అరుదైన కథన శిల్పి

| సంపాద‌కీయం

అరుదైన కథన శిల్పి

- పాణి | 16.07.2017 01:24:14am

డా. వి. చంద్రశేఖరరావు కొత్త కథా సంవిధానంతో సాహిత్యంలోకి వచ్చారు. అది కొంత అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మామూలుగా గ్రామీణ నేపథ్యం గల ఇతివృత్తాలు, పాత్రలు, వాతావరణం మాత్రమే తెలిసిన వాళ్లకు ఆయన కథలు మరీ కొత్తగా అనిపిస్తాయి. అందులో కొంత వింత కూడా ఉంటుంది. దాన్ని మనసుతో తెలుసుకునే ప్రయత్నం చేసినవాళ్లకు అందులో ఆర్తి కనిపిస్తుంది. అది చాలా విలువైనది. మనిషి పట్ల ఆయన ఆర్తి అనేక రకాలుగా కథల్లో కనిపిస్తుంది. అందమైన దృశ్యాలు, వర్ణ చిత్రాలు, వాతావరణాలు, పూలు పూచిన మొక్కలు, ఒకటి కనిపిస్తూ మరొకటిగా మారిపోయే మాంత్రిక రూపాలు, ఒక పాత్రే అనేక మందికి ప్రాతినిధ్యాలు.. ఇలా అన్నిటి మధ్యలో మనిషిపట్ల ఆర్తి కనిపిస్తుంది. నిజానికి ఈ మాట ఇంత సరళంగా చెప్పడం కూడా ఆయన కథల విషయంలో కుదరదు. కేవలం మన సౌకర్యం కోసమే.

ఆయనకు మొదట్లో గొప్ప పేరు తెచ్చిన జీవని కథలో లేదుగాని.. ఆ తర్వాత ఆయన కథన శిల్పంలో కాస్త మార్మికత చోటు సంపాదించుకుంది. అది మరీ ఎక్కువైనప్పుడు చంద్రశేఖరరావుగారి కథలు అర్థం కావండీ అనే ఫిర్యాదు ఒక వైపు నుంచి వినిపిస్తూ ఉండేది. అది పూర్తి అబద్ధం కాదనే విశ్లేషణా ఉన్నది. ఈ ధోరణిలో రాయడం మొదలు పెట్టాక పాఠకులు, విమర్శకులు మొదట ఎలా స్పందించారో గాని తెలుగు కథా లోకం ఆయన్ను అపురూపంగా స్వీకరించింది. ఆయన కథన శిల్పానికి ముచ్చటపడింది.

ఇంత వరకే అయితే ఆయన ప్రయోగవాది అని సరిపెట్టుకునే వాళ్లేమో. అదీ ఉన్నది. ఒక్కోసారి ప్రయోగం కొట్టవచ్చనట్లు కనిపించేలా కూడా రాశారు. కాని.. అంతకు మించిన ప్రత్యేకత ఉన్నది. తెలుగు కథలో ఎన్నో ప్రయోగాలు సాగాయి. వాటన్నిటికీ భిన్నమైన దినుసు చంద్రశేఖరరావుగారి కథల్లో ఉన్నది.

ఆయన కథలు చదువుతూ ఉంటే లోలోపల ఏదో ఒక రకమైన విషాదపు జీర కూడా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకున్న వాళ్లు ఆయన కథలను అంత తేలికగ్గా తీసుకోరు. అది ఆయన కథా కాలానిది. జీవిత కాలానిది. అంటే ఈ కాలానిది. ఆయన ఇతివృత్తమూ, కథా కథనమూ చాలా సమకాలానివి. కళ్ల ముందటి దృశ్యాలు, ఘటనలు, పరిణామాలు ఆయన కథల్లో కనిపిస్తాయి. కానీ వాటిని ఆయన కథన పద్ధతి వైపు నుంచే వివరించుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఆయన సంవిధానాన్ని చాలా ప్రత్యేకంగా విశ్లేషించాలి. అప్పుడే ఆయన కథా వస్తు దృక్పథాల చర్చ ముందుకు పోతుంది. ఆయన కథ చాలా మెత్తగా సాగిపోతుంది. తేటగా ఉన్నట్టనిపిస్తుంది. కళ్లు మిరమిట్లు గొలుపుతుంది. చాలా ఆహ్లాదంగా ఉన్నట్టనిపిస్తూనే ఒక పెద్ద విధ్వంసపు సవ్వడిని కూడా వినిపిస్తుంది. దాని ప్రకంపనలు కథలో అనేక రూపాల్లో మనల్ని ముట్టుకుంటాయి. ప్రతీకలు, మూడ్, కవితాత్మక వ్యాఖ్యలు, లేదా ఎవరో ప్రముఖుల వాక్యాల ఉటంకింపులుగా ఆ ప్రకంపనలు మనల్ని చేరుకుంటాయి. లేదా అంతదాకా నడుస్తున్న కథన దృశ్యానికి భిన్నమైన దృశ్యాదృశ్యాల కలగలపు మనల్ని కొత్త ఆవరణలోకి తీసికెళుతుంది.

ఇందులో ఆయన ఎంచుకున్న వస్తువు, దాన్ని చెప్పాలనుకున్న దృక్పథం ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. అందుకే చంద్రశేఖరరావుగారి కథలు విమర్శకులకు కొంచెం పని పెడతాయి. నిజానికి కల్పనా సాహిత్యమూ, దాని విమర్శా ఏం చేయాలో అవి చంద్రశేఖరరావుగారి సందర్భానికి బాగా అతుకుతాయి. ఆయన కథలు, నవలలపై ఇలాంటి విశ్లేషణ చేయడం చాలా ఆసక్తికరం.

అయితే ఆయన కథన శిల్పంలో ఎంత వైవిధ్యం ఉన్నట్టనిపిస్తుందో అంత సారూప్యత కూడా ఉంది. ఆయన పాటించే అంతర్గత నిర్మాణ రహస్యం ఒకసారి తెలిసిందంటే మిగతా కథలన్నీ విశ్లేషించడం తేలిక అవుతుంది. ఇది కూడా చాలా వివరంగా చెప్పవలసిన మాట.

ఈ కాలానికి చెందిన ఒక వాస్తవిక స్థితి నుంచి ఆయన కథా ఆవరణ రూపొందింది. అయితే ఆయన పాత్రలు అందులోని ఒక చిన్న పరిధికి చెందినవి. కొన్ని రకాల పాత్రలే ఆయన కథల్లో ఉంటాయి. అక్కడి నుంచి ఆ పాత్రలు లోకాన్ని చూస్తుంటాయి. తమ స్థలకాలాల్లోంచే ఎన్నో విషయాలు మనకు చెబుతున్నట్లనిపిస్తుంది. అందుకే ఆ పాత్రల స్వభావం, వ్యవహారం దీనికి తగినట్లు ఉంటాయి. విశేషమేమంటే ఆ ఆవరణ మీద, స్థితి మీద ఒక రకమైన విమర్శనా దృష్టిని ఆ పాత్రలు ప్రకటిస్తుంటాయి. అవి అందరూ అంగీకరించేవి కావచ్చు, కాకపోవచ్చు. అక్కడే ఆయన దృక్పథ చర్చకు స్కోప్ఉంటుంది. ఒక్కోసారి ఆయన కథల్లోని ఫోకస్పాయింట్ఆ విమర్శనాత్మక వ్యాఖ్య లేదా పరిశీలనే. దాన్ని కూడా చాలా సుతిమెత్తగా చెప్తారాయన. అందులోనే మనిషిపట్ల ఆర్తి కనిపిస్తుంది. ఈ కాలం పలికే జీర వినిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎందరో కథకులు, సృజనకారులు అనేక రకాలుగా వినిపించారు. వినిపిస్తున్నారు. చంద్రశేఖరరావుగారు తనదే అయిన గొంతుకలో పలికించారు. ప్రగతి అనే భావన మీద నిలబడి ఆయన ఈ సృజన కలాపం సాగించారు. అది ఎలా వ్యక్తమైందో చాలా వివరంగా ముచ్చటించుకోవాలి. మనుషులతో ఆయన ఎలా ఉంటారో ఆయన కథలే సుతిమెత్తని సాక్ష్యం. మనుషులు ఎలా ఉండాలో ఆయన కోరిక కూడా అది. యింకా ఎంతో రాయగల ఒక రచయిత ఈ కాలాన్ని ఇలా వదిలేసి వెళ్లిపోవడం విషాదం. ఇది ఆయన కథల్లోంచి మనల్ని వెంటాడే దృశ్యంలాంటిది.





No. of visitors : 364
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ
    భావ విస్ఫోటనం సి.వి.
    అరుణతార - నవంబర్ 2017
    100% డిజబులిటి నీడెడ్!
    మహిళా చైతన్యం అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
    ఓ ఆదివాసీ అమ్మ క‌థ‌
    నాదయిన మంచు గురించి
    స్వాప్నికుడు , సాహ‌సికుడు అవ‌తార్ సింగ్ పాష్‌
    31 అక్టోబర్‌ - శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు
    బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?
    ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •