అమ‌రుల స్మృతిలో....

| కార్య‌క్ర‌మాలు

అమ‌రుల స్మృతిలో....

- అమరుల బంధుమిత్రల సంఘం | 13.07.2017 12:39:40pm

యాభై వ‌సంతాల న‌క్స‌ల్బ‌రీని ఎత్తిప‌డ‌దాం
ఆప‌రేష‌న్ స‌మాధాన్‌కు వ్య‌తిరేకంగా పోరాడుదాం

ప్రతి ఏటా జలై 18న అమరుల బంధుమిత్రుల సంఘం విప్లవోద్యమ అమరవీరుల సంస్మరణ సభ జరుపుతోంది. ఈసారి నక్సల్బరీకి యాభై ఏళ్లయిన సందర్భంగా ఈ సంస్మరణ సభ మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 1967 మే 25న పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో జరిగిన భూ పోరాటంలో అమరులైన ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లల దగ్గరి నుంచి నిన్న మొన్నటి దాకా దేశవ్యాప్తంగా నక్సల్బరీ పంథాలో నెత్తురు ధారపోసిన వీరులందరి స్మృతిలో రa సభ జరుగుతోంది. ఈ ఐదు ద‌శాబ్దాల‌లో వేలాది మంది అమరుల తల్లిదండ్రులు, జీవన సహచరులు, బిడ్డలు, మిత్రులందరి కన్నీటితో, దు:ఖంతో అమరుల బంధుమిత్రుల సంఘం మమేకమవుతున్నది.

అమరుల కుటుంబ సభ్యులతో ఏర్పడిన బంధుమిత్రుల సంఘానికి 15 సంవత్సరాలు నిండాయి. రాజ్యహింసకు బలైపోతున్న కుటుంబాలతో ఏర్పడిన ఈ సంఘం పదిహేనేళ్లుగా తెలుగు ప్రజల రాజ్యహింసా వ్యతిరేక పోరాటాల‌తో గొంతు కలుపుతున్నది. కలిసి పోరాడుతున్నది. ఎందరో ప్రజాస్వామిక వాదులు కలిసి వచ్చినందువల్లే అత్యంత కఠినమైన ఈ కాలంలో అమరుల బంధుమిత్రుల సంఘం తన ఆచరణ కొనసాగించగలుగుతున్నది.

అమరుల ఆశయం, త్యాగం నక్సల్బరీ పంథాగా అనేక ఆటుపోట్ల మధ్యనే విస్తరిస్తున్నది. ఆ పంథాకు యాభైఏళ్ల నిండిన ఈ చారిత్రక సందర్భాన్ని అమరుల బంధుమిత్రుల సంఘం చాలా గర్వంగా గుర్తిస్తున్నది. దారుణమైన చిత్ర హింసలు అనుభవిసూ కూడా శతృవుకు లొంగని ధైర్యం, అనేక ఓటముల మధ్యనే విప్లవం జయిస్తుందనే ఆశావాదం, ఈ వ్యవస్థను కూలదోయాలనే సాహసం, ఈ క్రమంలో అనివారమైన మృత్యువు పట్ల నిర్భీతి నక్సల్బరీ పంథా నుంచే అమరులందరూ ప్రదర్శించారు.

నక్సల్బరీ పంథా మహత్తర శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంగా తెలుగు నేల మీదికి వచ్చి జగిత్యాల రైతాంగ పోరాటాల్లో ప్రజాపంథాను ఆవిష్కరించింది. అక్కడి నుంచి దండకారణ్యానికి చేరి దేశవ్యాప్త విప్లవోద్యమంగా విస్తరించింది. అందువల్ల నక్సల్బరీకి ఇవాళ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే కార్మికవర్గం విప్లవ జేజేలు పలుకుతోంది. ఆ అర్థంలో నక్సల్బరీ మన దేశ విముక్తి పంథానేకాక అంతర్జాతీయ విప్లవోద్యమాలకు సహితం ఉత్తేజాన్ని ఇచ్చే పోరాట పంథా, యాభై వసంతాలను నింపుకున్న విప్లవోద్యమం దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నది. ఈరోజు ప్రజాస్వామ్యమంటే బూర్జువా ప్రజాస్వామ్యమే. ప్రజాపోరాటాల వల్ల బూర్జువా ప్రజాస్వామ్యంలో భాగమైన విలువలను, ప్రమాణాలను సహితం దళారీ వర్గం భరించలేకపోతోంది. ఏ రూపంలో ఏ చిన్న ఆదర్శమైనా, విలువ అయినా దానికి భారమైపోయాయి. నిస్సిగ్గుగా సామ్రాజ్యవాదాన్ని బ్రాహ్మిణిజాన్ని వాడుకుంటోంది.

విప్లవోద్యమం విస్తరించినకొద్దీ రాజ్యహింస కూడా అన్ని ప్రాంతాలకు విరుచుకుపడుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో అణచివేత కొనసాగుతున్నది. బస్తర్లో ఆపరేషన్ ప్రహార్గా, ఒడిషాలో హంటింగ్ మావోయిస్టు మిషన్గా, మొత్తంగా ఏఒబీలో ఆలౌట్ వార్గా, దండకారణ్యంలో విజన్ 2017గా, దేశవ్యాప్తంగా సమాధాన్గా పాలవర్గ శక్తులు మోహరించి విప్లవోద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి.

రాంగుడా లాంటి అతి పెద్ద బూటకపు ఎన్కౌంటర్ దగ్గరి నుంచి దండకారణ్యంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఎంతోమంది విప్లవకారులు, విప్లవాభిమానులైన ప్రజలు బలిదానాల మధ్యనే ఉద్యమం నిలదొక్కుకుంటున్నది. రాంగుడా మారణకాండలో దయా, ప్రసాద్, ప్రభాకర్, కిరణ్, దాసు, భారతి, మమత, మన్నా సింహాచలం, దానియల్ వీరితోపాటు మరో 21 మంది కామేడ్స్ ఈ ఎన్కౌంటర్లో అమరులయ్యారు. వీరేగాక సాయన్న రవి, జాంబ్రి, చిట్టిబాబు, చిన్నబ్బాయి, కోటి, సురేష్. ఇంకా మనకు తెలియని ఎందరో విప్లవకారులు తెలంగాణ, ఏవోబీ, దండకారణ్యం, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో ఈ ఏడాదిలో అమరులయ్యారు. అలాగే ఈ ఏడాదిలో కేరళ విప్లవోద్యమ నాయకులు కా, దేవరాజ్, కా, అజిత్లను కూడా అక్కడి వామపక్షప్రభుత్వం దారుణంగా హత్యచేసింది. ఇంకో పక్కహిందూ ఫాసిజం ఈ దేశంలోని దళితులు, ముస్లింలపై దాడి చేస్తోంది. పాలకవర్గ అభివృద్ధి నమూనా వల్ల వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులను అప్పలపాలు చేసి ఉరికంబాలు ఎక్కిస్తున్నది. వ్యవస్థలో ఏవైపు చూసినా సంక్షోభమే కాని పరిష్కారం లేదు. నక్సల్బరీ మార్గంలో రక్త తర్పణ చేసిన అమరుల ఆశలు, త్యాగాలు నిరర్ధకం కావడం లేదు. ప్రజా జీవితంలో అవి చిగురిస్తూ శక్తివంతమవుతున్నాయి. అందుకే అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నక్సల్బరీ ఏక్హీ రాస్తా అని పోరాట ప్రజలు నినదిస్తున్నారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరినీ స్మరించుకునే ఈ సభకు మిమ్మల్నందరినీ స్వాగతిస్తున్నాం.

పతాకావిష్కరణ


18, జూలై 2017, ఉ.11 గం.లకు
సికింద్రాబాద్‌లోని సుభాష్ నగర్ సూపం వద్ద

రాజ్యహింసకు వ్యతిరేకంగా బ‌హిరంగ‌స‌భ‌


సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంప‌ల్లి, హైదరాబాదు, మ.2 గంటలకు
అధ్య‌క్ష‌త‌: అంజమ్మ (అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షరాలు)

వక్తలు


రావుణ్ణి (పోరాట్టం, కేరళ)
శ్రీధరన్ (అమరుడు దేవరాజ్ సోదరుడు, కర్నాటక)
గోపాల్ (సీపీడీఆర్‌, త‌మిళ‌నాడు)
వ‌ర‌వ‌ర‌రావు (విర‌సం)
క‌ళ్యాణ‌రావు (విర‌సం)
కాక‌రాల (గౌర‌వాధ్య‌క్ష‌లు, ఏబీఎంఎస్‌)
ప‌ద్మ‌కుమారి (కార్య‌ద‌ర్శి, ఏబీఎంఎస్‌)

అమ‌రుల పుస్త‌కావిష్క‌ర‌ణ‌లు, ప్రజా కళామండలి, డప్పు రమేష్ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి

No. of visitors : 1473
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా...

గానం : అందీప్‌ | 05.08.2016 10:25:33pm

కామ్రేడ్ గుండేటి శంక‌ర్ స్మృతిలో.. "అడ‌వి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా... పుడ‌మి త‌ల్లీ నీకు వంద‌నామ‌మ్మా.. పురుగు బూసి ముట్ట‌కుండ‌గా జూడు"...
...ఇంకా చదవండి

అమ‌రుల‌ను స్మ‌రించుకుందాం - రాజ్య‌హింస‌ను ప్ర‌తిఘటిద్దాం

| 08.07.2016 01:29:37am

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా... జూలై 18న హైద‌రాబాద్‌లో ప్ర‌జా ఉద్య‌మాల‌పై రాజ్య‌హింస‌కు వ్య‌తిరేకంగా బ‌హిరంగ‌స‌భ‌......
...ఇంకా చదవండి

రాజ్యహింస చెల‌రేగి పోయెగ‌ద‌నే.. ఎదురు కాల్పుల పేర మిము జంపెగ‌ద‌నే

| 22.07.2016 09:50:04pm

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా 18 జూలై 2016న సుబాష్ న‌గ‌ర్‌లో ర్యాలీ. అమ‌రుల స్మృతిలో... క‌ళాకారుల విప్ల‌వ‌ గీతాలు........
...ఇంకా చదవండి

నీ పోరు గెలవాలని ..నిన్ను ఆ పోరులో చూడాలని ..

| 21.07.2017 10:50:42am

అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభలో ప్రభాకర్ స్మృతిలో " సాహితి " పాడిన పాట ...
...ఇంకా చదవండి

అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సు

| 21.07.2016 11:56:14pm

ఉత్త‌రాంధ్ర అమ‌రుల‌ను స్మ‌రిస్తూ అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఈనెల 23న బొడ్డ‌పాడులో ఉత్త‌రాంధ్ర రెండో స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •