ఇజ్రాయెల్ తో స్నేహబంధం--భారత ప్రజలకు శిక్షాబంధం!

| సాహిత్యం | వ్యాసాలు

ఇజ్రాయెల్ తో స్నేహబంధం--భారత ప్రజలకు శిక్షాబంధం!

- ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యూ | 08.07.2017 11:21:32pm

మిత్రులారా,ఇజ్రాయిల్ లో మోడీ మూడురోజుల పర్యటన వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో (ముఖ్యంగా మధ్యప్రాచ్యం లో) భారత్ "దశ-దిశలు"ను మార్చి వేస్తున్నది.పుట్టిన మట్టి,పెరిగిన నేల,పీల్చిన గాలికి బలవంతం గా దూరం చేయబడ్డ లక్షలాది పాలస్తీనియన్ ప్రజలతో భారత్ కు సుదీర్ఘ సాంప్రదాయ స్నేహ బంధం ఉంది.అది కన్నీటి అనుబందం.దానికి మొదటి సారి గుడ్ బై చెప్పిన విషాద రాజనీతిని మోడీ సర్కారు అమలులోకి తెచింది.ఇకనుండి తమ కన్నీళ్లను తుడిచే పాత్రను భారతదేశం పోషించదని నేడు పాలస్తీనియన్ ప్రజలకి మోడీ తేల్చి చెప్పాడు.అంతటితో ఆగ లేదు. పిల్లలతో సహా మాతృ భూమి నుండి తమను వెళ్ల గొట్టిన సైనిక దుష్ట రాజ్యమైన ఇజ్రాయెల్ పక్షాన ఇకనుండి ఇండియా కొమ్ము కాస్తుందని కూడా పాలస్తీనియన్లకి మోడీ తేల్చిచెప్పాడు.ఏడిపించే వాళ్ళ పక్షాన తప్ప ఏడ్చేవాళ్ళ పక్షాన ఇండియా ఉండబోదని తేల్చి చెప్పిన మొట్ట మొదటి భారత్ సర్కార్ మోడీదే.ఇదే బీజేపీ అద్వానీ, సుస్మా స్వరాజ్ లు కూడా ఇజ్రాయెల్ పర్యటన చేశారు.కానీ ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనాని కూడా ఏకకాలంలో పర్యటించి కనీస0 మొక్కుబడి సమతుల్యతని పాటించారు. మోడీసర్కార్ దానికి కూడా మంగళం పాడింది.పైగా మరో అడుగు ముందుకేసి, దానితో వ్యూహాత్మక మైత్రికి దిగింది. అంటే ఇండియాకి ఇకనుండి అమెరికా, బ్రిటన్,జపాన్ వంటి అతి కొద్ది వ్యూహాత్మక మిత్ర రాజ్యాల సరసన ఇజ్రాయేల్ కూడా చేరనుంది.ఇది భారత్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది.

ప్రపంచంలో నేడు సుమారు 2వందల దేశాలు ఉన్నాయి.కప్పలని పాములు మింగినట్లు అత్యధిక దేశాలని కాటువేస్తున్న కొన్నీ దురాక్రమణ రాజ్యాల సర్పనీతి అమలులో ఉంది.అట్టి సర్పరాజ్యాల పడగ నీడలో సేద దీర్చుకోవచ్చన్న రాజనీతిని నిన్నటి కాంగ్రెస్,నేటి బీజేపీ సర్కార్లు ఆచరిస్తున్నవి. ప్రధానంగా పేద,చిన్న దేశాలని పీడిస్తున్న దురాక్రమణ లేదా దుష్ట రాజ్యాలతోనే వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోవడం మన పాలకులకు నూతన ఆర్ధిక విధానాల తర్వాత అలవాటు అయ్యుంది.వీటి జాబితాలో కొత్తగా ఇజ్రాయెల్ ను చేర్చడం మోడీ ప్రభుత్వ పరాకాష్ట చర్య!

వివిధ దేశాల మధ్య సాధారణంగా ఆర్ధిక, వాణిజ్య, రాజకీయ సంబంధాలుంటాయి. అదనంగా సైనిక రంగంలో కూడా ఏదేని రెండు దేశాల మధ్య పరస్పర సహకార ఒప్పందాలు జరిగితే వాటిని వ్యూహాత్మక మైత్రీ రాజ్యాలు అంటారు.విప్లవకార్లని,జాతీయ విమోచన పోరాట శక్తులను, తిరుగుబాటుదార్లను చిత్ర హింసలు పెట్టె కొత్త టెక్నీక్స్ ని ప్రపంచంలో బాగా వృద్ధి చేసిన దుష్ట చరిత్ర ఇజ్రాయేల్కి ఉంది. గత డెబ్బయ్ ఏళ్లకాలం లో లక్షలాది పాలస్తీనియన్లని చిత్ర హింసలు పెట్టడం ద్వారా వృద్ధి చేసింది. ఈ హింసా రాజ్యపు చిత్ర హింసల సైనిక సామగ్రి తో పాటు తర్ఫీదు సాయాన్ని ఇజ్రాయేల్ నుండి అమెరికా ద్వారా నికరగువా ,హోండురస్, హైతీ,చిలీ, ఇరాక్, ఆఫ్ఘన్ వంటి దేశ్హాలకి సరఫరా జరిగిన గత నేపధ్యం ఉంది. ఇది ఇప్పటికే ఇశ్రాయేల్ నుండి ఇండియాకి సందుదారుల గుండా సరఫరా అవుతూనే ఉంది.ఇక నుండి గ్రాండ్ ట్రంక్ రోడ్ పై రవాణా కానున్నది.

నేడు భారతదేశంలో ప్రజా ఉద్యమాలు నానాటికీ పెరుగుతున్నాయి. రైతాంగం, కార్మిక వర్గం, పీడిత జాతులు, తెగలు, ఆదివాసీలు,సామాజిక అణచివేత కి బలవుతున్న దళితులు, మైనార్టీలు, స్త్రీలు పోరాటాలకి దిగుతున్నారు.వీటి అణచివేత కోసం అరెస్సెస్ కార్యకర్తలకు నేడు సైనిక శిక్షణ ఇస్తుండటం తెల్సిందే. ఆవుల రక్షణ పేరిట దళిత, ముస్లిమ్స్ పై బాబ్రీ, ఉనా వంటి మారణ కాండ తెల్సిందే.స్టేట్ టెర్రరిజంకి తోడు ఆరెస్సెస్ ప్రైవేట్ టెర్రరిసాన్ని కూడా నేడు మోడీ సర్కారు ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా కూడా మోడీ సర్కార్ కి ఇశ్రాయేల్ సాయం కావాలి.అందుకే వ్యూహాత్మక మైత్రి అవసరం ఉంది. మన భారత దేశ కన్నీటి బాధిత ప్రజలను చిత్ర హింసల కొలిమి లో హింసించే తర్ఫీదు ఇవ్వగల ఇజ్రాయేల్ మోడీకి ముద్దుల దేశమే కదా!

మన భారతదేశ ప్రజల కన్నీటి బాధలూ,పాలస్తీనియన్ల విషాద గాధలూ ఒకటే! నేడు ఏడుగురు పౌరులకొక సాయుధ సైనికుడితో చుట్టు ముట్టబడ్డ కాశ్మీర్ లోయ ప్రజల వెతలూ, యూదు సైనిక చక్ర బంధంలో చిక్కుబడ్డ గాజా ప్రజల కధలూ ఒకటే! వెస్ట్ బ్యాంకు శరణార్ధ కూలీలదీ, మారుతీ కార్మికులదీ ఒకటే దీన గాథ!మంద్ సర్(మధ్యప్రదేశ్) లో పారిన రైతుల నెత్తురూ; జెరుసలెంలో కారిన భక్తుల నెత్తురూ ఒకటే! ఇశ్రాయేల్ నిర్బంధ సైనిక శిబిరాలలో మగ్గుతున్న హమాస్ నేతలదీ, భారత్ అండాసెల్ లో కుక్కబడ్డ సాయిబాబా వంటి ఖైదీలదీ ఒకే విషాద గాధ! దీనర్థం మోడీదీ, నెటెన్యాహూదీ కూడా ఒకటే లక్ష్యం! మూడు రోజుల పాటు పై ఇద్దరు ఫాసిస్ట్ నియంతలు బిగి కౌగిళ్ళల్లో మునిగిపోయి, మురిసిపోయారు. తామక్కడ పాలస్తీనియన్ల పై సాగిస్తున్న క్రూర అణచివేతకు 130 కోట్ల జనాభా గల భారత్ ప్రభుత్వ అండ లభించిన మురిపం నేతన్యాహు సర్కారుది. తిరగబడుతున్న భారత దేశ ప్రజల అణచివేతకు తగిన సైనిక సాంకేతిక సాయం లభిస్తున్న సంబరం మోడీది. ఆ ఇద్దరు ఫాసిస్ట్ నియంతల మధ్య బిగుస్తున్న విష కౌగిళ్ళు మన దేశ ప్రజలకి బోధిస్తున్న పాఠం ఒకటే!భారత్, పాలస్తీనా బాధిత ప్రజల మధ్య కూడా అంత కంటే నూరు రేట్ల బిగి కౌగిళ్ళూ; వెయ్యు రెట్ల బిగి పిడికిళ్ళూ బిగుసుకోవాలన్నదే!

ప్రసాద్(పిపి)ఐ.ఎఫ్.టి.యూ





No. of visitors : 333
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
    అరుణతార జనవరి - 2018
    జయహో టి.టి.ఆర్‌.
    జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌
    కుందాపన
    కాస్త..దారిస్తారా!
    చూపుడు వేలై పొడుచుకొస్తాను
    చీగుడ్లు
    విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి
    కవులారా ఓ కళాకారుల్లారా
    కులమతాలు లేని సమాజం కోసం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •