యుద్ధగీతం

| సాహిత్యం | క‌థ‌లు

యుద్ధగీతం

- ప‌ల్ల‌పు స్వాతి | 16.07.2017 08:36:43am

ఇంకా తెలవారలేదు. చల్లని గాలులు. అప్పుడే మొదలైన చినుకులు.
ʹనీకు తుపాకీ ఎక్కడి ʹ దంటూ వాళ్ళు నా పెడరెక్కలు విడిచికట్టిండ్రు . నేలపై కుదేసిండ్రు .
గడ్డిమోపులా విలవిల్లాడింది నా ప్రాణం. ఈదురు గాలులకు వణికే గడ్డిపూవులా .

దూప
దూప

వాళ్ళ దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లిన దేహం .

వాళ్ళెక్కడికో వెళ్ళిపొయిండ్రు జీపులో . అప్పుడు వెలిగింది జీప్ లైట్ .
ఆ వెలుగులో ఓ ముప్పయేళ్ల మహిళా పోలీసు. ముంత నిండా నీళ్ళించింది . గట గటా తాగిన .

ఆమె అడిగింది .....
ʹఎవరు నువ్వు ? దేనికోసం నీ పొరాటం ?ʹ అని .
మాట్లాడేందుకు సత్తువంతా కూడదీసుకున్న .తడబడుతున్న లోగొంతుతో చెప్పిన నా కథని .

నా కథ అంటే... మా ఆదివాసీల కథ. చీకటితో మొదలైన కథ. భూమి కోసం బలైన బిడ్డల చరిత . మా జాతినంతా అంతం చేస్తున్న రాజ్యం దుర్మార్గ చరిత్ర . మా నేల చెర విడిపించేందుకు నెత్తురోడిన వీరుల కథ. వీర గాథ. మా చీకటి బతుకుల్లొ వెలుగులు నింపేందుకు పోరాడుతున్న కథ.
నా తల్లిని , నా తండ్రిని , ఇద్దరు తమ్ముళ్లను కాల్చి చంపిండ్రు పోలీసులు .
ఆ కర్కశ పోలీసులు మా జాతి బిడ్డలను చిత్రహింసలు పెట్టి చంపుతున్నపుడు నెత్తురు మండి భుజానికెత్తుకున్న తుపాకీ ఇది .

ఆమె కండ్ల నిండా నీళ్ళు .
నుదుట పచ్చబొట్టు.
అంతా అర్ధమైంది ఆమెకు . నా కట్లు విప్పింది . అక్కడే ఉన్న జీపు దగ్గరికెళ్ళింది . తుపాకీ తీసుకుంది .
ʹనేను వస్తా ʹ నంటు నా చేతిలో చేయి వేసింది .
ఇద్దరమూ తూర్పు దిక్కుకు సాగినం .





No. of visitors : 1330
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పాటై ప‌దునెక్కాలి...

ప‌ల్ల‌పు స్వాతి | 18.06.2017 01:03:17pm

ఇప్పుడీ దుఃఖ‌భ‌రిత కాలాల్లో క‌రిగిన క‌ల‌ల్నీ చెదిరిన గూళ్ల‌నూ క‌న్నీళ్లింకిన మ‌నుషుల్నీ గుండెల‌కు హ‌త్తుకోవాలి...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార - అక్టోబర్ 2017
    కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
    భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే
    లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!
    అరుణ‌తార - సెప్టెంబ‌ర్ 2017
    చిత్ర‌హింస‌ల్లో న‌లుగుతున్న బుర్క‌పాల్ ఆదివాసీలు - పాల్‌నార్ బాలిక‌ల‌పై వేధింపులు
    మరణించదు చిర్నవ్వు
    కల కాని ఒక నిజం నక్సల్బరీ
    నేనే గౌరీ లంకేశ్
    మనుషుల్ని కాదు, ఒక జాతి మొత్తాన్నీ నిర్మూలిస్తున్నారు
    కట్టు కథ .. రాజ్య దృక్పథం
    జార్ఖండ్ జైల్ల‌లో.. 4వేల మంది ఆదివాసీల‌పై న‌క్స‌లైట్ కేసులు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •