ఆత్మగౌరవం కోస‌మే కాదు - ఆర్థిక, రాజ‌కీయ విధానాల‌పై కూడా పోరాడాలి : జిఘ్నేష్ మెవానీ

| సంభాషణ

ఆత్మగౌరవం కోస‌మే కాదు - ఆర్థిక, రాజ‌కీయ విధానాల‌పై కూడా పోరాడాలి : జిఘ్నేష్ మెవానీ

- ఇంట‌ర్వ్యూ : మాధ‌వి క‌ళ‌ | 07.07.2017 10:42:19am

ఆవు తోక మీరు ఉంచుకొండి - మా భూమి మాకు పంచండి అంటూ ద‌ళిత ఉద్య‌మానికి కొత్త నినాదం ఇచ్చిన ఉనా దళిత్ అత్యాచార్ లడత్ సమితి నాయ‌కుడు జిఘ్న‌ష్ మెవాని హిందుత్వ దేశంలో భ‌యోత్పాత వాతార‌ణాన్ని సృష్టించాల‌నుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు. మితిమీరిన ప్రపంచీకరణ పోకడలు, మత రాజకీయాల క‌ల‌యితే బీజేపీ అంటున్నారు. ద‌ళితులు ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక అంశాలు, మౌళిక సదుపాయల కోసం కూడా పోరాడాల్సి ఉంద‌టున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను గుర్తించిన్పుడే నిజమైన ఉద్య‌మం ఆరంభ‌మ‌వుతుందంటున్న జిఘ్నేష్ మెవానీ ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం...

ఉనా ఘ‌ట‌నే మిమ్మ‌ల్ని ఎందుకు క‌దిలించింది?


దళితల‌పై జరుగుతున్న వ‌రుస దాడుల‌ను చూస్తుంటే ఎవ‌రిలోనైనా ఆవేశం కలుగకమానదు. గుజరాత్లో 10-15ఏళ్ల కాలంలో దళితులు, ముస్లీంల‌పైన‌ అనేక దాడులు జరిగాయి. ఆ భాదంతా అంద‌రిలో గూడుకట్టుకుని ఉంది. కేవలం ఒక ట్రిగర్ కోసం ఎదురు చూస్తున్నారంతే. ఉనా ఉదంతం వీరందరికి ట్రిగర్లా ఉపయోగపడింది. అయితే కేవలం నిరసన వ్యక్తం చెయ్యటం సరిపోదు. అందుకే... సామాజికవేత్తలను, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని ఒక చోటుకి తీసుకురావాటానికి ప్రయత్నించాం. తర్వాత ఒక ఎజెండా సిద్ధం చేశాం. తలోదిక్కుగా ఉన్న వారందరినీ ఒక చోటికి చేర్చటమే ఈ సందర్భంలో నేను పోషించిన పాత్ర.

ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించింది?


సందర్భం అలాంటిది. చాలా సార్లు ఒక దాడి జరిగిన తర్వాత పలువురు స్పందిస్తారు. మెల్లిమెల్లిగా ఆ స్పందనకు సరైన రూపం, లాజిక్ లేకుండా పోతుంది. అందుకు కార‌ణం ఉద్య‌మానికి స‌రైన ఎజెండా లేక‌పోవ‌డం కార‌ణం. అందుకే... మొదలైనంత వేగంగా ఆగిపోతుంటాయి. ఈసారి అలా జరుగకూడదనుకున్నాను. 31జూలై, 2016లో దళిత మహాసభ జరిగింది. వేలాది మంది దళితులు ఒక చోటికి చేరారు. సమాజం నీచంగా భావించే పనులు ఇకపై చెయ్యమని శపథం చేశారు. 5 రోజుల తర్వాత అహ్మదాబాద్ నుంచి ఉనా పాదయాత్ర ప్రారంభించాం. ఆ యాత్రలో పాల్గొన్న దళితులు ఇకపై డ్రైనేజ్లలో దిగి వాటిని శుభ్రం చెయ్యం, మృతపశుచర్మం తియ్యం అని శపథం చేశారు. ఆవు తోక మీరే ఉంచుకొండి.. మాకు మా భూములివ్వండి అనే నినాదంతో ఈ యాత్ర చేపట్టాం. దేశంలోనే కాదు యూరోపియన్, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తమ మద్దతును తెలిపారు. ఉనాలో ఆగస్ట్ 15న చాలా పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. ఆసభ తర్వాత మొదటిసారి మోడీ నోరు మెదిపారు.

ఈ సంద‌ర్భంలో దళిత - ముస్లింల ఐక్య‌త‌ను ఎలా అర్థం చేసుకోవ‌చ్చు?


ఉనా వల్ల దళిత, ముస్లీం ఐక్యత సాధన గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుందేమో. ఇద్దరి మధ్య రాజకీయ, మతపరమైన విబేధాలున్నాయి. గుజరాత్ అల్లర్లలో ముస్లీం మీద జరిగిన దాడుల్లో దళితులు పాల్గొనటం నిజమే. ఇప్పుడు దళితుల ఆలోచనల్లో మార్పు, పశ్చాతాపం వచ్చింది. దళితులను, ముస్లీంలను రెండవ తరగతి నాగరికులుగా, అంటరానివారిగా చూశారు, చూస్తున్నారు. ఊరి బయట ఉంచుతారు, ఇరు వర్గాల వారూ శ్రామిక ప్రజలే. ఇలా సామాజిక, వర్గ సమస్యలు ఇద్దరికి ఒకేలా ఉండటం వారిని ఒక చోటుకి తీసుకువస్తాయి. కొంచెం సమయం పట్టినా ఇది జరుగుతుంది.

మీ ఉద్యమం ప్రధాన డిమాండ్లు ?


న్యాయం, ప్రగతిశీల రాజ్యాంగం, సామాజిక అసమానతల రద్దు, కులనిర్మూలన ఇవి మా ప్రధాన లక్ష్యాలు. ఈ రోజు ఉన్నంత కుల పిచ్చి ఇండియాలో ఎప్పుడు లేదనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో రంకెలేసున్న ఈ ప్రభుత్వాన్ని కులనిర్మూలన చెయ్యమంటున్నాం. చనిపోయిన ఎద్దుల చర్మాలను వలిచేది లేదు, మాకు భూములు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. గుజరాత్లో ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన బడ్జెట్ ను ఇత‌ర‌ అవసరాలకు వాడేస్తున్నారు. ఆ బడ్జెట్ కేటాయింపులను దళితులకే వినియోగించాలి. పిఓఏ కోసం ప్రత్యే క కోర్టులు లేవు. 50 వేలకు పైగా మ్యాన్యువల్ స్కావెంజింగ్ చేస్తున్నారు. లక్షకు పైగా పారిశుధ్యం పనులు చేసే వారికి సాధారణ వేతనాలు కూడా లభించటం లేదు. వారికి వేతనాలు ఇవ్వాలి. మురికి పనులు చేసే మాకు మంచి భూములు ఇవ్వండి అంటున్నాం. రిజర్వేషన్ యాక్ట్ ఎవ‌రికి వాళ్లు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. రిజర్వేషన్ యాక్ట్‌ని అతిక్రమించిన వారిపై ఎలాంటి చ‌ర్య‌లూ లేవు. అందుకే చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.


భూపంపిణి కోసం మీరు చేస్తున్న పోరాటాన్ని వర్గ‌ కోణంలో చూడవచ్చా?


మన దేశంలో కులమే స్థాయిని నిర్ణయిస్తుంది. దానిని అధిగమించాలి అంటే భూసంస్కరణలు జరగాలి. అగ్రవర్ణాల చేతిలో భూములుండటం వల్లే గ్రామాలు వారి నియంత్రణలో ఉంటున్నాయి. ఇరవై ఏళ్లలో సాగిన దళిత ఉద్యమాలు చూస్తే అవి ఆర్థిక, వర్గ పరమైన పోరాటాల కంటే అస్థిత్వ రాజకీయాలనే తెరపైకి వచ్చాయి. నమో బుద్ధాయ, జైభీం, మను వాద్ ముర్దాబాద్, బ్రాహ్మణ వాద్ ముర్దాబాద్ నినాదాలే మిగిలాయి.
ఆరోగ్యం, నిరుద్యోగం, మోది చెప్పే అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడడంలేదు. కార్పోరేట్ దోపిడీ వల్ల చనిపోతున్న దళితుల గురించి, ఎందుకు అడగడంలేదు. అంటే వీటిలో ఆర్థికపరమైన కోణాన్ని పట్టించుకోలేదు.

దళిత మహిళకు ఎలాంటి హక్కులు కావాలంటున్నారు?


కులం వల్ల దేశంలో ఎంత అరాచకం జరుగుతుందో, పురుషాధిక్యత అలాంటి ప్రభావాన్నే చూపిస్తుంది. కుల, వర్గ, లింగ వివక్షలను తగ్గించేదిగా మా అజెండా రూపొందించాలనుకున్నాం. అంబానీ, అదానీలకు కాకుండా దళితులకు, భూమిలేని వారికి, పేదలకు భూములు పంచాలి. దళితుల్లోను వాల్మీకులకు భూమి చెందాలి. అందులో వాల్మీకి స్త్రీలకు, వారిలోను భర్త లేని స్త్రీలకు, అందులోనూ మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ చనిపోయిన వ్యక్తి భార్యకు అలా ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రక్రియ సాగాలని కోరుకుంటున్నాం.

గుజరాత్లో కుల ప్రాబల్యాన్ని ఎలా అంచనా వేయవచ్చు?


గుజరాత్లో దళితులు 7 శాతం మంది ఉన్నారు. 1981, 1985లో యాంటి రిజర్వేషన్ అల్లర్లు గుజరాత్లో జరిగాయి. ఇవి బిజేపీ రాజకీయ మనుగడకు బాగా ఉపయోగపడ్డాయి. గుజరాత్లో 109 గ్రామాల్లో పోలీసుల రక్షణలో దళితులు నివసిస్తున్నారు. రక్షణ లేకపోతే వారిని చంపేస్తారు. 50 వేలకు పైగా మాన్యువల్ స్కావెంజర్స్, లక్షకు పైగా పారిశుధ్యం పనులు చేసే వారికి సాధారణ వేతనాలు కూడా లభించటం లేదు. 2004లో 24 మంది దళిత స్త్రీలపై అత్యాచారం జరుగగా, 2014లో ఈ సంఖ్య 74కుపెరిగింది. ఓబిసికి చెందిన శూద్ర, పటేల్ కమ్యూనిటీ భూసంస్కరణల వల్ల బాగా లాభపడింది. ఆర్థికంగా ప్రగతి సాధించిన వారి ఆలోచనల్లో సామాజికంగా ఎటువంటి పరిణితి రాలేదు. అలాంటి సామాజిక, ఆర్థిక, వర్గ విబేధాలు దళితలపై హింసకు పురికొల్పే అవకాశాన్నిస్తున్నాయి.

మరి ప్రజలు ఎందుకు ప్రతిఘటించలేదు ?


ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత, ప్రతిఘటనా కాంక్ష ఉన్నా ఒక గట్టి ప్రత్యర్థి లేకపోవటం, ఉన్న ప్రత్యర్థి మోడీని ప్రశ్నించగలడు అన్న ఆత్మవిశ్వాసాన్ని నింపేవాళ్లు లేకపోవటం కారణాలు. యూపి ఎన్నికల ముందు ఉన్న వాతావరణం ఇప్పుడు మారిపోయింది. ఉద్యమాన్ని రీ-ఇంజనీర్ చెయ్యాలి.

రైతాంగ సమస్యల పట్ల మీ ఉద్యమ వైఖరి?


కమ్యూనల్ ఫాసిజమ్, కార్పోరేట్ లూట్, ఎక్సెసివ్ ఫార్మ్ ఆఫ్ గ్లోబలైజేషన్, హిందుత్వ కలిపితే గుజరాత్ మోడల్. మోడీ చెప్తున్న అభివృద్ది ఇక్కడేం జరుగలేదు. వేలల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నర్మదా జలాలు రాలేదు, సబ్సిడీలు వెనక్కి తీసుకుని కార్పోరేట్లకు అందించారు. చెక్‌డ్యాంలులేవు. పండించిన పంట‌కు గిట్టుబాటు ధరల్లేవు. పేదలకు భూపంపిణీ జరగటం లేదు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు నామమాత్రం వేతనాలు ఇస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు మినిమమ్ వేజ్ ఇవ్వక పోతే ప్రభుత్వానికి మోర పెట్టుకుంటారు.

పాతికేళ్ల ప్రపంచీకరణ ప్రభావంలోంచి దేశం ఎలా బయటపడుతుందంటారు?


మా సంస్థ రాష్ట్రీయ్ దళిత్ అధికార మంచ్ ఆత్మగౌరవంతో పాటు ఆర్థికంగా మౌళిక సదుపాయల కోసం కూడా పోరాడనుంది. ముందు ఆర్థిక, సామాజిక అసమానతలను గుర్తించాలి. అప్పుడే నిజమైన ఉద్య‌మం ఆరంభ‌మ‌వుతుంది. అప్పుడే గ్లోబలైజేషన్, ఇతర విధానాలు మనకు వ్యతిరేకంగా ఏలా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. దేశంలో 6 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత కన్నా షాకింగ్ విషయం ఏం ఉంటుంది? ఇక దళితులు కుల, వర్గ బాధితులు. కానీ ఐడెంటీ పాలిటిక్స్ వల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు. ముందు ఈ ఆర్థిక కోణాల్ని, వాటి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఉద్యమానికి ఒక రూపం ఇవ్వగలుగుతారు.


యాంటి నేష‌న‌ల్ పేరిట జ‌రుగుతున్న దాడుల‌ను ఎలా అర్థం చేసుకోవ‌చ్చు?


అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు మన జాతి(దేశం) నిర్మాణ దశలో ఉందని. మన ఆలోచన, అవగాహన అన్నీకులాన్ని బేస్ చేసుకుని సాగుతాయి. అలాంటప్పుడు మనం ఒక జాతి అని ఎలా చెప్పగలం, ఇది కేవలం కుల సంకలనం మాత్రమే. ఎవరైతే రాజ్యాంగాన్ని నమ్మరో వారు యాంటి నేషనల్స్ అని నమ్ముతాను. సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రసీగా రూపొందాలని చెప్తుంది మన ప్రియాంబుల్, హిందూ దేశంగా మిగలమని కాదు. అలా హిందు దేశంగా మార్చాలని, మారాలని కోరుకునే వారే నిజమైన దేశద్రోహులు.

రోహిత్ వేముల యాక్ట్ ఆవ‌శ్య‌త ఎంత‌మేర‌కు ఉంది?


రోహిత్ వేముల యాక్ట్ చాలా ముఖ్యమైంది. దీంతో పాటు అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన జరగాలి. అయితే భారతీయులు కులవ్యవస్థను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఉనా, రోహిత్ వేముల దేశంలో జరుగుతున్న ఇతర దాడులను చూసినప్పుడు అర్థం చేసుకోవలసింది కులం మన జాతీయ సమస్య అని. దేశంలో ప్రతి పరిణామాన్ని, సమాజంలో ప్రతి మార్పుని, మనుషులుగా మన ప్రతి ఆలోచనని కులం ప్రభావితం చేస్తోందని గ్రహించాలి.

విశ్వ‌విద్యాల‌యాల్లో మ‌త రాజ‌కీయాలు?


గుజరాత్ మోడల్ అంటే ఇదే. మితిమీరిన ప్రపంచీకరణ పోకడలు, మతపరమైన రాజకీయలు కలిపితే బిజేపి. దీని వల్ల రెండు క్యాంపులకు లాభం. ఒకటి సంఘ్ పరివార్, రాష్ట్రీయ్ స్వయం సేవక్ దళం, మోహన్ భాగవత్ ఒకవైపు, మరొక వైపు అంబానీ, అదానీలు. వీళ్లు మోడీని ప్రమోట్ చేసి ప్రధానిని చేశారు. ఇక వసూళ్లు రాబట్టుకోవాలి. పదవిలోకి వచ్చే ముందు యువతకు చాలా ఆశలు కల్పించారు వీరు. ఉద్యోగాలు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లుంటాయి, ఎన్నో వ్యాపార అవకాశలుంటాయని. కానీ అవేవి జరుగలేదు కాబట్టి యువత తప్పకుండా స్పందిస్తుంది, ప్రశ్నిస్తుంది. అది జరుగకుండా యువత బయటికి రాకుండా ఉండ‌టానికి కావలసిన వాతావరణం సృష్టించడానికి, యువత గొంతుకను అణిచి వెయ్యడానికి చేసే ప్రయత్నాలలో భాగమే క్యాంప‌స్‌ల్లో మ‌త రాజ‌కీయాలు. ద‌ళిత, మైనార్టీ వ్య‌తిరేకుల‌కు ప‌దోన్న‌తులు ఇవ్వ‌డం. ఈ మ‌త‌రాజ‌కీయాల్ని ప్ర‌శ్నించినందుకే... కన్నయ్య, రోహిత్లను దేశద్రోహులుగా చిత్రీకరించారు. క్యాంపస్లు తమ కంట్రోల్ ఉంచుకోవడానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలివి. జాతి విముక్తి, స్వ‌యంపాల‌న‌, బస్తర్, ఝార్ఘండ్, భూసంస్కరణలు... ఇలా ఏ విధమైన అభ్యుదయ వాదనలు క్యాంప‌స్‌ల్లో వినిపించకూడ‌ద‌నేది వాళ్ల ఉద్దేశ్యం. 21వ శతాబ్దంలో శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడం మానేసి పుష్పక విమానం కథల కాలానికి తీసుకువెళ్తున్నారు. ఇలా వెనక్కు తీసుకెళ్తున్న వాళ్లు అగ్రవర్ణాల వారు. అందరిలో భ‌యాన్ని నింపాల‌నుకుంటున్నారు. అందుకే... ఇవాళ‌ ప్రశ్నించిన సాయిబాబా, మారుతి వర్కర్స్ జైలులో ఉన్నారు. కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్లపై కేసులు నమోదయ్యాయి. రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ భ‌యోత్పా వాతవరణం మాత్రం దేశమంతటా అలుముకుని ఉంది.

మీ రోల్ మోడల్..?


భగత్సింగ్, రామస్వామి పెరియార్. పెరియార్ అంబేద్కర్ కన్నా రాడికల్ నా అభిప్రాయం.

ఎలాంటి ల‌క్ష్యం వైపు మీ ప్ర‌యాణం?


మన దేశంలో భూసంస్కరణలు జరగాలి. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల కల్పన, జాప్యం లేకుండా భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, రైతుల ఆత్మహత్యలు నిరోధించే దిశలో చర్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, కార్మికులకు కనీస భత్యాలు, అమానవీయంగా సాగుతున్న మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన, ప్రజా ఆరోగ్యానికి అవసరమైన సదుపాయాలు, ఆసుపత్రులు, కామన్ స్కూలింగ్ - వర్గ, స్థాయి విబేధాలకు ఆస్కారం లేకుండా పిల్లలందరూ ఒకే విధమైన పాఠశాలల్లో చదివే అవకాశం, కులనిర్మూలన. వీటిని సాధించడానికి వీధుల్లో ఉద్యమిస్తాను.

No. of visitors : 1039
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •