యుద్ధంలో చిరునవ్వు

| సాహిత్యం | క‌విత్వం

యుద్ధంలో చిరునవ్వు

- పిడ‌మ‌ర్తి వేణు | 16.07.2017 09:58:44am

నిన్ను త‌లుచుకున్న‌ప్పుడ‌ల్లా
గుండెను కోసే త‌డిజ్ఞాప‌కాలు

ఎందుకో... ఎప్పుడూ
నాకు నువ్వు...
ప్రశ్నలానే కనిపిస్తావు

ఆ కళ్ళద్దాల్నించి నీ చూపు
ప్రశ్నిస్తూనే ఉంటుంది
పోరాటం అంటే ఏంటని...?

నేనేం చెప్పగలను
ప్రెస్ మీట్ లు, ధర్నాలు
దిష్టి బొమ్మ దహనాలు
మాకిదే స్పురిస్తుంది

మరి నీవెందుకు ఒప్పుకోవు నేస్తమా
ఎప్పటికైనా
పోరాటమంటే యుద్ధం అంటావు
యుద్ధమంటే జీవితమంటావు

అందుకే...
నీలాకాశంలో నువ్వు అరుణతారవ‌య్యావు
మేము నీ జ్ఞాప‌కాల్లో మునిగిపోయాం

యుద్ధంలోకి చిరునవ్వుని
రిక్రూట్ చేసిన
నవతరం రెవల్యూషనరీ
నీకు లాల్ సలామ్

( కామ్రేడ్ వివేక్ స్మృతిలో.... )

No. of visitors : 234
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!

ఆనాటి రాచరికపు సమాజం చాలా మంది స్త్రీలకు చూపిన బ్రతుకుదెరువు వ్యభిచారమే. ఈ వ్యవస్థ వల్ల ముందు బాధలపాలైంది వీరే నుక ఆ వ్యవస్థ మార్పుకౖేె సాగిన పోరాటంలో వీరే

 • నక్సల్బరీ నీకు లాల్‌సలాం
 • మేడే చారిత్రక ప్రాముఖ్యం
 • 2017 లో ʹపారిస్ కమ్యూన్ʹ
 • శ్రామికవర్గ నియంతృత్వానికి ప్ర‌తీక పారీస్ క‌మ్యూన్‌
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార ఆగ‌స్టు 2017 సంచిక‌
  The Impact of Naxalbari on Indian Society, Its Achievements and Challenges
  భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు : విజయాలు-సవాళ్లు
  దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు
  ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ మ‌రో మాన‌ని గాయం
  ఒక నినాదం - వంద దేశాలు
  అవి బడులు కావు... జనరల్ స్టోర్ దుకాణాలు
  రైతు - పిచ్చుకలు - కొంగలు
  నా మిత్రుని ఇల్లు ఎక్కడ...
  పిట్ట కథ!
  గాంధేయవాది మావోయిస్టు అయ్యాడు !
  దు:ఖపు వ్యక్తీకరణగా విప్లవ కవిత్వం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •