాట్లాడుతూ మరో వైపు బెంగాలీ భాషలో విద్యాబోధన తప్పనిసరి చేయాలని ప్రయత్నించిన బెంగాల్‌ ముఖ్యమంత్రికి గూర్ఖాలు సరైన గుణపాఠమే నేర్పుతున్నారు. కానీ గూర్ఖాలకు వ్యతిరేకంగా బెంగాలీలను రెచ్చగొట్టడం పాలకులకు సులభమైంది. అది గూర్ఖాలాండ్‌ ఉద్యమాన్ని ఎంత వరకు అడ్డుకుంటుందన్న విషయం పక్కన పెడితే ఇక్కడ పనిచేస్తున్న భావజాలం ప్రమాదకరమైనది. అది వివక్షకు గురవుతున్న జాతుల పట్ల, ప్రాంతాల పట్ల ఉండాల్సిన ప్రజాస్వామిక వైఖరికి సంబంధించినది. అది లేకపోతేనే ʹఅంత చిన్న భూభాగం పెట్టుకొని రాష్ట్రం అడగటమేమిటి? రెండు జిల్లాలకే రాష్ట్రం ఏర్పాటు చేయాలా?ʹ వంటి ప్రశ్నలు అలవోకగా పుట్టుకొస్తాయి. (రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతీయ ఉద్యమాలకూ ఇవే ప్రశ్నలు పుట్టుకొస్తాయి). దీనికి సమాధానంగా రెండే జిల్లాలున్న ఏ గోవా ఉదాహరణో తీసుకురానక్కర్లేదు. ఒక జాతిని గుర్తించడానికి ప్రమాణాలేమిటి? జనసంఖ్య, ప్రాంత విస్తీర్ణం కొలమానాలుగా జాతిని గుర్తిస్తామా? లేక ఎంత చిన్న ప్రాంతమైనా దాని ప్రత్యేక లక్షణాలను బట్టి అది ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా ఎదిగే అవకాశం కల్పిస్తామా అన్నదే ప్రజాస్వామిక వైఖరికి కొలమానం. ఒక జాతిని గుర్తించి గౌరవించి గూర్ఖా ప్రజల పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం.

No. of visitors : 1026
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •