పున‌ర్జ‌న్మ‌

| సాహిత్యం | క‌విత్వం

పున‌ర్జ‌న్మ‌

- జి. వీర‌న్న‌ | 16.07.2017 09:35:21am

ఇక్కడ ఒక రైతు ఆత్మహత్య
పత్రికల పతాక శీర్షికలతో మరోసారి ఉరిబోసుకుంటుంది
రాజకీయ చర్చల్లో అన్నదాత బతుకు అపహాస్యమవుతుంది
ఇక్కడ సామాన్యుడిగా పట్టడమంటే
ప్రతి అయిదేళ్ళకు ఓటరుగా బాధ్యత నిర్వర్తించడానికో
నాయకుల ప్రగల్భాల ప్రసంగాలకు చప్పట్ల చరచడానికో
ఇక్కడ ఒక నిరుద్యోగి ఆశంటే
భారమవుతున్న వయసును దాచుకోడానికో
కన్నవాళ్ళ బాధ్యతను వాయిదా వేయడాని
ఇక్కడ పేదవాడు అంటే
నెలవారీ పింఛన్లకు ఎగబడే ఒక అనాథ
ఎప్పటికీ గీత దాటకూడని శాశ్వత బానిస
ఇక్కడ హక్కులకోసం ఆరవడమంటే
సంఘవిద్రోహిగా పిలిపించుకోవడానికి సిద్ధపడటమే
ఊచల మాటున ఒక జీవితాన్ని మరిచిపోవడమే
ఇక్కడ ఉద్యమాల బాటంటే
చరిత్రను తిరిగేసుకుంటున్న హత్యాసాదృశ్యం
బాసటగా నిలుపుకున్నవారే బందీని చేస్తున్న వెనం
కలలన్నికల్లోలమవుతున్నయి
సమర్ధించుకున్న నిజాలన్ని బీటలు వారుతున్నయి
నాయకుడని దాచుకున్నగుండెలు బాధగా రోధిస్తున్నయి
ఒక్కో ఆశ పేకమేడలా కూలుతుంటే
నిస్సహాయతను అలవరుచుకున్న దేహం
ఒక్కపిడికిలికి జన్మనిచ్చేందుకు
నరకయాతన పడుతోంది

జి. వీర‌న్న‌, రీసెర్చ్ స్కాల‌ర్‌, మ‌ద్రాసు విశ్వ‌విద్యాల‌యం






No. of visitors : 238
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

ఆనాటి రాచరికపు సమాజం చాలా మంది స్త్రీలకు చూపిన బ్రతుకుదెరువు వ్యభిచారమే. ఈ వ్యవస్థ వల్ల ముందు బాధలపాలైంది వీరే నుక ఆ వ్యవస్థ మార్పుకౖేె సాగిన పోరాటంలో వీరే

  • నక్సల్బరీ నీకు లాల్‌సలాం
  • మేడే చారిత్రక ప్రాముఖ్యం
  • 2017 లో ʹపారిస్ కమ్యూన్ʹ
  • శ్రామికవర్గ నియంతృత్వానికి ప్ర‌తీక పారీస్ క‌మ్యూన్‌
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణ‌తార ఆగ‌స్టు 2017 సంచిక‌
    The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges
    భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు
    దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు
    ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ మ‌రో మాన‌ని గాయం
    ఒక నినాదం - వంద దేశాలు
    అవి బడులు కావు... జనరల్ స్టోర్ దుకాణాలు
    రైతు - పిచ్చుకలు - కొంగలు
    నా మిత్రుని ఇల్లు ఎక్కడ...
    పిట్ట కథ!
    గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !
    దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •